బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–కాలక్షేపం…


   ఏమిటో ఈమధ్యన నా మిస్టరీ షాపింగులతో బిజీ బిజీ.. అయిపోతున్నాను. క్రిందటి 15 రోజుల్లోనూ అయిదు చేశాను. పాపం వాళ్ళు కూడా ఇదివరకు చేసినవాటికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుండబట్టి, నాకూ చేయడానికి ఏమీ అభ్యంతరం ఉండడం లేదు. అదో కాలక్షేపం. ఈ మిస్టరీ షాపింగు వ్యవహారం ఎక్కడిదాకా వచ్చిందంటే, నేను ఎప్లై చేయకపోయినా, వాళ్ళే ఓ ఫోను చేసి, ఎలాగోలాగ చేసేయండీ అంటున్నారు!

   ఆ సందర్భం లోనే మొన్నెప్పుడో ట్రావెల్ ఏజన్సీ ఎస్.ఓ.టి.సి కి నాలుగో సారి వెళ్ళవలసివచ్చింది. మర్నాడు ఫోను చేసి, అదేదో వీసా ప్రాసెసింగ్ సెంటర్ వి.ఎఫ్.సి కి వెళ్ళమన్నారు. నాదేం పోయిందీ, 500/- ఇస్తూంటే! అక్కడకెళ్ళి డుబై వెళ్ళడానికి వీసా ఫార్మాలిటీస్ కనుక్కోవాలిట. సరేఅనీక్కడకి వెళ్తే, వాడడిగిన మొదటి ప్రశ్న అసలెందుకు వెళ్ళాలనుకుంటున్నారూ అని. ఏం లేదూ ఓసారి దావూద్ ని చూసొద్దామనీ, లేకపోతే వాడికెందుకూ అసలు. తిన్న తిండరక్క వెళ్తున్నానూ, నా పాస్ పోర్టూ, నేనూ expire అయ్యేలోపల ఓ సారి దాంట్లో స్టాంప్ వేయించుకుంటే బాగుంటుందీ అందుకోసమనీ అనేటప్పటికి, వాడు నవ్వలేక నవ్వలేక తిప్పలు పడ్డాడు! ఇలా ఉంటాయి నా వ్యవహారాలు. ఏదో కావలిసిన సమాచారం ఇచ్చాడూ, వాటిని మా వాళ్ళకి పంపేశాను.ఏమైనా దుబై వెళ్ళానా పెట్టానా! అదో సరదా. ఇంకోళ్ళెవరో సగం సగం తెలిసిన మహాశయులు మనకి చేసే జ్ఞానబోధలు వినఖ్ఖర్లేకుండా, మనమే తెలిసికుంటే బావుంటుంది కదూ!

   ఇంతలో మళ్ళీ ఫోనూ-ESPRIT కి వెళ్ళమని. ఇప్పటికే ఊళ్ళో ఉన్న మూడు outlets చేశాను. ఈసారి ఇంకోటి మిగిలిపోయిందిట, అదేదో ఎమనోరా ( హడప్సర్) లో ఉంది.ఓ 2000/- దాకా ఖర్చుపెట్టుకోమన్నారు, ఇంక నాకు అదుపేముంటుందీ. ఏదో మా ఇంటావిడకి ఓ హ్యాండ్ బ్యాగ్ కొందామనుకున్నాను. ఇంతలో ఓ క్యాప్ కనిపించింది. పెట్టుకుని చూస్తే సరీగ్గా సరిపోయింది. పైగా అద్దం లో చూసుకుంటే, మొహం కూడా తమాషాగా కనిపించింది. పైగా అలాటిది ఎప్పటినుంచో తీసుకోవాలని ఓ కోరికోటీ.ఊరికే కూర్చుని అంతంత డబ్బులు తగలేయడానికి, మనకేమైనా ఇస్టేట్లున్నాయా ఏమిటీ?ఆ టోపీ ఖరీదు అక్షరాలా 1690/- రూపాయలు. ఎవరో ఇస్తున్నప్పుడు కొనుక్కోవడానికి ఏం రోగం? ఇంటావిడ బ్యాగ్ క్యాన్సిల్.. కానీ అది పెట్టుకున్న తరువాత మా వాళ్ళందరూ బాగానే ఉందన్నారు. ఫొటో పెట్టాను. మీరూ ఓ సారి చూడండి!. కానీ తిడితే మాత్రం ఊరుకోను!

   అక్కడకి దగ్గరలోనే ఉన్నారు కదా అని మా టెండర్ లీవ్స్ మెంబరు ఓ తెలుగావిడని పోనీ కలుద్దామా అనుకుని ఫోను చేశాను. చెప్పానుగా నా సెల్ లో ఏదో ఫోను నెంబరు నోట్ చేసికుని, ఏదో పేరు వ్రాసేసికుంటాను. పేరు తప్పూ అని కలిసిన తరువాతే కదా తెలిసేదీ. ఇప్పుడూ అంతే! ఫోను చేసి మీరు ఫలానాఏనా అన్నాను. మీరు మా గ్రంధాలయంలో మెంబరు కదా అన్నాను. అంతా రైటేనండీ కానీ నా పేరు ఫలానా లక్ష్మి కాదూ, ఇంకో లక్ష్మీ అన్నారు. ఏ లక్ష్మైతేనేమిటీ, ఓసారి మిమ్మల్ని కలుస్తానూ అభ్యంతరం లేకపోతే అన్నాను. పాపం ఆవిడమాత్రం ఏం చేస్తారూ, నెత్తిమీద కూర్చుంటే, ఏదో ఒకటీ అనుకుని వాళ్ళింటికి చేరాను. ఓసారి పరిచయం అవ్వాలే కానీ, కబుర్లకేమిటి లోటూ? పాపం ఆవిడకి బోరుకొట్టేసుంటుంది. ఏం చెయ్యను చెప్పండి, మాట్లాడడం మొదలెడితే హద్దూ అదుపూ ఉండదు! ఓ ప్లేట్ లో బాలుషాహి, మినపసున్నుండా ఇచ్చారు. మరీ అన్నీ తినేస్తే బావుండదని ( అప్పటికి చచ్చే ఆకలేస్తోంది), మొహమ్మాటానికి ఓ మినపసున్నుండ , మరీ నోట్లో కుక్కేస్తే బాగుండదని, సుతారంగా ముక్కలు చేసికుని మరీ తినడం మొదలెట్టాను. పాపం వాళ్ళ సోఫా నిండా ఆ పొడి పడుంటుంది! చీమలు పడితే నన్ను తిట్టుకుంటారు! ఇప్పుడు నేర్చుకున్నదేమిటంటే, ఎవరైనా మినపసున్ని లాటిది పెడితే, ఓ ప్లేటులో విడిగా వేసికుని తింటే, వీధిన పడమూ అని! అదండీ విషయం…

Advertisements

10 Responses

 1. 🙂 mee cap chala bavundandy..

  Like

 2. cap bavundi. maree anta cost vunnaya caps?

  Like

 3. You are looking like legendary music director O.P.Nayyar.

  Like

 4. బాబయ్యోయ్ ,
  గ్రెగరీ పేక్ (Gregory Peck) లాగా ఉన్నావు !
  హాలివుడ్ వాళ్ళు తలుపు కొడుతున్నారు జాగ్రత్త 🙂

  Like

 5. బోర్లించుకున్న పూలకుండీ అచ్చం ఇంగ్లీష్ టోపీలా వుంది, అచ్చు షెర్లాక్ హోంలా కనిపిస్తున్నారు, బాగుంది. 🙂

  Happy New year బాతా-ఖాని లక్ష్మిఫణి గారు.

  Like

 6. నాకేమిటో జెఫ్రీ బాయ్ కాట్ లాగా కనిపిస్తున్నారు.

  ఊరుకోనన్నారుగా అందుకని ఏమి మాట్లాడను.

  మీకు మీ కుటుంబ సభ్యులందరికి కొన్ని గంటలు ముందుగా

  నూతన సంవత్సర శుభాకాంక్షలు

  Like

 7. @స్వాతీ,

  థాంక్స్..

  @రవి,
  అదే బయట అయితే చాలా తక్కువలో వచ్చి ఉండేది. డబ్బులు మనవి కావుగా, ఎంత ఖరీదైతే ఏమిటీ?

  @శ్రీకాంత్,

  వహ్వా…

  అరుణ తల్లీ,

  @అందుకే ఎవరైనా వచ్చేరేమో అని ప్రతీ రోజూ వెయిటింగే….

  @Snkr,
  ఇంక వాట్ సన్ ఒకడే తరవాయి….

  @సుబ్రహ్మణ్యం గారూ,

  థాంక్స్…

  Like

 8. మీరు బాగున్నారండీ ఆ కాప్ పెట్టుకుంటే…
  కాప్ పెట్టుకోకపొతే బాగోనా అని మాత్రం అడగొద్దు….. 🙂

  మరి మిగిలిన 350తో పిన్నిగారికి ఏదో ఒకటి కొనివ్వొచ్చు కదా….

  ఈ మిస్టరీ షాపింగు అంటే ఏంటో ఎప్పుడైనా టపా రాసేస్తే నేను మిస్ అయ్యానా
  లేదంటే కాస్త రాయండీ మా పెద్దవారికి కూడా కాస్త కాలక్షేపం అవుతుంది కదా అని….
  అవునూ ఇంతకీ ఇది ఆంధ్రాలో ఉందాండీ…?

  వెబ్సైటు లాంటిదుంటే ఇవ్వగలరు…

  Like

 9. మాధవీ,

  టోపీ పెట్టుకోనప్పుడు ఆద్వానీలా ఉన్నానన్నారు ఇక్కడివాళ్ళు. ఇంక టోపీ పెట్టుకున్న తరువాత చూశావుగా ఏమేం అంటున్నారో? ఇంక మిస్టరీ షాపింగులంటవా, రెండు టపాలు వ్రాశాను. అయినా వాటి లింకులు మళ్ళీ ఇస్తున్నాను. ఆంధ్రదేశంలో కూడా ఇవి చేయొచ్చు. ఇదివరకు భాగ్యనగరానికి మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు టూ టియెర్ టౌన్లకి కూడా విస్తరించారు.

  1) http://www.onioninsights.info/index.norm.php

  2) http://www.bareinternational.com/

  Like

 10. ఆ టపాలు నేను మిస్సయ్యినట్టు ఉన్నాను……
  చాలా థాంక్స్ అండీ….

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: