బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పోన్లెద్దూ.. Syndrome..


   మనలో చాలామందికి ఈ “పోన్లెద్దూ” అనో, ” जानॅ दी यार्….” అనో, “Let it be..” అనో ఉంటుంది.
ఎందుకొచ్చిన గొడవా అనైనా కారణం కావొచ్చు, లేదా సహసిధ్ధంగా అన్నిటితోనూ సద్దుకుపోయే స్వభావం కావొచ్చు. ఏది ఏమైనా ఇలాటి మనుషులు ని exploit చేసేవారు చాలా మందుంటారు.
అవతలి వారిలోని మంచితనం కనిపించదు. అదేదో వారి బలహీనత అనుకుంటారు.ఛాన్స్ దొరికితే చాలు అవకాశం తీసేసికుంటారు. పైగా ఇలాటివారి స్వభావం స్పష్టంగా కనిపిస్తుంది. పైగా అందరికీ ఓ అభిప్రాయం కూడా ఏర్పడిపోతుంది. ఫరవాలేదు మనవాడే అని లోకువైపోతాడు. ప్రస్తుత వాతావరణం లో ఇలాటి వారు చాలా నష్టపోతూంటారు.

   ఆఫీసుల్లో చూస్తూంటాము. కొంతమంది “పనిదొంగలు ” ఉంటూంటారు. వీళ్ళకి రోజంతా పని ఎలా ఎగ్గొట్టడమా అనే ఆలోచిస్తూంటారు. సడెన్ గా ఎక్కడినుంచో ఫోనొచ్చిందీ అని ఓ వంక పెట్టి, ఇదిగో మన “పోన్లెద్దూ” మాస్టారి దగ్గరకు వెళ్ళి, “బాబ్బాబు, ఈ ఫైలు చాలా అర్జెంటూ, నాకేమో ఇంటినుంచి ఫోనొచ్చింది, అర్జెంటు గా వెళ్ళాలి, ఏమీ అనుకోపోతే కొద్దిగా దీన్ని క్లియర్ చేసి, ఆఫిసరుకి ఇచ్చెయ్..” అని బుడి బుడి ఏడుపులు ఏడ్చేసి, ఆయనకి అంటకట్టేస్తాడు. ఈయన సీట్ కి పక్కనుండే ఆయన అడుగుతాడు అప్పటికీ, అదేమిటి మాస్టారూ మీ టేబుల్ పని చాలదన్నట్టు, అతని పనికూడా నెత్తిమీద పెట్టుకున్నారేమిటీ అని. మన ఫ్రెండు మాత్రం “పోనీ లెండి, నాక్కూడా ఖాళీయేగా, ఆ మాత్రం సహాయం చేస్తే అరిగిపోతానా ఏమిటీ..” అని చిద్విలాసంగా సమాధానం చెప్తాడు. ఆ అవతలి ప్రబ్రుధ్ధుడి కి అంత అర్జెంటు పనేమిటయ్యా అంటే పెళ్ళాం తో మ్యాట్నీకి వెళ్ళడం. పోనీ ఇలా సహాయం చేశాడని ఏమైనా కృతజ్ఞత అనేది ఉంటుందా అంటే అదీ లేదు. ఆఫీసంతా టముకేస్తాడు– మా సెక్షన్ లో ఫలానా వెర్రిబాగులోడోడున్నాడూ అని !

   ఇలాటివారు మొగాళ్ళలోనే కాదు, ఆడాళ్ళలోనూ చూస్తూంటాము, ఏదో తన భర్త ప్రేమతో తెచ్చిన చీరో, లేక ఇంకోటేదో పక్కింటివారికి చూపించిందే అనుకుందాం, ” అబ్బ ఎంత బావుందండీ, ఎప్పటినుంచో వెదుకుతున్నా సరీగ్గా ఇలాటి దానికోసమే… వగైరా వగైరా..” .ఇంక ఈవిడ, మీకు మరీ నచ్చేస్తే పోనీ మీరే ఉంచేసికోండి, నేను ఇంకోసారి కొనుక్కుంటాను అంటుంది. అలాగే జీవితమంతా కుటుంబం కోసం సేవ చేస్తూనే ఉంటుంది. పిల్లలకోసం, భర్త కోసం తయారు చేసిన పిండివంటలు పోనీ ఓసారి రుచైనా చూస్తుందా అంటే అదీ లేదు.”పోన్లెద్దురూ పిల్లలిష్టపడుతున్నారని చేశాను, వాళ్ళతో వంతేమిటీ..”.

   ఈరోజుల్లో ప్రతీవాడూ మాల్స్ కి వెళ్ళేవాడే. అక్కడ ఏ కౌంటరు దగ్గర చూసినా కొల్లేరు చాంతాడంత క్యూలే బిల్లింగ్ చేయడానికి. ఎవడో వస్తాడు, ‘ఆంకుల్, నేను అర్జెంటు గా వెళ్ళాలి, కొద్దిగా నన్ను మీకంటే ముందర వెళ్ళనిస్తారా ప్లీజ్…”. అదేం ఖర్మమో, ఈ “పోన్లెద్దూ” జాతి పక్షులు, కరిగిపోతారు. బస్సుల్లో సీటు ఖాళీగా ఉన్నా కూచోడు.పక్కవాడు పేపరడిగినా ఇచ్చేస్తాడు. అవతలివాళ్ళకి సహాయం చేయొచ్చు కాదనం, కానీ మరీ “అపాత్రదానం” చేయకూడదు. పైగా అలా చేస్తే “పాపం” ట కూడానూ.

   బైదవే మీ అందరి ఆశీర్వచనాలతోనూ, మీరు చూపించే అపార అభిమానం తోనూ, నేను ఈ టపాలు వ్రాయడం ప్రారంభించి, నిన్నటికి 3 సంవత్సరాలు పూర్తిచేశాను. మా ఇంటావిడ వ్రాసే blogspot లో , ప్రపంచం లో ఏ ఏ దేశాలలోని పాఠకులు చదువుతున్నారో అని వివరాలు ఇస్తారు. అయ్యో నేను వ్రాసేది wordpress దీంట్లో అలాటి సదుపాయం లేదే అని ఊరికే బాధ పడిపోయేవాణ్ణి ఇన్నాళ్ళూ. తెలిస్తే ఏం చేస్తారుటా అని అడక్కండి. అదో “తుత్తీ”, ఓహో మనం రాసే “చెత్త” కబుర్లు ప్రపంచం లో ఇంతమంది చదువుతున్నారా అని ఓ సంతోషం, ఆనందం. ఇంతకంటే ఏం కావాలండీ ఈ వయస్సులో? ఈమధ్యన wordpress లో కూడా ఈ వివరాలు ఇస్తున్నారు. ప్రతీ రోజూ ఓసారి చూసుకోడం, సంతోషించడం. వామ్మోయ్ నా టపాలు ప్రపంచంలో ఉన్న ఇన్నిదేశాల్లో పాఠకులు చదువుతున్నారా అనిపించింది. అందరికీ నా నమస్కారాలు.మొదట్లో వ్రాయడం మొదలెట్టినప్పుడు, వ్యాఖ్యలు పెట్టేరా ఎవరైనా అని పొద్దుటే లేచి చూసుకోడం, వ్యాఖ్య లేకపోతే “అయ్యో..” అనుకోడం. కాలక్రమేణా అలవాటైపోయింది. ” పోన్లెద్దూ పాపం టైము లేకపోయిందేమో…” దాకా వచ్చాను. అసలంటూ చదువుతున్నారు కదా, ఎవరూ చదవకుండానే 1,78000 పైగా hits ఎక్కణ్ణుంచొస్తాయీ? ఎక్కడికక్కడే సమాధాన పడిపోవాలి కదూ.. ఏదో ఓపికున్నన్నాళ్ళూ రాస్తూండడమే. వ్రాయడానికేమిటీ టాపిక్స్ కావలిసినన్ని. పనీ పాటా లేదూ, ఇంకేం చేయనూ మరి?….

   నా టపాలు చదివి సింగపూర్ నుంచీ, US నుంచీ ఫోన్లొచ్చినప్పుడు అనిర్వచనీయమైన సంతోషం. ఫరవాలేదూ, నాటపాలు చదివి ఫోను చేయాలనిపించినవారు కూడా ఉన్నారూ అని ఓ ఆనందం.

A BIG BIG THANKS …….

    ఈ అభిమానం ఇలాగే కొనసాగనీయాలని ఆ భగవంతుడిని ప్రార్ధిస్తూ….

10 Responses

 1. Sorry sir I am also a good follower of ur blog but seldom reply. Thanks for the honest posts Satya from Singapore

  Like

 2. చెప్పొద్దు కానీ మీరు నేనూ కూడా ఈ పోన్లేద్దు బ్యాచ్ సభ్యులమేనండీ……

  నేను కొన్ని విషయాలలో ‘పోన్లేద్దూ’ పాలసీ పాటిస్తుంటాను…..

  మీరు, ఒక్కోసారి మేము కామెంటు పెట్టడం మర్చిపొయినా ‘పోన్లేద్దూ’ అనుకోవట్లేదా ఏమి…..?

  అలా అనుకోకుండా టపాలు రాయడం మానేస్తే ఊరుకుంటామా ఏంటి గానీ….??

  Like

 3. మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మీబ్లాగుకు అభినందనలండీ…

  Like

 4. పోన్లేద్దూ, బాతాఖానీ ఫణి వారు మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారట ! పోన్లేద్దూ, ఒక కాంప్లిమెంట్ ఇద్దారి !

  చీర్స్ సర్!
  జిలేబి.

  Like

 5. మూడేళ్ళ గా వ్రాస్తున్నందుకు మీకు అభినందనలు.
  ఒక దశాబ్దం తరువాత, పోనిలే పాపం అని అనుకుంటూ, ఇదే కామెంటు మళ్ళి పెడతాను…. దహా.

  Like

 6. happy anniversary (birthday) sir…!

  Like

 7. Happy third annivarsary, wish for a fast lakh “vennuthattlu”
  Mohan

  Like

 8. కంగ్రాట్స్! మీ కబుర్ల కోసం ఎదురు చూసే వాళ్ల ముందు వరస లో నేనూ.. ఎప్పుడూ ఉంటాను..

  Like

 9. Congrats Phani Babu Garu …On ur successful completion of 3 yrs of blogging..Keep Going

  Like

 10. @సత్యనారాయణ గారూ,

  ధన్యవాదాలు.

  @మాధవీ,
  ఏదో తిన్నతిండరక్క కూసే కూతలు కానీ, రాయడం మానేస్తానా ఏమిటీ? ఇంట్లోవాళ్ళకెలాగూ ఓపిక లేదు. మీ అందరితోనైనా పంచుకోవద్దూ నా గోల…

  @జ్యోతిర్మయీ,

  థాంక్స్…

  @జిలేబీ,

  థాంక్స్…

  @సుబ్రహ్మణ్యం గారూ,

  వామ్మోయ్ ఇంకో దశాబ్దమా ….

  @ఫణీంద్ర,

  థాంక్స్..

  @మోహన్ గారూ,

  ఏదో హిట్స్ లక్ష దాటేయి అక్కడికే సంతోష పడిపోయాను. వెన్నుతట్లు కూడానా … అంతంత ఆశలు లేవు సార్…

  @కృష్ణప్రియా,

  ఆ మాత్రం ప్రోత్సాహం ఉంటే చాలమ్మా… థాంక్స్..

  @డాక్టరుగారూ,

  థాంక్స్…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: