బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఈ లెఖ్ఖన పేరెంట్సూ తమ జాగ్రత్తలో ఉంటే మంచిదేమో…


Times Crest

   మన సైన్యాదక్షుడు జనరల్ సింగ్ గారు, మొత్తానికి సుప్రీం కోర్టు వారి మాట విని, తన dob మీద వచ్చిన, controvesy కి తెర వేసేశారు. అసలు ఈ గొడవంతా ఎందుకు పెట్టారో అర్ధం అవలేదు. తనని జనరల్ గా నియమించేముందు, 1950 కి ఒప్పుకుని, తరువాత, ఠాఠ్ అదంతా అబధ్ధం, అసలు నేను పుట్టింది 1951 అనడం, ఆయనున్న పదవికి disgrace తెచ్చింది. ఉత్తిపుణ్యాన్న ఈ గొడవంతా వీధిన పెట్టారనిపించింది. ఒకవైపున పేపర్లలో యాడ్లూ “సైన్యం లో చేరండీ” అంటూ, ఇంకోవైపునేమో ఇలాటి గందరగోళాలూ. ఎవడికైనా Armed Forces లో చేరాలని కోరిక కలుగుతుందా అసలూ?
ఇవేవీ సరిపోనట్టు, ISRO లో ఈమధ్యన రిటైరయిన ముగ్గురు శాస్త్రవేత్తలమీద, ఇంకో ఉద్యోగంలో చేరకూడదూ అని ఆంక్షలు. అసలు మనవాళ్ళకి ఏదో ఒక గొడవుంటేనేకానీ, రోజు గడవదనుకుంటాను. మన రాష్ట్రం లో ఐఏఏస్ వారి దైతే రావణకాష్ఠం లా మండుతూనే ఉంటుంది. మొన్నెప్పుడో, అదేదో చానెల్ లో శ్రీవెంకటేశ్వరుడి నామాల మీద గొడవా.

   ఆమధ్యనెప్పుడో పూణె లో ఓ డ్రైవరు, ఇష్టం వచ్చినట్టు బస్సు నడిపేసి, ఓ తొమ్మిదిమందిని చంపేశాడు. ఇంకో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆరోజు headlines వేశారు, మర్నాటి నుంచీ ప్రతీ రోజూ, ఆ దిక్కుమాలిన డ్రైవరు గురించే కానీ, ఆ గాయపడ్డవారి పరిస్థితి ఏమిటీ, ప్రాణాలు పోగ్గొట్టుకున్నవారికి పరిహారం ఇచ్చారా అసలు, ఇస్తే ఎంతంతా, ఇలాటివాటి గురించి, ఏ పేపరు వాడికీ, ఏ చానెల్ వాడికీ పట్టలేదు. అసలు ఏదైనా అలాటి సంఘటన జరిగినప్పుడు, దాని follow up కూడా ఇస్తే, విషయాలు తెలుస్తాయి కదా.

   ఇవన్నీ సరిపోనట్టు, నిన్న చెన్నై లో ఓ కుర్రాడు, తన టీచర్ ని పొడిచి చంపేశాడుట. ఎక్కడో న్యూస్ లో చదివాను- “అగ్నిపథ్” సినిమాతో inspire అయ్యాడుట వాడు. పైగా వీడికి 15 సంవత్సరాల వయస్సే కాబట్టి juvenile court లోనేట వాడి విచారణ. Great. అక్కడికేదో మామూలు కోర్టుల్లో జరిగితే ఏదో ఒరిగిపోతుందని కాదూ, ఇంక పిల్లలూ, చదువులూ, టీచర్లూ వీటిమీద ప్రతీ వారూ తమ “అమూల్యమైన” అభిప్రాయాలు చెప్పేస్తున్నారు. స్కూల్లో పాఠాలు చెప్పకపోతే, అంతంత ఫీజులిస్తున్నామూ, చెప్పకపోతే ఎలాగా అని ఏడుస్తారు. చెప్తే, అర్ధం అయిందా లేదా అని అడక్కూడదుట. వీళ్ళదారిన వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసికోవచ్చు.

    ప్రతీ ప్రొఫెషన్ లోనూ “కలుపుమొక్కలు” అనేవి ఉంటాయి.ఇప్పుడు మొన్న వాడెవడో ఇష్టం వచ్చినట్టు బస్సు నడిపేడని, బస్సులెక్కడం మానుతారా, లేక ఎక్కడో ఏ మారుమూలో ఏ తిక్కశంకరయ్యో విద్యార్ధిని కొట్టాడని, టీచర్లందరూ అలాటివాళ్ళేననడం ఎంతవరకూ భావ్యమో మన ” విజ్ఞులే” చెప్పాలి. ఈ వరస చూస్తే, చిన్నప్పుడు దెబ్బలేసిన తండ్రులనందరినీ కూడా, firing squad ఎదురుగుండా పెట్టేయాలేమో? రేపెప్పుడో మా అబ్బాయిని అడగాలి, నా టర్న్ ఎప్పుడు నాయనా అని!! నేనూ దెబ్బలు తిన్నాను, మా అబ్బాయీ నాచేతిలో దెబ్బలు తిన్నాడు, కానీ మామధ్య రిలెషన్స్ ఏమీ పాడవలేదే? మా ఇంటావిడంటూంటుంది “గొర్రెప్పుడూ కసాయివాణ్ణే నమ్ముతుందీ..” అని.

   నేను పెరిగింది టీచర్ల వాతావరణం లో, నాకైతే టీచర్ అంటే విపరీతమైన గౌరవం. మనకు తెలియదుకనుకనే వాళ్ళ దగ్గరకి వెళ్తాము, ఇప్పుడు నాకు చదువు అబ్బలేదూ అంటే, నాకు చదువు చెప్పిన టీచర్లది తప్పూ అంటే ఎలాగండి బాబూ? ఏదో కొందరు సెన్సిటివ్ పేరెంట్స్ ఇస్యూ చేసేస్తున్నారని, ప్రతీ పేరెంటూ అలాటివారే అని ఎలా చెప్పలేమో, అలాగే ఏ కొద్దిమంది టీచర్ల ప్రవర్తన వలన అందరినీ అదే కాటా లో తూస్తే ఎలాగ?

   స్కూళ్ళలో పిల్లల్ని “హింస” పెట్టేస్తున్నారూ అని భావిస్తే, హాయిగా స్కూలుకీ కాలేజీకీ పంపడం మానేయొచ్చు. మీ పిల్లలూ మీఇష్టమునూ! మన రాజ్యాంగం లో ఏం చేసినా అడిగేవాడు లేడు ! ఈ మధ్యన అదేదో చానెల్ లో అదేదో సీరియల్ గురించి ఓ ప్రొమో వస్తోంది. దాంట్లో ఓ పదేళ్ళ పిల్ల చెప్పే డయలాగ్– ” ఒరేయ్ వెధవా, నువ్వు నాకు తండ్రేమిట్రా..” ఇంతకంటే హీనాతి హీనమైన డయలాగ్గు ఉండదేమో? దీనికి ఆ డయలాగ్ వ్రాసిన రచయితననాలా, దాన్ని ప్రసారం చేస్తున్న చానెల్ ని అనాలా, ఆ పిల్లచేత అనిపిస్తున్న దర్శకుణ్ణనాలా, అలాటి డయలాగ్గులు చెప్పించొద్దూ మా పిల్లచేతా అని చెప్పలేని తల్లితండ్రులననాలా, ఎవరినీ? Ofcourse మన “విజ్ఞులు” అందరూ, పాపం పిల్లదేం తప్పులేదూ అనే అంటారు లెండి. మర్చిపోయాను చెప్పడం ఆ దౌర్భాగ్యపు డయలాగ్ చెప్పబడే సీరియల్ “జెమినీ” లో వస్తోందిట. జోక్ ఏమిటంటే దానిపేరు ” కన్నవారికలలు”–

    పైన పెట్టిన వ్యాసం చదవండి. పిల్లలు tantrums చేస్తే దానిక్కూడా counselling ఉందట. హాయిగా దానికి దేనికో పంపేయండి. అలాకాకుండా చెయ్యి చేసికున్నారంటే రేపెప్పుడో పుటుక్కున ఏ కత్తో పెట్టి పొడిచేస్తాడు, లేదా కాల్చేస్తాడు. మన జాగ్రత్తలో మనం ఉండాలి కదండీ…

   GOD SAVE ALL PARENTS, TEACHERS.. .

9 Responses

 1. > ఇప్పుడు నాకు చదువు అబ్బలేదూ అంటే, నాకు చదువు చెప్పిన టీచర్లది తప్పూ
  అది మీ స్వగతమా లేక వేరే బ్లాగు లో పోస్ట్ కి సెటైరా?

  Like

 2. కలి కాలం…

  Like

 3. WELL SAID….

  Like

 4. జన్మ దిన గోల్ మాల్ లో జనరల్ వి.కే. సి౦ఘం గారు ఓడి పోయారు.
  వయస్సు రాకముందే విశ్రాంతి తీసుకుంటారు.
  తెలుగు వారైన ఒక జనరల్ గారు జన్మదినం
  గోల్మాల్ చేసి తన తమ్ముడి కంటే చిన్నవారై
  ఒక మూడేళ్ళు ఎక్కువ సర్వీసు చేసారండి. ఇది నిజం.
  విశ్రాంత బ్రిగేడియర్ సి వి యార్ మోహన్

  Like

 5. teachers ,teachers la ge behave cheste vallani tappu pattakudadu.
  Kani konta mandi teachers vuntaru
  nenu chusina incidents cheptunna
  1.ma school lo 3 yrs pasi pillalni LKG vallani,cheppulu lekunda endalo nilabettedi oka maha talli.Endukante aa bidda nidra ki apukoleka class lo tugutunnadu ani.
  2.Maa school lo Oka sir tana class lo girl students chala mandini bedirinchi illegal relation ship maintain chesevadu.Chivariki oka ammayi dwara sangathi bayatapadindi.Kani vaadu lessons baga chepatadu ane oke oka reason tho kottakunda vadili pettaru aa voori vallu.Tarvata vadu transfer cheyinchukoni vere vuriki velli poyadu.Vadi service mottam ilanti sangatanalu chala.Idi real ga chusina incident.
  Ilanti vallani kuda emi anakudadu antara meeru.
  nenu ma teachers chetilo debbalu tinnanu.Kani appudu kopam vachina ippudu alochiste naa manchi kosame kada anipistundi.
  Kani nenu pyna cheppina 2 incidents matram taluchukonna prati sari telugu lo vunde boothulu anni kalipi tittalanipistundi.
  So teacher ayinanta matrana vademi devudu ayipodu.
  Valla behaviour ni patti respect ivvagalama leda ane vishayam depend ayi vuntundi
  I am not supporting the boy who killed his teacher.But there could be reasons to do so.
  Nenu pyna cheppina 2nd incident lo,aa ammayilu life long idi marchipogalara?

  Like

 6. బేసిగ్గా తెలుస్తున్నది ఏమంటే…టీచర్లు..ముఖ్యంగా ప్రైవేటు స్కూళ్ళల్లో తక్కువ వేతనాలు పొందుతున్న వాళ్ళూ …నిత్యం సమస్యలతో సతమతమయ్యే వాళ్ళూ …అసంతృప్త జీవితాలు గడుపుతున్న వాళ్ళూ…ఒక టీచర్ గా భాద్యతలు తెలియని వాళ్ళూ..తమ ను నిత్యం వేదిస్తున్న సమస్యల వలన కలుగుతున్న అసహనాన్ని పిల్లల మీద చూపిస్తున్నారు…అలా అని పిల్లలు కత్తులు పట్టుకుని టీచర్లను పొడవమని నేను చెప్పడం లేదు….

  Like

 7. @john,

  ఇందులో ఎవరిమీదా సెటైర్లు వేయడానికి నేనెంతవాడినీ? ఏదో నాకు తోచిందేదో వ్రాశాను…

  @మాధవీ,
  ఔను కదూ….

  @బోనగిరీ,

  ధన్యవాదాలు…

  @మోహన్ గారూ,

  మీరు ఆర్మీలో పనిచేశారు కాబట్టి ఇలాటి విషయాలు మీకే ఎక్కువ తెలుసును. అయినా ఇదివరకటి రోజుల్లో ఈ RTI లూ అవీ లేవూ, పైగా పేపర్లవాళ్ళకి ప్రభుత్వం అంటే అదేదో భయమూ, భక్తీనూ…

  @శ్రావ్యా,

  నేనేమీ ఉపాధ్యాయులందరూ గొప్పవారనలేదు. ప్రతీ వృత్తిలోనూ black sheep ఉంటారు. అలాగని మొత్తం అందరినీ ద్వేషించడం భావ్యం కాదు. అదే కాకుండా, ఇప్పటి రోజుల్లో, ఎవరినైనా తిట్టాలీ అంటే ముందుగా ఉపాధ్యాయులే కనిపిస్తారు, అదంతా కాలమహిమ. మీరు ఎన్ని చెప్పినా సరే, ఉపాధ్యాయులమీద నాకున్న గౌరవమూ, భక్తీ తగ్గదుగాక తగ్గదు.Take it or leave it.

  @వీకెండ్ పొలిటీషియన్,

  ధన్యవాదాలు…

  @kvsv,
  ఎవరిమీదో కోపం ఇంకోరిమీద చూపించుకోడం ఎప్పుడూ ఉండేదే కదా. అలాగని ఉపాధ్యాయులందరినీ ఒకే త్రాసులో తూచడం బాగోలేదు…

  Like

 8. దీన్ని బట్టి మీరు పేపర్లో హింసా,స్కామ్ కాలమ్స్ చదవటానికి ఇష్టపడతారని తెలుస్తోంది. 🙂

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: