బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– బిజినెస్ మాన్…


    మిట్ట మధ్యాన్నం వెళ్ళి చూసొచ్చామండి మొత్తానికి. దేశంలో ఉన్న చాలా సినిమాలకి హాయిగా వాళ్ళ వాళ్ళ భాషల్లో పేర్లు పెడుతూంటే, అసలు మనవాళ్ళకేం రోగం, ఇంగ్లీషులో పెడతారు? రేపెప్పుడో బాడీ గార్డుట ! పేర్లు ఇంగ్లీషులో పెట్టేటప్పటికి ఆ థియేటర్ వాడికీ అనుమానం వచ్చేసింది, ఇదే భాష సినిమా అని! పేరుకూడా తెలుగులో పెట్టలేని దౌర్భాగ్యం మనది. సినిమాలో పేద్ద ఏమీ విశేషం ఉండఖ్ఖర్లేదు, ఓ అరడజను క్యాచీ పాటలూ, మధ్యమధ్యలో ఈ మధ్యన డయలాగ్గుల్లో సెన్సారోటి మొదలెట్టారండోయ్, పీ..పీ.. అని సౌండొచ్చేస్తుంది. మన సెన్సారు వాళ్ళుకూడా మెళుకువగా ఉన్నారని చూపించుకోవాలిగా మరి!

    ఏదో ఆంధ్రదేశానికి బయట ఉండిపోయామని ఏమీ బాధపడఖ్ఖర్లేకుండా, సినిమాలో మహేష్ బాబు కనిపించగానే ఈలలూ, చప్పట్లూ, పిల్లికూతలూ, అరుపులూ అన్నీ ఉన్నాయి!
ఇంక సినిమా విషయానికొస్తే, కథ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, కారణం అసలు కథ అనేదే లేదు కనుక! ఇంక హీరో విషయానికొస్తే, హిందీ హీరోలకి ఏమాత్రం తీసిపోకుండా చేశాడు.వచ్చిన గొడవల్లా ఏమిటంటే, రేపెప్పుడో, ఈ సినిమా రైట్లు ఏ హిందీవాడో కొనుక్కుని, ఏ సల్మాన్ ఖాన్ తోనో తీస్తాడు. మహేష్ బాబు వయస్సు ఎంతైనా, కొద్దిగా
boyish looks ఉండడంతో ఏదో ఫరవాలేదు కానీ, సల్మాన్ ఖాన్ లాటివాళ్ళు, మరీ వెగటుగా కనిపిస్తారు!

    సినిమాకి డబ్బులసంగతికొస్తే, రెండువేల ప్రింటులు రిలీజ్ చేసినప్పుడు రాక చస్తాయా? ఎలా చూసినా ఓ వారం, మహ అయితే పదకొండో రోజుకి ఔట్ !! ఊరికే యాడ్లూ, ఇంటర్వ్యూలూ చూసి ఊరికే ఎగేసుకు వెళ్ళిపోకండి. ఎప్పుడో టి.వీ. లో వస్తే చూడొచ్చు! పాటల విషయానికొస్తే, ఏదో బీట్లు పెట్టేస్తే హిట్ అయిపోతుందనుకోవడం పొరపాటు. ఇంతకుముందొచ్చిన పోకిరీ, దూకుడు సినిమాల్లో చెప్పుకోడానికి కథైనా ఉంది. ఇందులో అలాటిదేమీ లేదు. పోనీ ఉన్న ప్రకాష్ రాజ్ నైనా ఉపయోగించుకున్నారా అంటే అదీ లేదూ, అంతా కలిపి పదిహేను నిమిషాలు! నాజర్ ఇంకో పావుగంటా, మిగిలిన రెండు గంటలూ హీరో, డిష్యుం ఢిష్యుం..

    ఇదివరకు రాంగోపాల్ వర్మ ఇలాటి సినిమాలు చాలా తీశాడు. ఏదో అతని సినిమా చూస్తున్నట్లే ఉంది.

    కొసమెరుపేమిటంటే ఈ సినిమాలో ఓ డయలాగ్గుంది… “సూర్య.. అంటే అదో పేరు కాదు. బ్రాండ్…” బస్! మా ఇంటావిడ పేరులో సూర్య ఉండడంతో ఇంక అదే డయలాగ్గు రోజంతా!!

    చేసిన తప్పేమిటంటే, పదకొండున్నర దాకా జెమినీ లో శంకరాభరణం చూసి తరువాతి రెండు గంటలూ బిజినెస్ మాన్ ! లెవెలెంత పడిపోయిందో చూడండి !!

    ఇంక పెర్త్ లో మనవాళ్ళు అదేదో నలుగురు పేస్ బౌలర్లని పెట్టి ఏదో చేసేద్దామనుకుని చతికిలపడ్డారు as usual ! ఎంత ప్రభావవంతమయ్యారూ అంటే, వార్నర్ ఇచ్చిన క్యాచ్ పట్టుకుని కూడా ఎపీల్ చేయకపోవడం!! వాళ్ళిద్దరూ చెడుగుడాడేసికున్నారు.రేపెప్పుడో బాగా ఆడొచ్చు, కానీ ఇవేళ్టి సంగతేమిటండి బాబూ! మనవాళ్ళ ఆటా, బిజినెస్ మాన్ సినిమా ఇంక అడక్కండి శుక్రవారం ఎలా ఉందో?

    బైదవే వచ్చేవారం అప్పుడెప్పుడో వెళ్ళిన హొటల్ కి మళ్ళీ వెళ్ళమన్నారు రోజున్నర గడపమని. ఈసారీ ఒక్కణ్ణే !!!

సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ…

Advertisements

9 Responses

 1. ఫణిబాబు గారూ, మీకూ సంక్రాంతి శుభాకాంక్షలు.

  Like

 2. మీకు మీ కుటుంబ సభ్యులందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

  Like

 3. “పదకొండున్నర దాకా జెమినీ లో శంకరాభరణం చూసి తరువాతి రెండు గంటలూ బిజినెస్ మాన్ ! లెవెలెంత పడిపోయిందో చూడండి !!”

  :)))))))))))))))))))))

  Like

 4. mee ninchi review asalu expect cheyyaledandi

  Like

 5. ఫ్రైడే, ది థర్టీన్త్ ఎఫెక్టన్నమాట.
  సంక్రాంతి శుభాకాంక్షలండీ.

  Like

 6. GURUJI namaste. Wish you and your family happy ponagal.

  Like

 7. happy sankranthi

  Like

 8. బాగుందండీ మీ వరస..
  అమలాపురంలో సంక్రాంతికి లైన్లో నిలబడి.. చొక్కాతడిచిపోయేలా చెమటలు పట్టించుకుని.. గుండీలు నాలుగు తెంచుకుని.. ఎలాగైతే రెండు టిక్కెట్లు సంపాదించి పండుగరోజు సినిమా చూసినట్టు.. ఇక్కడకూడా సంక్రాంతికి సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. అందులోనూ రిలీజైన కొత్తసినిమా.. కృష్ణగారబ్బాయి మహేష్ బాబుది.. అరవైలో ఇరవై అంటే ఇదే మరి. 😉

  సంక్రాంతి శుభాకాంక్షలు. 🙂

  Like

 9. @భాస్కరరామరెడ్డిగారూ,సుబ్రహ్మణ్యం గారూ,శర్మగారూ,మోహన్ గారూ,

  ధన్యవాదాలు. మీరందరూ సంక్రాంతి బాగా జరుపుకునే ఉంటారని భావిస్తున్నాను.

  @బాలు,
  అనే అనిపిస్తోంది…

  @రవీ,

  చేసిన పాపం చెప్పుకుంటే పోతుందిట !!

  @శ్రీనివాసా,

  ఏం చేయను బాబూ? ఇరవైల వాళ్ళు మరీ అరవైలవాళ్ళలాగ తయారవుతున్నారని, ఈ బృహత్తర కార్యం నేనే చేస్తున్నాను…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: