బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు


   అదేమిటో కొందరు ఎక్కడైనా కాలెడితే, ఎక్కడలేని ఉపద్రవాలూ వచ్చేస్తూంటాయి. నేనూ, ఇంటావిడా 2004 లో దక్షిణ దేశ యాత్ర చేసి వచ్చిన ప్రాంతాలన్నీ, “సునామీ” వచ్చేసి కొట్టుకుపోయాయి ! ఆ తరువాత ఈ మధ్యన ఉప్పాడ వెళ్ళేటప్పటికి, కొద్దిరోజులకే అక్కడ కూడా “సునామి” హెచ్చరిక వచ్చేసి, ఉపద్రవం జరగబోతూ ఆగిపోయింది! తేడా ఏమిటంటే, మేము ఇద్దరమూ కాకుండా, ఇంకోరు( మా కజినూ, భార్యా) కూడా ఉండడం వల్లనేమో ఉపద్రవం వస్తూ వస్తూ ఆగిపోయుండొచ్చు !

   కిందటేడాది అబ్బాయీ,కోడలూ మనవరాలూ,మనవడితో ఇక్కడకు దగ్గరలో ఉన్న దివేఘర్ అని, కొంకణ్ తీరం లో ఉన్న ఒక రిసార్ట్ కి వెళ్ళాము. అక్కడి ప్రత్యేకత , సువర్ణ గణపతి విగ్రహం గురించి, మా ఇంటావిడ ఓ టపా కూడా పెట్టింది. మా పాదమహిమ వలన ఇక్కడ జరిగిన ఉపద్రవం ఏమిటంటే, ఆ సువర్ణ గణపతి విగ్రహాన్ని ఎవరో దొంగలు ఎత్తుకుపోయారు ! చెప్పానుగా ఇద్దరం వెళ్తేనే గొడవంతా, పిల్లలు కూడా ఉండడం తో ఆ ఉపద్రవం తప్పిపోయినట్టే. విగ్రహ దొంగల్ని పట్టుకున్నారుట !

    Moral of the story ఏమిటంటే… లోకకల్యాణార్ధం నేనూ మా ఇంటావిడా కలిసి మాత్రం ఎక్కడికీ వెళ్ళకూడదూ అని !! అలాగని, అస్సలు వెళ్ళకూడదని కాదూ, ఎవరో ఒకరిని తోడు తీసికునే వెళ్ళమనీ… freedom fighters కీ వాళ్ళకీ రైళ్ళల్లో వెళ్ళేటప్పుడు తోడుండాలంటారు అలాగన్నమాట !!

   ఈమధ్యన http://www.tenderleaves.com/ తరపున మా అబ్బాయి హరీష్, కోడలు శిరీష చిన్న పిల్లలకి ఓ summer camp నిర్వహిస్తున్నారని ఆ మధ్య ఓ టపా వ్రాశాను. అక్కడ జరుగుతున్న కొన్ని కార్యక్రమాల ఫొటోలు ఇక్కడ, ఇక్కడ, ఇక్కాడా( కొత్త బంగారు లోకం..!!) చూడండి.

   ఈ హడావిడిలో ఉండి టపాలు వ్రాయడం కొద్దిగా వెనక్కి వెళ్ళింది…

4 Responses

 1. మీరు మరీను,
  సునామి రావడానికి సైంటిఫిక్ కారణాలున్నాయి కదా!
  అలాగే దొంగతనానికి తిరిగి పట్టుబడ దానికి మీకు , ఏమి సంభందం?
  మీ ఫోన్ నెంబర్ ఇస్తారా, ఒక కాల్ ఇచ్చి!
  Please avoid self blaming, and self flagellation.

  Like

 2. @శర్మగారూ, ఫణీంద్రా,

  ధన్యవాదాలు.

  @మోహన్ గారూ,

  ఈ వంకనైనా ఇద్దరమూ వెళ్ళడం తప్పించుకోవచ్చని !!!!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: