బాతాఖాని- లక్ష్మిఫణి కబుర్లు–National Obsession….


    ఏడాది నుంచి చూస్తున్నాము, ఎప్పుడు మన వాళ్ళు క్రికెట్ ఆడినా, పేపర్లలోనూ, టి.వీ ల్లోనూ ఒకటే గోల. Wiil he or won’t he… ఏదో ఈసారైనా అదేదో చేసేస్తే ఓ పీడా వదిలేది. అంతదృష్టం కూడానా మనకి! ఆయన ఆ వందో సెంచరీ చేయనూ చేయడూ, మనకి ఈ గోలా తప్పదూ! పైగా అలా అంటే, మనల్ని అంటే నాలాటివాడిని దేశద్రోహి కింద కట్టేసి ఉరి తిసేసినా తీసేయొచ్చు. పోనీ వదిలేద్దామా అంటే, ఈ గోల భరించడం ఇంకా ఎంతకాలమండి బాబూ? అసలు ఆ వందో సెంచరీచేస్తేనే, అతను గ్రేట్ ప్లేయరా? ప్రతీ సారీ ఒకటే జవాబు- ” నాకైతే అలాటిదేమీ లేదూ, ఊరికే అందరూ కలిసి ప్రెషర్ పెటేస్తున్నారూ…etc..etc.. ” అని. డాన్ బ్రాడ్మన్ అదేదో 99.something యావరేజ్ చేయడం వల్లనే అలా unique గా ఉండిపోయేడేమో? అలా ఎందుకు ఆలోచించరూ అసలూ?

    అఛ్ఛా ఇంకో విషయం, అప్పుడెప్పుడో World Cup నెగ్గడం కూడా ఈయనకోసమేట అదేమిటో మనందరికోసం అనుకున్నాం. చదువుకున్నవాళ్ళమా ఏమిటీ, లోకజ్ఞానం లేనివాళ్ళమాయే !!. అంటే దేశం, గౌరవం, వెర్రి ప్రజలూ కోసం కాదన్నమాట. దేనికైనా ఓ హద్దూ అదుపూ ఉండాలి.
అతనికి ఆ వందోదేదో వచ్చేస్తే దేశం బయటకు వెళ్ళినప్పుడు, మనం సరదాగా అప్పుడప్పుడు matches నెగ్గడం అలవాటు చేసికుంటే బావుంటుందేమో? ఇప్పటికి, వరసగా ఆరోది తగలేసికున్నాము. ఏమైనా అంటే, ప్రపంచంలో మొన్న మొన్నటిదాకా మనమే కదా నెంబరు వన్నూ అనోటి. అదికూడా మూణ్ణాళ్ళ ముచ్చటే అయింది. వాళ్ళు ఎలా తగలేసినా వాళ్ళకిచ్చే ఫీజులు తగ్గవూ. నెగ్గితే ఏమిటి నాలుగో రోజుకి మూటా ముల్లె కట్టేస్తే ఏమిటి? పైగా ఇంకోటీ, మన target అతని వందో సెంచరీయే. అతను ఔట్ అవగానే మిగిలినవాళ్ళు కూడా లైన్లో వచ్చేస్తారు అదేం చిత్రమో! ఇంక మన so called cool Captain గారి ఉవాచ : “”We have lost the chance of winning the series but still with two more Test matches to go we can level the series so that’s what we’re looking to do.” వహ్వా వహ్వా! ఏమిటో ఎప్పుడు మనవాళ్ళు బయటకెళ్ళి నెగ్గడం ప్రారంభిస్తారో. అదేదో జింబాబ్వే ఏదో ఉందిట, అక్కడకి వెళ్తే ఏమైనా నెగ్గుతామేమో ఓ సారి మనవాళ్ళకి చెప్తే మంచిదేమో!

    పైగా ఎవరిని కలిసినా ఇదేమాట, అయ్యొ పాపం ఈసారికూడా చేయలెకపోయాడండీ అని.చేస్తే మీకేమైనా ఆస్థి రాసిస్తాడా అని అడిగితే, ” మీకు అసలు క్రికెట్ గురించేమైనా తెలుసునా, అయినా మీతో మాట్టాడ్దం నా బుధ్ధితక్కువ..” అన్నవాళ్ళూ ఎదురయ్యారు. ఎవరిని చూసినా ఇదే గోల! అందుకే ఈ విషయం National Obsession అయిపోయిందన్నాను. అపుడెప్పుడో అన్నా సాహెబ్ గారు ఉపోషం అదీ అన్నారు. మరి ఏమయ్యిందో ఏమిటో ఇక్కడే పూణే లో హాస్పిటల్ లో రెస్టు తీసికుంటున్నారు.

    Cricket గురించి మాట్టాడొద్దనీ, corruption కొనసాగనీయమనీ అనడం లేదు. పేపర్లలోనూ, టి.వీ.ల్లోనూ హడావిడి చేస్తే సచిన్ వందో సెంచరీ చేస్తాడా, లేక corruption ఆగిపోతుందా? దేశంలో ఉన్న 120 కోట్ల జనాలకీ కావలిసినన్ని సమస్యలున్నాయి, ఈ పైనచెప్పిన రెండింటి కంటే. ఒక్కడంటే ఒక్కడు మాట్టాడ్డు. ఇంక మన రాజకీయ నాయకులైతే really great, ఇక్కడ పూణె లో వచ్చే నెలలో కార్పొరేషన్ కి ఎన్నికలు లెండి. ఆ కార్పొరేటర్లు అయిదేళ్ళనుండీ ఉంటున్నారు. కిందటి ఎన్నికల్లో ఏవేవో ప్రామిస్సులు చేసేరుకదా, ఏదీ గుర్తుండదు. పాపం వాళ్ళని మాత్రం ఏం చేస్తాం లెండి, వాడి స్వ సంపాదనే చూసుకుంటాడా, లేక మన వార్డుల్లో ఉండే సమస్యలే చూస్తాడా? సడెన్ గా కొత్త ఎన్నికలొచ్చేస్తాయి. ఏమిట్రా అప్పుడెప్పుడో ఏదేదో చేసేస్తామన్నావు, ఏమయిందీ అని అడగండి, అందరికీ ఒకటే సమాధానం–” Election Code ” ఎన్నికలు ప్రకటించిన తరువాత ఎటువంటి ఉపయోగకరమైన పనీ చేయకూడదుట అందుకోసం ఆగవలసొచ్చింది కానీ, లెకపోతేనా….. ఇదో పేద్ద జోక్కూ! అది పంచాయితీ అనండి, కార్పొరేషన్ అనండి, అసెంబ్లీ అనండి, పార్లమెంటనండి ప్రతీ సారీ చివరి నెలరోజుల్లోనూ గుర్తొస్తారు. అప్పుడేమో Election Code ఆయే !

    ఏమిటో బ్లాగుల్లో వ్రాస్తే పన్లవుతాయా! నాగ్గూడా ఇదో Obsession ఏం చేయనూ? ఎవడి గోల వాడిదీ…

Advertisements

7 Responses

 1. ఈతరహా పిచ్చోళ్ళలో నాస్నేహితులు కొందరున్నారులెండి. ఇండియా అనేకాకుండా ఎవడు టెస్టుమ్యాచ్ ఆడినా వీళ్ళు “క్రిక్కిన్‌ఫో” సైటుని క్లిక్కుతుంటారు. ఇహ మొన్నైతే సచినుచేస్తాడా చెయ్యడా అని ఆసుత్తి మ్యాచ్‌ని ఆడినన్నాళ్ళూ చూశారు.

  Like

 2. మీ కొక విషయం అర్ధమైనట్లు లేదు. మనం ఆస్ట్రేలియాతో టెష్టు సీరీస్ ఆడుతున్నదే సచిన్ మహాశయుడి వందవ శతకం కోసమే నాయె. ఒకే మేచ్ అంటే బాగుండదూ, పైగా ఒకే టెష్టులో చెయ్యటం ప్రతిపక్షం కుట్రవలన కుదరకపోవచ్చునూ అని చెప్పి యెందుకైనా మంచిదని నాలుగో అయదో టెష్టులు పెట్టారట. పైగా ఒకే మాచ్ పెట్టి సీరీస్ అంటే బాగుండదేమో అని కొంచెం మొగమోట పడ్డారట కూడా. ఇది తెలియక కొంత మంది పిచ్చి జనం మన మేదో యేమంత పెద్దగా విలువలేని గెలుపుల కోసం ఆడేస్తున్నామనుకుని తెగ బాధపడిపోతున్నారు!

  Like

 3. అంతా బాగానే ఉంది మాష్టారు. దేశం లో ఒక్క హీరో ని చూపించండి. ఏ రంగం లో నైనా, రాజకీయాలు, సైన్స్, సోషల్ వర్క్, లిటరేచర్ etc. కనీసం నాకు ఎవరూ కనిపించటం లేదు. నా పరిధి తక్కువ ఒప్పుకుంటాను. మీరు చెప్పండి.

  సచిన్ అంటే అభిమానించే వాళ్ళలో నేను ఉన్నాను. ఒక హీరో అయ్యే అవకాశాలు సచిన్ కే ఉన్నాయి.క్రీడా రంగం లో. ఈ దేశం లో అతనొక్కడే హీరో అనిపిస్తుంది నాకు. 22 ఏళ్లగా నిబద్ధ్త తో ఆడుతున్నాడు. క్రికెట్ కే అంకితమయ్యాడు అనిపిస్తుంది నాకు. నేను కూడా బహుశా ఒక పిచ్చివాడిని అని మీరు అనుకోవచ్చు.

  100వ శతకం అంటారా చేస్తాడు. చేయలేక పోవచ్చు. It is another record. అంతె.

  But Sachin is sachin. ఎవరూ అతని దరిదాపులలో లేరు.

  అన్నట్టు ప్రతీ మనిషికి ఏదో ఒక పిచ్చి ఉంటుంది. కొంతమంది కి, పుస్తకాలు, రాజకీయాలు, కొంతమందికి విమర్శించడం etc. నాకు క్రికెట్ పిచ్చి. ఏం చెయ్యమంటారు?

  Like

  • “అంతా బాగానే ఉంది మాష్టారు. దేశం లో ఒక్క హీరో ని చూపించండి.”

   గురువు గారూ మీరు మన సుమన్ బాబుని మరచిపోతున్నారు.:)))

   Like

 4. >>ఏదో ఈసారైనా అదేదో చేసేస్తే ఓ పీడా వదిలేది. అంతదృష్టం కూడానా మనకి! ఆయన ఆ వందో సెంచరీ చేయనూ చేయడూ, మనకి ఈ గోలా తప్పదూ! >>

  భలే భలే… మీరెంత బాగా రాశారో! స్పోర్ట్స్ కాలమ్స్ లో ఈ ‘చారిత్రక సందర్భం’ పై కర్టెన్ రైజర్ల హడావుడిని ఎప్పటినుంచో చూస్తున్నా. వందో సెంచరీ చిన్నాచితకా స్టేడియంలో చేస్తే ఏం బాగుంటుందీ… ‘గొప్ప’ స్టేడియంలో చేస్తేనే ఘనతట. ఆట కంటే రికార్డులే ప్రధానమైపోవటమే ఈ గోలంతటికీ కారణం. మొత్తానికి అంతా కలిసి ‘క్రికెట్ దేవుణ్ణి’ ఒత్తిడితో తెగ ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు. (సచిన్ కాకుండా మరొకరయితే ఈ మహా ఒత్తిడిని అసలు తట్టుకునేవారే కాదట!)

  అంతా కలిసి క్రికెట్ దేవుణ్ణి పాపం ఎంతగా ఒత్తిడి పెట్టేస్తున్నారో కదా!

  Like

 5. మీ బ్లాగు చదవడం మాకో Obsession

  Like

 6. @ఇండియన్ మినర్వా,
  థాంక్స్..

  @శ్యామలరావు గారూ,

  జనాలే కాదు, మీడియా కూడా ఇదే పిచ్చిలో పడింది..

  @సుబ్రహ్మణ్యం గారూ,

  ప్రతీవారికీ ఎవరో ఒక “హీరో” ఉంటారు. అందులో అంత విశేషమేమీ లేదు. కానీ, అతని వందో శతకాన్ని గురించి అంత హడావిడి, రాత్రీ పగలూ అవసరమంటారా? పైగా ఈమధ్యన వాడెవడో, ఇతన్ని ఓ మనస్థత్వ కన్సల్టెంటు దగ్గరకు కూడా వెళ్తే బావుంటుందంటున్నాడు !!

  @శంకరా,

  అదేదో బులుసు వారినుద్దేశించిందనుకుంటా…

  @వేణూ,

  ఔనుకదూ…

  @మాధవీ,

  ఇదేదో వినడానికి బాగానే ఉంది! థాంక్స్..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: