బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Customer Care…


   క్రిందటేడాది డిసెంబరు23 న ఓ టపా వ్రాశాను, నాకు వచ్చిన మెయిల్ వివరాలు ఇస్తూ, దాంట్లో మన రైల్వే వారి Customer Care… ఎలా ఉంటుందో, ఆ మెయిల్ పంపినాయన అనుభవాలు వివరిస్తూ. ఏదో ఆయన అదృష్టం బాగుండి జరిగుండొచ్చుగా, మనమూ ఓసారి ప్రయత్నించి చూస్తే పోలా అనుకున్నాను. ఎప్పుడూ రైళ్ళలో ప్రయాణం చేసే “పక్షి” నే కదా, కావలిసినన్ని అవకాశాలుంటాయి. ఈమధ్యన సికిందరాబాద్ లో పూణె శతాబ్ది లో చివరి రెండు సీట్లూ ఇచ్చారు. కావలిసినంత ఖాళీ ఉంటుంది సామాన్లు పెట్టుకోడానికి, ఇదీ బావుందీ అనుకుని సెటిల్ అయ్యాము. పక్కనే రెండు కోచ్ లికీ మధ్య ఓ గ్లాస్ డోర్ ఉంటుంది కదా, దానితోనే వచ్చింది గొడవంతా. వచ్చేవాడూ పోయేవాడూ ఆ డోర్ ని ఫోర్స్ తో లాగడం, అదేమో చివరి సీట్ లో కూర్చున్న నాకు తగలడం, పైగా ఎంత మూద్దామని ప్రయత్నించినా మూసుకుపోకపోవడం. దరిద్రపు గేట్ కీపర్ బతుకైపోయింది ఆ ఎనిమిది గంటలూనూ. ఒక్కోసారైతే గట్టిగా భళ్ళున తోసేయడం మొదలెట్టాను.ఓ పెద్దమనిషి, డోర్ తీసేసి నేను కూర్చున్న సీట్ దాకా తోసి, బయట నిలబడ్డాడు. అప్పటికే నాకు చిరాకొచ్చి, ఫోర్స్ గా తోసేయడం తో, బయట గ్లాసుని ఆనుకుని నుంచున్న ఆ “పెద్దమనిషికి” అదిరినట్టుంది. సీరియస్సు గా లోపలికొచ్చి, అంత గట్టిగా వేయాలా అన్నాడు.నాన్నా నువ్వు తలుపు తీసినప్పుడు నా సీట్ దాకా లాగాలా మరీనూ, మరి అప్పుడు నాకు inconvenience అయినప్పుడు ఏమీ అనిపించలేదా, ఇప్పుడు మాత్రం జ్ఞానబోధ చేస్తున్నావూ అనగానే, ఏదో సణుక్కుంటూ వెళ్ళిపోయాడు.

   అతనెవరో నెంబరిచ్చాడుకదా, పోనీ ఓసారి మెసేజ్ పంపితే ఏమౌతుందీ అనుకుని, వివరాలు కోచ్ నెంబరూ, సీట్ నెంబరూ, ట్రైన్ నెంబరూ ఇస్తూ ఫలానా సమస్య ఉందీ అని.రెండు రోజులు ఏమీ అవలేదు. మాదారిన మేము ట్రైన్ దిగి కొంపకొచ్చేశాము. ఈవేళ చూద్దునుకదా, నా సెల్ లో ఓ మెసేజ్ ఉంది.—Complaint ID 1203050038. Sir,Corrective action has been initiated and the issue has been forwarded to the authorities of PUNE/ Central Railway,since the subject matter comes under the administrative control of this particular division. Action taken report would be intimated to you soon. Thanks for registering the complaint. అని. ఇంతకంటే ఏం కావాలి? అందుకనే అంటాను, ఛాన్స్ దొరికినప్పుడల్లా ప్రభుత్వ సంస్థలు ఏమీ చేయడం లేదూ అని గోల పెట్టేబదులు, వాళ్ళు కలగచేసిన సదుపాయాలు ఉపయోగించుకుంటే మనకే తెలుస్తుందిగా. అలాగే నేను వ్రాసిన మెయిల్ కి వెంటనే జవాబిచ్చిన irctc వాళ్ళూ. ఆ డబ్బులొచ్చేశాయండోయ్..

   మన ప్రెవేట్ సెక్టార్ లో ఏదో ఘనకార్యాలు చేసేస్తున్నారూ అనుకుంటాము. పైగా ఇక్కడకూడా పోల్చడమే ప్రభుత్వ సంస్థలతో. ఎప్పుడైనా కొత్తగా పెట్టిన మాల్స్ కి వెళ్ళేఉంటారు, Big Bazaar, D’mart లాటివి. ఉండడం మాత్రం ఓ పాతిక దాకా billing counters ఉంటాయి. కానీ వాళ్ళు తెరిచి ఉంచేవి మాత్రం మహ అయితే ఓ అరడజనూ. ప్రతీ కౌంటర్ దగ్గరా ఆ ట్రాలీలు పట్టుకుని కొల్లేరు చాంతాడంత క్యూలూ. రష్ ఉన్నప్పుడైనా ఇంకొన్ని కౌంటర్లు తెరుద్దామని మాత్రం అనుకోరు. రాకేం చేస్తారులే అని ఓ తేలిక భావం. అంతంత టైము క్యూల్లో జనం తిప్పలు పడ్డం చూడ్డంలో ఓ sadistic pleasure పొందుతారనుకుంటా. ఎంత మొత్తుకున్నా పట్టించుకునేవాడెవడూ ఉండడు.They care two hoots for the customer. అయినా జనాలు మాత్రం ఆ దిక్కుమాలిన మాల్స్ కి వెళ్ళడం మాత్రం మానరు.

   ఈమధ్యన మనవైపు వెళ్ళినప్పుడు, అదేదో పేద్ద పేరుందీ, అనుకుని, తాపేశ్వరం వెళ్ళాము. అక్కడ కాజాలు తీసికుందామని. అక్కడ ఉన్న స్టాఫ్ తో మాకు జరిగిన అనుభవం ధర్మమా అని, మళ్ళీ జీవితంలో అక్కడకు వెళ్ళొద్దనిపించింది. ఏదో టీవీల్లో వస్తోంది కదా అని ” సురిచి” అనే కొట్టుకి వెళ్ళాము. అక్కడ ఓ నలుగు స్టాఫ్ ఉన్నారు. సొళ్ళుకబుర్లు చెప్పుకుంటూ. వాళ్ళని అడిగాము, కిలో కి ఎన్ని తూగుతాయీ, ఎంతకాలం నిలవ ఉంటాయీ అని. జవాబు చెప్పే దిక్కే లేదు. పోనీ ఏదైనా పనిలో ఉన్నారా అంటే అదీ లేదూ, సినిమాలగురించి కబుర్లు. విసుగెత్తి ఛడామడా కోప్పడేశాను. వీళ్ళకి వచ్చిన రోగం ఏమిటీ అంటే, ఒకసారి పేరువస్తే చాలు, కస్టమర్లు రాక ఛస్తారా అని. ఏదో ప్రపంచప్రఖ్యాతి పొందాయి కదా కాజాలు అని, ప్రత్యేకంగా పనికట్టుకుని మరీ వెళ్తాము. తీరా వెళ్తే, అసలు కస్టమర్లు అనేవాళ్ళే వీళ్ళ కళ్ళకి ఆనరు.మహ అయితే రావడం మానేస్తారు. వాళ్ళదేంపోయిందీ. ఆకొట్టు యజమాని మట్టికొట్టుకుపోతాడు.

    ఇదో రకమైన అనుభవం, ఇంకో అనుభవమేమిటంటే, ఏదో టైం పాస్ చేద్దామని కాకినాడ దగ్గరలో ఉన్న ఉప్పాడ వెళ్ళాము. అక్కడి కొట్టువారి ప్రవర్తన ఎంతబాగుందీ అంటే, అక్కడ మొత్తం మూడు గంటలు గడిపి చీరలు కొన్నాము. ఆ వివరాలూ,కొట్టువివరాలూ ఇంకో టపాలో….

Advertisements

5 Responses

 1. దక్షిణాది నుండి గౌహతి వెళ్ళే ఎక్సుప్రెస్సులలో బోగీల మీద నంబర్లు వేసి ఉండవు. గత డిసెంబరులో మీరు చెప్పిన నంబరు గుర్తుపెట్టుకుని అప్పటికప్పుడు రైల్వే స్టేషను నుండే మెస్సేజ్ పెట్టాను..ఇలా దూరప్రాంతలు వెళ్ళే రైళ్ళకి బోగీల మీద నంబర్లు లేకపోతే చాలా ఇబ్బంది అని..మీ కంప్లైంట్ రిజిస్టర్ అయింది స్టాటస్ కోసం ఆన్ లైనులో చూడండి.. లేకపోతే పలానా నంబరుకి మెసేజ్ చెయ్యండి అని వచ్చింది..ఆ పలానా నంబరుకి మెసేజ్ పెడితే మీరు కంప్లైంట్ చెయ్యాల్సింది ఈ జోనుకి కాదు సారీ అని వచ్చింది..క

  Like

 2. ఏ జోనుకి కంప్లైంటు చెయ్యాలో చెప్పి ఆ జోను నంబర్ చెప్తే బాగుండేది!

  Like

 3. మీవల్ల కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను…

  Like

 4. @సిరిసిరిమువ్వ,

  మీ వ్యాఖ్య చదివిన తరువాత సెర్చ్ చేస్తే దొరికింది ఇలా ఉంది.. “Central Railway commuters can send their SMS complaints/suggestions to 90044 11111, while Western Railway’s number is 90044 77777. ఇంకో నెంబర్ అయితే ఉండనే ఉంది 8121281212 . మిగిలిన డివిజన్లలోనూ తొందరలోనే వస్తుందిట.ఇంకో లింకు ఇప్పుడే దొరికింది http://expressbuzz.com/states/orissa/now-sms-your-rail-complaints/355145.html

  1.Central Railway commuters can send their SMS complaints/suggestions to 90044 11111

  2.Western Railway’s number is 90044 77777

  3.Southern Railway Number for SMS is 81212 81212.

  4. and Northern Railway No. is 9717630982.

  @మాధవీ,

  థాంక్స్…

  Like

 5. మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలండి.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: