బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– అసలేమయిందంటే……….


    అసలేమయిందంటే… అంటూ సాగదీసుకుంటూ మళ్ళీ మొదలెట్టాడండి బాబూ అనుకోకండి…క్రిందటి వారమే చెప్పాను, నాకు మీరూ, మీఅందరికీ నేనూ తప్పమండి బాబూ. ఏం చేస్తాం? ఏదో నా మిస్టరీ షాపింగులతో కాలక్షేపం చేసికుంటూ, మనవళ్ళూ మనవరాళ్ళతో గడుపుతూ, నా దారిన నేను గుమ్ముగా కూర్చుందామనుకున్నా, ఈ టపాల వ్యసనం లోంచి బయటపడలేకున్నాను. మా చిన్నప్పుడు వినేవాళ్ళం, అదేదో “నల్లమందు” అని అలాటి అలవాటే ఇదీనూ..

   ఫిబ్రవరి 25 న బయలుదేరి, మనవైపు ప్రయాణం కట్టాము. పైగా అదేదో సామెత చెప్పినట్టు, ఓ రెండు టిక్కెట్లు 24 వ తారీకుకీ, అది వెయిటింగ్ లిస్ట్ లో ఉందని, మర్నాటికి శతాబ్ది లో సికందరాబాద్ వరకూ, అక్కణ్ణించి మర్నాడు బయలుదేరి రాజమండ్రీ వెళ్ళేటట్టూనూ. మన జాతకం బ్రహ్మాండంలెండి, బుక్ చేసినప్పుడున్న వెయిటింగ్ లిస్ట్ 15,16 ఏదో మొత్తానికి 1,2 కి వచ్చేసింది. అవకపోతుందా అని ఆశ ఉండడం లో తప్పేమీ లేదుకదా. కానీ నా అదృష్టం ఏమిటంటే, చివరి క్షణం దాకా అదికూడా కన్ఫర్మ్ అవలేదు! ఇలా ఉంటుంది కొంతమంది చేసికున్న అదృష్టం. ఏదో మొత్తానికి మా ఇంటావిడ కూడా 50% కన్సెషన్ రేంజ్ లోకి వచ్చేసిందని, ముచ్చట పడి ఏసీ 2 టయర్ లో కూడా చేశాను, పేద్ద పోజెట్టుకుంటూ వెళ్ళొచ్చని !!పైగా ప్రతీ అరగంటకీ PNR Status చెక్ చేసికోడం ఓటీ. (ఇదోటొచ్చిందిగా). ఎప్పుడు చూసినా Chart not prepared అనే మెసేజ్. చివరకి నాలుగున్నరకి చావు కబురు చల్లగా వచ్చేసింది. పోనీ క్యాన్సిల్ చేద్దామనుకున్నా, ticket can not be cancelled once chart is prepared అనో మెసేజీ. వీడిల్లుబంగారం గానూ, నా పదిహేనువందలెవడు తిన్నట్టూ? ఇంక జీవితం లో మళ్ళీ ఇలాటి పని చేయకూడదూ అని ఓ పేద్ద నిర్ణయమూ, రైల్వే వాళ్ళని నానా శాపనార్ధాలూ, ఎన్నెన్ని అనడక్కండి, నాకొచ్చినవన్నీ శాపం పెట్టేశాను. అసలు ఏదో ఇద్దరికీ కలిపి ఓ టిక్కెట్టు తో ( 50+40 % కన్సెషన్ తో) లాగించేయొచ్చుకదా అని కక్కూర్తి పడితే ఇలాగే ఉంటుందీ అనుకుంటూ, పోనీ ఓసారి ఆ irctc వాడికి ఓ మెయిల్ పంపుదామా అనుకుంటూ ఓ మెయిల్ పంపాను, వివరాలతో నాలాటి పెన్షనర్ల ఉసురు పోసుకుంటావూ అని కొసమెరుపుతో. రెండో నిమిషానికల్లా జవాబొచ్చింది. పైగా ఆటోమేటెడ్ కాకుండా, పెర్సనల్ మెయిల్. ఊరికే గోలెట్టకూ, రెండు రోజుల్లో నీడబ్బులు పువ్వుల్లోపెట్టిస్తారూ…అని.ఇంకేముందీ, శాపాలూ తిట్లూ withdraw !!

   మొత్తానికి మర్నాడు తెల్లవారుఝామున, అబ్బాయి కారులో దింపగా శతాబ్ది లో ఎక్కామండి. ఇంక ఆ ట్రైన్ లో వాళ్ళు చేసే మర్యాదలు అదేదో వియ్యాలారు చేసినట్టు, వెళ్ళగానే అవేవో నాలుగైదు ప్యాకెట్లూ, ఓ గ్లాసులో వేణ్ణీళ్ళూ చాయ్ కలుపుకోవాలిట. ఇవన్నీ నాకెక్కడ తెలుస్తాయీ, ఏదో ఇంటావిడ గ్లాసులో ఇవ్వగా తాగడమే కానీ.అది తాగేమో లేదో, ఓ ప్లేట్ నిండా బ్రెడ్ స్లైసులూ,బటరూ జామ్మూ,ఇవి కాకుండా అదేదో కట్ లెట్టుట.తిండం ఇంకా పూర్తవలేదు, మళ్ళీ సూప్ ట. ఇన్నీ పూర్తయేసరికి లంచ్. గిల్టీ గా ఎక్కడ ఫీల్ అయానంటే, అందరిలాగా కాకుండా పైగా కన్సెషన్ టిక్కెట్టోటీ !!మామూలు 750 కాకుండా, ఇద్దరికీ కలిపి 750 అంటే పూర్తి కిట్టుబాటయినట్టే కదా...

   మిగిలిన ప్రయాణం కబుర్లూ వివరాలూ ఇంకో టపాలో…అసలు ఈ ప్రయాణం ఎందుకయ్యా అంటే 40 ఏళ్ళక్రితం నేను చేసుకున్న అదృష్టమా అని, మా ఇంటావిడ నా జీవితం లోకి వచ్చిన రోజున, మా వివాహం చేసిన ఆ అన్నవరం శ్రీసత్యనారాయణ స్వామికి, మేము కల్యాణం చేద్దామని…మరి ఆ దేముడున్నాడా లేడా అన్నదానికి, మమ్మల్ని చూడగానే గబగబా లోపలికి వెళ్ళి ఓ కార్టూన్ తెచ్చి, నుంచునే దానిమీద సంతకం పెట్టి , మా చేతుల్లో పెట్టిన శ్రీ బాపూ గారిని అడగండి.. అసలు మన మొహాలు చూడగానే తెలిసిపోతుందనుకుంటా…అదీ ఆయన ఘనత… కిందిచ్చాను ఆ కార్టూన్….

Advertisements

6 Responses

 1. hammayya eppudu prasanthamga vundi. really it boring not to have u r posts in haaram

  Like

 2. పెళ్లి రోజు శుభాకాంక్షలు గురువుగారూ (కాస్త ఆలస్యంగా)

  Like

 3. అబ్బో నలభై ఏండ్లు లాగించేసారన్నమాట!
  మీకు, మీ శ్రీమతి గారికి శుభాకాంక్షలు !!
  మోహన్

  Like

 4. పెళ్ళిరోజు శుభాకాంక్షలు .

  Like

 5. Happy n Healthy Long married life ..belated …Fortunate to have such a great gift from Bapu garu ..u couple deserve it sir.

  Like

 6. @రవీ,
  థాంక్స్…

  @శంకరా,
  ధన్యవాదాలు.

  @మోహన్ గారూ,

  “లాగించేశారన్నమాట !” నిజమేనండి సారూ….

  @మాలాకుమార్ గారూ,

  ధన్యవాదాలు

  @డాక్టరు గారూ,

  ధన్యవాదాలు. మీరు ఫోనులో మాట్లాడినప్పుడు, మరీ మునగ చెట్టెక్కించేశారు. కానీ వినడానికి మాత్రం భలేగా ఉందిలెండి….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: