బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు- మనల్ని బట్టే మన చుట్టూ ఉన్నవాళ్ళూనూ…


PUNE MIRROR

   ఈవేళ పేపరు చదువుతూంటే, ఒక వార్త చదివాను. పైన పెట్టానే Pune Mirror అని దానిమీద ఓ నొక్కు నొక్కండి. మీకే తెలుస్తుంది, ప్రస్తుతం పేద్ద పెద్ద నగరాల్లో ఎలాటి దుస్థితిలో ఉన్నామో! ఈవేళ పూణే లో వాళ్ళకి జరిగింది, రేపో మాపో మనకీ జరగడానికి అవకాశాలున్నాయి. కానీ ప్రస్తుత వాతావరణం లో ఎవరూ ఏమీ చేయగలిగిందేమీ లేదు. ఏదో చేద్దామనున్నా, అందరూ సహకరించాలి కదా.

నేను చాలా సార్లు వ్రాశాను, ఊళ్ళో వాళ్ళ సంగతెలా ఉన్నా, మనం ఉంటున్న కాలనీ/ సొసైటీల్లో అందరూ కాకపోయినా, చివరకి మన బిల్డింగులో ఉన్నవారితోనైనా పరిచయం పెట్టుకుంటే నష్టం ఏమీ లేదు. వాళ్ళేమీ, రోజంతా మన నెత్తిమీద కూర్చుని, మనల్ని ఏమీ దోచేసుకోరు. ఒక్కో బిల్డింగుకీ ఈరోజుల్లో పదికంటె తక్కువ అంతస్థులు ఉండడం లేదు.ఒక్కో అంతస్థుకీ నాలుగేసి ఫ్లాట్టులు. మరీ మనం ఏదైనా high society మనుష్యులమైతే ఫ్లోర్ కీ ఒక్కో ఫ్లాట్. అయినా వాళ్ళ గొడవ మనకెందుకూ? మన సంగతి మనం చూసుకుంటే, ఊళ్ళోవాళ్ళందరి సంగతీ చూసుకున్నంత పుణ్యం. అందువలన ఈ వ్యవహారం, ఆం ఆద్మీ వరకే సీమిత్ చేద్దాం సరేనా?

ఏం చెప్తున్నానూ, సో, బిల్డింగుకీ ఓ నలభై ఫ్లాట్లుంటాయి. మన ఫ్లోర్ లో ఉండే నలుగురితోనైనా పరిచయం చేసికుంటే అసలు నష్టం ఏమిటో తెలియదు. ఇదివరకటి రోజుల్లో, అంటే ఈ ఎపార్ట్ మెంట్లూ గోలా లేనప్పుడు, ఏ ఊరైనా వెళ్ళి, ఫలానా వారిల్లెక్కడా అంటే ఠక్కున చెప్పేవారు. ఖర్మ కాలి మనం ఎక్కడికైతే వెళ్ళేమో, వాళ్ళు ఇంట్లో లేకపోతే, పక్కవాళ్ళు, పిలిచి ఇంటికి తీసికెళ్ళి మర్యాదలు చేసేవారు. ఈరోజుల్లో మర్యాదలూ వగైరా, asking too much అనుకోండి, కనీసం పక్కవాడు తలుపుతీస్తే చాలు, మహద్భాగ్యం లా ఉంది. ఇలాటి రోజుల్లో, వాళ్ళెవరికో ఎవ్వరూ తలుపులు తీయలేదంటే ఆశ్చర్యం ఏముందీ?

ఇప్పటికీ పిల్లలు నగరాల్లో ఉద్యోగరీత్యా ఉంటూ, తాము ఏ పల్లెలోనో, పట్టణం లోనో ఉంటూన్న తల్లితండ్రులున్నారు. పిల్లల్నో, మనవలూ, మనవరాళ్ళనో చూడ్డానికి, నగరానికి వస్తారనుకుందాము. అక్కడ రోజంతా ఎవరో ఒకరి పలకరింపులతో కాలక్షేపం జరిగే, ఈ పేరెంట్స్ కి, ఈ నగర వాతావరణం చూసేటప్పటికి ఠారెత్తిపోతారు. ప్రొద్దుటే కొడుకూ, కోడలూ ఆఫీసులకీ, చిన్న పిల్లలు స్కూళ్ళకీ వెళ్ళిపోతే, ఈ పెద్దాళ్ళు రోజంతా ఏం చేస్తారు? ఆ దిక్కుమాలిన టి.వీ.క్కూడా ఓ హద్దుంటుంది. పోనీ ఎదురుగుండా ఉండేవాళ్ళైనా పలకరిస్తారా అంటే అదీ లేదు. వాళ్ళింట్లోనూ ఓ వయసొచ్చిన దంపతులుంటారు. కానీ వాళ్ళూ “sailing in the same boat”. ప్రొద్దుటే వెళ్ళేటప్పుడు పిల్లలు చెప్పివెళ్తారు, ఊరికే ఎవరు పడితే వాళ్ళకి, బెల్లు కొట్టగానే తలుపు తీసేయొద్దు, ఈమధ్యన దిన్ దహాడే ( పట్ట పగలే) దోపిడీలు జరుగుతున్నాయిట. అసలే మీరు పెద్దాళ్ళూ, ఎవడో వచ్చి పీక పిసికేసినా దిక్కు లేదు!

Thats the bottom line… దిక్కు అనేది… ఎవరు చేసుకోవద్దారమ్మా? అదంతా స్వయంకృతమే కదా! వాడెవడో రాడూ, వీడెవడో రాడూ అని ఏడ్చేకన్నా, ఆ “దిక్కు” ఏర్పరుచుకోడానికి, నీ ప్రయత్నం నువ్వు చేశావా అబ్బే. ఎదురింటి పిన్ని గారితోనో, మామ్మ గారితోనో పరిచయం చేసికుంటే, తనమీద చాడీలెక్కడ చెప్పేస్తోందో అని కోడలికి భయం! పోనీ ఆ పెద్దాయనతో పరిచయం చేసికుందామంటే, ఆయన కొడుక్కీ, ఈయన కొడుక్కీ ఆఫీసులో ఏదో ఒకళ్ళకొకళ్ళు competitors., దానితో ఆ కొడుకూ ఫామిలీ, ఈ ఇంట్లో persona non grata !

పోనీ స్కూలుకెళ్ళే చిన్న పిల్లలతో పరిచయం చేసికుందామా అంటే, వాళ్ళు ఓ స్కూలూ, వీళ్ళ పిల్లలు ఇంకో స్కూలూ, అక్కడ మళ్ళీ స్కూళ్ళలో తేడాపాడాలు- వీళ్ళు చదివేదానికి లక్షల్లో ఫీజులూ, వాళ్ళ పిల్లలు చదివే స్కూల్లో afterall వేలల్లో ఫీజులూ. మరి తేడా ఉంటుందంటే ఉండదూ? మనం ఎక్కడా, వాళ్ళెక్కడా దానితో ఆ పిల్లలూ externed జాతిలోకొచ్చేస్తారు. మనమేమో పిల్లల్ని holidays కి ఏ స్విట్జర్లాండో, యూరోప్పో తీసికెళ్తాము, వాళ్ళేమో పిల్లల్ని ఏ అమలాపురమో, అంబాజీపేటో తీసికెళ్తారు. వాళ్ళకీ మనకీ అసలు పోలికేమిటీ? మనమేమో పిజ్జాలూ, హాంబర్గర్లూ తెప్పించుకుంటాము. మరి వాళ్ళో ఇంట్లో వాసిని పోళ్ళతో సరిపెట్టేసికుంటారు.అంతదాకా ఎందుకూ, వాళ్ళింట్లో ఓ ఫోను కూడా లేదు. ఎప్పుడూ ఏ ఎస్.టి.డి బూత్ దగ్గరో కనిపిస్తూంటారు! ఇంక నెట్ అంటావా, సైబర్ కెఫేలే దిక్కు. ఎవరి స్థాయిలో వాళ్ళుండాలి కానీ, మనూళ్ళో జరిగినట్టు ఇక్కడా జరగాలంటే కుదిరే పనేనా. ఏమిటో మీవన్నీ పాతచింతకాయ ఆలోచనలూ. మీకు తట్టదూ, ఇంకోళ్ళు చెప్తే వినరూ. ఇప్పటి ground rules మారిపోయాయి డాడీ అంటూ జ్ఞానబోధ చేస్తారు!ఇక్కడో disclaimer: మా ఇంట్లో అలాటి గొడవేదీ లేదు! మా అబ్బాయికి ఊరునిండా, బిల్డింగ్ నిండా ఫ్రెండ్సే !!

మరి ఇలాటి వాతావరణం లో ఏదైనా కష్టం వచ్చిందంటే, మన మొహం చూసే వాడు లేడంటే అంత పేద్దగా ఫీలైపోవడం ఎందుకో మరి?

Advertisements

7 Responses

 1. ‘ఎవరికీ వారే ఈలోకం రారు ఎవ్వరు నీకోసం’ –
  పాట మదిలో వినిపించింది!

  Like

 2. ఇప్పుడంతా ఇలాగేకావాలనుకుంటున్నరుమరి. మీరు పాత కాలంవాళ్ళు మరి. ఆయ్! ఉంటానండి.పల్లెటూరి వాళ్ళం కదండీ! ఆయ్! ఎవరో పిలుస్తున్నారు ఉంటానండి.

  Like

 3. భమిడిపాటి ఫణిబాబు గారికి సంకలిని తరఫున జన్మ దిన శుభాకాంక్షలు
  http://www.sankalini.org/

  Like

 4. హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలండీ..

  Like

 5. wish you many happy returns of the day

  Like

 6. many many happy returns of the day… PHANI BABU garu…

  Like

 7. @మోహన్ గారూ,

  ఔను కదూ…

  @అప్పారావు శాస్త్రి గారూ,

  ధన్యవాదాలు..

  @శుభా,

  ధన్యవాదాలు.

  @శర్మ గారూ,

  థాంక్స్..

  @గీతిక,

  థాంక్స్.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: