బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మా గ్రంధాలయ ప్రస్థానం…చాలా తీయగా, కొంచం చేదుగా….ఉగాది పచ్చళ్ళా అన్నమాట…


   మా అబ్బాయి ప్రారంభించిన tenderleaves.com ప్రోత్సాహవంతంగా ముందుకు సాగుతోంది. ఈమధ్యనే ఓ కొత్త investor ఒకరు వచ్చారు. ఇంగ్లీషు, మరాఠి, హిందీ పుస్తకాలకి ప్రోత్సాహం బాగానే ఉంది. వచ్చిన గొడవల్లా, తెలుగు పుస్తకాల విషయం లోనే వస్తోంది. ఏదో పూణె లో అయిదు లక్షల మందిదాకా మనవాళ్ళు ఉన్నారూ, వారికి తెలుగు పుస్తకాలు ( ఆరు వందల పైగా), ఇంట్లోంచి బయటకు వెళ్ళఖ్ఖర్లేకుండా, గుమ్మం లోకే వచ్చేటట్టు సదుపాయం ఇచ్చినా, response మాత్రం అంత ఉత్సాహంగా లేదు. అప్పటికీ, నాకు చాలా మందే తెలుసుననే దురభిప్రాయం తో ఉన్నాను ఇన్నాళ్ళూ. పోనీ ఆ తెలిసినవాళ్ళైనా చేరారా అంటే, అదీ లేదూ. అప్పటికీ గ్రంధాలయం ప్రారంభించే ముందు, చాలా మందితో సంప్రదించాను కూడా. ” అర్రే బలేగా ఉందండీ. అయితే మనకి తెలుగు పుస్తకాలు ఇంటికే వచ్చేటట్టు చేస్తున్నారన్న మాట.. అహా ఒహో…” అన్నవాళ్ళే, తీరా ప్రారంభించిన తరువాత, “ ఏమిటోనండీ, అసలు టైమే ఉండడం లేదండీ” అని ఒకళ్ళూ, “పిల్లలతోనే సరిపోతోందండీ...” అని ఒకళ్ళూ. ఇంకోళ్ళైతే, మాకు తెలిసినవారితో చెప్తాములెండి అని ఇంకొకళ్ళూ, పోనీ ఏ ఆంధ్ర సంఘం వారి కార్యక్రమాల్లోనైనా, అంతమంది తెలుగువారు పరిచయం అవుతారూ, వాళ్ళకేమైనా interest ఉందేమో అని వారితో పరిచయం చేసికుని, వారికి pamphlet ఇచ్చి ఫలానా సైటులోకి వెళ్ళి చూడండీ, వగైరా..వగైరా చెప్పడం వరకే సీమిత్ అవుతోంది. ” రాత్ గయీ బాత్ గయీ..” లాగ, నేనిచ్చిన pamphlet చూసే ఓపికెవరికుంటోంది? అసలంటూ వాళ్ళు ఇళ్ళకెళ్ళిన తరువాత సెర్చ్ చేశారా లేదా అన్నది, మాకు ఎలాగూ తెలుస్తుంది.

   ఇదంతా మా గ్రంధాలయానికి బిజినెస్స్ రావడంలేదే అన్న భావంతో వ్రాసింది కాదు. అయ్యో అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోలేక పోతున్నారే అనే ఆవేదనతో వ్రాస్తున్నది. సభ్యులైన వారు కూడా, నా బ్లాగులద్వారా తెలిసికున్నవారే. పూణె లో ఉంటున్న వారు చాలామంది, ఐ.టి. లోనో, టాటా మోటార్స్ లోనో, బ్యాంకుల్లోనో ఈమధ్యన చేరినవారే. నేను వారిని పరిచయం చేసికుని, మా గ్రంధాలయం గురించి చెప్పడం, వారు వెంటనే అలాగాండీ అనడం, తరువాత, పుస్తకాలు చదువుతామండీ అనే వారొకరూ, మాకు తెలుగు చదవడం రాదూ అనేవారొకరూ. I can definetely understand and appreciate this problem. ఎందుకంటారా, ఏ పరాయి రాష్ట్రం లోనో చదివినవారికి ఈ సమస్య ఉంటుంది. కానీ మేము target చేస్తున్నది, నిజం చెప్పాలంటే వారిని కాదు, వారి ఇంట్లో వీళ్ళ పిల్లల్ని చూసుకోడానికై, రిటైరయిన తరువాత మన వైపునుండి వచ్చిన వారి తల్లితండ్రులనీ, అత్తమామల్నీనూ !! వీళ్ళు ప్రొద్దుటే అఫీసులకెళ్ళిపోతారు, రోజంతా ఆ టి.వీ. ముందర కూర్చోడం కంటే, ఇలాటి గ్రంధాలయాల నుండి, తెలుగు పుస్తకాలు తెప్పించి ఇస్తే బాగుంటుందని.అప్పటికీ ఆ విషయమూ చెప్తూంటాను.అయినా ఎవరూ పట్టించుకున్నట్టు లేదు. సదుపాయం అంటే కల్పించగలం కానీ, బలవంతం చేయలేము కదా!!

   పోనీ ఊరికే ఇద్దామనుకున్నా, మరీ మాదేమీ Charitable Institution కూడా కాదే !పూణె లో ఏ ప్రాంతం లోనైనా నివశించేవారికి పుస్తకాలు వారి గుమ్మం దాకా చేర్చాలా వద్దా, దానికయే ఖర్చుమాత్రమే అడుగుతున్నాము.ఎంతా నెలకి రెండు/మూడు వందలు. ఎన్ని పుస్తకాలైనా తెప్పించుకోవచ్చు. ఆ ఎమౌంటు కూడా ఎక్కువైపోతుందనుకునే వారిని ఏం చేయగలమూ?

   అప్పుడప్పుడు మా అబ్బాయి అడిగే ప్రశ్నలకి నా దగ్గర జవాబు లేదు. “అదేమిటి డాడీ ఈ ఊళ్ళో తెలుగువారు చాలా మందున్నారూ, వాళ్ళకి పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం అన్నావూ…” .అవును నాయనా ఏం చేయనూ, అలా అనుకున్నానూ, కానీ అది శుధ్ధ తప్పూ అని తెలిసిందీ.ఏదైనా అనుభవం మీదే కదా తెలిసేదీ, ఇంగ్లీషు,మరాఠీ పుస్తకాలకి response బాగుంది కదా, అలాగే కానీయ్ అని ఓ వెర్రి నవ్వు నవ్వేస్తూంటాను అంతకంటే ఇంకేమీ చేయలేక… తనూ అర్ధం చేసికున్నట్టే కనిపిస్తున్నాడు.

   కిందటేడాది ఈ ఊళ్ళో ఉన్న స్కూలు పిల్లలచేత స్టోరీస్ వ్రాయించి, ఓ పుస్తకం కూడా రిలీజ్ చేశాడని ఓ టపా వ్రాశాను. గుర్తుండే ఉంటుంది. దాని తరువాత, పై నెలలో ఓ Summer Camp ఒకటి organise చేస్తున్నాడు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

   ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే పుస్తక పఠనం సంబంధించినంతవరకూ, మన భాష వారికంటే ఇతర భాషల వారికే ఉత్సాహం ఎక్కువని. వారికోసం కాకపోయినా, వారి పిల్లలకైనా పుస్తకపఠనం ఆలవాటు చేద్దామనుకునే సదుద్దేశ్యంతో మా టెండర్ లీవ్స్ చక చకా ముందుకు సాగిపొతోంది… మీ అందరి ఆశీర్వాదాలతోనూ, భగవంతుడి దయతోనూ, అలాగే ముందుకు సాగిపోవాలని ఆశిస్తూ.…..

6 Responses

 1. మీ టెండర్ లీవ్స్ కి శుభాభినందనలు. ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలని, పూనా లోని తెలుగు వారికి తెలుగు పుస్తక పఠనాభిలాష పెరగాలని కోరుకుంటున్నాను.

  Like

 2. తివిరి ఇసమున తైలంబు తీయ వచ్చు
  ———చేరి మూర్ఖుని మనస్సు రంజింప రాదు.
  గుల్టీ లతో తెలుగు చదివింప ఎవ్వరి తరం కాదు.

  Like

 3. ఫణిబాబు గారు, నేను ప్రతి సంవత్సరం రెండు ముడు వేలు పెట్టి పుస్తకాలు కొంటుంటాను. కాని అందులో పది ఇరవయి శాతం మాత్రమె చదువగలుగు తున్నాను. సిటి జీవితాలలో అంతా సమయం కేటాయించటం కష్టం. అది తెలుగాయిన ఇంగ్లిష్ అయిన సాఫ్టువేరు బుక్సు అయిన కూడా ఒకటే.

  Like

 4. @సుబ్రహ్మణ్యం గారూ,

  అనే ఆశిస్తున్నాము…..

  @మోహన్ గారూ,

  ” గుల్టీ లతో తెలుగు చదివింప ఎవ్వరి తరం కాదు.”—ఏమో మరి…..

  @శేషు,

  మీరు చెప్పినదానితో నేనూ ఏకీభవిస్తాను. కానీ నా బాధల్లా ఏమిటంటే, పరాయి రాష్ట్రాల్లో ఉంటూ, తెలుగు పుస్తకాలు లభించడం లేదో అని ఉత్తుత్తి కబుర్లు చెప్పేవారిని చూసి.

  Like

 5. తెలుగు దెశం లో కూడా చదివే వాళ్ళు తగ్గిపొతున్నారు. చాలా మంది పిల్లలకి క్లాస్ పుస్తకాలు తప్ప మరొకటి చదివే ఓపిక సమయము కుడా లెవు.

  Like

 6. సింహాద్రి అప్పన్న గారూ,

  అది కూడా నిజమే…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: