బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– బుల్లి.. బుల్లి.. సంతోషాలు..


The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

Madison Square Garden can seat 20,000 people for a concert. This blog was viewed about 64,000 times in 2011. If it were a concert at Madison Square Garden, it would take about 3 sold-out performances for that many people to see it.

Click here to see the complete report.</p

    వయస్సు వచ్చిన తరువాత మనకి వచ్చే ప్రశంసలకన్నా పిల్లలకి వచ్చేవాటిమీద ఆసక్తి ఎక్కువైపోతుంది. మన ప్రోగ్రెస్ back bench లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ బాధ్యతలన్నీ తీరి, వానప్రస్థం లోకి వచ్చినప్పుడు అనుకుంటాము. మళ్ళీ చిన్నతనం లోకి వెళ్ళిపోతే ఎంత బావుంటుందీ అని. అప్పటి మధుర జ్ఞాపకాలు అవేనండి, పెన్సిళ్ళూ, సోప్ బాక్సులూ, కంపాస్ బాక్సులూ గుర్తుచేసికోడం! వయస్సు వచ్చిన తరువాత మనకి వచ్చే ప్రశంసలకన్నా పిల్లలకి వచ్చేవాటిమీద ఆసక్తి ఎక్కువైపోతుంది. మన ప్రోగ్రెస్ back bench లోకి వెళ్ళిపోతుంది. మళ్ళీ బాధ్యతలన్నీ తీరి, వానప్రస్థం లోకి వచ్చినప్పుడు అనుకుంటాము. మళ్ళీ చిన్నతనం లోకి వెళ్ళిపోతే ఎంత బావుంటుందీ అని. ! చిన్నప్పుడు ఎప్పుడైనా చిన్న చిన్న ప్రైజులు– అది ఓ పెన్సిల్ కావొచ్చు , ఓ సోప్ బాక్స్, ఓ కంపాస్ బాక్స్ కావొచ్చు, అదీ ఇదీ అని లేకుండా, గుండెలకి హత్తేసికుని, ఊరంతా చూపించుకోడం లో ఉన్న ఆనందం ఎంతో విలువైనది. ఇంక మన తల్లితండ్రులు కూడా, " మా అబ్బాయికి స్కూల్లో ప్రైజొచ్చిందండీ" అని అడిగినవాళ్ళకీ, అడగనివాళ్ళకీ చూపించేసికోడం ! రిక్షా వాడి దగ్గరనుంచి, పాలు పోసేవాడిదాకా అందరూ ఈ “హింస” కి బలైపోయేవారు. గుర్తుండే ఉంటుంది.

   అలాటిది 68 ఏళ్ళొచ్చిన తరువాత, జీవితంలో మొదటిసారిగా ప్రైజొచ్చిందంటే, ఎంత చిన్నదైనా అందరికీ చెప్పుకోవాలనుంటుంది కదా! ఈ గోలంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, నాకైతే ఎప్పుడూ ప్రైజులొచ్చిన గుర్తు లేదు. నా చదువే అంతంతాయిరి!దానికి సాయం ప్రైజులుకూడానా! No way.. అయినా వస్తే బావుండునూ అనుకోడం లో తప్పు లేదుగా. ప్రతీ ఆదివారం ETV2 లో “తెలుగువెలుగు” అని ఓ కార్యక్రమం వస్తూంటుంది. దాంట్లో ఓ “ప్రశ్న” ఇస్తూంటారు. దానికి జవాబు కరెక్ట్ గా వ్రాస్తే వాళ్ళకి ఓ ప్రైజు కూడా ఇస్తారుట. నేను ఈ కార్యక్రమం ప్రతీ వారం తప్పకుండా చూస్తూంటాను. పోనీ వాళ్ళిచ్చే ప్రశ్నకి జవాబు ఎస్.ఎం.ఎస్. చేస్తే ప్రైజురావొచ్చేమో అని అనిపించేది. ఆమాత్రం తెలివితేటలే ఉంటే గొడవే ఉండేది కాదుగా. అది లేకేకదా… కిందటివారం ఓ ప్రశ్న ఇచ్చారు. ఏమైనా సరే ఈసారి పంపించేయాలీ అనుకున్నాను. మహ అయితే ఏమౌతుందీ, లాటరీలో మన జవాబు సెలెక్ట్ చేయలేదూ అనుకోడం. ఎవరితోనైనా చెప్తే కష్టం కానీ, ఈ విషయం అసలు ఎవరితోనూ చెప్పకపోతే అసలు గొడవే ఉండదూ. కానీ అంత అదృష్టం కూడానా, మొన్నెప్పుడో, మా లైబ్రరీలో పని చేసికుంటుండగా ఓ ఫోనొచ్చింది. ” మీరు క్రితంవారం తెలుగు వెలుగు ప్రశ్నకి జవాబు పంపారా” అంటూ. ఔనూ అని చెప్పి, సంగతేమిటీ అని అడిగితే, మీ జవాబు సెలెక్ట్ చేశాము, మీ ఎడ్రస్ ఇవ్వండీ, ప్రైజు పంపాలీ అని. వామ్మోయ్ వెంటనే ఇంటావిడకి ఫోను చేసి చెప్పేశాను ఇదీ విషయం అని. నాకు తెలియకుండా అసలు మీరెప్పుడు పంపారూ, అదన్నమాట విషయం, ఇంకా ఏమేం చేస్తున్నారో అంటూ మసలా లేని చివాట్లేసిందనుకోండి. కానీ ఈవేళ 11.55 కి “తెలుగువెలుగు” కార్యక్రమం లో తెరమీద నా పేరు చూసిన తరువాత మొత్తానికి నమ్మిందిలెండి.

   అలాగే WordPress.com వాళ్ళదగ్గరనుంచి ఓ మెయిల్ వచ్చింది. 2011 లో నేను బ్లాగులోకంలో చేసిన నిర్వాకం. అందులో వాళ్ళువ్రాసిన —” If it were a concert at Madison Square Garden,it would take about 3-sold out performances for that many people to see it.” అన్నది చదవడానికి బావుంది. ఇంతమందినా నేను హింసిస్తున్నదీ అని బాధా వేసింది!

   ఏది ఏమైనా ఇలాటి బుల్లి బుల్లి… సంతోషాలేకదా గుర్తుండేవి! అందరికీ అనిపించొచ్చు ” ఏమిటో ఈయన ఉబలాటం, అక్కడికేదో పద్మ ఎవార్డ్ వచ్చినంతగా సంతోష పడిపోతున్నాడూ అని. నా ప్రాణానికి ఇలాటి సంతోషాలు చాలు

    HAPPY NEW YEAR TO ALL MY BELOVED READERS…

14 Responses

  1. Happy new year and wishing you and your family a great year ahead. Expecting the same flow in 2012 too from you. Apologies for commenting in English.

    Like

  2. నూతన సంవత్సర శుభాకాంక్షలు…

    Like

  3. congrats anDi .
    మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు .

    Like

  4. 2012 లో మీకు ఒక సంవత్సరంలోనే లక్ష కు పైగా వెన్నుతట్లు రావాలని కోరుకుంటున్నాను.

    Like

  5. CONGRATULATIONS. I AM REALLY PROUD OF YOU.WISH YOU AND YOUR FAMILY VERY VERY HAPPY NEW YEAR

    Like

  6. బాగున్నాయండీ! హేపీ న్యూ ఇయర్!! 🙂

    Like

  7. బాగుంది, బాగుంది… మీకూ నూతన సంవత్సర శుభాకాంక్షలు..

    Like

  8. జీవితం లో ఎక్కడా ఎప్పుడూ నేను 1st. రాలేదు. ఇప్పుడు మీ బ్లాగులో కామెంటేటర్స్ లిస్ట్ లో 70 కామెంట్ల తో మొదటి స్థానం సంపాదించాను. ఇంత కష్టపడి నేను కామెంట్లు పెట్టినందుకు మీరేమి బహుమతి ఇస్తారు?

    మీరు ఇల్లాగే నూతనోత్సాహంతో మరెన్నో టపాలు వ్రాయాలని కోరుకుంటున్నాను.

    నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    నూతన

    Like

  9. {P} hani, I am so ‘Mad’ (about your blog) ఈ ‘sun’ you know !!

    Ur blogging is like ‘sing’ a song!

    Happy New Year sir.

    cheeers
    zilebi.

    Like

  10. బాబాయ్ గారూ.. మీకు మీ కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు.

    అదిగో చూసారా.. తెలియకుండానే కామెంట్లిచ్చేవాడిలో నాలుగోవాడినయ్యానంట. మీకున్న “బుల్లి.. బుల్లి ఆనందాలు”.. లాగానే నాకూ ఇది భలే ఆనందాన్నిచ్చింది.
    ఇదొక వ్యసనం అయిపోయింది.. మీ బ్లాగుకు మమ్మల్ని బానిసలుచేసేసారు. ఇంతకుముందు చెప్పినట్టుగానే బ్రౌజర్ ఎడ్రస్ బార్లో “హెచ్” అని కొట్టి ఆటోమేటిగ్గా వచ్చే లింకుపై నొక్కి నవ్వుతూనే మీ బ్లాగ్ ఓపెన్ చేస్తుంటాను. ఆఫీసులో వీలున్నప్పుడల్లా నేనుచదివే ఏకైక బ్లాగు మీదే..:) ఇలానే ఈ కొత్త సంవత్సరంలో కూడా ఇంకా బానిసలు చేస్తారని ఆశిస్తున్నాను.

    Like

  11. ప్రైజ్ కొట్టేశారు, అదృష్టవంతులు. మరి పార్టీ ఎప్పుడిస్తున్నారు? 😀

    Like

  12. అభినందనలు మరియూ నూతన సంవత్సర శుభాకాంక్షలు 🙂

    Like

  13. Hearty congratulations sir….

    Like

  14. @ఋషీ,

    థాంక్స్..

    @లక్ష్మిగారూ,

    ధన్యవాదాలు.

    @మాలాకుమార్ గారూ,

    థాంక్సండి..

    @మోహన్ గారూ,

    వామ్మోయ్ అన్నే !!!

    @కొత్తావకాయ,

    థాంక్స్..

    @సుబ్రహ్మణ్యం గారూ,

    అదే ఆలోచిస్తున్నానండీ ! ఇదేదో ఎదురు కట్నం ఇచ్చుకుని సన్మానం చేయించుకున్నట్టుంటుందని ఆలోచిస్తున్నాను…

    @జిలేబీ,
    A BIG THANK YOU

    @శ్రీనివాసా,

    మీరందరూ పెట్టే వ్యాఖ్యలే కదా నాకు టానిక్కూ !!

    @Snkr,
    పార్టీ అంటూ ఇస్తే మిమ్మల్నే మొదట ఆహ్వానించేది…

    @వేణూ శ్రీకాంత్,
    ధన్యవాదాలు..

    @హంసా,
    థాంక్స్..

    Like

Leave a comment