బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఇలా అయితే కష్టమే కదండీ….


    ఓ వారం అయింది టపా వ్రాసి. మనం టపాలు వ్రాయకపోతే, ప్రపంచం ఏదీ ఆగదు. పైగా ఎవరి పని వాళ్ళు హాయిగా చేసికుంటారు. నాకైతే పనేమీ లేదు కానీ, మిగిలినవారికి ఏదో ఒక వ్యాపకం ఉంటుందిగా. ఏదో మన టపాలు మిస్ అవుతున్నారూ అందరూ, అనుకోడం ఓ తృప్తీ. నిజం చెప్పాలంటే అలాటిదేమీ ఉండదు. పాపం ఆయనకెవరికో ( పేరు కూడా వ్రాసుకోలేని దుస్థితి పాపం ఆయనది) నెత్తిమీద ఇంకా బొచ్చొచ్చుండాలి ఈ వారం లోనూ! పోన్లెండి ఆ గొడవంతా ఎందుకూ ఇప్పుడు?

    మా ఇంటికి వెళ్ళినప్పుడల్లా, మా మనవడు అగస్థ్య వాడి నానమ్మని, ఎత్తుకో..ఎత్తుకో.. అంటూ పీకేస్తూంటాడు. ఈవేళ “సాక్షి” పేపర్ లో ఓ వార్త చదివి, పోనీ వీణ్ణి నార్వే పంపించేద్దామేమిటండీ, అని ఓ ప్రపోజల్ పెట్టింది మా ఇంటావిడ. వాటి వివరాల్లో కెళ్ళాలంటే ఇక్కడ చదవండి, లేదా కింద పెట్టిన Norwegian Law మీద ఓ నొక్కు నొక్కండి. తెలుస్తుంది..

   ఇదెక్కడి గొడవండి బాబూ, పిల్లలకి గోరుముద్దలు తినిపించకూడదుట, పక్కని పడుక్కోబెట్టకూడదట. బయటి దేశాల్లో ఏదో సంపాదించేసి సుఖపడిపోదామని వెళ్ళడమే కానీ, ఉన్న ఇద్దరు పిల్లలనీ, దగ్గరకే తీసికోకూడదంటే ఎలాగ? ఏమిటో చిత్రచిత్రాతి చట్టాలూ. హాయిగా మనకే బావుంది.. ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్టాడుకోవచ్చు, అవతలివాడు ఎలాటివాడైనా, మన ఎసెంబ్లీ కి పోటీ చేసి నెగ్గొచ్చూ, రన్స్ స్కోర్ చేయకపోయినా హాయిగా టెస్టుల్లో ఆడి డబ్బులు కూడబెట్టుకోవచ్చు, విగ్రహాలు కూల్చొచ్చు అది ట్యాంకు బండైనా సరే, లేక కోనసీమ అయినా సరే! ఓపికున్నంత దోచుకోవచ్చు, మరీ పట్టుబడిపోతే మొక్కుబడిగా కొన్ని నెలలు జైల్లో కూర్చోచ్చు. భూములూ, గనులూ అన్నీ మనవే. అన్నిటిలోకీ ఇంకో సదుపాయం ఏమిటంటే, మన న్యాయ వ్యవస్థ కూడా ఎవడడిగినా వాడికి ఓ ” స్టే” ఆర్డరోటి ఇచ్చేస్తుంది.బెయిళ్ళ సంగతి అసలు అడగొద్దు.

    ఈవేళ మా పూణె మహానగరం లో ఓ సంఘటన జరిగింది. పొద్దుటే ఎనిమిదిన్నరకి ఓ డ్రైవరు ఓ ఎస్ టీ బస్ డిపోలోంచి బయటకు తెచ్చి, వాడిష్టం వచ్చినట్టు నడిపి, దారిలో ఎవడడ్డం వస్తే వాడి మీదనుంచి పోనిచ్చేసి ఓ తొమ్మిదిమంది ప్రాణాలూ తీసేశాడు. ఓ పాతికపై మంది జనాలు గాయపడ్డారు. ఇంక వాహనాల సంగతి అడక్కండి. ఏదో వాడి పేరు, ఇంకో మతం వాడు కాదుకాబట్టి, ఆ మతానికి చెందిన మిగిలినవారు బ్రతికిపోయారు. లేకపోతేనా.. తెలుసుగా పూణె లో పేద్ద కారణం అంటూ అఖ్ఖర్లేదు.. మరి ఇలాటివన్నీ అదేదో నార్వేలో చేయడానికి వీలుంటుందా మరి?

    ఇవన్నీ సరిపోనట్టు ఈవేళ్టి పేపరులో ఇంకో వార్త చదివాను. అదికూడా చదివేస్తే ఇవాళ్టికి చాలు.Norwegian LawDNA

Advertisements

7 Responses

 1. Really we missed u for aweek

  Like

 2. Nijamgaa miss ayyamandi.evaro annavi nijamgaa pattinchukoodadadu meeru.Chaala mande vuntaaru maa laanti vallu

  Like

 3. దారుణంగా ఉంది పరిస్థితి, రాను రాను మీ టపాలు చదవడం ఒక వ్యసనంగా మారి, ఆ మోతాదు పడని రోజు బోరే కాదండోయ్, తల బొప్పి కూడా కడుతుంది. మీకు ఫర్వాలేదుగానీ నెత్తి మీద చాలా కొంచెమే బొచ్చు మిగిలిన నాలాంటోళ్ళ సంగతేంగానూ? దయచేసి ఇలా వారమేసి రోజులు మాకు విశ్రాంతి ఇవ్వకండి బాబయ్యా!

  భవదీయుడు
  వర్మ

  Like

 4. ఏవిటండీ మీరు…. సరే ఏదో వీకెండు కదా మనవలు మనవరాళ్ళతో సమయం గడుపుతున్నరేమోలే రాయడం కుదర్లేదు అనుకొని……. సోమవారం చూసినా లేదు…… మంగళవారం చూసినా లేదు…… ఏంటీ లేనిదీ అంటారా….. మీ బ్లాగులో కొత్త టపా… ఇహ లాభం లేదు రేపు కూడా వ్రాయకపొతే బులుసువారిని మీ మెయిలు ఐ.డి. అడిగి మీకో మెయిలు పెట్టేద్దాము….

  “ఎవరో ఒకరు ఏదో అన్నారని…. చదివే మమ్మల్నందరినీ వదిలేసి వ్రాయడం మానెసి కూర్చుంటే ఎలాగండీ” అని

  ఇంతలో మీ టపా…… మీకు తెలియటం లేదు కానీ మీరు పెద్ద ఉపద్రవం నుంచి తప్పించుకున్నారు….

  నేను వెనక టపాలలోకి వెళ్ళి మీకు రెగులరుగా కామెంటే వారినందరినీ ఏకం చేసి మీవైపు మళ్ళిద్దాము అనుకున్నాను కూడా…

  Like

 5. అదేమిటో నండీ,

  ఈ మధ్య టపాలకి తాటాకు చప్పుళ్ళు ఎక్కువవు తున్నాయి. కామెంటు రాసే వాళ్ళు ఓయ్ నువ్వెందుకు రాస్తున్నావ్, ఆపు చేయి అంటారు !

  వెంటనే మనమంతా హమ్మో మన వల్ల వీళ్ళకెంత సమస్యో అని టపా ఆపేస్తాం !

  అంతా విష్ణు మాయ ! ఆ నార్వే కథలా మనల్ని కూడా ఎక్కువ టపాలు రాస్తున్న మని తీస్కెళ్ళి నో నెట్ ఏరియా లో పడేస్తా రంటారా ?

  చీర్స్
  జిలేబి.

  Like

 6. @శర్మగారూ,
  మరీ మొహమ్మాటానికి చెప్పినా వినడానికి మాత్రం బలే స్వీట్ గా ఉంది..

  @అన్నపూర్ణ గారూ,

  మరీ అంత కాదులెండి.. ఎనీ వే ధన్యవాదాలు…

  @అబ్బులూ,

  మరీ అలా అంటే ఎలాగా? పైగా నాకైతే ఫరవాలేదా, వహ్వా వహ్వా… మళ్ళీ మొదలెట్టేశానుగా…

  @మాధవీ,

  మరీ బులుసువారినే అడగఖ్ఖర్లేదు. అప్పుడప్పుడు మెయిల్స్ కూడా పంపొచ్చు.. bphanibabu@gmail.com

  @జిలేబీ,

  నార్వే కథ సుఖాంతం అయింది కదా.. అలాగే నా టపాలూనూ… ఏదో మూడ్ సరీగ్గాలేక వ్రాయలేదు. ఎందుకు బాగోలేదో ఓ టపా వ్రాస్తాను, మూడ్ బావున్నప్పుడు…థాంక్స్…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: