బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–పుత్రోత్సాహం….


DNA

    నిన్న రోజంతా బిజీబిజీ గా గడిచిపోయింది. మేము భాగ్యనగరం నుంచి, ఇంకా పైకి రాజమండ్రీ దాకా వెళ్దామని టిక్కెట్లు రిజర్వు చేసేశానని చెప్పానుగా. అలాగే కనుక వెళ్ళి ఉంటే, నిన్న మా అబ్బాయీ, కోడలూ సంయుక్తంగా నిర్వహించిన ఓ మంచి కార్యక్రమాన్ని మిస్ అయి ఉండేవాడిని. తను ఇక్కడ ఓ ఆన్ లైన్ గ్రంధాలయం నిర్వహిస్తున్నాడని ఇదివరకు వ్రాశానుగా, పేరు tenderleaves అయినా, మెల్లిమెల్లిగా మారుతున్నాయి!!

   పుస్తకాలకి సభ్యత్వం బాగానే జరుగుతోంది అయినా, మా వాడికి ఇంకా ఏదో చేయాలని తపనా. ఓ నెల రోజుల క్రితం ఇక్కడ ఉండే 14 స్కూళ్ళకి వెళ్ళి, అక్కడ చదువుకునే పిల్లల
నుంచి, వాళ్ళు స్వయంగా వ్రాసిన కథల పోటీ ఒకటి పెట్టాడు. ఆ పోటీకి వచ్చిన కథలెన్నో తెలిస్తే ఆశ్చర్యపోతారు! అక్షరాలా 2000. వాటన్నిటినీ, అబ్బాయీ, కోడలూ రాత్రింబవళ్ళు చదివి, వాటిలో ఓ వంద కథల్ని షార్ట్ లిస్ట్ చేశారు. మళ్ళీ వాటిలో, ఓ 60 కథల్ని సెలెక్ట్ చేశారు. కథల్ని సెలెక్ట్ చేయడం తో సరిపోదుగా, వాటిని ఓ పుస్తకం లా తేవాలని ఓ ఆలోచనొచ్చింది. ఓ ప్రింటర్ ని పట్టుకుని ఆ కథలని The Diary of a Puneri Kid అని ఓ పేరోటి పెట్టి ప్రింట్ చేయించాడు. ఇందులో విశేషమెమిటంటే, 60 కథలనీ, యతాతథంగా , అంటే ఎడిటింగూ అదీ లేకుండా, యదాతథంగా స్కాన్ చేసేశారు. పక్కనే ఆ కథ వ్రాసినవారి పేరూ,ఫొటో వేయించారు.

    ఇంక చూడండి హడావిడి, నిన్న ఆ పుస్తక వితరణా, దానితో పాటు స్కూలు పిల్లలకి ఓ క్విజ్జు పోటీ ఆర్గనైజు చేశారు. నిన్నంతా అదే హడావిడి. పిల్లలూ, వాళ్ళ తల్లితండ్రులూ, కొంతమంది గ్రాండ్ పేరెంట్సూ, టీచర్లూ అబ్బో సందడే సందడి! తమ పిల్లల అదీ 5 నుంఛి 12 సంవత్సరాల వయస్సు వారు వ్రాసిన కథలు పుస్తక రూపంలో చూసుకునేసరికి, ఒక్కోళ్ళ ఆనందం చూడాలేకానీ, చెప్పలేను!

    ఎవరికి వారే, అర్రే మావాడు ఇంత బాగా రాస్తాడని తెలియనేతెలియదూ, అని ఒకళ్ళు, ఈమధ్యన ఎప్పుడు చూసినా ఏదో వ్రాస్తూనే కనిపించాడూ, ఇదన్నమాట అని ఇంకొకరూ, ఎవరికి వారే ఇంత సంతోషం, ఆనందం ఇచ్చినందుకు మా అబ్బాయి ని పొగుడుతూంటే, అంతకన్నా ఆనందం ఎక్కడుంటుందీ?

    ఇంక క్విజ్జు పోటీకి మొత్తం 70 ఎంట్రీలు వచ్చాయి. ముందుగా ఎలిమినేషన్ రౌండ్ ప్రారంభించి, చివరి ఆరు టీమ్ములనీ వేదిక మీదకి పిలిచి, ఆరు రౌండ్ల క్విజ్ నిర్వహించారు. నెగ్గిన వాళ్ళకి ప్రైజులూ, పుస్తకంలో ప్రచురణకి సెలెక్ట్ అయిన్ అరవైమందికీ మా లైబ్రరీ ఆరునెలల సభత్వమూ ఇచ్చాడు. ఇంత బ్రహ్మాండమైన కార్యక్రమం ,అదీ మా అబ్బాయి, కోడలూ రాత్రింబవళ్ళు శ్రమ పడి చేస్తూంటే, నేనా మిస్ అయేది? కానీ మా ఇంటావిడ ఫొటోలు చూసే ఆనందించవలసివచ్చింది. ఇంట్లో చి.అగస్థ్యని పెట్టుకుని ఉండిపోయింది.DNA అన్న దానిమీద నొక్కితే, ఆ పేపరులో ఈ కార్యక్రమం గురించి ఏం వ్రాశారో చదవ్వొచ్చు.

   రాజమండ్రీ ఎప్పుడైనా వెళ్ళొచ్చు. కానీ ఇలాటి కార్యక్రమం అస్తమానూ రమ్మంటే వస్తుందా మరి?

14 Responses

 1. It was an excellent idea… . .

  Like

 2. అంత మంచి ఆలోచన రావడం, దాన్ని ఆచరణలో పెట్టడం great.. All the best to him and your daughter-in-law and congrats to you 🙂

  Like

 3. Amazing ఫణిబాబు గారు మీ అబ్బాయిగారికి కోడలుగారికి అభినందనలు తెలియచేయండి ఇంత మంచి పని చేసినందుకు.

  Like

 4. చాలా చాలా బాగుంది! మీ కుటుంబానికి శుభాకాంక్షలు.

  Like

 5. Very Nice. Good Idea.

  Congrats to the your Son and Daughter In Law.

  And congatulations to the proud Father as well 🙂

  Like

 6. చాలా మంచి పని చేశారు మీ పిల్లలు. చదువుతున్న మాకే ఇంత ఆనందంగా ఉందంటే ఆ తల్లితండ్రుల సంతోషం చెప్పనలవి కాదు అనుకుంటాను.

  మీ అబ్బాయికి, మీ కోడలికి మా అభినందనలు అందజేయండి.
  మీరు గర్వ పడే పని మీ పిల్లలు చేశారు. మీకు కూడా అభినందనలు.

  Like

 7. మీరు అటునుంచి అటెళ్ళిపోయారని చాలా బాధ పడ్డాను. తప్పుచేశానని ఒప్పుకుంటున్నాను. మీ సుపుత్రునికి, కోడలికి నా ఆశీస్సులు. శుభాభినందనలు.

  Like

 8. హృదయపూర్వక అభినందనలండీ..
  భావితరాన్ని సృజనాత్మకతవైపు నడిపిస్తున్న మీ అబ్బాయికీ, కోడలికీ అభినందనలు.
  ఇంట్లో వుండి చి.అగస్థ్యని చూసుకున్న లక్ష్మిగారికి ప్రత్యేక అభినందనలు..

  Like

 9. @రాజేష్,
  థాంక్స్…

  @మేధా,

  ధన్యవాదాలు. మీ అభినందనలు మా పిల్లలకి అందచేస్తాను…

  @వేణూ శ్రీకాంత్,
  తప్పకుండా….

  @కృష్ణప్రియా,

  ధన్యవాదాలు.

  @వీకెండ్ పొలిటీషియన్,

  పిల్లలకి చెప్పమన్నారు బాగానే ఉంది. కానీ, “పల్లకీ మోసేవాళ్ళొకరూ, చంకలెగరేసేవారింకోళ్ళూ..” అన్నట్టుగా నాకెందుకూ….

  @సుబ్రహ్మణ్యం గారూ,

  నిజమేనండీ.. పిల్లలు అంత శ్రమ పడినందుకు, దానికి రెస్పాన్సూ బాగానే ఉంది. మనక్కూడా అంతకంటే ఇంకేం కావాలండీ ..

  @శర్మగారూ,

  మరీ “తప్పు” అనేయకండి. ఏదో అపార్ధం చేసికున్నారు.

  @లక్ష్మిగారూ,

  మీరన్నది నిజం. ఈ కార్యక్రమం విజయవంతంగా చేయడం ఒక ఎత్తూ. ఇంట్లో కూర్చుని, మా అగస్థ్యని, మా ఇంటావిడ చూడ్డం ఓ ఎత్తూ..

  Like

 10. ఫర్లేదండీ, రాబోయే కాలం లో మనం మరిన్ని మాంచి బ్లాగార్లను ఈ చిట్టి పిల్లల నుంచి చూడవచ్చంనమాట !

  Like

 11. చిగురు ఆకులు (టెండర్ లీవ్స్) కార్యక్రమం విజయవంతం అయ్యినందుకు మీ ఇంటిల్లిపాదికి
  అభినందనములు.
  ఫుటోలలో మిమ్మలిని చూడలేకపోయినందుకు దిగులేసింది.
  మోహన్

  Like

 12. చాలా మంచి initiative అండీ. దీని మంచిగా కొనసాగిస్తూ విస్తరిస్తూ ఉంటారని ఆశిస్తూ, అభినందనలు.

  Like

 13. Kudos and congratulations to your Family!

  Like

 14. @జిలేబీ,

  అనే ఆశిద్దాం…

  @మోహన్ గారూ,

  క్రెడిట్ అంతా అబ్బాయిది. మధ్యలో నా ఫొటో ఎందుకండీ …

  @లలిత గారూ,

  కొనసాగించాలనే ఉద్దేశ్యం…

  @సంధ్యా,

  థాంక్స్..

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: