బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–టైంపాస్…


Sakshi

    ఈవేళ ప్రొద్దుటే మా ఇంటివైపు వెళ్ళినప్పుడు ఓ పాత స్నేహితుణ్ణి కలిశాను. అతనితోపాటే ఇంకొకాయనా ఉన్నారు. ఆయనుండేది మా సొసైటీలోనే లెండి.అవీ ఇవీ మాట్టాడుతూంటే, ఈమధ్యన మా CGHS వారు ప్లాస్టిక్కు కార్డుల జారీ విషయం లో, ఓ ఎప్లికేషను ఇస్తున్నారుట. కావలిసిస్తే నన్నూ తీసికోమన్నారు. ఎలాగూ వాళ్ళ ఆఫీసుకెళ్ళి తీసికుందామనే అనుకుంటున్నాను, పోనీ ఇక్కడే దొరికింది కదా అని ఓ కాపీ నేనూ తీసికున్నాను. చిత్రం ఏమిటంటే, మా సొసైటీ లో ఉండే ఆయన దగ్గర ఎప్పణ్ణించో ఉందట, ఎవరితోనూ పంచుకోవాలనిమాత్రం అనుకోలేదాయన. మరీ అవతలివాళ్ళు సుఖపడిపోతే ఎలాగా?That is the bottom line. ఇక్కడ నేనేమో ఏదైనా విషయం నా దృష్టికి వస్తే, కొంపలు మునిగిపోతున్నట్టు బ్లాగులనిండానూ, కనిపించిన ప్రతీ వారితోనూ పంచేసికుంటాను. అదంతవసరమంటారా? నాలో ఏదైనా “లోపం” ఉందంటారా? ప్రతీ వారిలోనూ ఎంతోకొంత “దాపరికం” ఉండాలేమో మరి!! ఒక్కోరి స్వభావాలింతేనేమో…

    ఆమాటా ఈమాటా చెప్పుకుంటూంటే, రైల్వేల్లో Complaint SMS విషయం ఎత్తాను. ఊరుకోవచ్చుగా వెధవబుధ్ధి-కుక్కతోకలాటిది– నాకు తెలిసిందేదో వాగేసేదాకా కడుపుబ్బరం తగ్గదు.మామూలేగా, ప్రభుత్వం చేసే పన్లులలోనూ కొన్ని మంచివీ ఉంటాయి అని ఒప్పుకోడం నామోషీ మరి. వీళ్ళకి జీతాలిచ్చిందీ ఆ ప్రభుత్వమే. ఏ పనీ చేయకుండా మేపుతున్నదీ మళ్ళీ ఆ ప్రభుత్వమే. అయినా ప్రతీదానికీ ప్రభుత్వాన్ని తిట్టడం ఓ ఫాషనూ మరి.నే చెప్పింది ఒప్పుకోరే వాళ్ళు, చివరకి నా సెల్ లో ఉన్న ఎస్.ఎమ్.ఎస్ చూపించి నమ్మించాను.అదేదో one off అంటారే కానీ, ఒప్పుకోడం మాత్రం లేదు.పైగా రైళ్ళల్లో జరిగే “అన్యాయాలూ” లంచాలూ వగైరాల గురించి ఓ లెక్చరూ. వాటిక్కూడా నివారణోపాయాలున్నాయి. వివరాలతో ఓ ఎస్.ఎమ్.ఎస్ పంపితే, వెంటనే యాక్షన్ తీసికుంటారు. కానీ మనకంత తీరికెక్కడ? టిటి చేతిలో డబ్బెట్టాము, బెర్త్ దొరికింది బస్.. “రాత్ గయీ బాత్ గయీ..”.మళ్ళీ Complaint చేసి ఇంకోడి పొట్టమీద కొట్టడం ఎందుకూ అని సెంటిమెంటోటీ.అలాటివాళ్ళు రోడ్లమీద పడి గోలెట్టకూడదు.

   ఇంతలో మొదటాయన పోస్టాఫీసులో తన సేవింగ్స్ ఎకౌంటు మార్చుకోడానికి నాలుగు నెలలనుండి ప్రయత్నిస్తున్నాడుట, ఇప్పటిదాకా జరగలేదూ అన్నారు. మరి PMG కి Complaint చేశావా అన్నాను. ఇంట్లో నెట్టుందికదా దాంట్లో వెదికితే ఫోను నెంబర్లూ అవీ తెలుస్తాయీ, ఓసారి వాళ్ళ దృష్టికి తెస్తే క్షణాల్లో పనైపోవును కదా అంటే, మా సొసైటీలో ఉన్నాయనంటాడూ, ఇదే పనా ఏమిటీ బయటెన్నెన్ని పన్లుంటాయో. అసలు ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు సరైన టైములో సరీగ్గా పని చేస్తే ఇలాటి సమస్యలే ఉండవూ వగైరా వగైరా జ్ఞానబోధ మొదలెట్టాడు.అవునండీ కరెక్టే.మరి “మనం” ఉద్యోగంలో ఉన్నంత కాలం ఏం చేశామో మర్చిపోతే ఎలాగా? పుట్టింటారి సంగతి మేనమామ దగ్గరా? అసలా గొడవంతా వదిలేయండి, ఏదో PMG దృష్టికి తెస్తే పనైపోతుందని చెప్తే, ఆ రెండో ఆయన పాపం చేద్దామనే అనుకుంటున్నా, ఈ మొదటాయన ఒప్పుకోడే. పైగా ఇద్దరిదీ ఒకే ప్రాంతం లెండి!

   నాకెందుకొచ్చిందీ అనవసరంగా నా బుర్ర పగలుకొట్టుకోడం ఎందుకూ, కొంతమంది స్వభావమే అంత. మనకే ప్రపంచంలో అన్నీ తెలుసూ, అవతలివాళ్ళు ఉత్త తెలివితక్కువ దద్దమ్మలూ అని భావిస్తూంటారు. వాళ్ళ దారిన వాళ్ళని వదిలేయడం ఉత్తమం!

   బైదవే నా “ఆధార్” కార్డు వచ్చేసింది.ఎంట్రీలు సరీగ్గానే ఉన్నాయి. ఇంటావిడది ఇంకా రాలేదు. దీని ఉపయోగం ఏమిటో నాకైతే ఇంకా తెలియలేదు. ఈవేళ సాక్షి పేపరులో చదివిన వార్త చాలా ఆసక్తికరంగా ఉంది. ఇక్కడ చదవండి లేదా పైన పెట్టిన పిడిఎఫ్ చదవండి. ఇదేమిటండి బాబూ, ఏదో నగలు కొట్టేశారూ, సూట్ కేసులు కొట్టేశారూ అని విన్నాము. మరీ ఇలా బస్సులోంచి, పసిపిల్లాడు కిటికీలోంచి జారిపోయాడూ అంటే ఎలాగా? ఏదో ఆ పిల్లాడి అదృష్టం బాగుండి బతికి బట్టకట్టాడు. లేకపోతే ఊహించుకోడానికే ఒళ్ళు గగుర్పొస్తోంది…..

Advertisements

4 Responses

 1. ఉంటారు అలా దేనినీ ఒప్పుకోలేని వారు ఇలా ఏదీ డిసైడు చేసుకోలేని వారు…
  నిజంగా వారి ఖర్మ అని వదిలేయాలి……
  పొద్దున్న అత్తయ్య ఫోనులో చెప్పారీవిషయం అదృష్టం బాగుంది నిజంగా లేచిన వేళ మంచిది…. లేకుంటే బస్సులోంచి పడి దక్కడం అంటే మాటలు కాదు….

  Like

 2. ఆషామాషీ టైం పాస్ కాదండీ మాష్టారు, ఈ మీ టపా, ఫుల్ టైం పాస్ !!

  చీర్స్
  టైంపాస్ జిలేబి. !

  Like

 3. very interesting articles

  Like

 4. @మాధవీ,

  అలా అనుకునే వదిలేస్తున్నాను. హాయిగా ఉంది. కానీ అనుభవాలు పంచుకోవాలిగా…

  @జిలేబీ,

  థాంక్స్…

  @రామూ గారూ,

  నా టపాలు నచ్చుతున్నందుకు ధన్యవాదాలు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: