బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– విని విని విసిగెత్తిపోయింది….


Pune Newsline

    పైన Pune Newsline అని ఒక పి.డి.ఎఫ్ పెట్టాను. ఈమధ్య నేను పనిచేసి రిటైరయిన ఫాక్టరీలో ఒక దుస్సంఘటన జరిగి, అందులో ఒక వర్కర్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఇలాటి accidents అవవని కాదూ, కానీ వాటిని prevent చేయడానికి మానేజ్మెంట్ ఎంత జాగ్రత్త తీసికుంటోందో అనేది ఇక్కడ ప్రశ్న. ఇలాటివి ఎక్కడ జరిగినా, మెడమీద తలున్న ప్రతీవాడూ చెప్పేదొకటే!It is very unfortunate. We would make every effort to prevent recurrance of such accidents, blah..blah... పైన ఇచ్చినదీ అలాటిదే. ఇక్కడ తేడా ఏమిటంటే, అదే Organisation లో నేను దాదాపు 42 సంవత్సరాలు పనిచేసి, అందులోనూ 20 సంవత్సరాలు, Safety సెక్షన్ లోనే పనిచేశాను. అందువలన నేను వ్రాసేదానిలో కొంతైనా content ఉంటుంది. అక్కడికేదో నేను గొప్ప expert అని చెప్పుకోనుకానీ, నా ఉద్యోగ రీత్యా నేను పడ్డ కష్టాలు,ప్రత్యేకంగా implementing safety standards, ఎలా ఉంటాయో, అందరిదగ్గరనుండీ, ఎలాటి రెసిస్టెన్స్ ఉంటుందో చెప్పాలనే ఈ టపా.

    నేను నా ఉద్యోగం ప్రారంభించింది High Explosives Factory. లో. అక్కడ అసలు ఈ సేఫ్టీ అంటే ఏమిటో తెలుస్తుంది. మనమాటెలాగున్నా, పక్కవాడు తప్పు చేసినా చాలు, వాడితోపాటు మనమూ గోవిందో గోవిందా!! దానితో అక్కడ పనిచేసిన ప్రతీవాడూ, జనరల్ మేనేజర్ నుంచి, కింద పనిచేసేవాడివరకూ అందరూ జాగ్రత్తగానే ఉండేవారు. నరనరాల్లోనూ, ఇదే మంత్రం. దీనివలన మాకు జీవితం లో ఓ డిసిప్లీన్ అనేది కూడా వంటబట్టింది.అక్కడున్న 20 సంవత్సరాలూ సేఫ్టీ సెక్షన్ లోనే పనిచేశాను. ఆ తరువాత, ఓ ఫిల్లింగ్ ఫాక్టరీ కి బదిలీ చేశారు.అక్కడి పరిస్థితులు చూస్తే కళ్ళు తిరిగిపోయాయి. పోనీ ఏదో కొద్దిగా తెలుసును కదా అని జగ్రత్తలు చెప్పడం ప్రారంభించేసరికి, ఇంకో సెక్షన్ కి మార్చేశారు. కారణం, నేను చెప్పే జాగ్రత్తలు వాళ్ళకి చాదస్థంగా కనిపించాయి.మేనేజ్మెంట్ కేమో, ఒకటే ధ్యాస–meeting production targets. To hell with safety. మరి అవ్వా కావాలి బువ్వా కావాలంటే కుదరదుగా! ఆ ఫాక్టరీలో 15 సంవత్సరాలు పనిచేసి, ఇంకో ఫిల్లింగ్ ఫాక్టరీకి వచ్చాను. వచ్చిన కొత్తలో జరిగిన ఓ సంఘటన చెప్తాను–

    ఓ చోట ఓ వర్కర్ కి యాసిడ్ మీదపడి, చేతులూ, మొహమూ కాలాయి. మా మానేజ్మెంట్ అదృష్టం బాగోక, దాని ఇంక్వైరీకి నన్ను వేశారు. నా దారిన నేను ఇంక్వైరీ చేసి నా రిపోర్ట్ వ్రాశాను.మావాళ్ళకి నచ్చలేదు, మార్చమన్నారు నేను మార్చనూ అన్నాను. నన్నుతీసేసి ఇంకోడికిచ్చారు.కారణం మరేమీ లేదు, ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో, అక్కడ పేరుకి మాత్రమే, safety equipment పెట్టారు కానీ, వాటిగురించి చెప్పే దిక్కే లేదు.ఉండవలసినsafety equipment చాలామట్టుకు లేనేలేవు.మరి ఇలాటివన్నీ రిపోర్ట్లో వ్రాస్తే, ఆ సేఫ్టీ ఆఫీసర్ కి, జనరల్ మేనేజర్ చేతిలో చివాట్లు పడతాయిగా మరి, అందుకోసమన్నమాట మార్చడం! అలా ఉంటాయి తూతూమంత్రాలు.

    అసలు వచ్చిన గొడవల్లా, కెమికల్స్ వాడే చోట, అందులో ప్రవేశం ఉన్నవాడిని వేయాలి కానీ, ఓ ఆర్ట్స్ వాడినో, మెకానికల్ వాడినో వేస్తే ఇదిగో అలాగే ఉంటాయి మరి.ట్రైనింగ్ అనేది ఇవ్వాలి. 42 సంవత్సరాలూ, మేము పనిచేసిన ఫాక్టరీల్లో , ప్రొద్దుటే వెళ్ళి సాయంత్రానికి కొంప చేరేమంటే, దానిక్కారణం ఇంటి ఇల్లాళ్ళ తాళి బొట్టు గట్టితనం! అంతేకానీ, ఏవేవో జాగ్రత్తలు తీసేసికుంటున్నారని కాదు! ఇలావ్రాయడం బాగోలేదు, కానీ ఉన్నదేదో చెప్పాలిగా!ఎక్కడ చూసినా ఇదేపరిస్థితి.చల్తాహై…

    అందుకే పైన( పిడిఎఫ్) లో వ్రాసింది చదవగానే నవ్వాలో ఏడవాలో తెలియలేదు. అంతదాకా ఎందుకూ, హెల్మెట్ పెట్టుకోవాలని గొంతెత్తుకు చెప్తారు, ఎంతమంది పాటిస్తారు? పైగా అదిపెట్టుకుంటే ఓ న్యూసెన్సండీ అంటారు. రూల్స్ పాటించవలసిన పోలీసు వ్యవస్థే దానిగురించి పట్టించుకోనప్పుడు, ఎవడెక్కడికి పోతేనేం…

Advertisements

4 Responses

  1. రెండు మూడేళ్ళ క్రితం మా స్నేహితుడు కాకినాడ ఎరువుల ఫ్యాక్టరీలో గేస్ లీక్ అయ్యి ప్రాణాలు పోగుట్టుకున్నాడు. మేనేజ్ మెంట్ వాళ్ళావిడకి ఉద్యోగం ఇచ్చారు. ఇంకా ఎవో బెనిఫిట్స్ కూడా ఇచ్చారు. కానీ పోయిన ప్రాణం తిరిగిరాదుగా?

    సేఫ్టీ విషయంలో ఆఖరికి టునీషియా అంత చిన్న దేశం కూడా ఇండియా కన్నా బెటరే

    Like

  2. చాలా మంచి టపా. ఇటువంటివనే ఏముంది లేండి. ఎప్పుడైనా పెద్ద పెద్ద భవనాలకి పెయింట్లు వేసే వాళ్ళని చూనినా, ఇటుక బట్టీల్లోనూ, క్వారీల్లోనూ పని చేసే వాళ్ళని చూసినా.. ఇటువంటి ఆలోచనలే వస్తాయి. చాలా మంది సంక్షేమ పథకాలని తాయిలాలనీ, ఓటు బాంకు రాజకీయాలనీ అంటున్నప్పుడు నాకు వాళ్ళే గుర్తొస్తారు.

    చాలా మంది చదువుకున్న వాళ్ళు చెప్పే విధంగా సేఫ్టీ ప్రమాణాలు పాటిస్తే ఆ సరుకులూ, సేవల ధరలూ చాలా పెరుగుతాయి. అప్పుడది మనకి రుచించదు. కాబట్టి కడుపు నిండినోళ్ళు చాలా మంది సాధారణంగా ఇటువంటి వాటి గురించి లిప్ సర్వీస్ మాటలు మాట్లాడుతుంటారు.

    Our development is built on their cheap labour. Since we are not in a position to balance development and their work conditions, it is our responsibility to compensate them to the extent we can.

    I am not trying to criticize or glorify any one section. Just trying to stress the importance of understanding in shaping our thoughts..

    Like

  3. మన దేశంలో ఉన్నన్ని చట్టాలు, రూల్స్ మరేదేశంలోనూ వుండవు, కాని మనం ఆచరణ మాత్రం చేయం, అదంతే

    Like

  4. @noName,

    వచ్చిన గొడవల్లా ఇదేనండి. ఎప్పుడో ఏదో దుర్ఘటన జరిగినప్పుడు మాత్రమే గుర్తొస్తాయి. మళ్ళీ మామూలే….

    @వీకెండ్ పొలిటీషియన్,

    నా టపా నచ్చినందుకు ధన్యవాదాలు. ఏదో ఆపుకోలేక వ్రాసేశాను. కంఠసోష తప్ప ఇంకేమీ లాభం ఉండదు. అదీ తెలుసు…

    @శర్మగారూ,

    నిజమే కదండీ…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: