బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– self discipline…


    ఈవేళ కొల్కత్తాలో జరిగిన అగ్నిప్రమాదం తెలిసి చాలా బాధేసింది. మనవాళ్ళు, ఏదో ప్రమాదం జరిగితేనే కానీ, పాఠాలు నేర్చుకోరు. కార్పొరేట్ హాస్పిటల్స్ అంటారే కానీ, వాటిల్లో ఉండే safety systems గురించి మాత్రం పట్టించుకునే దిక్కుండదు. పైగా ఇలాటి ప్రమాదాలు జరిగినప్పుడు, ప్రతీ వాడూ జ్ఞాన బోధలు చేసేవాళ్ళే. వాళ్ళు వసూలు చేస్తున్న ఫీజుల్లో, వీసమంత safety systems కోసం ఖర్చుపెడితే వాళ్ళ సొమ్మేం పోయిందిట? అదేం ఖర్మమో, ఎప్పుడు అగ్నిప్రమాదాలు జరిగినా ఒక్కటే కామన్ గా కనిపిస్తూంటుంది. ప్రమాద స్థలానికి ఫైర్ టెండర్లు వెళ్ళే జాగా లేదనీ, ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ trained staff లేరనిన్నూ.కొద్ది సంవత్సరాల క్రితం ఢిల్లీ లో ఉపహార్ సినిమా హాల్ లో జరిగినప్పుడూ ఇదే . అప్పుడెప్పుడో తమిళనాడు స్కూల్లో జరిగినప్పుడూ ఇలాగే. ఏవేవో కమెటీలు వేస్తారు, ఎవడినో ఒకణ్ణి శిక్షిస్తారు. బస్ ! మళ్ళీ అలాటి ప్రమాదం జరిగేదాకా చూడ్డం!

    నేను High Explosives Factory లో పనిచేసేటప్పుడు, ప్రతీ నెలా Fire Drill అని ఒకటి చేసేవాళ్ళం. జనరల్ మేనేజర్ నుంచి, కింద పనిచేసే వర్కర్ దాకా ప్రతీ వాడూ, ఎప్పుడైనా ఎమర్జెన్సీ వస్తే ఎవరెవరేం చేయాలో అందరూ చచ్చినట్లు చేయాల్సిందే. నేను Safety Section లో పనిచేసేవాడిని. ఫాక్టరీ అంతా ప్రతీ రోజూ రౌండు కొట్టి, ఎక్కడెక్కడ fire equipment సరీగ్గా ఉందో లేదో చూడ్డం ఓ పని. చాలామంది అనుకుంటారూ, గవర్నమెంటు ఫాక్టరీల్లో పనులన్నీ తూతూ మంత్రం లా ఉంటాయీ అని. కానీ నేను తెలిసికున్నదేమిటంటే, ప్రెవేట్ వాళ్ళకంటె ప్రభుత్వం వారే జాగ్రత్త తీసికుంటారని. రూల్స్ ప్రతీ చోటా ఉంటాయి, కానీ వాటిని ఫాలో అవడానికి self discipline అని ఒకటి కూడా ఉండాలి.

    రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చూడండి, ఖర్మ కాలి సిగ్నల్ పనిచేయడం ఏ కారణం చేతైనా ఆగిపోతే, ఆ రోడ్లమీద వెళ్ళే డ్రైవర్లకి ఎంత సంతోషమో! ఎవడికివాడే హీరో అయిపోయాననుకుంటాడు. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ గాడీ దోపేస్తాడు, అవతలివాడు ఏ గంగలో దూకినా సరే. దాంతో ట్రాఫిక్కు జామ్ములూ, పోలీసుల్ని తిట్టడం ,ఒకళ్ళమీదొకళ్ళు అరుచుకోడం. ఈ phenomenon మన దేశానికే పరిమితమా లేక ప్రపంచం అంతా ఉందా ఎవరైనా చెప్తే సంతోషిస్తాను. ఇంకో నగరాల్లో ట్రాఫిక్ పలచ బడేసరికి కనీసం రాత్రి పదవుతుంది. అదేం చిత్రమో తొమ్మిదింటికల్లా సిగ్నల్స్ నిద్రపోతాయి! ఏ ఆటోమేటిక్ వో పెడితే ఏం పోయిందిట?

    ఎక్కడకో వెళ్ళాలని ప్రోగ్రాం వేసికుంటారు, ఏదో టైము చెప్తారు, పోనీ ఓ అయిదో పదో నిముషాలు ముందే చేరుకుంటే, అవతలివాళ్ళేమైనా వద్దంటారా? అయినా సరే పెద్ద stylish గా, ఫరవాలేదండి indian punctuality. కదా మనదీ అనడం. మనల్ని మనమే అలా అనుకోడానికి సిగ్గుండొద్దూ. ఇలాటివన్నీ ఈ రోజుల్లో వస్తున్న పరిణామాలు. నాకు బాగా గుర్తు- పూణె లో ఇదివరకటి రోజుల్లో గొప్ప గొప్ప కళాకారులు శ్రీ చెంబై, శ్రీ బాలమురళి, శ్రీ చిట్టిబాబు, శ్రీమతి ఎమ్.ఎస్., శ్రీమతి ఎం.ఎల్.వి కచేరీ ప్రారంభించడానికి ఓ టైమంటూ ఇస్తే, ఠంచనుగా ఆ టైముకి మొదలెట్టేయడమే, ఆడిటోరియం నిండకపోయినా సరే. అలాగే ఏ తన్యావర్తనం జరిగేటప్పుడో ఎవరైనా బయటకు వెళ్ళడానికి నుంచుంటే, చడామడా కోప్పడేసేవారు. మధ్యలో ఓ పదినిముషాలు ఇంటర్వెల్ అయినా ఇచ్చేవారు కానీ, మధ్యలో వెళ్ళడం సుతరామూ ఒప్పుకునేవారు కాదు.

    ఏమిటో ఓ హైలీ సెన్సిటివ్ ఫాక్టరీలో పని చేయడం వల్ల కాబోలు, ఈ డిసిప్లీన్లూ అవీ వంటబట్టేశాయి. దానివలన నష్టం అనేది రాలేదు ఎప్పుడూ. మహా అయితే అవతలివాళ్ళు గేలిచేసేవారు, వెధవ చాదస్తం ఈయనా అంటూ! మా రాజమండ్రీలో ఉండగా, ఒకసారి త్యాగరాజ ఆరాధన జరుగుతోందని తెలిసి వెళ్ళాను. కార్యక్రమం ఉదయం తొమ్మిదికన్నారు. సరే అనుకుని, 8.50 కి చేరితే, అక్కడి ఆర్గనైజర్లు ఎవడూ కనిపించరే! ఆడుతూ పాడుతూ 9.30 కి వచ్చారు! ఏమిటండీ అని అడిగితే కోపం. పైగా మీరుకొత్తగావచ్చారేమిటీ అని అడగడం ఓటీ!

    ఏదో ఈయనకి అవతలివాళ్ళని విమర్శించడం తప్ప పనేదీ లేదా అనుకోవచ్చు. కానీ ఒక్కసంగతి చెప్పండి, మనకే ( తల్లితండ్రులకి) క్రమశిక్షణ లేకపోతే, మన పిల్లలేం నేర్చుకుంటారు? ఇంకో విషయం, కొంతమందిని చూస్తూంటాము, చిన్న క్లాసులే కదా అని, ఎప్పుడు పడితే అప్పుడు స్కూలుకి డుమ్మాకొట్టించేయడం. ఈ తల్లితండ్రులకేదో ప్రోగ్రాం ఉంటుంది, పిల్లలు స్కూలునుంచి వచ్చే టైము దీనితో క్లాష్ అవొచ్చు, అన్నిటిలోకీ ఈజీ ఆప్షన్ పిల్లల్ని స్కూలుకి పంపడం మానేయడం. ఇంట్లో తండ్రిగారు క్రికెట్ మాచ్ చూడ్డం మానేయగలడా, లేక తల్లి ఆ దిక్కుమాలిన సీరియళ్ళు చూడ్డం మానుకోగలదా! అబ్బే, అవి చాలా ముఖ్యం. ఈజీ ఆప్షన్ పిల్లాడి స్కూలు!

    ప్రతీవాళ్ళూ చేస్తారనికాదు, కానీ అలా చేసే తల్లితండ్రులూ, పిల్లలూ చాలు అందరినీ పాడుచేయడానికి.క్రమశిక్షణ అనేది, మనం ముందుగా ఆచరించి చూపిస్తే, పిల్లలు వాళ్ళంతట వాళ్ళే నేర్చుకుంటారు.

Advertisements

3 Responses

 1. ఇండియా లో అంత అడ్డగోలు గ ఎక్కడ వుండదు అండి ట్రాఫ్ఫిక్ విషయానికొస్తే..అదొక్కటే నచుతుంది నాకు అమెరికా లో. రోడ్ లు,నడిచి వెళ్ళే వారి పట్ల చూపించే బాధ్యత. నాకు క్రితం సరి వచినప్పుడు విజయవాడ లో ట్రాఫ్ఫిక్ చూసి భయం వేసింది. చిన్న పిల్లలాగా మా నాన్న చెయ్యి పట్టుకుని నడిచాను.అగ్ని ప్రమాదం గురించి చదివి చాల బాధ అనిపించింది.

  Like

 2. negligence is the fashion of the day

  Like

 3. @వినీలా,

  ఇక్కడ ఎందుకూ పనికిరానివాళ్ళూ, Dispensable ఉన్నారా అంటే, రోడ్డుమీద నడిచేవాళ్ళే !!!!

  @శర్మగారూ,

  అక్షర సత్యం.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: