బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– మేరా భారత్ మహాన్….


   ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పరిణామాలకి నవ్వాలో, ఏడవాలో తెలియడం లేదు. నిజం చెప్పాలంటే భారతీయులుగా మనం అందరం సిగ్గుపడాల్సిన విషయం. మన పదాదిదళాధికారి జనరల్ సింగ్ గారు, మొదట్లో ఆయన జన్మదినం గురించి గొడవ పడి సుప్రీం కోర్టు దాకా వెళ్ళి, వెనక్కి తగ్గారు. ఈ లోపులో మన ప్రభుత్వం కొత్త జనరల్ ని నియమించేసింది. ఇంక ఎలాగూ వెళ్ళాల్సిందే అనుకున్నారో ఏమో, రోజుకో స్కాం బయటపెట్టడం మొదలెట్టారు. చివరకి జరుగుతున్నదేమిటీ అంటే,ఒకళ్ళమీదొకళ్ళ నేరారోపణలు మాత్రమే. రాజకీయ నాయకులకైతే సిగ్గూ, ఎగ్గూ లేదనుకోవచ్చు, కానీ డిసిప్లీన్ కి మారుపేరైన ఆర్మీలో ఉంటూకూడా, సింగుగారి ప్రవర్తన వెనుక అసలు విషయమేమిటో మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. రిటైరయిన తరువాత పోనీ ఏదైనా ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారేమో అని, లాలూ అన్నదాన్ని కొట్టిపారేయలేము. పోనీ చేద్దామనే అనుకున్నారనుకుందాము, కానీ దానికీ ఓ వరసా వావీ ఉండాలిగా.

   గత వారం రోజుల్లోనూ, వాళ్ళెవరో తనకి 14 కోట్లు ఇవ్వచూపారూ అని ఒకటీ, ఇంకోసారి ప్రస్తుతం ఇంకా సర్వీసులో ఉన్న జనరల్ దల్బీర్ సింగ్ గురించి, ఆయనెవడో త్రునమూల్ కాంగ్రెస్ ఎం.పి. ఏదో పితూరీ చెప్పాడనీ,ఇవన్నీ కాకుండా, మన దేశరక్షణ చాలా క్లిష్టపరిస్థితుల్లో ఉందని, ప్రదానమంత్రికి ఈయన ఓ లేఖ వ్రాశారనీ, ఆ లేఖేదో లీకయింది. ఇదిలా ఉండగా, “సందట్లో సడేమియా” అన్నట్టు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి, వాళ్ళ నాన్న ( దేవె గౌడ) ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, ఆయనకీ లంచం ఇవ్వబోయారనీ, ఎవడిష్టం వచ్చినట్టు వాళ్ళు పిచ్చికుక్క కరిచినవాళ్ళలా నోటికొచ్చింది వాగేస్తున్నారు. మన రాజకీయనాయకులకి కావలిసినంత మసాళా దొరికేసింది. అక్కడికేదో, తామే సత్యహరిశ్చంద్రులన్నట్టు, లాలూ దగ్గరనుండి, మెడమీద తలకాయున్న ప్రతీవాడూ మాట్లాడేస్తున్నాడు.

   మేము ఉద్యోగంలో చేరిన కొత్తలో, ప్రతీ ఏడాదీ మా అందరిచేతా, ఓ Oath of secrecy తీయించేవారు.కాలక్రమేణా ఆపేశారు. మా Ordnance Factories లలో, ఎక్కడ ఏమేమి తయారుచేసేవారో దాంట్లో పనిచేసేవారికి తప్ప ఇంకోరికి తెలిసేది కాదు. దేశరక్షణ దృష్ట్యా అలాటివి అవసరమే కదా. అలాగని, వాటిల్లో ఏదో అంతా Rosy గా ఉండేదీ అని కాదు. ప్రతీ వ్యవస్థలోనూ లోపాలనేవి ఉంటూనే ఉంటాయి. కానీ inspite of all that, 1962 తరువాత మన రక్షణదళాలు బయటి దేశాలతో జరిపిన మూడు యుధ్ధాల్లోనూ, మరీ పూర్తిగా కాకపోయినా, నూటికి అరవైపాళ్ళైనా, మా Ordnance Factories వారి ఘనతే కదా.

    ఈవేళ్టి press conference లో రక్షా మంత్రి శ్రీ ఆంటొనీ చెప్పినట్టు, మన సరిహద్దుల్లో రాత్రనక పగలనక మనల్ని, రాత్రిళ్ళు ప్రశాంతంగా నిద్రపోనిస్తున్న మన జవాన్లని దృష్టిలో పెట్టుకునైనా మన రక్షణ బలాల్ని గురించి, మరీ పబ్లిక్కుగా మాట్టాడొద్దు. అక్కడికేదో మన అధికారులందరూ సత్యహరిశ్చంద్రులనడం లేదు. మా DGOF/Chairman Ordnance Factories, దోచుకున్నంత దోచుకుని, పట్టుకునేసరికి, ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.అదే పొజిషన్ కి వెళ్ళిన ఇంకా చాలామంది తిన్నా పట్టుబడలేదు కాబట్టి, పెద్దమనుషుల్లా చెలామణి అయి, హాయిగా రిటైరయ్యారు. అలాగే ప్రభుత్వ విభాగాల్లో అత్యున్నత స్థానాలకి వెళ్ళిన చాలామంది “జాతకాలు” నెట్ లో వెదికితే కావలిసినన్ని దొరుకుతాయి. పట్టుకోనంతసేపే దొర, పట్టుకుంటే దొంగ.

   అంతదాకా ఎందుకూ, కొంతకాలం క్రితం వరకూ, మా Ordnance Factories లో Production Target జనవరి ఒకటో తారీకుదాకా ఎవరికీ తెలిసేది కాదు, కానీ ఇప్పుడు ప్రతీదీoutsource చేయడం, ఆ figures అన్నీ నెట్ లో పెట్టడంతో, ఆర్నెల్లు ముందరగానే, వెండర్లకి తెలుస్తోంది. ఇంక సీక్రెసీ ఉండమంటే, ఎక్కడ ఉండి ఛస్తుందీ? One has to pay the price for all these things. ఇదివరకటి రోజుల్లో ఎవరైనా sensitive positions లో పనిచేసి రిటైరయిన తరువాత, కొంతకాలం దాకా conflict of interest వచ్చేచోట పని చేయకూడదనేవారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటీ, ఆ పెద్ద పొజిషన్ లో ఉన్నవాడు, సర్వీసులో ఉండగానే, VRS తీసికుని మరీ, Advisor/Consultant గా చేరిపోతున్నాడు.<b.To hell with conflict of interest... వీటన్నిటికీ మూలకారణం lack of discipline. జన్మతాహా క్రమశిక్షణ లేనివాడు, దేశాన్నేమిటీ, తల్లిని కూడా అమ్మేయడానికి వెనుకాడడు.

   ప్రస్తుతం మన జనరల్ సింగ్ గారు ప్రధాన మంత్రికి వ్రాసిన విషయాలేవీ కొత్తవి కావు. వచ్చిన గొడవల్లా ఏమిటీ అంటే, పబ్లిక్ డొమైన్ లోకి రావడం కొత్త.ఆయనెవడో, ఈయనకి 14 కోట్లు ఇవ్వ చూపాడూ అన్నది జరిగి రెండేళ్ళ క్రితం అయితే, మరి ఇప్పటిదాకా ఏం చేస్తున్నారుట? గోళ్ళు గిల్లుకుంటున్నారా? అలాగే జనరల్ దల్బీర్ సింగు గారి విషయం కూడా, ఇప్పుడే బయటపెట్టాల్సిన విషయం కూడా debatable. ఎలాగూ ఇంకో రెండు నెలల్లో రిటైరయిపోతాడు కదా, ఆ తరువాత ప్రతీవాడూ రాసినట్టుగా memoirs రాసుకోవచ్చుగా. ఆ పుస్తకం ఎవడూ కొనడేమో అని భయమా? There was no need to to make them public at this juncture.There definetely is an ulterior motive.

   ఇంక మన మాజీ ప్రధానమంత్రి గారు ఇప్పుడే ” నిద్ర” లోంచి లేచారా? లేక ఈమధ్యన ఎవడూ తనని పట్టించుకోడంలేదని ఆడే డ్రామాయా ఇది. దేశ ప్రధాన మంత్రి అనండి, లేక ఆర్మీ ఛీఫ్ అనండి, వారి దరిదాపుల్లోకెళ్ళి, వాళ్ళకి “ఎర” చూపించే ధైర్యం ఉంటుందంటే నమ్మే విషయమేనా? అంత చీప్పా వాళ్ళూ?పోనీ అలా జరిగిందనే నమ్ముదాము,అంటే వారి ప్రవర్తన అలాగే ఉందనుకోవాలా? If somebody could offer a bribe to people, holding such high position, God only can save this Country.

   ఈ గొడవ చాలదన్నట్టు, వాడెవడో పంజాబ్ మాజీ ముఖ్యమంత్రిని చంపినందుకు, ఉరితీయాలిట, ఠాఠ్ కూడదూ అన్నారుట, మన కేంద్ర గృహశాఖ వారు, ఆ “ఉరిశిక్ష” stay చేసేశారుట. మరి సుప్రీం కోర్టులూ అవీ ఉన్నదెందుకుట? ఇదంతా ఓ డ్రామా అని సుప్రీం కోర్టు వారు చెప్పనే చెప్పారు. అయినా వాళ్ళని పట్టించుకునే వాళ్ళెవడులెండి?

    చివరికి జరిగిందేమిటయ్యా అంటే, దేశాన్ని అమ్మకానికి పెట్టేశారు.

   మేరా భారత్ మహాన్.

Advertisements

11 Responses

 1. ఫణిబాబు గారూ,

  సరైన ప్రశ్నలు వేశారు. మీ టపాతో దాదాపుగా 100% ఏకీభవిస్తున్నాను. (దేశాన్ని అమ్మకానికి పెట్టేశారు అనేదొక్కటి మాత్రం కొంచెం నచ్చలేదు కానీ మీ ఉద్దేశ్యం అర్థమయ్యింది లెండి).

  చాలామంది మెధావులూ, చదువుకున్నవాళ్ళూ దేశభక్తులుగా చెప్పుకునే వారి నంగి మాటలూ, అతి ద్వేషంతో కూడిన వాదనలూ, ఏమాత్రం ఆలోచనలేని లాజిక్కులూ విని వినీ విసిగెత్తిపోయిన వాళ్ళకి మీలా ఆలోచించేవాళ్ళను చూసినప్పుడు మళ్ళీ దేశం మీద ఆశ చిగురిస్తుందండీ.

  Like

 2. పిచ్చికుక్క కరిచినవాళ్ళలా నోటికొచ్చింది వాగేస్తున్నారు. – ఈమాట కరెక్ట్ సర్. God knows the truth. But in India truth will be like God (Invisible)

  Like

 3. పిచ్చికుక్క కరిచినవాళ్ళలా నోటికొచ్చింది వాగేస్తున్నారు. ఇది కరెక్ట్ సర్. God knows the truth, in our country truth is like god (invisible).

  Like

 4. ఏమిటి ఇల్లా అందరి మీద అగ్గి ఫైర్ అయిపోతున్నారు. 2014 ఎన్నికల్లో నిలబడతారా?

  Like

 5. / ఈయనకి 14 కోట్లు ఇవ్వ చూపాడూ అన్నది జరిగి రెండేళ్ళ క్రితం అయితే, మరి ఇప్పటిదాకా ఏం చేస్తున్నారుట? గోళ్ళు గిల్లుకుంటున్నారా? /
  Well said.

  But if we look a bit deep…

  Army chief complained to his civilian head(Def.min), immediately (one year ago, before the age row came to light). But, the Defense minister didn’t take any action moreover advised him to take action. He didn’t ask the chief to give it in writting. Defence minister could have ordered a probe, he didn’t.

  Why didn’t the minister pursue? It is because the broker has contacts to the politicians running the govt. I don’t question integrity of the minister, but I would say the minister didn’t act for obvious reasons.

  /అదే పొజిషన్ కి వెళ్ళిన ఇంకా చాలామంది తిన్నా పట్టుబడలేదు కాబట్టి, పెద్దమనుషుల్లా చెలామణి అయి, హాయిగా రిటైరయ్యారు/
  I swear, won’t say “మరి ఇప్పటిదాకా ఏం చేస్తున్నారుట? గోళ్ళు గిల్లుకుంటున్నారా?” 🙂

  But, humbly would like to know, whether you complained that to anyone, while you were in office?

  Who should bell the cat? Good that the chief taking it head-on while he is in office. Some say he is fighting because of personal reasons! Whatever, but exposing murky dealings in defence, under the veil of ‘defence secrets’, offcial secret act ..

  Like

 6. ఒక హోదాలో ఉన్నటువంటి జనరల్ స్దాయి అధికారి ప్రవర్తించవలసిన తీరు కాదిది…
  ప్రతి దానికి ఒక విధానమంటూ ఉంటుంది. ఆ విధానము ప్రకారము ఫాలో కావడం సభ్యత అనిపించుకుంటుంది.
  తనకు లంచం అఫర్ చేసిన వ్యక్తిని అక్కడికక్కడే అరెస్టు చేయకపోవడం సింగ్ తప్పయితే, దానిని అంటోని మీదకు
  నెట్టేయడం తప్పు. సింగ్ నిజము చెపుతున్నాడో, లేదో తెలియకుండా అంటోని ఎలా చర్యలు తీసుకోగలరు. అందుకనే
  లెటరల్ గా ఇమ్మని అడిగియుండోచ్చు. కాని సింగ్ ఎందుకు రాసివ్వలేదు?? అలోచించండి…
  మీరు వ్రాసిన దానితో పూర్తిగా ఏకిభవీస్తున్నాను సార్…

  Like

  • ఆర్మీ చీఫ్ అంటే టు-టౌన్ ఎస్సై కాదనుకుంటా, అలా అడ్డదిడ్డంగా అరెస్టు చేయడానికి. పైగా… వచ్చినవాడు రాహుల్ అనుగుడు, అవశ్యము అరెస్టు చేతుననంగ రాదు. రాతమూలకంగా ఇవ్వు తరవాత అమ్మతో మాట్లాడి చూస్తాం అని సలహా పడేశాడేకాని, ఆంటోనీ ఎందుకు రాతపూర్వకంగా ఇవ్వమని ఆదేశించలేదు రాఘవా?! బ్రిగేడియర్ స్థాయి నుంచి పైపోస్టుకు ‘ఎంపిక’ కాబడుతారు, సినిమా టికెట్ల క్యూలో వెనకోడు తోస్తే మనం ముందుకు పోవడమనే పద్ధతి లేదనుకుంటా. లంచం ఇవ్వజూపిన వాడు కూడా ఓ పదవీ విరమణ తరువాత ఆయుధవ్యాపారం చేసుకుంటున్న ఓ లెఫ్టినెంట్ జనరల్. ఇపుడు కొంచెమైనా అర్థమయివుంటుందనుకుంటా. లేదా… ‘ఆహా రాఘవ గారు, భలే కామెంటారు, మీతో ఏకీభవిస్తున్నాను, అదియే మన తక్షణ కర్తవ్యం’ …అంతే! 😛 :))

   Like

 7. @వీకెండ్ పొలిటీషియన్,

  ధన్యవాదాలు…

  @రీడ్ గుడ్,

  ఫ్రీడం ఆఫ్ స్పీచ్ ఒకటుంది కదా… నిన్నటి ఇండియన్ ఎక్స్ ప్రెస్స్ లో శేఖర్ గుప్తా వ్రాసిన వ్యాసం చదవండి…

  @సుబ్రహ్మణ్యం గారూ,

  ఏదో ఇలా వెళ్ళిపోనీయండి. మరీ నేను పనిచేసిన ఆయుధకర్మాగారాల (పరోక్షంగా) విషయం వచ్చేటప్పటికి, కొద్దిగా రాశాను…

  @Snkr,

  “But, humbly would like to know, whether you complained that to anyone, while you were in office?” సరైన ప్రశ్న అడిగారు. ఆరోజుల్లో, “Protection of Whistle Blowers Act” లాటి చట్టాల మీద, ప్రభుత్వానికి ఆలోచన రాలేదు. అలాటి పరిస్థితుల్లో మరీ ” త్యాగాలు” చేసే ఉదాత్త హృదయం ఉండేది కాదు. మధ్యతరగతి ప్రాణులం మాస్టారూ. ఉన్న ఉద్యోగం ఊడితే కష్టం కదా…

  @రాఘవ్,

  ప్రభుత్వ యంత్రాంగాల్లో ఉన్న “కిటుకు” ఇదే కదా.. కర్ర విరగా కూడదూ, పాము చావాలి, పైవాళ్ళందరూ పెద్దమనుషుల్లా ఉండాలి. ఏదైనా గొడవొస్తే, ఆ కంప్లైంట్ ఇచ్చినవాణ్ణి ముందరకి తోస్తారు.. ఇప్పుడిప్పుడే, అదేదో కొత్త చట్టం తెస్తారుట. చూద్దాం ఎంతవరకూ బాగుపడతారో…

  Like

 8. Hi

  Like

 9. Dr Subramanian Swamy supports Army Chief V. K. Singh

  Like

 10. శ్రీ,

  మీరు పంపిన లింకులు చూశాను…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: