బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–అపార్ధాలు…


    ఒక్కోప్పుడు మనం మాట్టాడే మాటలు కొంపలు ముంచేస్తూంటాయి. ఏదో సరదాగా అన్నాను కానీ, మరీ అంత పట్టించేసికుంటారనుకోలేదు, అని మనలో మనం ఎంత మొత్తుకున్నా లాభం ఉండదు. మనలో చాలామందిది, సాధుస్వభావమే, ఇంకోరిని బాధపెట్టే స్వభావము కాకపోవచ్చు, అయినా సరే, కాలం ఖర్మం కలిసి రాక, ఏదో inadvertent గా అనేసి, ప్రాణం మీదకి తెచ్చేసికుంటాము. ఆ తరువాత ఎంత బాధపడ్డా లాభం ఉండదు.అప్పటిదాకా ఉన్న సంబంధబాంధవ్యాలు strain అయిపోతాయి. పోనీ, అలాగని, తప్పైపోయిందీ, నేను అలా అనవలిసుండకూడదూ, అని చెబ్దామన్నా, ఆ పరిస్థితుల్లో అంత లాభం కూడా ఉండదు.The damage is already done.

   ఇవేమీ సినిమాలూ, కథలా, టివీ సీరియళ్ళా ఏమిటీ, ఓ సీన్ లోనో, ఓ పేజీలోనో అపార్ధాలూ, సినిమా చివరికో,సీరియల్ వెయ్యో భాగం లోనో, కథ చివరి పేజీల్లోనో ఆ అపార్ధాలు పోయి, కలిసిపోడానికి, “శుభం” అనుకోడానికి. కానీ మన జీవితాల్లో కూడా అనిపిస్తూంటుంది, అలా జరిగితే ఎంత బావుంటుందో కదూ అని. ఇంకో విషయం ఏమిటంటే, ఈ అపార్ధాలూ వగైరాలు మనలాటి మామూలు మనుష్యులకే పరిమితం. రాజకీయ నాయకుల్ని చూడండి, ఒకళ్ళమీద ఒకళ్ళు అవాకులూ చవాకులూ పేలుతూంటారు, అయినా సరే సమయం వచ్చేసరికి, అవన్నీ హూష్ కాకి అయిపోతాయి! కారణం ఇద్దరి టార్గెట్టూ ఒకటే కాబట్టి (to take us for a sweet ride !!). బహుశా, మన నిజ జీవితాల్లో కూడా అలాటి common minimum programme లాటిదోటుంటే, మన పనీ బాగానే ఉండేదేమో! అయినా మనకంత అదృష్టం ఎక్కడిదిలెండి?

    కొంతమందితో, ఏం మాట్టాడినా పరవాలేదు. కానీ కొంతమందితో ఆచి తూచి మాట్టాడాలి.అలాటివారితో ఏం మాట్టాడితే ఏం కొంపమునుగుతుందో అని ఎప్పుడూ భయమే. పోనీ మాట్టాడడం మానేద్దామా అనీ అనుకోడానికి లాభం లేదు. పైగా వాళ్ళే మనల్ని provoke చేసి మరీ మాట్టాడిస్తారు. మన ఖర్మకాలిందా, మన “తోడు” లెకుండగా, ఒక్కళ్ళమూ వాళ్ళ చేతుల్లో పడుతాము, ఇంక మనతో ఆడేసికుంటారు. ఆ ప్రస్థానం లో, ఏం మాట్టాడాలో కూడా మర్చిపోయి, ఎవరిగురించో మన “విలువైన” అభిప్రాయాలు కూడా చెప్పేస్తాము. బస్! ఇది చాలు, అవతలివాడికీ, మనకీ మధ్యన పుల్లలు పెట్టడానికి. పైగా పని కట్టుకుని, అడిగినవాడికీ అడగనివాడికీ చెప్పడం–” మొన్న ఫణి వచ్చాడురా, అదేదో మాటల్లో చెప్పాడు, నీకూ వాడికీ ఏదో అభిప్రాయ బేధం వచ్చిందిటగా..etc..etc…”, అని తను ఊహించినవి, తన కల్పనాశక్తి జోడించి మరీ మోసేస్తాడు.ఇలాటివాళ్ళకి, ఇద్దరి మధ్య సంబంధాలు తగలేయడం, ఓ pastime. నిజం చెప్పాలంటే, మనం ఆ రెండోవాణ్ణి గురించి అంత చెడ్డగా ఏమీ చెప్పలేదు, అయినా సరే, ఈ “మధ్యవర్తి” ధర్మమా అని, ఉత్తినే లేనిపోని అపార్ధాలు చోటు చేసికుంటాయి.అన్నాళ్ళూ, స్నేహంగా ఉన్నవాళ్ళు మొహం మొహం చూసుకోరు, అలాగని ఆ “అపోహ” దూరం చేసికోవాలనీ ప్రయత్నం చేయరు.ఎవరి ego వారిదీ.

    ప్రపంచం లో ఏదో ఒక లోపం లేనివాడెవడూ ఉండడు.కొంతమదివి కనిపించేవీ, కొంతమందివి కనిపించనివీనూ. శరీరం లో ఉండే లోపాలు కొంతమందివి కనిపిస్తాయి, అలాటప్పుడు మనం మాట్టాడేటప్పుడు మరీ జాగ్రత్త గా ఉండాలి. ఇలాటివి చాలా fertile ground to create misunderstanding. ఏం మాట్టాడినా తమ గురించే అనుకుంటారు.అంతదాకా ఎందుకూ, నేనే ఓ living example, మొదట్లో అందరూ నన్ను చూసే నవ్వుతున్నారూ అనుకునేవాడిని, చాలా ఫీలైపోతూండేవాడిని, అదో రకమైన కాంపెక్స్ వచ్చేసింది. కానీ, బంగారం లాటి భార్యా, రత్నాల్లాటి పిల్లలూ వచ్చిన తరువాత, ఆ డిప్రెషన్ లోంచి బయట పడ్డాను.Now I feel I am the luckiest person, by the grace of GOD.ఇప్పుడు, ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఫారినర్ అనుకున్నామండీ అన్నా కానీ, నవ్వేసి ఊరుకుంటాను!! అవతలివారు ఏ ఉద్దేశ్యంతో అన్నా సరే !అక్కడికేదో నేను గొప్పవాణ్ణనికాదు. సందర్భం వచ్చింది కదా అని, నా personal example చెప్పాను.ఏదో భగవంతుడి దయ వలన,అలాటి దృష్టికోణంలో ఆలోచించే శక్తి ప్రసాదించారు. ఎవరి గురించి మాట్టాడితే ఎవరూరుకుంటారు చెప్పండి?

   ఎవరికైనా ఓ physicaly challenged వారెదురుగుండా,వారిలో ఉండే మంచితనాన్నైనా పొగుడుతూ మాట్టాడినా, ఒక్కోప్పుడు అపార్ధాలకి దారితీస్తుంది. ఇవతలివారి intentions may be noble, కానీ ఆ చెప్పడంలోనే ఉంటుంది నేర్పంతా. అయినా మనందరమూ డాక్టర్లమా ఏమిటీ, ఇలాటివన్నీ నేర్చుకోడానికి? ఏదో యాదాలాపంగా మాట్టాడేశామనుకుంటాము. అవతలివారికి ఎక్కడో గుచ్చుకుంటుంది. అంతే coldwar ప్రారంభం అవుతుంది. ఎప్పటికో అర్ధం చేసికుంటారు, పాపం ఏదో మనస్సులో పెట్టుకుని అనుండరూ అని. కానీ అది realise చేసి relations మామూలు స్థితికి రావడానికి చాలా టైము పడుతుంది.Life goes on….

Advertisements

2 Responses

 1. అపార్థాలు కలగకుండా ,తాను నొవ్వక
  పరులను నొప్పింపక ఉండడం చాలా కష్టం .
  గూడి గూడి బాయిగా ఉండడం వాళ్ళ లాభం లేదు.
  మీతో ఏకిభవిస్తున్నాను.

  Like

 2. మోహన్ గారూ,

  ధన్యవాదాలు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: