బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Melody R.I.P…….


SRT is GOD

    ఈవేళ సాయంత్రం “మా” మ్యూజిక్ చానెల్ వారి బహుమతీ పురస్కార కార్యక్రమం చూశాను. అందులో వివిధ గాయకులు పాడిన పాటలు విన్నాము. మెలొడీ కీ, బీట్ కీ ఉండే తేడా ఏమిటో స్పష్టంగా తెలిసింది. బీట్ అనేదుండాలి, కానీ మరీ ఎక్కువేమో అనిపించింది. ఇదివరకటి రోజుల్లోనూ ఉండేవి బీట్ పాటలు, కానీ వాటిలో ఏదో అర్ధం అయ్యే పదాలుండెవి. ఇప్పుడు పదాలకి అంత ప్రాముఖ్యం అవసరం లేదని తెలిసింది. అందుకే కాబోలు, ఆర్నెల్ల క్రితం వచ్చిన సినిమా అయినా సరే, ఒక్క పాటకూడా గుర్తుండదు. ఆ అరుపులూ, కేకలూ, వాటిననుకరిస్తూ చేసే గైరేషన్లేనా గుర్తుంటాయా అంటే అదీ లేదు.
ఒక విషయం మాత్రం చాలా బాగుంది– మోడరన్ అరుపులు ఎంత బాగా చేశారో, అదే శ్రధ్ధతో పాత పాటలు పాడిన, మన యువ గాయకులకి హ్యాట్సాఫ్ !! బహుశా ఈ ప్రావీణ్యం, మన సుశీల గారికీ, జానకి గారికీ లేదేమో అనిపించింది. వాళ్ళు ఈరోజుల్లో వచ్చే పాటలు పాడిఉండగలిగేవారా అనిపించింది. హాయిగా రంగం లోంచి వెళ్ళిపోయి సుఖపడ్డారు. సిరివెన్నెలసీతారామశాస్త్రి గారి గురించి, దర్శకుడు త్రివిక్రం చెప్పిన మాటలు చాలా బావున్నాయి. తనకు జరిగిన సన్మానానికి సిరివెన్నెల స్పందన కూడా బావుంది.

   ఒక విషయం మాత్రం అర్ధం అవదు నాకు ఎప్పటికీ- ఇలాటి కార్యక్రమాల్లో కొంతమంది “కళాకారులు” చేసే ఐటం సాంగుల గెంతులు !పబ్లిక్కుగా వీళ్ళు చేస్తే రైటా, అదే మన పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ ఏదో పొట్టకూటి కోసం రికార్డింగ్ డాన్సులు చేస్తే తప్పా?Why these doublestandards? ఆ మధ్యన ఏదో “జాతర” సందర్భం లో పాపం వాళ్ళెవరో సోకాల్డ్ “అశ్లీల నృత్యాలు” చేశారనీ, వాళ్ళని పోలీసులు అరెస్ట్ చేశారనీ , మన చానెళ్ళవాళ్ళు ఘోష పెట్టేశారులెండి. దానికి సాయం అదే కార్యక్రమం లో మన మహిళా సంఘాల ప్రతినిధులు కూడా పాపం ఆవేశపడి, ఆవేదన చెందేశారు. మరి ఇలాటి ఫంక్షన్లలో జరిగేవేవీ వీళ్ళ దృష్టిలోకి రావా? వచ్చినా అభ్యంతరపెట్టే ధైర్యం లేదా?

   కొత్త పాటలు వింటూన్నంతసేపూ, గైరేషన్లు చూస్తున్నంతసేపూ ప్రేక్షకులలో ఉన్న శ్రీ విశ్వనాథ్, శ్రీ బాపూ.శ్రీమతి సుశీలా ( to mention only a few..) గార్ల body language, హావభావాలు చూస్తేనే అర్ధం అవుతుంది, వాళ్ళెంత ” హింస” కి గురయ్యారో! ముందరి సీట్లలో కూర్చున్న ఏ ఒకరో ఇద్దరో తప్ప, మిగిలినవారందరూ లిటరల్లీ ఫ్రీజ్ అయిపోయారు!

   బీట్ పాటలుండకూడదనడం లేదు, కాని వాటి shelf life ఎంత? ఆ పాటలున్న సినిమాల్లాగానే మహ అయితే ఓ వారం, పదిహేను రోజులు కాదూ కూడదూ అంటే ఓ నెలేసికోండి.ఈరోజుల్లో వచ్చే పాటల standard గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.అలాగే ఈ మ్యూజిక్ డైరెక్టర్లూనూ- one night wonders !మెలొడీకి ఈ రోజుల్లో స్థానం లేదని, ఇళయరాజా చేసిన శ్రీరామరాజ్యానికి ఎవార్డ్ రానప్పుడే తెలిసింది. Melody R.I.P.

   వారం వారం వచ్చే సాహిత్య సంచికా కార్యక్రమం ” వందేళ్ళ తెలుగు కథ” ప్రసారం చేస్తున్న hmtv వారు అభినందనీయులు. అలాగే నిన్ననుకుంటా ఏదో చానెల్ లో సైబర్ క్రైం గురించి ఓ కార్యక్రమం కూడా బావుంది. ఈవేళ TV9 అనుకుంటా, తెలుగు ఎకాడెమీ వారు ప్రచురించిన డిఎస్ సీ పుస్తకాల్లో ప్రచురించిన తప్పుల తడకల గురించి కార్యక్రమం. వాటిగురించి వింటూంటే సిగ్గేసింది.మనకంటే సిగ్గేస్తుంది కానీ, వాళ్ళకి సిగ్గూ ఎగ్గూ లేదని తెలిసిపోయింది.

   మనవాళ్ళు ఏదో by mistake ఓ మాచ్ నెగ్గేసరికి ఇక్కడ టపాకాయలు పేల్చేశారు. పాపం వాళ్ళా మనల్ని disappoint చేసేదీ? ఈవేళ మళ్ళీ మామూలే… నిన్న ఓ పేపరు లో చదివిన ఓ వ్యాసం పైన పెట్టాను. కోప్పడకండి, ఓపికుంటే చదవండి…

8 Responses

 1. పాతతరం గాయకులు శ్రీ పి.బి.శ్రీనివాస్ గారు ఒకసందర్భంలో అన్నారట “మా రోజుల్లో అన్నీ ఆల్ టైమ్ సాంగ్స్ వచ్చేవి, యీ రోజుల్లో అన్నీ హాల్ టైమ్ సాంగ్స్ వస్తున్నాయి” అని.

  Like

 2. పబ్లిక్కుగా వీళ్ళు చేస్తే రైటా, అదే మన పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ ఏదో పొట్టకూటి కోసం రికార్డింగ్ డాన్సులు చేస్తే తప్పా?bagaa chepparu

  Like

 3. ఎం చేస్తాం, ఇప్పుడు జనానికి మసాలాలు లేకపోతే ముద్ద దిగదు.
  ఉదాహరణకి,
  శ్రీరామరాజ్యం సినిమాలోని కాసిన్ని లోపాలని డజన్లకొద్దీ బ్లాగర్లు సమీక్షించి చీల్చిచెండాడారు.
  లోపాలపుట్ట అయిన బిజినెస్‌మేన్ (బీప్ మేన్ అనాలి అసలు) సినిమాని విమర్శిస్తూ నలుగురు కూడా వ్రాయలేదు.

  Like

 4. స్వామీ, కిళ్ళీకొట్లలో వ్రేలాడుతూ కొన్నిరకాల పిచ్చి పుస్తకాలు కనిపిస్తాయి. వాటిమీద యెవ్వరూ విమర్శనాగ్రంధాలు వ్రాయరుగదా?

  ఒకప్పుడు తెన్నేటివారబ్బాయి ఒకతను పరిచయంలో ఉండేవాడు. ఇప్పుడెక్కడున్నాడో! అతడొకసారి గ్రంధాలయాలనిండా యెవరూ చదవని పుస్తకాలు యెవరో అరబిందో అని వివేకానంద అని విశ్వనాథ అనీ గొప్పవాళ్ళ సరకు తెచ్చి నింపుతున్నారు. అందరూ చదివే డిటెక్టివ్ సాహిత్యం పెట్టాలి తప్పకుండా. ఇవ్వన్నీ ఉత్త దండగ అని వాదించాడు – వేదిక మీదకు యెక్కి. ఏదో సినిమా క్రెడిట్స్ లో ఇతని పేరి చూసినట్లుగర్తు – అడగాడు వేరే తెన్నేటి కాకపోతే.

  సరుకున్న పెద్దమనిషి పనిలో మంచిచెడ్డలు యెన్నటం ఉభయులకూ గౌరవం. కాకపోతే గొంగడిలో తింటు వెండ్రుకలెంచటం లాంటిది శోభనివ్వదు గద – అందుచేత బీప్-మేన్ జోలికి సభ్యప్రపంచం పోలేదని నా ఉద్దేశం.

  Like

 5. >>కొంతమంది “కళాకారులు” చేసే ఐటం సాంగుల గెంతులు !పబ్లిక్కుగా వీళ్ళు చేస్తే రైటా, అదే మన పట్టణాల్లోనూ, గ్రామాల్లోనూ ఏదో పొట్టకూటి కోసం రికార్డింగ్ డాన్సులు చేస్తే తప్పా?Why these doublestandards? <<

  Valid point…బాగా అడిగారు.

  Like

 6. స్లో పాయిజన్ లాగా అన్నీ అలవాటయి ఏది మంచో ఏది చేదో తేడా తెలియకుండా పోతోంది. ఆ సంస్కృతి సినిమాల వరకో, టివి వరకో ఆగడం లేదు. ఐటెం సాంగ్స్ కి పసి పిల్లలు కూడా హావభావాలతో అలాగే అభినయిస్తున్నా, పెద్ద పెల్లలు అర్ధ నగ్నంగా డాన్సులు చేస్తున్నా, చూస్తున్న పెద్దలంతా సంబరపడిపోవడం చూస్తుంటే అలా అనిపించింది. ఈ పిల్లల డాన్సులు వేరెక్కడో కాదండీ, మన ఇళ్ళల్లో వేడుకలకే.ఎవరికని చెప్తాం చేస్తున్న పిల్లలకా, వాళ్ళని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకా…

  Like

 7. మీరన్నది నిజమే.
  పసి పిల్లలకు యేమీ తెలియదు – వారి తప్పులేదు.
  పెద్ద వాళ్ళకు యేమీ యెబ్బెట్టుగా అనిపించటం లేదు – వారు సమకాలీల ప్రపంచంలో సాంస్కృతిక కాలుష్యంయొక్క ప్రభావంలో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. వారి మనస్సులు క్రమంగా ఇటువంటి అభ్యంతరకరమైనవాటిని గుర్తించి నివారించేందుకు కావలసిన సున్నితమైన విచక్షణ (sensitivity) ని కోల్పోతున్నారు. విచారించవలసిందేమిటంటే అలా కోల్పోతున్నట్లు వారు గమనించలేకుండా ఉన్నారు.
  కొందరు ఇంకా అటువంటి విచక్షణ కలిగియున్న వారికి యెవరికీ యేమీ చెప్పలేని, చెప్పి ఒప్పించలేని పరిస్థితి.

  Like

 8. @శ్యామలరావుగారూ,

  పాపం ఆయన ఎంత బాధ పడి చెప్పారో…

  @సాయీ,

  ధన్యవాదాలు..

  @బోనగిరి గారూ,

  శ్రీరామరాజ్యం లాటి సినిమాలో లోపాలొస్తే తట్టుకోలేరు జనాలు. బిజినెస్ మాన్ ఎంత దరిద్రంగా ఉన్నా , దాంట్లో పెద్ద వింతేమీ లేదు. అందుకే వ్రాసుండరు..

  @సౌమ్యా,

  అడగడం వరకే కదా చేసేది….

  @జ్యోతిర్మయీ,

  ఎవరిననీ లాభం లేదు. జరుగుతున్నది చూడ్డం తప్ప…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: