బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   నిన్నటి రోజున నేను వ్రాశినటపా మీద ఓ వ్యాఖ్య వచ్చింది. శ్రీ బాపు గారి గురించి సాక్షి పేపరులో వచ్చిన కార్టూన్ లింకు ఇచ్చారు. మళ్ళీ మీరందరూ, ఆ లింకేమిటో అని ఖంగారు పడేబదులుగా, అదేదో నేనే పెట్టేస్తే బావుంటుందని, ఆ కార్టూన్ పైన ఇచ్చాను. ఎంత apt గా ఉందో కదూ !! ఇంకో విచిత్రం ఏమిటంటే, ఈ వ్యాఖ్య పెట్టిన వారి పేరు “బాపు”, ఆయన మెయిల్ ఐడీ లో రమణగారి పేరుండడం. ఈవేళ NTV లో ఒక కార్యక్రమం చూశాను, ఈ విషయం గురించే– ఎవరెవరో వారి వారి అభిప్రాయాలూ, శ్రీ బాపు గారికి పద్మ ఎవార్డు రానందుకు బాధపడిపోతూ అభిప్రాయాలు వెలిబుచ్చారు. అందులో ఒకాయనన్నారూ- ” మనం తెలుగువారి గురించి ఉత్తినే రికమెండు చేసేస్తే సరిపోదూ, ఆ కమెటీ వాళ్ళకి అర్ధం అయేటట్టు హిందీలో ఏదైనా brief గా వ్రాసిస్తే బాగుండేదేమో…” అని. I think this is the most ridiculous suggestion of the century.. మన పక్క రాష్ట్రం తమిళనాడు వాళ్ళు హిందీ అంటేనే పడేడుస్తారే, మరి వాళ్ళకి అన్నేసి పద్మలు ఎలా వస్తున్నాయో? ఇక్కడ మన ప్రభుత్వం వారిచ్చిన రికమెండేషన్ అర్ధం అవుతుందా లేదా అని కాదు ప్రశ్న, ప్రభుత్వాల మీద అవిశ్వాస తీర్మానాలొచ్చినప్పుడు, మన పార్లమెంటు మెంబర్ల సపోర్టడగడం లేదూ, అక్కడ అడ్డం రాని భాష ఇక్కడెందుకూ? అప్పుడెప్పుడో, తెలుగుదేశం మనిషి ఆదికేశవులునాయుణ్ణి హిందీలోనే అడిగారా మాకు మీ ఓటు ఇవ్వండీ అని? ఏదో టివీ వాళ్ళు అడిగారు కదా అని సలహాలిచ్చేయడం. అన్నిన్ని కబుర్లు చెబతారే, మన నటసామ్రాట్టు గారు, ప్రతీ ఏడూ, ఊళ్ళో ఉన్న అందరికీ ఇస్తారే కానీ, మన బాపురమణలు గుర్తుకే రాలేదా? ఏమైనా అంటే అన్నారని అభిమానసంఘాలవాళ్ళు హడావిడి చేస్తారు.ఎందుకొచ్చిన గొడవా?

   ఏదో మనవాళ్ళు ఎడిలైడ్ టెస్టులో అయిదోరోజుదాకా ఆడకలిగారని ఊరికే సంతోషపడిపోనఖ్ఖర్లేదు. ఇదంతా మన గొప్పేనని ఊరికే అపోహపడిపోకండి. ముందరి మూడు టెస్టులూ మూడో రోజుకే అయిపోవడంతో, అక్కడిbroadcasters నష్టాల్లో పడిపోయారుట. అందుకే ఎలాగోలాగ అయిదో రోజుకి లాక్కురావడానికే , మనకి follow on ఇవ్వలేదు. ఈవేళ్టి ఆడిన పధ్ధతి చూస్తే, ఆ follow on ఏదో ఇస్తే, నిన్నటికే పూర్తయుండేది. This is another way of match fixing.. ఇలాటి ఫిక్సింగులమీద ఇంక్వైరీలూ గట్రా ఉండవు !! వాడెవడో డబ్బు తీసికున్నాడని గోలెడతారే, మరి ఇలాటి day light robberies దృష్టిలోకి రావా మరి? డబ్బు మాస్టారూ డబ్బు. రేప్పొద్దుట మనం నిద్రలేచే టైముకి మాచ్ అయ్యేపోతుంది, గొడవా వదుల్తుంది. మళ్ళీ వచ్చేవారం ODI లుట! అందులోనైనా మన భగవద్స్వరూపుడు ఆ వందో శతకం పూర్తిచేసేస్తే, అందరూ ఆనందిస్తారు. భారతరత్న గురించి ఆలోచించొచ్చు.

Advertisements

8 Responses

 1. nice post sir…gud analsyis

  Like

 2. పద్మశ్రీలు etc. ప్రతిభను చూసి ఇచ్చే రోజులు వెళ్లిపోయాయి. అయినా బాపూ రమణ లకి ఇస్తే పద్మభూషణ్ / విభూషణ్ ఇవ్వాలి..

  Like

 3. హాయ్
  మీరు మీ బ్లాగ్ ని వేరే వారి బ్లాగులు మరియు సైటులలో ప్రచారము చేయలనుకుంటే ఈ క్రింది లంకె మీద క్లిక్ చేయండి.
  http://www.adsflip.com/?r=8058

  If u join with above referal link we will get 1000 credits. This is good site. We can advertise free in other webs.

  Thanks
  niftysiri
  http://www.niftysiri.in

  Like

 4. @RAMSi,

  ధన్యవాదాలు.

  @సుబ్రహ్మణ్యం గారూ,

  ఇన్నేళ్ళ తరువాత ఇస్తేనేమిటి, ఇవ్వకపోతేనేమిటి? కేంద్రప్రభుత్వాన్నని లాభం ఏమిటిలెండి, మన రాష్ట్ర దౌర్భాగ్య పాలకులనాలి.

  Like

 5. బాపూ గారి మెయిలు ఐ.డి. లో కూడా బాపు అండర్ స్కోర్ రమణ అని ఉంటుందని ఈ మధ్యనే ఒకరి బ్లాగులో చదివాను….

  Like

 6. జగమెరిగిన విప్రునికి జంధ్యమేల?

  Like

 7. ప్రవసాoధ్రులకు ఆంధ్ర ప్రదేశ్ వారినుంచి కితాబు లభించదు ,
  కానీ భారత రత్నాలు అయ్యిన ముగ్గురు తెలుగు వారు ప్రవాసులే మరి.
  మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారు, స ర్వేపల్లి రాధాకృష్ణ గారు, వరహగిరి వేంకటగిరి గారు,
  ముగ్గురు ప్రవాసులే.
  జగమెరిగిన విప్రునికి జంధ్యమేల?

  Like

 8. @మాధవీ,

  పైన వ్రాసిన ” బాపు” గారిచ్చిన ఐడి కి మెయిల్ పంపితే బౌన్స్ అయింది….

  @మోహన్ గారూ,

  మీరు చెప్పేదీ నిజమే. ఈ ఎవార్డులతో ఏమొస్తుంది శ్రీ బాపూ గారికీ ?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: