బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— Are we on the right track…….


    ఈ రోజుల్లో మార్కెట్టుల్లో చూస్తూంటాము, కూరగాయలనండి, పళ్ళనండి ప్రతీ చోటా ఏదో మందూ మాకూ ఉపయోగించి, అనవసరమైనవన్నీ వాడేసి, పండ బెట్టేయడం. ఒకటికి రెండు సార్లు పాలిష్ చేసేసి, తాజా గా ఉన్నట్లు మనల్ని నమ్మించేయడం. ఎక్కడ చూసినా ఫెర్టిలైజర్లూ, కెమికల్సూనూ. చివరకి ఇదివరకటి రోజుల్లోలాగ ఉండే కూరగాయలూ, పళ్ళూ కావాలంటే అవేవో “organic variety” అని ఖరీదెక్కువైనవేవో కొనుక్కోడం. ఎక్కడ చూసినా hybrid. మన జీవితాలుకూడా అలాగే అయిపోయాయి ! ప్రతీ దాంట్లోనూ పోటీ,అవతలివాడికంటే మనం, మన పిల్లలూ ఓ ఆకు ఎక్కువే ఉండాలీ అనే కానీ, ఈ పోటీ ప్రపంచం లో మనం పోగొట్టుంటున్నదేదో ఒక్కళ్ళైనా ఆలోచించారా? జవాబు–NO–

    ఇదివరకటి రోజుల్లో, ఓ పసిపాప ని చూస్తే ముద్దొచ్చేది. ఇప్పుడూ వస్తోంది, కానీ ఏ వయస్సొచ్చేదాకా? ఏదో నోట్లో ఓ మాటొచ్చేదాకానూ. ఇంక అక్కడనుంచి కష్టాలు ప్రారంభం పాపం ఆ పసిపాపకి. రెండు మూడేళ్ళొచ్చేదాకా ఏదో ఫరవాలేదు. అక్కడనుంచి ప్లేస్కూళ్ళూ, కేజీలూ, డాన్సులూ, పాటలూ ఒకటేమిటి, తల్లితండ్రులకి తాము తీర్చుకోలేని ambitions అన్నీ, ఆ పిల్లలద్వారా తీర్చుకోడం. టి.వి. లలో వచ్చే ఏ చిన్న పిల్లల ప్రోగ్రామైనా చూడండి, అందులో పాల్గొనే చాలామంది పిల్లలు, తమ వయస్సు కంటె, ఎక్కువ వయస్సులా కనిపిస్తారు. పైన చెప్పినట్టు, మార్కెట్ లో దొరికే కూరలకీ, పళ్ళకీ, వీళ్ళకీ తేడా ఏమీ కనిపించదు. అయిదారేళ్ళ పిల్ల పదేళ్ళ పిల్లలా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.

    ఆరోజుల్లో ,చిన్న పిల్లల హావభావాల్లో ఉండే పసితనం, అమాయకత్వం అన్నీ ఎక్కడకి మాయం అయిపోయుంటాయంటారు ? They just vanished.. మనలో చాలామందికి చిన్నప్పటి మధుర జ్ఞాపకాలుండాలి, కానీ మన పిల్లలకి మాత్రం ఉండకూడదు. వాళ్ళని robots లా తయారుచేసి, ఇంటికి ఎవరైనా వస్తే, బాబూ/అమ్మా ఓ ఇంగ్లీషు పద్యం పాడమ్మా అనడం. ఇంకవాళ్ళుకూడా, ప్లేస్కులుకి వెళ్ళేదాకా రోజంతా టి.వి. ముందరే కూర్చోడం. ఆ పసిపాపకి ఆకలేసినప్పుడు చెప్పడం రాదుకానీ, టి.వి. లో ఏదైనా “షీలాకీ జవానీ” లాటి పాటల మ్యూజిక్కొచ్చేటప్పటికి మాత్రం గుర్తుపట్టేయడం, వాళ్ళ అమ్మా నాన్నలు అబ్బో మావాడికి ఎంత తెలివితేటలో అనుకుంటూ సంబరపడిపోవడం! వాణ్ణి ఏ కోచింగు స్కూల్లోనో చేర్పించేయడం, వీలైనన్ని కార్యక్రమాల్లో పోటీ చేయించేయడం.అలాగే ఆటల్లో కూడానూ. ఇవన్నీ ఉండకూడదనడం లేదు. But at what cost…? ఆటల్లో వివిధ రకాల categories లలో ( under 15, under 19,…) ఉంటాయి. దేంట్లోనూ, వాటిలో పాల్గొనే పిల్లలు వారి వయస్సుకి తగ్గట్టుండరు. ఇదివరకటి రోజుల్లో, పధ్ధెనిమిదేళ్ళొచ్చినా ఇంకా మూతి మీద మీసం ఉండేది కాదు. కానీ ఈ రోజుల్లో ఎవరిని చూసినా ఓ ఇద్దరు ముగ్గురు పిల్లల తండ్రిలాగే కనిపిస్తారు! దీనికంతటికీ కారణం, మనం పిల్లలకి పెట్టే తిండి కూడా ఓ కారణం.

    ఇంకోటి, ఇదివరకటి రోజుల్లో, ఎవరింటికైనా వెళ్తే, అక్కడుండే చిన్నపిల్లాడిని పలకరించడం ఓ ముచ్చటగా ఉండేది, కారణం వాళ్ళు మాట్లాడే ముద్దుమాటలూ అవీనూ. కానీ ఇప్పుడు ఎవరినైనా పలకరించాలన్నా భయమే! ఏం మాట్లాడితే ఎటువంటి retort వస్తుందో అనే భయమే! దానికి మన సినిమాలు కూడా, వాళ్ళకి చేతనైనంత చేస్తున్నారు. పిల్లలు చేసేది తల్లితండ్రులు చూస్తునే ఉన్నా, వాళ్ళకీ భయమే, ” అలా అనకూడదమ్మా…” అంటే , తను చూసిన ఏ ఎపిసోడ్ లోంచి రిఫరెన్సిస్తాడో అని!

    ఎన్నో సంవత్సరాల క్రితం శ్రీ బాపూగారు సృష్టించిన ” బాపూ బొమ్మ”లు ఇప్పుడు, కాగడా పెట్టివెదికినా కనిపించరంటే అతిశయోక్తి కాదు. అసలు ఆ కాన్సెప్టే లేదు.అలాగని ఆడపిల్లలందరూ, పరికిణీ ఓణీ లే వేసుకోవాలని కాదు, ఆయన చిత్రించిన బొమ్మల్లోని అందం, అమాయకత్వం, సొగసూ ఇప్పుడెవరికైనా కనిపిస్తున్నాయా? అందుకే పాపం ఆయనకూడా అలాటివి వేయడం మానేశారు! పదహారేళ్ళ ఆడపిల్లంటే, ఇంటికే ఓ అందం వచ్చేది. టి.వి.ల్లో వచ్చే ఏ కార్యక్రమం చూడండి, ఊరికే పేరుకే ” చిన్నపిల్లలు” అంటారు. కానీ వాళ్ళల్లో ఎవరూ చిన్నపిల్లల్లా కనిపించరు. అంతదాకా ఎందుకూ, ఓ పెళ్ళికూతుర్ని చూస్తే, ఆ సమయం లో ఆ పిల్ల పడే సిగ్గూ, అవీ ఇప్పుడు మచ్చుకైనా కనిపిస్తాయా? ఎప్పుడు పెళ్ళవుతుందా, ఎప్పుడు వీడి పని పడదామా అనే కనిపిస్తుంది.

    ఈరోజుల్లో చిన్న పిల్లల వయస్సుకీ, వారు మాట్లాడే మాటలకీ పొంతే లేదు. ఇంక తల్లితండ్రులు కూడా వహ్వా మనవాడి ఐక్యూ ఎంతుందో అనే మురిసిపోవడమే కానీ, Are we on the right track అని ఆలోచించే టైమే లేదు. వాళ్ళని అనీ ఏం లాభం లెండి? వాళ్ళుమాత్రం ఏం చేస్తారు? నూటికి తొంభై మార్కులొచ్చినా, సీటొస్తుందో లేదో తెలియదు. తీరా చదివు పూర్తైన తరువాత ఉద్యోగం వస్తుందో లేదో తెలియదు. Adolescence అనే మాటకి అర్ధం ఏ డిక్షనరీలోనూ కనిపించదు, కారణం అసలు అదేమిటో తెలిస్తే కదా !!!

15 Responses

 1. Totally agreed!

  Like

 2. నిజమే sir… u r right.

  Like

 3. Excellent post !!! 100% agree with you.

  Like

 4. Every thing is artificial

  Like

 5. మనిషి ఎప్పుడయితే ప్రకృతిని తన అధీనంలోకి తెచ్చుకోవడం మొదలు పెట్టాడో అప్పుడే సగం నాశనం అయ్యాడు. అలాంటిదే ఈ సంకర (hybrid) జాతి కూరగాయలు, పళ్ళు పండించటం కూడాను. పిల్లలకి బాల్యం యొక్క అందం తెలియకుండా మీరు చెప్పినట్టు మర మనుషుల్లా తయారు కావడానికి మాత్రం కేవలం పోల్చుకునే తత్వమే. అది తల్లిదండ్రులవనీయండి లేదా పిల్లలే అవనీయండి! చాలా చక్కగా చెప్పారు నేటి పరిస్థితి గురించి!

  Like

 6. కాలం మారుతోంది మాష్టారూ. మనం కూడా మారాలి కాలానికనుగుణంగా. కానీ మార్పు అనేది వేలం వెర్రి కాకూడదు. దురదృష్ట వశాత్తు అదే జరుగుతోంది కొన్ని చోట్ల. ఇందులో తల్లితండ్రుల పాత్ర ఎక్కువుగా ఉంటోంది. అంటే మన పిల్లల పాత్ర మన మనవల, మనవారాండ్ర విషయం లో. మన పెంపకం లోనే ఎక్కడో లోపం ఉందేమో? ఇందులో బాధ్యత మన తరం దే ఎక్కువ అనిపిస్తుంది నాకు.

  కింది మధ్య తరగతి జీవితాలనుంచి పైకెదిగే క్రమం లో మన పొరపాట్లు కూడా ఎక్కువే నని పిస్తోంది మన పిల్లల విషయం లో. (మన అన్నది నేను జనరల్ గా అనే ఉద్దేశ్యం తోనే వాడాను.)

  Like

 7. చదువుతుంటే బాధగా అనిపించినా అదే నిజం. 100% మీతో ఏకీభవిస్తాను.

  Like

 8. బాగా చెప్పారండీ…….

  Like

 9. తల్లిదండ్రుల ఆలోచనల్ని పిల్లలపై రుద్దటం ఈ కాలంలో మామూలైపోయింది. ఒకవేళ ఎవరన్నా అదికాదని అందరికన్నా భిన్నంగా పిల్లల్ని పెంచుదామన్నా కుదరని పరిస్థితి వచ్చింది. ఈ సొసైటీ ని వదిలి అడవిలో కాపురం వుండలేం కదా.. పక్కపిల్లాడిని చూసి వాళ్ళూ నేర్చుకుంటారు.
  ఇంకేం చేస్తాం.. మనమూ ఆ సంకర జాతి పండ్ల మెరుపును చూసి ఆనందపడటం తప్ప.
  బాపుబొమ్మలా ఇంకేమన్నానా!. అసలు వాటి కాలిగోటికి తగ్గవి కనిపించే అందాలే లేవీ రోజుల్లో.. మాంచి బీటుంటేనే సినిమా పాట, ఒక ఫైటుంటేనే సినిమా హిట్టంటా.. కుప్పిగంతులేస్తేనే హీరోనంటా.., నగ్నత్వం అంటేనే అందం అంట. ఇదనే కాదు అన్నీ అలాగే తగలడ్డాయి.. పాత గొప్పలూ.. పాత చెప్పులూ చెల్లవులే ఈనాడు అన్నట్టు.. ఇప్పుడొచ్చే వేటిలోనూ సహజత్వమనేదేలేదు. పాతవాటిల్లో ఎంత అందం.. ఎంత ఆనందం వుందండీ.. ఎన్ని వేల వాయిద్యాలు టెక్నాలజీలు వచ్చినా పాతపాటంత తియ్యగా ఏపాటలైనా వుంటున్నాయా ఈ రోజుల్లో. ఇప్పటికీ అవే మా మనసులు దోచకుని నడిపిస్తున్నాయంటే నమ్మరు. ఇది చూసి మమ్మల్ని వీడో పిచ్చోడులే అనే వాళ్ళూ ఉన్నారు.

  మీరు చెప్పిందే నేనూ చెబుతున్నానంటారా!, మీ బాధకంటే మా బాధే ఎక్కువ.. మీకూ మాకూ ఒక జనరేషన్ గ్యాప్ వుంది మరి.

  ఈ టపాలో మీలో ఒక విప్లవ కవి కనిపించాడు నాకైతే. నాకూ ఇలాంటివి రాయాలని మనసు రగిలిపోతుంటుంది.. రాసినా పోస్ట్ చేయటానికి మనసొప్పదు… ఎవడు వింటాడు ఈ రోజుల్లో అనిపిస్తుంటుంది.
  మీరూ నేనూ ఎంత అరిచినా ఎన్ని రాసినా బ్లాగ్ రోదన తప్ప ఏమైనా ఒరుగుతుందంటారా 🙂

  Like

 10. ఏమిటో ఈ మధ్య రాజు గారు కొంచెం చిరాగ్గా ఉన్నట్టున్నారు.

  Like

 11. కృత్రిమంగా మాగబెట్టిన పళ్ళు వేగంగా కుళ్ళిపోతాయి. అమాయకత్వం తెలీకుండానే టీనేజ్ దాటేస్తున్న నేటి పిల్లలదీ అదే పరిస్థితి. చారిత్రక విషాదం.

  ఫణీంద్ర

  Like

 12. ఏవిటో ఈ కాలం పిల్లల హైక్యూ పెరిగిందా !? చుట్టూ వున్న నేటి పరిస్థితుల ప్రభావమా అని అనుకొవాలా? పిల్లలు పిల్లలా మాట్లాడితే
  ముద్దుగా వుంటుందిగానీ పెద్దపెద్ద మాటలు మాట్లాడితే ఎబ్బెట్టుగా వుంటున్నది. దీనికి కారణం వాళ్ళు ఇంట్లో చూసే టీవీలు, ఈనాటి
  మోడరన్ బడులూ! ఇక పెద్దలుకూడా వాళ్ళ ఎదుట కొన్ని మాటలు మాట్లాడకుండా వుంటేనే బాగుంటుంది. పెద్దవాళ్ళని అనుకరించే
  కదా పిల్లలు నేర్చుకొనేది. ఒకవేళ వాళ్ళు అట్లా మాట్లాడితే అట్లా అనకూడదు, తప్పు అని చెప్పాలి తప్ప , ఇంకా వాళ్ళు ఏఏ కారుకూతలు
  మాట్లాడతారో గొప్పగా, వచ్చిన వాళ్ళకు చెబుతుంటారు. నెలల పిల్లలకు చేతికి సెల్లు ఫోనులను అవెవో గిలక్కాయల్లా ఇచ్చిన వాళ్ళను
  చూశాను. పూర్వం పసిపిల్లలకు ఆడుకోవటానికి గిలక్కాయలని (వెండివి కూడా) అమ్మేవారు. వాళ్ళు చిట్టి గుప్పెళ్ళల్లలో పట్టుకొని చిట్టి
  చేతులు కదుపుతుంటే గలగల శబ్దం వచ్చేది.

  Like

 13. @కృష్ణప్రియా,

  థాంక్స్…

  @శుభా,

  ధన్యవాదాలు..

  @రూత్,

  నా టపా నచ్చినందుకూ, నా అభిప్రాయాలతో ఏకిభవించినందుకూ ధన్యవాదాలు..

  @శర్మ గారూ,

  ఈ ఆర్టిఫిషియాలిటీ మీద కూడా ఒక పోస్టు వ్రాశాను…

  @రసజ్ఞా,

  నా అభిప్రాయాలతో ఏకిభవించినందుకు ధన్యవాదాలు..

  @సుబ్రహ్మణ్యం గారూ,

  మన పెంపకం లో లోపం ఉందంటే కొద్దిగా బాగుండలేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల వల్లనే ఈనాటి జనాలు మారిపోయారు !

  @స్వాతీ,

  థాంక్స్..

  @శ్రీనివాసా,
  నీ బాధ అర్ధం చేసికోగలను. కానీ పరిస్థితి నీ చేతుల్లో ఏమీ లేదు !!

  @ఫణీంద్రా,
  ఆ తప్పేదో చరిత్ర మీద పెట్టేస్తే ఓ గొడవొదిలిపోతుంది కదూ !!!!

  @గురువుగారూ,
  గిలకలూ బూరాలూ గుర్తుచేసికోడం తప్ప ఏమీ చేయలేము.We are silent spectators only..

  Like

 14. మాధవీ,

  బులుసు వారికి భయపడిపోయి, Maddy మార్చేసి, మాధవి గా ప్రత్యక్షం అయిపోవడం ఎమిటో బాగాలేదు !!!!

  Like

 15. @బోనగిరి గారు
  హహహా…, మీరెందుకలా అన్నారో అర్ధమయ్యింది లేండి. మొన్న మీ కామెంటుకు ఇచ్చిన సమాధానం చూసినట్టున్నారు. అదేంలేదండీ.. చిరాకేం కాదుగానీ కాస్త మొరటుగా స్పందించాను అంతే. అందులో కూడా హాస్యం చూడండి.. ఎంత నవ్వొస్తుందో మీకు. అర్ధంచేసుకోరూ… 🙂

  బాబాయ్ గారూ.. మీరైనా బాధ అర్దంచేసుకున్నందుకు సంతోషాలు. 🙂

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: