బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


Engg Students

   రెండు రోజుల క్రితం, మన రాష్ట్రం లోని ప్రెవేట్ కాలేజీల యాజమాన్యం వారు, రేపణ్ణించి కాలేజీలు మూసేస్తున్నామని ప్రకటించారు. ఏదో కిందా మీదా పడి, మొత్తానికి ప్రభుత్వం, అదేదో fees reimbursement కి సంబంధించి, కొంత మొత్తాన్ని విడుదల చేస్తామనేటప్పటికి, యాజమాన్యం, వారి “బెదిరింపు” వాయిదా వేశారని ఈవేళ్టి న్యూస్ లో విన్నాము. అంతా బాగానే ఉంది, కానీ ప్రభుత్వం వారిచ్చేreimbursement ఏ కొద్దిమందికో కానీ, అందరికీ కాదు కదా, మరి ఈమాత్రం దానికి నిజాయితీగా ఫీజులు కట్టేవారి చదువులు పాడిచేస్తే ఎలాగండి బాబూ? అంత బాధ్యతా రహితంగా ప్రవర్తిస్తే ఎలాగా?

   మా రోజుల్లో, ఇంజనీరింగు కాలేజీలు ఎక్కడో కాకినాడలోనూ, విశాఖపట్టణం లోనూ, అలాగే కొన్ని ముఖ్యనగరాల్లోనూ ఉండేవి. జనాభా పెరిగేకొద్దీ, ప్రస్తుతం వీధికో ఇంజనీరింగు కాలేజీ వచ్చేసింది. దాంట్లో టీచింగ్ క్వాలిటీ ఎలాగుందీ అనే దానిమీద ఎవరికీ శ్రధ్ధలేదు, అది వేరే విషయం. మన రాష్ట్రం లో ఎక్కువ ఇంజనీరింగు కాలేజీలు, ఏదో ఒక రాజకీయనాయకుడికి సంబంధించినవే. ఎలాగూ ప్రభుత్వం ఫీజు reimburse చేస్తారులే అని, ఎవడుపడితే వాడు, ఎక్కడ పడితే అక్కడ, ఓ కాలేజీ తెరిచేశారు. ఏదో తల తాకట్టు పెట్టో, ఏ ఎడ్యుకేషన్ లోనో తీసికుని, చాలామంది తల్లితండ్రులు వారి పిల్లల్ని ఇంజనీరింగులో చేర్పిస్తారు. చదువు పూర్తయిన తరువాత ఏదో ఉద్యోగం వస్తేనే కదా, వాళ్ళు చేసిన అప్పు తీర్చడం. అందరూ లక్షాధికార్లూ, కోటీశ్వరులూ కాదు కదా, చాలామంది మధ్యతరగతి వాళ్ళే. ఏదో దీక్షలూ, ఆందోళనలూ దాటుకుని మొత్తానికి ఆ డిగ్రీ పూర్తిచేస్తారు. వీళ్ళేదో డిగ్రీ సంపాదించేశారూ అని, వీళ్ళకోసం ఉద్యోగాలేమైనా వీరికోసం waiting లో ఉండవుకదా. మళ్ళీ ఇంతట్లో ఊరికే కూర్చోడం ఎందుకని, పోస్ట్ గ్రాడ్యుఏషనూ, అప్పటికీ ఉద్యోగం రాకపోతే, ఎంబిఏ, అదీ పూర్తిచేసి, మళ్ళీ అదేదో డాక్టరేటూ.

   మనదేశం లో ఇంజనీరింగు చేసినవారికి ఉద్యోగాలు ఎందుకు రావడం లేదో కారణాలు, ఈమధ్యన ఓ పేపర్లో చదివాను. ఆ వ్యాసంపైన పెట్టాను. ఓసారి చదవండి. ఊరికే కాలేజీలు తెరిచేసి, ఇంజనీర్ల ఫాక్టరీలు తయారుచేస్తే సరిపోదుగా.

   ఈవేళ మన ఐఏఎస్ వారు, ” work to rule” లాటిది మొదలెట్టారుట. అంటే దానర్ధం ఇన్నాళ్ళూ రూల్స్ ప్రకారం పనిచేయడం లేదన్న మాటే కదా! మరి ఈమాత్రం దానికి ఊరికే మొత్తుకోడం దేనికీ?

.

10 Responses

 1. “మా రోజుల్లో, ఇంజనీరింగు కాలేజీలు ఎక్కడో కాకినాడలోనూ,”

  ఏమన్నారు గురువుగారూ “కా…..కి….నా….డ” అన్నారా. ట్ట ట్ట ట్ట ట్ట ట్టా… ప్ప్పీ..ప్ప్పీ

  (కళ్ళలో ఆనందభాష్పాలతో “జయమ్ము నిశ్చయమ్మురా” సినిమాలో శ్రీలక్ష్మి టైపు లో శంకర్)

  Like

 2. అయ్యో! మీకు తెలీదా? ఇక్కడ కాలేజి,మందు,…సర్వం ప్రభుత్వం లో ఉన్నవారి స్వంతం. వారిష్టం

  Like

 3. “…ఈవేళ మన ఐఏఎస్ వారు, ” work to rule” లాటిది మొదలెట్టారుట. అంటే దానర్ధం ఇన్నాళ్ళూ రూల్స్ ప్రకారం పనిచేయడం లేదన్న మాటే కదా!….”

  You are right. Thats why they are getting interrogated and/or arrested.

  Like

 4. ” work to rule” అంటే ముష్టికి చేతులు చాచరనే అర్థం కాదనుకుంటా. 🙂

  Like

 5. రూల్సా అంటే ఏమిటండీ?
  సామాన్యులకే ఉన్నాయి. పెద్దవాళ్ళకి ఏమి లేవు.
  అన్ని ఇంజినీరింగ్ కాలేజీలు అవసరమా?

  Like

 6. మొన్నామధ్య మా ఊళ్ళో విశేషాల గురించి చెబుతూ నా చిన్ననాటి స్నేహితుడొకడు ఇలా అన్నాడు…”మనూళ్ళో చదుకున్నవాళ్ళందరూ బయట ఊళ్ళకి ఉద్యోగాలకి వెళ్ళిపోయారు. చదువురాని పనికిమాలిన వెధవలంతా స్కూళ్ళు పెట్టారు”, అని.

  భవదీయుడు
  వర్మ

  Like

 7. @శంకరా,

  ఏమిటీ కాకినాడలో చదివావా నాయనా?

  @శర్మగారూ,

  అందుకే కదా మన ప్రభుత్వం…

  @శివ గారూ,

  బహుశా మీరన్నట్టు అదే కారణమయ్యుండొచ్చు…

  @Snkr,
  రూల్స్ ప్రకారం నడుచుకుంటే అసలు గొడవే ఉండదేమో…

  @సుబ్రహ్మణ్యం గారూ,

  మన నాయకుల పొట్టలు నిండద్దండీ. పిల్లలకేమైనా వచ్చిందా లేదా అన్నది సెకండరీ…

  @అబ్బులూ,

  అదేదో సినిమాలో విన్నట్టు జ్ఞాపకం. కానీ అదే నిజం…

  Like

 8. గురూజీ హెంత మాటన్నారు. :(((

  కాకినాడలో పుట్టి
  కాకినాడలో పెరిగి
  కాకినాడలో చదివి
  కాకినాడ మీద ప్రేమని నరనరానా నింపుకున్న
  అచ్చమైన కాకినాడ పౌరుడిని నేను.

  Like

 9. అంతేకాదు,
  కాకినాడలో తింటూ
  కాకినాడలో కాకిలా
  కాకా అంటూ వుంటున్నారు కూడా
  😉 :))))

  Like

 10. @శంకరా ( అచ్చమైన కాకినాడ పౌరుడా) !

  ఉత్తి పుణ్యాన ఇలాటి వ్యాఖ్య పెట్టి, నాచేత ఓ టపా వ్రాయించేశావు…ఈవేళ..

  @Snkr,

  పాపం వెర్రి మనిషి, కాకినాడలో ఉండి కాజాలు తినే అదృష్టం కూడానా? భాగ్యనగరం, తిరుపతి up down చేస్తూంటాడు…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: