బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అస్సలు జీవితంలో బాగుపడతానా….


   ఓ కారణం ఉండదు, ఊరికే ఏదో జరిగిందని, బి.పి.పెంచేసికుని, తేరగా దొరికిందికదా అని ఇంటావిడమీద కేకలేసేయడం. ఓ అర్ధం పర్ధం ఉండదు. ఈమధ్యన మనప్రాంతాలు తిరిగి వచ్చినప్పటినుంచీ, అలిసిపోయి, ఎంతైనా డెభైఏళ్లకి దగ్గరవుతున్నాను కదా ( పైగా ఇదో వంకోటీ !!!), చిన్న చిన్న కారణాలకి ఊరికే ఆవిడమీద ధాంధూం అనేస్తున్నాను. తెలుసండి బాబూ,నేను చేస్తున్నది తప్పూ అని. కానీ అదేమిటో సమయం వచ్చేటప్పటికి ఏమీ గుర్తుకు రావు. ఇన్నేళ్ళనుండీ నన్ను భరిస్తోందా, వేసే వెర్రి మొర్రి వేషాలన్నీ” పోన్లెద్దూ నాదగ్గర కాక ఇంకెవరిదగ్గర వేస్తారూ..” అని వదిలేస్తోందా, అయినా సరే, ఈ periodical bursts లోంచి మాత్రం బయటపడలేకున్నాను. పోనీ స్త్రీలకైతే అదేదో PMT ట, కానీ నాకేం రోగంట?

ఏం లేదూ, ఈవేళ ప్రొద్దుట మేముండే ఫ్లాట్ లో నీళ్ళు రావడం మానేశాయి. పేద్ద కారణమూ లేదు, వాచ్ మన్ కి పంపు ఆన్ చేయడానికి మూడ్ లేదుట, దాంతో నీళ్ళు టాంక్ లోకి ఎక్కడం మానేశాయి.వీడిల్లుబంగారం గానూ, మాటిమాటికీ ఇలా అయితే ఎలాగట? ఎలాగూ నీళ్ళు లేవూ, పోనీ మన ఫ్లాట్ కి వెళ్ళిపోదామా అన్నాను. ఠాఠ్ మనకి వేరే ఆప్షన్ ఉందికదా అని, మనింటికి వెళ్తామూ, సొసైటీలో ఉండే మిగిలినవాళ్ళసంగతేమిటీ? వాళ్ళలాగే మనమూనూ. ఓర్నాయనో మన రాజకీయనాయకుల్లా ఇలా “ సామాజికన్యాయం” అంటూ జ్ఞానబోధ చేస్తే ఎలా చెప్పండి? ఏదో భగవంతుడు మనల్ని చల్లగా చూసి, ఇంకో ఆల్టర్నేటివ్ ఇచ్చాడు, అది అవసరం వచ్చినప్పుడు ఉపయోగించుకోవాలి కానీ, మరీ ఇలా social justice అంటే ఎలాగా అంటే వినదే.నేను చెప్పాను తను వినలేదూ బస్ అంతే కారణం. దానితో నోటికొచ్చినట్టల్లా వాగేసి, నాదారిన నేను భళ్ళున తలుపేసేసి వెళ్ళిపోయాను.అయినా ఇంత బుల్లి కారణానికి ఎవరైనా కట్టుకున్న భార్యమీద ఎగురుతారా ? అయినా సరే ఆ టైములో ఇది చిన్నకారణం, పెద్దకారణం అని గుర్తుండదు. ఏదో ఒకటీ, కారణం అంటూ ఉందికదా! Very poor defence కదూ! ఇలాటివి నాకే కాదు ” రాక్షసత్వం” లేని ఏ భర్తకైనా ఎప్పుడో ఒకసారి వస్తూనేఉంటుంది. నిజంగా “ రాక్షసుడే” అయితే, పీక నొక్కి వదిలేస్తాడు.భగవంతుడి దయవలన అలాటివేవీ ఉండవు నూటికి తొంభైమంది భర్తల్లో. అందుకేనేమో కొట్టుకుంటూ తిట్టుకుంటూ కాపరాలు చేసేస్తున్నాము.

అప్పుడప్పుడు ఇలాటి కన్ఫెషన్స్ చేస్తే చేసినపాపం ఉండదుట. ఇదీ బాగానే ఉందండోయ్, చేసేదల్లా చేసేయడం, కన్ఫెషన్ చేసేయడం. హాయి కదూ. మన కాలక్షేపం మనకీ ఉంటుంది. అయినా ఒక్కోసారి అనిపిస్తూంటుంది, విన్నన్నాళ్ళు విని, ఎప్పుడో ఎదురుతిరిగితే ఏం చేస్తాముట?నీదారి నువ్వు చూసుకో, నా దారి నాదీ అంటే ఏమిటిట దిక్కు? హాయిగా కూర్చున్న చోటునుండి లేవఖ్ఖర్లేకుండా, ముద్ద దిగుతోంది కదా. ఏదో వేళపట్టున తిండి తిని ఉండొచ్చుకదా. అబ్బే అలా ఉంటే కాపరం ఏమిటీ? అప్పుడప్పుడు కొట్టుకుంటూనూ ఉండాలీ,మళ్ళీ కలుస్తూనూ ఉండాలి. అదేకదండీ జీవితం! ఇదేదోజ్ఞానబోధో, ప్రవచనమో అనుకోకండి ఏదో నాకు తోచింది వ్రాశాను. ఇలాటివన్నీ ఎప్పుడు తెలుస్తాయీ అంటే, అప్పుడప్పుడు, బయటి ఊళ్ళకి వెళ్ళి ఎక్కడో అక్కడ ఉండి, అవతలివాళ్ళ కాపరాలు ఎలా ఉన్నాయో చూస్తే, మనం ఎంత అదృష్టవంతులమో తెలుస్తూంటుంది.

ప్రస్తుతం జరిగిందదే నాకూనూ. ఈమధ్యన మనవైపు వెళ్ళినప్పుడు, మాకు తెలిసిన వారి విషయాలు విన్నప్పుడు, కలిగిన అభిప్రాయం అన్నమాట. ఏదైనా సరే, ఇంకోరితో పోలిస్తేనే కదా తెలిసేది, where we stand అనేది!!వెళ్ళొచ్చిన తరువాత ఓ వారం పదిరోజులుంటుంది, ఆ ప్రయాణ ప్రభావం, ఆహా మనం ఎంతదృష్టవంతులమో, ఓహో మనకలాటి సమస్యలు లేవుకదా అని. మళ్ళీ మొదలు.అలాగని అక్కడే ఉంటే మన సెంటిమెంట్లు తాజాగా ఉంటాయని అనుకోకూడదు. గుంపులోగోవిందా అని మనమూ అలాగే తయారవుతాము.ఎంతైనా స్థలప్రభావం అనోటుంటుందికదా.

ఆతావేతా చెప్పేదేమిటంటే, రిటైరయిన తరువాత ఊరికే కొంప పట్టుకుని కూర్చోకుండా, అప్పుడప్పుడు బయటి ప్రదేశాలకీ వెళ్తేనే కదా తెలిసేది, మన పరిస్థితి ఏమిటో.కానీ ఈ సదుపాయం ఉద్యోగంలో ఉండే వారికి వీలవదు. వాళ్ళ హడావిడేదో వారిదీ. కొట్టుకుంటూంటారు, పిల్లల ధర్మమా అని మళ్ళీ కలుస్తూంటారు. మరీ ఎక్కడో కానీ, విడిపోరు…
విడిపోయారా అంటే beyond economic repairs అన్న మాట…..

Advertisements

4 Responses

 1. బాపు గారు మీకు కనుక గా ఇచ్చిన
  ‘యాభై ఏళ్ళ వైవాహిక జీవితం పై కార్టూన్’ ని విశదీకరించారు.
  జీవితంలో బ్లో హాట్ బ్లో కోల్డ్ చాలా సామాన్యంగా జరిగేదే.
  BER కాకుండా చూసుకోవాలి మరి.
  టపాలో చాల బాగా అత్మవలోలోకనం చేసారు.
  మోహన్

  Like

 2. మొదట మీ మీద కాస్త కోపం వచ్చినా తర్వాత్తర్వాత మటుకు ఆనందంగా అనిపించింది…..
  ఈ రోజుల్లో ఈ మాత్రం కూడా ఆలోచించేవారు లేరు కదా అనిపించింది….

  తిట్టేసి వెళ్ళిపోవడం , తప్పని తెలిసినా ఒప్పుకోలేకపోవటం, తిడితే పడాలి అనే మనస్తత్వం ఉన్నవారిని చాలామందినే చూసాను….
  ఇలా ఒప్పుకున్న వారినే తక్కువ సంఖ్యలో చూసాను…. అందులో మీరు ఉండడం ఆనదించదగ్గ విషయం.
  (మధ్యలో నీకెందుకట ఆనందం అనుకోకండి మా పిన్ని గారిని తలుచుకొని ఆనందిస్తున్నాను…)

  Like

 3. @శర్మగారూ,

  థాంక్స్…

  @మోహన్ గారూ,

  ధన్యవాదాలు

  @మాధవీ,

  థాంక్స్…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: