బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఒకే ఒక్క శంకరుడు…


    ఇదివరకటి రోజుల్లో వినేవారం, గ్రామాల్లో భోజనానికి ప్రతీరోజూ, ఎవరో ఒక అతిథి విస్తరి లేవకుండా, గృహస్థు భోజనం చేసేవారు కాదని. ఓహో కాబోసు అనుకునేవాళ్ళం. ఎవరి ఆనందం, సంతోషం వారిది. ఒక్కరూ భోజనం చేస్తే చేసినట్టుండేది కాదుట. ఆరోజులు వేరూ, ఆ ఆప్యాయతలు వేరు. కాల క్రమేణా అలాటి మర్యాదలు అటకెక్కేశాయి. ఏదో పుస్తకాల్లో చదవడం తప్ప, ఇంకో గతి లేదు. కానీ పుస్తకాలు కూడా దొరకాలిగా.

   ఆరోజుల్లో అతిథి లేకుండా, ఎలా మనసొప్పేది కాదో, అలాగే ఈ రోజుల్లో అదీ 21 వ శతాబ్దం లో కూడా, మరీ అతిథీ భోజనం, కాదుకానీ, తాను చదివిన పుస్తకాన్ని, ఇంకోరి చేత చదివించితే కానీ, ఆ పుస్తకాన్ని ఆస్వాదించినట్లుండని ఒక మనీషి- ఇంకెవరూ మన శంకర్… అదేమిటో, తను అనుభవించిన సంతోషం ఇంకోరితో చెప్పేకన్నా, వారికే ఓ పుస్తకం పంపేస్తే ఉండే ఆనందం ఈ రోజుల్లో, అదీ ఎటువంటి ప్రతిఫలమూ ( మన ఆనందం, సంతోషం తప్ప) అపేక్షించకుండా, చేయడం గ్రేట్! ఒకసారి బాపు “బొమ్మల కొలువు”, ఇంకోసారి
ముళ్ళపూడి వారి “ ఇంకోతికొమ్మచ్చి” మళ్ళీ ఇప్పుడేమో “మిథునం”. మమ్మల్ని మరీ “ఋణగ్రస్థు” ల్ని చేసేస్తున్నావు శంకరా... పోనీ భాగ్యనగరం వచ్చినప్పుడు కలిసి, పెర్సనల్ గా థాంక్స్ చెప్దామా అంటే, “ఉత్తరాయణం” లో స్వాతి సన్నిధీ, “దక్షిణాయణం” లో భాగ్యనగరమూనూ! పోనీ ఈ ఆయనాలేనా స్టెడీ గా ఉంటాయా అంటే, అదీ లేదూ, ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడే వెళ్ళిపోవడం! అవునులెండి, నువ్వక్కడా, నేనిక్కడా.. అంటూ పాడుకోడం కంటే, ఇదే బావుంది. కానీ ,ఎప్పుడో స్వాతి కలిసినప్పుడు, ” ఇదెక్కడలవాటండి బాబూ, పుస్తకాలు తనకి తెలిసినవారందరితోనూ పంచుకోకుండా ఉండలేరట. పెద్దవారు మీరైనా చెప్పకూడదూ,…” అని కోప్పడుతుందేమో అని భయం
తాంబూలం, దక్షిణ లకి ధన్యవాదాలు….

    1998 లో ఆంధ్రభూమి వార పత్రికలో మొట్టమొదటి సారి ” మిథునం” కథ చదివినప్పుడు, సంతోషం, ఆనందం పట్టలేక, కళ్ళంబట నీళ్ళు కారుస్తూ, శ్రీరమణ గారికి ఒక ఉత్తరం వ్రాశాను. ఆ కథకి నా స్పందన తెలుపుతూ వ్రాశానే కానీ, దానికి ఆయన జవాబిస్తారని కలలో కూడా ఆశించలేదు. పైన ఉంచినది ఆయన జవాబు.

    అక్కడితో ఎక్కడ పూర్తయింది ఆ సంతోషం… ఆ ఉత్తరం అందిన దశాబ్దానికి అంటే సరీగ్గా 16-02-2008 రోజున, భాగ్యనగరం లో, మా శిరీష, అమ్మమ్మగారి ధర్మమా అని వారి తమ్ముడు శ్రీ దివాకర్ గారి సహకారంతో, మాకు శ్రీరమణ గారితో మూడు గంటలు గడిపే అదృష్టం కలిగింది. అడగ్గానే వచ్చి, వారి అమూల్యమైన సమయం మాతో గడిపిన శ్రీరమణ గారికి, ఎలా ఋణం తీర్చుకోనూ?

    మిథునం గురించి వ్రాసే అర్హత లేకపోయినా, మిథున సృష్టికర్తతో మా అనుబంధం,దస్తూరి తిలక బాపూ గారితో మేము గడిపిన మధుర క్షణాలూ,”ఒకే ఒక్క మిథునం” అంకితమివ్వబడిన ” ఒకే ఒక్క రమణ” గారితో గడిపిన అమృతతుల్య ఘడియలూ— వీటన్నిటికీ అన్నం లో “నెయ్యి” లా శంకర్ పంపిన పుస్తకమూ ఇంకేం కావాలండి.

7 Responses

 1. బలే బలే…శ్రీ రమణ గారితో మూడు గంటలే…బాగు బాగు!

  శంకర్ గారి పంపిన పుస్తకం నాకూ అందిందండీ.

  అందరం ఒకసారి శంకర్ గారికి గట్టిగా జై కొడదామా!

  జై జై జై జై జై జై జై జై జై

  Like

 2. శ్రీ రమణ గారు తిరిగి ఉత్తరం రాసారంటే, మీరు అంత బాగా మీ సంతోషాన్ని ఉత్తరంలో వ్యక్తపరిచారన్నమాట!

  Like

 3. ఒక్క మాటలో చెప్పలంటే….. మీరు చాలా అదృష్టవంతులండీ…..
  వారి గొప్పతనాన్ని మెచ్చుకోకుండా ఉండలేము…..

  Like

 4. శంకరార్యులది మహ దొడ్డ మనసండీ!! 🙂

  Like

 5. @సౌమ్యా,

  జయహో…. జయహో…. అదంతా శ్రీరమణ గారి గొప్పతనం…

  @మాధవీ,

  “మీరు చాలా అదృష్టవంతులండీ..” అది మాత్రం నిజం!! దేముడికి సర్వదా కృతజ్ఞుణ్ణి…

  @కొత్తావకాయ,

  నిస్సందేహంగా….

  Like

 6. Wow!
  I have the book in my collections and first thing I read to my husband after my marriage is “mithunam”. So far I recommended to all my friends who are in commited relations.
  Wonderful! Ramana gari anni books konnesanu…aa joshlo.

  Like

 7. సంధ్యా,

  చాలా సంతోషం.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: