బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– పుట్టిన రోజుకి పన్నెండు రోజులు ముందుగానే……


   మనమేమైనా చిన్న పిల్లలమా ఏమిటీ? సరీగ్గా పుట్టిన రోజుకే Surprise Gift ఇప్పించుకోడానికీ… అప్పటికీ ఆ గిఫ్ట్ ని పుట్టినరోజుకే ఇచ్చేటట్టు ముందుగా ప్లాన్ చేశారు. కానీ అన్నీ మనం అనుకున్నట్టు జరిగితే దాంట్లో వింతేముంది? అసలు కిక్కంతా ఆ Element of surprise లోనే ఉంది!

    నేను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా భావించి పూజించేవారు శ్రీ ముళ్ళపూడి వెంకట రమణ గారూ, శ్రీ బాపూ గారూ, వీరిలో మిగిలిందల్లా మహేశ్వరుడే. చిన్నప్పటినుంచీ ఓ భక్తి అనండి, లేకపోతే ఇంగ్లీషులో awe అనండి, మీ ఇష్టం ఏమనుకున్నా సరే, ఎవరికోసమైతే Times of India ఏరోజూ మిస్స్ అవకుండా చూసేవాడినో, నా ఆరాధ్య దైవం శ్రీ R K Laxman ! ఈయనా నా మహేశ్వరుడు! ఇద్దరు మూర్తులను ప్రత్యక్షం గా కలిసి, పాదాభివందనం చేయకలిగాను, కానీ ఆ మూడో మూర్తిని కూడా కలియగలిగితే ఎంత బాగుంటుందో అని, పైగా పూణె లోనే ఉంటూ ఆయన దర్శనం చేసికోలేకపోయానే అనే భావం నాలో ఎప్పటినుంచో ఉంది. పైగా కిందటేడాది శ్రీ బాపూ గారిని కలిసినప్పుడు ఆయనన్నారు కూడానూ
“శ్రీ లక్ష్మణ్ గారిని కలిశారా, మీ పూణే లోనే ఉంటున్నారు కదా ..” అని. సమాధానం చెప్ప్లలేక ఓ వెర్రి నవ్వు నవ్వేశాను!

    ఈ మధ్యన బాల్ ఠాక్రే ప్రత్యేకంగా పూణె వచ్చి శ్రీ లక్ష్మణ్ ని కలిశారు. ఆ విషయం పేపర్లో చదివి, అర్రే మనకూ అలాటి అవకాశం వస్తే బాగుండునూ అనుకున్నాను. అయినా మనమేమైనా, పేద్ద రాజకీయనాయకులమా,ఏమిటీ? అయినా ఈ విషయం మా అబ్బాయి చెవిలో వేశాను! ఏమనుకున్నాడో ఏమిటో, ఏం చేశాడో ఏమిటో, నిన్న సడెన్ గా “డాడీ, రేపు ( శనివారం) సాయంత్రం మీకు ఖాళీయేనా అన్నాడు. ఎక్కడికైనా వెళ్ళాలో ఏమిటో, పిల్లల్ని చూడ్డానికేమోలే అనుకుంటూ, దానికేం నాయనా మాకు ఖాళీయే అన్నాను. ” ఏం లేదూ, ఓ చోటకి వెళ్దామూ, మీకు ఖాళీ ఉంటే..” ఎవరింటికీ అంటే “ ఆర్.కే.లక్ష్మణ్ గారింటికీ …” అని చల్లగా చెప్పాడు ! ” నా శరీరం లో ఊపిరంటూ ఉండాలే కానీ, ఇలాటి అవకాశమా మిస్ అయేదీ..” అన్నాను.

    మొత్తానికి ఈవేళ సాయంత్రం, నేనూ, మా ఇంటావిడా, అబ్బాయీ,కోడలూ, నవ్యా,అగస్థ్యా ఇంకో ఫ్రెండూ వెళ్ళి ఓ గంటన్నర గడిపి వచ్చామండి. ఆయనకి ఎడం వైపు స్వాధీనం లో లేదు. మాట కూడా మాట్లాడలేక పోతున్నారు. అయినా మేము అక్కడున్న గంటన్నరా కుర్చీలోనే కూర్చుని, మేము ఆయన శ్రీమతి కమల గారితో మాట్లాడుతున్నంతసేపూ అక్కడే ఉన్నారు. ఓ పది దాకా ఫొటోలు తీసికోనిచ్చారు. ఆయన activity మాత్రం ఏమీ తగ్గలేదు !!

    పైన పెట్టిన ఫొటో మా పిల్లలు నా పుట్టిన రోజు సందర్భం గా నాకు ఇచ్చిన ఓ అద్భుతమైన కానుక (” R K LAXMAN– The Uncommon Man “)! ఇంకో ఫొటోలో మా అబ్బాయి ఆ పుస్తకం మీద శ్రీ లక్ష్మణ్ గారి ఆటోగ్రాఫ్ తీసికుంటూ…
Thank you Harish, Sirisha, Navya & Agastya for this beautiful gift…

    నా సంతోషాన్ని మీ అందరితోనూ పంచుకుందామనే ఈ టపా….

8 Responses

 1. ఆర్కె లక్ష్మణ్ గారిని పెర్సనల్ గా కలిసినంత ఆనందం గా ఉందండీ మీ టపా చదివాక. వారి అన్నయ్య ఆర్కె నారాయణ్ గారి మై డేస్ చదివినప్పుడు, వారి చిన్నప్పటి విషయాలు చదివి , చాలా బ్రహ్మనందమైన చిన్నప్పటి జ్ఞాపికలు వీరివి అనుకున్నాను. అట్లాంటి ఇద్దరిలో ఒక్కరైన లక్ష్మణ్ గారిని మీరు పర్సనల్ గా కలవడం మరీ విశేషం ! వారితో సమయం గడపడమే ఒక పెద్ద అనుభవం అనుకుంటా!

  Like

 2. WOW!!!!!!!!!!!!!!
  ఆయన్ని చూసిన క్షణంలో మీ కళ్ళలో కనిపించే మెరుపు, ఆ ఉద్వేగం……ఇంతకన్నా అద్భుతమైన పుట్టిన రోజు బహుమతి ఏముంటుంది గురువు గారూ. కిందటి ఏడాది బహుమతే అపురూపం అనుకుంటే ఈ సారి దాన్ని మించిన క్షణాలని బహుమతిగా అందించిన మీ అబ్బాయికి శతకోటి వీరతాళ్ళు.

  Like

 3. ఆర్కె లక్ష్మణ్ గార్ని కలిశారా…ఎంత మంచి బహుమానం..అలాంటి పిల్లలున్నందుకు మిమ్మల్ని అభిమానించాలి..

  Like

 4. అదృష్టవంతులు

  Like

 5. ఆహా! మంచి విషయం సర్! హేపీ ఫర్ యూ! 🙂

  Like

 6. చాలా సంతోషం..

  Like

 7. నిజమేనండి.అయ్యో నేనెలా పొరబడ్దాను ! చాలా అదృష్టవంతులు ! ఇలాటి మహానుభావుల్ని కలవడం అంటే స్వయంగా భగవంతుణ్ణి చూచినంత పుణ్యం !!

  Like

 8. @జిలేబీ,

  ఇంకా ఆ ” మత్తు” లోంచి బయటకు రాలేకే కొత్త టపాలు వ్రాయలేకపోయాను….

  @శంకర్,

  ధన్యవాదాలు… అది సరే, ఇంతకు ముందు వ్రాసిన టపా చదివినట్టులేదు…

  @జ్యోతిర్మయి,

  ఇంకో సంగతి చెప్పనా… శ్రీమతి లక్ష్మణ్ గారు మా ఇంటికి కూడా వీలు చూసుకుని వస్తామని చెప్పారు…

  @శర్మ గారూ,

  నిజం సార్…

  @కొత్తావకాయ,

  థాంక్స్..

  @కృష్ణప్రియా,

  ధన్యవాదాలు.

  @గురువుగారూ,

  మీరు ఏదో పరధ్యానం లో ఉండి, పొరపాటు పడ్డట్టున్నారు. అది సరే, మా ఇంటికి ఎప్పుడు వస్తున్నారు?

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: