బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


    ఈవేళ మా మనవడు చి.అగస్థ్య రెండో పుట్టిన రోజు. సాయంత్రం అమ్మాయి,అల్లుడూ, పిల్లలూ కూడా వస్తారు. కావలిసినంత కాలక్షేపం. సంక్రాంతికి మా పెద్ద మనవరాలు చి.తాన్యా పుట్టినరోజు. మళ్ళి అమ్మాయి అత్తవారూ, ఆడపడుచులూ వాళ్ళ ఫామిలీలూ కలవడం. ఏదో హాయిగా గడిచిపోతోంది. మేము మా మనవరాలు నవ్య రెండో పుట్టిన రోజు అవగానే, రాజమండ్రీ కాపరం పెట్టేశాము, అప్పటికి నవ్య కొద్దిగా అర్ధం చేసికోడమూ అదీ రావడం చేత. ఇప్పుడు మా మనవడితో అలాటి లక్షణాలు ఏమీ కనిపించడం లేదు. కూర్చోపెట్టి చేయించుకోడంలో ఎంత ఆనందమో వాడికీ! ఎప్పుడో, మా పూర్వీకులకెవరికో ఋణపడి ఉంటాము, ఇప్పుడు చేయించుకుంటున్నాడు! అస్సలు వదలడే! అన్నీఅర్ధం అవుతాయి, అయినా సరే, చేయించుకోడం. అలా ఉంటుందనుకుంటా, నానమ్మా తాతయ్యల దగ్గర! అసలు వాడు ఎప్పటికైనా పెద్దాడవుతాడా అని నేనూ, మా ఇంటావిడా అనుకుంటూంటాము. ఏమో నిజంగా పెద్దాడైపోయి, మా దగ్గరకి రాకపోతే, అసలు ఉండగలమా? ఏమిటో ఈ భవబందాలు !! But we are enjoying every minute of it… God bless them.

    గత రెండు మూడేళ్ళలోనూ నాలో వచ్చిన మార్పుల గురించి సింహావలోకనమో అదేదో చేసుకుంటూంటాను. ఇదివరకటి రోజుల్లో, అంటే pre 80s అన్నమాట, ఎవరితోనైనా మాట్లాడాలంటే భయం. ఏమనుకుంటారో మన్నీ, మన డ్రెస్సునీ చూసి అని. ఏదో మొత్తానికి మా ఇంటావిడ పోరగా పోరగా, టైలర్లచేత ఎవరో పెట్టిన గుడ్డలు కుట్టించుకోడం తగ్గించి, ఏదో సాదా సీదా రెడీ మేడ్ షాప్పులకెళ్ళి బట్టలు కొనుక్కోడం మొదలెట్టాను. పిల్ల పెళ్ళయీ టైముకి మొత్తానికి ఓ గట్టున పడ్డట్టే అనుకోండి. ఉద్యోగం చివరి పది సంవత్సరాల్ల్లోనూ, కొద్ది కొద్దిగా మార్పు రావడం మొదలెట్టింది. నేను పనిచేసే ఫాక్టరీల్లోని నా పై ,అధికార్ల చలవ అనండి, ఇంట్లో ఉండే వాతావరణం అనండి, ఫరవాలేదూ, నేనూ బతక్కలనూ అని!

   రిటైరయిన తరువాతైతే అసలు మా వాళ్ళు నమ్మడం లేదు, నేనూ, నా బిజీ షెడ్యూళ్ళూ. ఎప్పుడు చూసినా బ్లాగులూ, మిస్టరీ షాపింగులూ, మా లైబ్రరీ. అస్సలు టైమే ఉండడం లేదు. తెలిసిందేమిటీ అంటే, నేర్చుకోవాలని తపనే ఉండాలి, కావలిసినంత ఉంది నేర్చుకోడానికి. అంతే కానీ, అసలు నాకు ఇంటరెస్టే లేదూ, ఏదో రామా కృష్ణా అనుకుంటూ కూర్చుంటానూ అంటే భగవంతుడు కూడా బాగుచేయలేడు! ఆమధ్యన ఆయనెవరో అన్నారులెండి, మీరు మిస్టరీ షాపింగ్ మిషతో వాళ్ళని ఫూల్స్ చేయడం లేదా అని! అప్పుడు ఆయనతో చెప్పాను మాస్టారూ నేను చేసేది shop lifting కాదూ, face lifటూ అని!. ఏమిటో ఎవరేమనుకుంటే ఏమిటీ, హాయిగా ఇప్పుడు బ్రాండెడ్ బట్టలే ! ఇప్పుడు ఎవరితోనైనా మాట్టాడ్డానికి భయమూ జంకూ లేదు. అందుకే మన బ్లాగర్ల ఇళ్ళలో ఉండే పెద్దవాళ్ళకి ఈ మిస్టరీ షాపింగ్ వివరాలు చెప్పండి. హాయిగా ఎంజాయ్ చేస్తారు,

Advertisements

3 Responses

 1. చి.అగస్థ్య కు జన్మదిన శుభాకాంక్షలు…పచ్చచొక్కా లగూలో ఎంత ముద్దుగా ఉన్నాడో..

  Like

 2. > …. టైలర్లచేత ఎవరో పెట్టిన గుడ్డలు కుట్టించుకోడం తగ్గించి…
  నేనూ అమెరికాలో ఉండగా, మనదేశానికి వచ్చినప్పుడల్లా బంధుమిత్రులు పెట్టిన గుడ్డలు గుట్టలయేవి. అవికుట్టించుకోకతపప్పేది కాదు. ఓ సారి మాతమ్ముడన్నాడు, ఒరేయ్ బాగానే ఉంది కానీ, నువ్వు బట్టలు సెలక్ట్ చేసుకొనే అవకాశం పోయిందీ అని! నిజమే కదా.

  అన్నట్లు, ఈ మిస్టరీ షాపింగ్ అంటే యేమిటో తమాషాగా ఉందండీ. కొంచెం బోధపరుస్తారూ!

  Like

 3. @జ్యోతిర్మయీ,

  థాంక్స్.. అదిగో అలా ఉండే మమ్మల్ని భవబంధాల్లో ఇరికించేశాడు…

  @శ్యామలరావుగారూ,

  ఈ విషయం మీద ఇప్పటికి మూణ్ణాలుగు టపాలు వ్రాశాను. అయినా ఆ లింకులు మరోసారి ఇస్తున్నాను:..1) onioninsights.info 2) http://www.baidata.com/

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: