బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— ఓ మనిషవ్వొచ్చు, కొట్టవ్వొచ్చు, అనుబంధం అనుబంధమే….


Manney’s

    ప్రతీ మనిషికీ చిన్నప్పటివో, కొత్తగా ఉద్యోగంలో చేరినప్పటివో, ఎన్నెన్నో జ్ఞాపకాలుంటాయి. పైగా ఓ మనిషి కానీ, ఓ సంఘటన కానీ, తన జీవితంలో ఒక మార్పుకి గురి అయినదైతే అసలు మర్చిపోలేము. అలాగే ఏ స్కూలుకెళ్ళేటప్పుడో దారిలో ఉండే కొట్టనండి, ఓ సినిమా హాలనండి , సావకాశంగా కూర్చున్నప్పుడు గుర్తొస్తూంటాయి. ఎప్పుడో, సంవత్సరాల తరువాత ఓ సారి చూసొద్దామని వెళ్తే అక్కడేముంటుందీ? ఆ కొట్టు స్థానంలో ఓ మాలూ, సినిమా హాలు స్థానం లో ఓ మల్టీప్లెక్సూ! అయ్యో అనుకుంటాము. కానీ ఆ జ్ఞాపకాలు రాక మానవుగా.

    ఇప్పుడు మరీ అంతకాదనుకోండి. ఈ రోజుల్లో అన్నీ use and throw ! చేరిన ఉద్యోగంలోనే పట్టుమని రెండేళ్ళుండని ఈ కాలంలో మరీ attachment లు ఉండాలనుకోడం అత్యాశే ! ఏదో తప్పదు కాబట్టి తల్లితండ్రులతో మరీ అంత కాకపోయినా ఏదో ఆ బాండింగు ఉంచుతున్నారు. దీనికి ఎవరినీ తప్పుపట్టలేము. కాల మహిమ ! నేను 1963 దాకా అమలాపురం లో స్కూలు,కాలేజీ చదువులులాటివి పూర్తిచేసి ఉద్యోగానికి పూనా వచ్చాను. అమలాపురం లో ఉన్నంతకాలమూ, ఏ కిళ్ళీకొట్టునుండో డిటెక్టివ్ పుస్తకాలు అద్దెకి తెచ్చి చదవడం వరకే సీమిత్ నా పుస్తక పఠనం. ఏదో మెడ్రాస్ లాటి ఊళ్ళు వెళ్ళినప్పుడు ఏ మూర్ మార్కెట్ లోనో ఇంగ్లీషు పుస్తకాలు చూసేవాణ్ణి. అలాగని చదివే ధైర్యం ఉండేది కాదు. ఏదో ఏ హాలీవుడ్ సినిమా గురించో ఏ “కినిమా” లో కానీ, ఏ “సినిమారంగం” లో కానీ బొమ్మలు, అదీ ఎవరికీ కనిపించకుండా చూసి ఆనందించడమే! ఇదీ నా పుస్తకపఠన background !

    అలాటిది నేను ఉద్యోగంలో చేరిన రెండేళ్ళకి, నన్ను మా ఫాక్టరీలో ఇంకో సెక్షన్ కి మార్చి, లైబ్రరీ చూడమన్నారు. అక్కడ ఏదో టెక్నికల్ పుస్తకాలుండేవి. గవర్నమెంటులో funds కి ఏమీ లోటులేదుగా. దానికి సాయం, మా జనరల్ మేనెజర్ గారికి, కొత్త కొత్త పుస్తకాలు చేర్చాలని ఓ కోరికా! ప్రతీ బుధవారం పూనాలో Westend సినిమా పక్కనే ఓ కొట్టుండేది Manneys అని.

    అక్కడకి వెళ్ళడం,మా బాస్ చెప్పిన ఏదో పుస్తకం కొనడం, అలా కాలక్రమేణా, ఆ కొట్టు అతను ఇవ్వగా, కొన్ని పుస్తకాలు On approval basis మీద తెచ్చేవాడిని. మా జిఎం గారికి నచ్చొచ్చేమో అని, ఆయన ఆ పుస్తకాన్ని ఓసారి చూసి,excellent selection అని ఓ శభాసీ ఇచ్చేవారు. ఓహో నాక్కూడా పుస్తకాల సెలెక్షన్ వచ్చునన్నమాట అని సంతోషపడిపోయేవాడిని. ఇంక వారానికి రెండు సార్లు వెళ్ళడం మొదలెట్టాను. దీనితో ఆ కొట్టతనికీ, నాకూ ఓ అవినాభావసంబంధం ఏర్పడిపోయింది. ఇది ఎంతదాకా వెళ్ళిందీ అంటే, ఫాక్టరీ కోసం పుస్తకాలే కాకుండా, ప్రత్యేకంగా నేను చదువుకోడానికి అప్పుడే కొత్తగా వచ్చిన Hard bound నావెల్సనండి, క్రికెట్ మీదొచ్చిన పుస్తకాలనండి, నాకు ఓపికున్నన్ని పుస్తకాలిచ్చేసేవాడు. Paper back కీ Hard bound కీ ఉన్న తేడా ఏమిటో చాలామంది పుస్తకప్రియులకి తెలిసే ఉంటుంది. రెండో దాంట్లో పెద్ద పెద్ద అక్షరాలూ, మరీ మొదటిదానిలా ఇరుకిరుగ్గా ఉండేవి కావు. దానితో పుస్తకాలంటే ఓ పిచ్చి ఏర్పడిపోయింది. వందల పుస్తకాలు అవీ ఒరిజినల్ Hard bound లో చదివే అవకాశం వచ్చింది. That was how my love wih books started పూనా/పూణె తో సంబంధం ఉన్న ఎవరికైనాసరే ఈ పుస్తకాల షాప్ పరిచయమే! తెలుగు పుస్తకాలకి మన విశాలాంధ్ర, నవోదయా ఎలాటివో, పూణె లో ఇంగ్లీషు పుస్తకాలకి ఈ Manneys అలాగన్నమాట.

   దీనితో ఏమయిందీ, ఇంట్లో ఎప్పుడు చూసినా పుస్తకాలే. రైల్వే స్టేషన్ లో తెలుగువీ, ఈ కొట్టునుంచి తెచ్చిన ఇంగ్లీషువీ. పెళ్ళైన తరువాత మా ఇంటావిడకీ ఈ జాడ్యం అంటించాను!ఇంక దానితో మా ఇంట్లో పుస్తకాలు చదవడం ఓ “వ్యసనం” లా మారింది. మధ్యలో 15 సంవత్సరాలు, వరంగాం ట్రాన్స్ఫర్ అయినా, అక్కణ్ణుంచి కూడా, ఈ కొట్టతనితో సంబంధాలు కంటిన్యూ చేశాను, కారణం అక్కడకూడా లైబ్రరీ ఏ చూసేవాణ్ణి. ఇంట్లో ఎప్పుడూ పుస్తకాలే అవడంతో, మా పిల్లలకి కూడా ఇదే అలవాటయింది. అదే చివరకి, మా అబ్బాయిచేత ఓ గ్రంధాలయం ప్రారంభించేదాకా వచ్చింది. ఆ Manney’s తో ఎన్నెన్ని జ్ఞాపకాలండి బాబూ. మా ఇంటావిడతో మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు, ఓ నిట్టింగ్ బుక్ ఇచ్చారు. ఇప్పటికీ ఉంది. అలాగే మా అమ్మాయి రెండో birthday కి ఓమూడు పుస్తకాలిచ్చాడు. ఇప్పటికీ ఉన్నాయి.అలాటివి మర్చిపోగలమా?

   అలాటిది నిన్నటి పేపర్లో వచ్చిన వార్త ( పైన ఇచ్చాను, ఓ నొక్కు నొక్కండి) చదవగానే గుండె చెరువైపోయింది! ఏదో మన ఇంట్లోనే ఎవరో వెళ్ళిపోయినంత బాధేసింది! ఎవరి కారణాలు వాళ్ళకుంటాయనుకోండి, కానీ ఈవేళ ఉండబట్టలేక, వెంటనే వెళ్ళి ఆ కొట్టతని తో నా nostalgia పంచుకున్నాను! ఒకటా రెండా 48 సంవత్సరాల గుర్తులు! జీవితంలో ఇంగ్లీషు పుస్తకాలు చదవడానికి సదవకాశం ఇచ్చిన మా Manneys కి ఇదే నా పుష్పాంజలి !!
Advertisements

18 Responses

 1. మీరు అదృష్ట వంతులు ఎందుకంటే మేడమ్ కు కూడా పుస్తకాలు చదివే అలవాటు ఉంది కనక. మాఇంటావిడకి పుస్తకాలంటే ఎలర్జీ. ఏదో చదవాలి కాబట్టి ఎలాగో డిగ్రీ అయింది అనిపించింది. మాపిల్లల చదువు ఎప్పుడవుతుందా పుస్తకాల అలమరా ఎప్పుడు ఖళీ అవుతుందా అని ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటుంది (ఇంకా 10, 5 వ తరగతే లెండి). సరే నావి చాలాపుస్తకాలు అటక ఎక్కాయి.

  Like

 2. వేణు గోపాల్,

  అప్పుడే ఎక్కడ? ఇంకా పిల్లలు 10, 5 లోనేకదా ఉన్నారూ. చూద్దాం. ఒక స్టేజ్ వచ్చేటప్పటికి హాయిగా పుస్తకాలు చదవడం లోకి వచ్చేస్తారు…

  Like

 3. దారునం గా ఉంది పరిస్థితి. రాను రాను మీ టపాలు బోరే కాదండోయ్ తలమీద బొప్పి కట్టిస్తున్నాయ్. మీకు పర్లేదుగానీ నెత్తిమీద కాస్తో కూస్తో బొచ్చున్న నాలాంటోళ్ళ సంగతేంగానూ
  దయచేసి కొన్నాళ్ళు చదువరులకు విశ్రాంతి ఇవ్వండి బాబయ్యా

  Like

 4. ఓ పాఠకుడు గారూ,

  మిమ్మల్ని చదవమని ఎవరూ బలవంత పెట్టడం లేదండీ. ఇంక మీ బొప్పులూ, బొచ్చుల సంగతి .. చదవడం మానేస్తే సరి.. హాయిగా ఉంటారు… మీ ఐడి తయారుచేసికోడానికి ఎన్ని బొప్పులు కట్టాయో ఆలోచిస్తే బాధేస్తోంది…

  Like

  • > మీ ఐడి తయారుచేసికోడానికి ఎన్ని బొప్పులు కట్టాయో ఆలోచిస్తే బాధేస్తోంది
   ఇంతకూ ఆ బొప్పి కట్టించే ID ఏమిటి?

   Like

 5. పుస్తకానికి మించిన స్నేహితుడు లేదంటారు , మీ యొక్క స్పందన నాకు అర్ధమైంది . ధన్యవాదాలు

  Like

 6. మల్లికార్జున్ గారూ,

  థాంక్స్…

  Like

 7. pustakaalu vikrayimche vallu abhiruchi unna vallaite aa atmiyata bamdham amta tvaraga tempukolem kada.

  Like

 8. ఏదైనా సరే అనుబంధం అనుబంధమే కదా…..
  కానీ వేరెవరైనా ఆ కొట్టుని నడిపిస్తే బాగుండునేమో…

  వారి పిల్లలో ఇంకెవరో ఒకరు ముందుకొస్తే…… అయినా అనుకోవడమే గానీ అదంతా అయ్యే పనా చెప్పండి….
  ఎవరిదాకో ఎందుకు నేనే అన్ని పనులు మానేసి దాన్ని చూసుకోడానికి వస్తానా….?

  కొన్ని అంతే…. మారము…. మార్చలేము….

  Like

 9. కాల గతి లో కిళ్ళీ కొట్టు డిటెక్టివ్ పుస్తకాల చిరు లైబ్రరీ లూ పోయేయి.
  గ్రంధాలయాలు పోతున్నాయి. ప్రింటెడ్ పుస్తకాలని ఎలెక్ట్రానిక్ ‘రీడర్స్’ రిప్లేస్ చేస్తున్నాయి.

  No ‘Stall’ ‘jiyaa’ – Nostalgia

  No చీర్స్
  జిలేబి.

  Like

 10. ఏమిటో బాబు గారు,
  బంధాలు – అనుబంధాలు అని గుండెని, నిమ్మకాయ పిండినట్లు పిండుతున్నారు.

  Like

 11. అనుభూతి రాహిత్యం కొంత మంది లో ఎలా పేరుకొని పోయిందో ,
  కొన్ని అసహన పరుల టపాలలో చూసి బాధగా ఉంది.
  మీరు మాత్రం మీ పరంపరను ఆపకుండా కొనసాగించండి.
  bash on regardless.

  Like

 12. సర్,

  చాలా బాగా రాసారు. మా పేరెంట్స్ నుంచి మాకు పుస్తకాలే ఆస్తిగా వచ్చాయి. పుస్తకాలూ పట్టుకుని చదువుతూ వుంటే వుండే ఆనందం దేనిలోనూ లేదు.

  Like

 13. మా జోర్హట్ లో ‘పీపుల్స్ బుక్ స్టాల్ ‘ అని ఒక షాప్ ఉండేది. అతని పేరు. హజ్రా. కొత్తగా వచ్చిన పుస్తకాలు అన్నీ చదివేవాడు. పుస్తకం కొనడానికి వెళ్ళితే అతనే చెప్పేవాడు భలానా పుస్తకం బాగుంది. చదవండి అని. ఒక 20 యియర్స్ నెలకో పుస్తకం కొనేవాడిని అక్కడ. మా ఆవిడ కోసం కొన్ని తెలుగు పత్రికలు కూడా తెప్పించాడు. ఆ తరువాత దుకాణం మూసివేసి ఇంకో వ్యాపారం లోకి వెళ్ళాడు కలకత్తాలో. కలకత్తా లో కూడా అప్పుడప్పుడు కలిసేవాడు చదివిన పుస్తకాల గురించి చెప్పేవాడు.

  మనకి తెలియకుండానే అనుబందాలు, ఆత్మీయత పెరిగిపోతుంటాయి. పుస్తకాల షాప్ తో కానీ మరే షాప్ తో కానీ, యజమాని మంచివాడైతే. మా హజ్రా గుర్తుకొచ్చారు మీ టపా చదివిన తరువాత. థాంక్యూ. .

  Like

 14. chala baga rasaru….thanks for ur valuable post

  Like

 15. chala baga rasaru sir

  Like

 16. @cool,

  పోనిద్దురూ వదిలేయండి. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం…

  @ఫణీంద్రా,

  నిజమే కదూ. బైదవే మీరు పంపిన మెయిల్ కి సమాధానం పంపాను. ఇంకా సందేహాలుంటే అడగండి..

  @మాధవీ,

  ఆ విషయమూ అడిగాను. కానీ కొట్టు మూసేందుకే నిశ్చయించి, clearance sale మొదలెట్టారు..

  @ జిలేబీ,

  నొస్టాల్జియా ని ఎంత బాగా వివరించారు… నిజమే కదూ..

  @పానిపురి,

  ఏమో నాకు తోచింది, వ్రాస్తున్నాను.. నా టపాలు మీకందరికీ నచ్చడం నేను చేసికున్న అదృష్టం…

  @మోహన్ గారూ,

  అనే అనుకుంటున్నాను. కానీ అప్పుడప్పుడు పైన పెట్టిన వ్యాఖ్యలలాటివి చదివినప్పుడు బాధేస్తుంది. బలవంతంగా ఏదో మందు తాగినట్టు చదవడం ఎందుకో అర్ధం అవదు.

  @శ్రీకాంత్,

  మన తల్లితండ్రులు ఇచ్చిన ఆస్థే ఎప్పుడూ తరగని ఆస్థి.

  @సుబ్రహ్మణ్యం గారూ,
  నేను వ్రాసిన టపా చదివి, మీ జీవితం లోని ఓ ఆప్తమిత్రుణ్ణి గుర్తుచేసికున్నందుకు చాలా సంతోషం, అదీ పుస్తకాల విషయం లో..

  @కిరణ్.
  చాలా చాలా థాంక్స్..

  Like

 17. ఆ వ్యాఖ్యలో మీమీద కోపం కనిపించిందా మీకు? మీరిలా అనుకోవడం బాలేదు.
  అంటే మరీ మీరు కుటుంబానుబంధాలగురించే రాస్తున్నారు గానీ సమకాలీన రాజకీయాలో, సంస్కృతిమీద జరుగుతున కుట్రలమీదో రాస్తే మీలాంటి పెద్దవారి మాటలు ఎంతమందికి సరైన దారిచూపిస్తాయి కదా అన్నాదే అక్కడ ఉద్దేశం.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: