బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ” అభి న జావో ఛోడ్ కర్….”


    1960-70 లలో ఇప్పటి తాతయ్యలకూ,నానమ్మలకూ, అమ్మమ్మలకూ ఓ రొమాంటిక్ హీరో…. శ్రీ దేవానంద్… ఆ రోజుల్లో హిందీ అర్ధం అవకపోయినా సరే, దేవానంద్ సినిమా వచ్చిందంటే చాలు, ఎగేసుకువెళ్ళిపోవడమే ! ఇంక ఆ సినిమా చూసి వచ్చిన తరువాత ఆ సినిమాలో హీరో హావభావాలూ, నడకలో ఆ గైట్టూ, జుట్టు స్టైలూ మార్చేసికుని, తనే ఓ దేవానందంతలా ఉండాలనే కుర్రాళ్ళు లేరంటే అతిశయోక్తి కాదు!కాలేజీకి వెళ్ళే ప్రతీ ఆడపిల్లకీ పోజులిచ్చేయడమే! వాళ్ళు మాత్రం తక్కువ తిన్నారా ఏమిటీ, అసలు పెళ్ళంటూ జరిగితే, ఆ వచ్చేవాడు దేవానంద్ లాగే ఉండాలని “కలలు” కనని అమ్మాయుండేది కాదు!

    ఇప్పుడు వస్తున్న సినిమాలూ, వాటిలో ఛాన్సొస్తే చొక్కాలిప్పేసికునే హీరోలని చూసిన వారికి ఆరోజుల్లోని హీరోలకుండే ఫాలోయింగు తెలియదులెండి! రొమాన్సుకి నిర్వచనం దేవానంద్. నగరాల్లో హిందీ సినిమాలు త్వరగానే వచ్చేవి. కానీ మా అమలాపురం లాటి ” ద్వీపాల” కి రావడానికి కొంచం టైము పట్టేది.So what.. ఎప్పుడొస్తే అప్పుడే, కాలేజీ ఎగ్గొట్టేసి, మ్యాట్నీకి చెక్కేయడమే. అబ్బ ఎన్నెన్ని సినిమాలండి బాబూ.. <a href="“>హందోనో, జబ్ ప్యార్ కిసీసే హోతాహై, అస్లీ నక్లీ, బాత్ ఏక్ రాత్ కీ,కాలాపానీ, కాలా బజార్… ఒకటేమిటి వచ్చిన ప్రతీ సినిమా చూసేయడమే. భాష అర్ధం అయేది కాదు అయినా సరే, భాష ఎవడిక్కావాలి… అప్పటికే రేడియోలో ఆ సినిమా పాటలు వినేయడం, వాటిని తెర మీద, దేవానంద్ అభినయించిన తీరు వంటబెట్టేసికోడం ..

    చెప్పుకోడానికి సిగ్గు పడేవారు కానీ, ప్రతీ ఆడపిల్లకీ హీరో దేవానందే!అంతదాకా ఎందుకూ మా ఇంటావిడకి పెళ్ళయిన తరువాత, కలిసి చూసిన మొట్టమొదటి హిందీ సినిమా ” తేరే మేరే సప్నే..” ఏదో మాటల్లో చెప్పింది, దేవానందంటే చాలా ఇష్టమూ అని. పోనీ, చెప్పింది కదా అని, హైదరాబాద్ లో రామకృష్ణా థియేటర్ లో చూసొచ్చాము. ఒకసారి రుచి మరిగిందిగా, ఇంక పూణె వచ్చేసిన తరువాత, దేవానంద్ సినిమా వచ్చిందంటే చాలు, ఆదివారం వెళ్ళిపోడమే. అలాగ వెళ్ళేవి ఆ రోజులు !
తరువాత్తర్వాత టి.వీ లు వచ్చి అందులో ఆదివారాలు ప్రొద్దుటే వచ్చే “రంగోలి” లోనూ, ఛాయా గీత్ లోనూ దేవానంద్ పాటలు హోరెత్తేసేవి. మా అబ్బాయికి, దేవానంద్ వాళ్ళ అమ్మకి ఫేవరెట్ హీరో అని తెలిసికుని, దేవానంద్ పాటొచ్చినప్పుడల్లా టి.వీ.కి అడ్డంగా నుల్చుని, ఏడిపించేవాడు. ఈవిడకేమో కోపం !

    1980 దాకా వచ్చిన ఏ దేవానంద్ సినిమా వదల్లేదు.. కాలక్రమేణా, మనకీ బాధ్యతలు పెరిగాయీ, సినిమాల క్వాలిటీ మారిందీ, అయినా సరే ఆరోజుల్లో చూసిన ఏ దేవానంద్ సినిమాయేనా మర్చిపోగలమా? హాలీవుడ్ యాక్టరు గ్రెగరీ పెక్ ని అనుకరిస్తున్నాడనే వారు కొందరు, కానీ అలా అనుకరించడం కూడా ఘనతేగా. ఎవరెన్ని చెప్పండి దేవానంద్ దేవానందే.. అంత రొమాంటిక్ హీరో కాబట్టే తను వ్రాసిన ఆత్మ కథకి “Romancing with Life” అని మరీ పేరు పెట్టారు.

    పుట్టినవాళ్ళు ఎప్పటికైనా వెళ్ళాల్సిందే, కానీ మన టినేజ్ హీరో వెళ్ళిపోతే బాధుండదూ మరి…

The “Evergreen Romantic Hero” DEV ANAND…. R I P..

Advertisements

2 Responses

  1. In fact..I am of this generation but still I like devanand. He has a romantic charm. sorry telugu lo response ivvaleka pothunanduku.

    Like

  2. సంధ్యా,

    ఆలశ్యం గా స్పందిస్తున్నందుకు ఏమీ అనుకోకు. దేవానంద్ లో ఉన్న గొప్పతనమే అంత !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: