బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– దేముణ్ణి కూడా వదలడం లేదు…


OPEN

   అదేం విశేషమో, ఆ శ్రీవెంకటేశ్వరుణ్ణి కూడా రాజకీయాల్లోకి లాగేస్తున్నారు. రెండు రోజుల క్రితం, షిరిడీ నుండి వచ్చిన సాయిబాబా పాదుకలమీద వివాదం. ఈవేళ చిన జియర్ గారూ, ఆయనెవరో పీఠాధిపతి గారూ ఒకరిమీద ఒకరు ఆరోపణలు. ఈ మధ్యలో శ్రీవారి కల్యాణం నేపాల్ లో జరపడం విషయం లో వివాదం. ఇవే కాకుండా ఈ.ఓ. గారొకాయన మీద సిబీఐ వాళ్ళు chargesheet లో ఆయన పేరు ప్రస్తావించారని, ఈయనేమో దేముడి మీద ప్రమాణాలూ వగైరా.. ఏమిటో ఆయనదారిన ఆయన శ్రీవెంకటేశ్వరుడు, ఏదో హాయిగా కళ్ళు మూసుకుని, ఆయన అప్పేదో తీర్చుకుంటున్నారుగా, వీళ్ళనేమైనా అడిగారా పెట్టారా, వదిలేయకూడదూ పోనీ? ప్రతీదాన్నీ రాజకీయం చేయడం ఎందుకో అసలు? ఆయనెవడో, ప్రభుత్వాన్ని రక్షించడానికి ఓటు వేశాడని, టిటిడి ఛైర్మన్ చేశారు. ఇంకోఆయనేమో (మాజీ ఛైర్మన్) అవేవో నిరాహారదీక్షలూ వగైరా చేశాడు. ఒక్కరోజు కూడా, ఏదో ఒక controversy లేకుండా రోజెళ్ళడం లేదు. ఎవరి వాదనలు కరెక్టో కూడా తెలియదు. ఎవర్ని నమ్మాలో అసలే తెలియదు. అందుకనే అన్నారేమో కలికాలం అని.

   ఈవేళంతా మన ఐఏఎస్ అధికారులందరూ గొడవ మొదలెట్టారు. ప్రతీ వాళ్ళూ రాజకీయ నాయకుల ఒత్తిడివలన ఆర్డర్లు పాస్ చేశామనే వారే. కానీ దేశం మొత్తం మీద చూస్తే
ఓ ఆర్మీ అనండి, ఇంకం టాక్సనండి, పోలీసనండి, ఎక్సైజనండి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ శాఖలోనూ అతిరథమహారథులున్నారు. గట్టిగా పట్టుకునేసరికి గుండె నొప్పనేవాళ్ళోళ్ళు, నడుంనొప్పనేవాళ్ళోళ్ళు. అసలు ఎవర్ని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కూడా తెలియదు. ఈ సందర్భం లో OPEN లో వచ్చిన వ్యాసం ఒకటి పెట్టాను.చదవండి.
అమ్మయ్య మొత్తానికి మనవాళ్ళు ఓ మ్యాచ్ నెగ్గారండి బాబూ! దానిక్కూడా ఎంత సస్పెన్సో…

9 Responses

 1. మ్యాచ్ నెగ్గడం వెనుకా ఏవైనా రాజకీయ వత్తుళ్ళు , కారణాలు వున్నాయంటారా ??!!

  చీర్స్
  జిలేబి.

  Like

  • కం. ఓడుతు పోతున్నారని
   వాడల వాడలను తిట్ల వర్షాలాయే
   నేడొకటి గెలవగానే
   తేడానూ ఒప్పుకోరు తిరిగి జిలేబీ

   Like

 2. బాగుందండీ. రాజకీయం ఏమైనా రాజకీయనాయకుల సొత్తా ఏంటీ. అందరిదీనూ. అలాగే గోవిందుడు కూడా. అతడు కూడా అందరివాడేగా.

  Like

 3. పై ఆయన చూస్తున్నాడులెండి.

  Like

 4. మతం మత్తు ఓ పెద్ద వ్యాపారం మరి !

  Like

 5. baga chepparu pateedi rajkeeya konam lo chustunnaru …chala mandi peddalu

  Like

 6. @జిలేబీ,

  ఉండినా ఉండొచ్చు…

  @శ్యామలరావుగారూ,

  అందుకే ఈవేళ్టి మాచ్ ఓడిపోయారు…

  @శర్మగారూ,

  ఔననుకోండి…

  @మోహన్ గారూ,

  నిజమే కదూ…

  @శాయి,
  అదే మనవాళ్ళలోని “ప్రత్యేకత”…

  Like

 7. ఎక్కడ తీపి ఉంటే అక్కడ చీమలు చేరినట్టు,
  ఎక్కడ సంపద ఉంటే అక్కడ రా. నా. లు చేరతారు మరి.

  Like

 8. బోనగిరి గారూ,

  నిజమేనండీ. కానీ రా.నా తో పాటు ఈ మద్యన పీఠాధిపతుల గోల కూడా ఎక్కువయ్యింది. ఎవణ్ణి చూసినా ఆ దేవదేవుణ్ణి దోచుకోడానికి ప్రయత్నించేవారే…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: