బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


www.indianexpress

ఏమిటో మా అన్నా సాహెబు గారి టీం అంతా గందరగోళం అయిపోయింది! ఒకళ్ళేమో, కాశ్మీరు లో అదేదో జనవాక్య సేకరణ చేస్తే బావుంటుందంటాడు. ఇంకో ఆయనేమో, తన్నులు తిన్నాడు. నేనేం తక్కువా అంటూ, కిరణమ్మగారు తను, ఎప్పుడెప్పుడో ఎక్కడెక్కడికో వెళ్ళినప్పుడల్లా, ఎవరైతే తనని ఆహ్వానించారో, వాళ్ళందరినుంచీ, ముక్కుపిండి, పూర్తి ఫేర్ లు వసూలు చేసింది, తనేమో హాయిగా కన్సెషన్ లో ప్రయాణాలు చేసింది. అదేదో పేపరు వాళ్ళు ఈ విషయమంతా గుట్టురట్టు చేసేటప్పటికి, అదేమీ లేదూ, పేద పిల్లల చదువులకోసమే అలా వసూలు చేశానూ, అంటుంది. మరి ఈమాటేదో ముందరే చెప్పొచ్చుగా, ఎవరో పట్టుకున్న తరువాత కాదుగా. ఇంక ఈ గొడవలన్నీ భరించలేక, మా అన్నా సాహెబ్ గారేమో శుభ్రంగా ” మౌన వ్రతం” లోకి వెళ్ళిపోయారు! ఇదే హాయి కదూ, ప్రతీ అడ్డమైనవాడికీ సమాధానం చెప్పుకోనఖ్ఖర్లేదు! మనం కూడా ఇళ్ళల్లో భార్యలకి సమాధానం చెప్పలేకపోతే, హాయిగా నోరుమూసుక్కూర్చుంటాము. అడిగి అడిగి తన నోరే నొప్పెడుతుంది !

ఈ సందర్భం లో నిన్నటి Indian Express లో వచ్చిన వ్యాసం , నాకైతే చాలా నచ్చేసింది…. పైన ఇచ్చిన పి.డి.ఎఫ్ మీద ఓ నొక్కు నొక్కండి...

   ఆయనెవరో స్వాములారేమో, చందా రూపం లో వచ్చినడబ్బంతా, ఓ ఎకౌంటూ పాడూ లేకుండా లాగించేస్తున్నారనంటున్నారు. అన్నా గారి ఉద్యమం సమయంలో, కావలిసినంత మంది ఏవేవో, టోపీలూ అవీ తయారు చేసి డబ్బులుచేసికున్నారు. పైగా మన దేశం లోని ” అతిరథ మహారథు” లందరూ, Status Symbol లా ప్రతీ సోషల్ నెట్వర్కు లోనూ, హోరెత్తించేశారు. పైగా అక్కడెక్కడో ఈజిప్టు లోనూ, లిబ్యా లోనూ జరిగిన ” ప్రజా ఉద్యమాలు” గురించి మాట్లాడడమే. అక్కడి ఉద్యమాలకీ, ఇక్కడి ఉద్యమా లకీ తేడా ఏమిటంటే, మనది ప్రజాస్వామ్యం, వారిదేమో నియంతృత్వం. దానికీ, దీనికీ సహస్రాలు తేడా ఉంది. మన దేశం లో 65 ఏళ్ళ క్రితం స్వాతంత్రోద్యమం జరిగిందంటే, కారణం అందరి గోలూ దేశ స్వాతంత్రమే. మరి ఇప్పుడో, ప్రతీ ఉద్యమం వెనుకా ఓ రాజకీయ పార్టీ ఉంటుంది. వాళ్ళు అధికారం లోకి వస్తే, ఎంత నొక్కేయొచ్చా అని అనుకుంటారు కానీ, మన సంగతెవడిక్కావాలి? అయినా సరే గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ఎవడి వెనక్కాలో ఫాలో అయిపోవడమే! అప్పుడెప్పుడో ఓ టపా వ్రాశాను- ఈ విషయం మీద. పైన ఉన్న వ్యాసం చదివిన తరువాత, ఫరవాలేదు, నేను మరీ ఏదో మహాపాపం చేయలేదూ అనిపించింది !!!

9 Responses

 1. ఎందరో మహానుభావులు, ఆందరూ,
  గురువింద సామెత ను గుర్తుకు తెస్తున్నారు.

  Like

 2. I agree to dis agree with you

  Like

 3. ఫణిగారు,
  కాంగ్రెస్‌పై యుద్ధమంటే మాటలా, ఇలాంటివి ఇంకా ఎన్నో. ఎన్.డి.తివారిలాంటి మహానాయకులు 80ఏళ్ళదాకా పదవులు అనుభవించిన మహా పార్టీ అది! అడ్డంగా కపిల్‌సిబాల్‌కు సమాచారం చేరవేస్తూ అడ్డంగా పట్టుబడిన అడ్డగాడిద అగ్నివేష్ లాంటి వాళ్ళను చూశాంగా! నా ఉద్దేశ్యంలో ఆయా ఆరోపణలు 100% నిజాలైనా, ఆ టీం చేసే వుద్యమానికి మద్దతిస్తా, విరాళమిస్తా.
  వాళ్ళ కృషి ఫలితంగా కనీసం ఎంతోకొంత చలనం మబ్బు సింగడి (MMS) సర్కారులో మొదలయ్యిందనేది నిజం. ఇలాంటి లక్ష ఎదవలు రిపోర్ట్లు రాసినా హజారే సంస్కరణలు కొనసాగాలి. ఏ ఎదవాని మద్దతిచ్చినా , ఇవ్వకున్నా, హజారే ఎన్నికలను ప్రభావితం చేసే శక్తిగా మారారు. నాకు అతని మీద JP మీద వున్న దానికన్నా ఎక్కువ నమ్మకముంది.

  మీ అభిప్రాయాలు, ఆలోచనలు ఈ విషయంలో సమతూకంగా లేవు.

  Like

 4. “……దానికీ, దీనికీ సహస్రాలు తేడా ఉంది. మన దేశం లో 65 ఏళ్ళ క్రితం స్వాతంత్రోద్యమం జరిగిందంటే, కారణం అందరి గోలూ దేశ స్వాతంత్రమే. మరి ఇప్పుడో, ప్రతీ ఉద్యమం వెనుకా ఓ రాజకీయ పార్టీ ఉంటుంది. వాళ్ళు అధికారం లోకి వస్తే, ఎంత నొక్కేయొచ్చా అని అనుకుంటారు కానీ, మన సంగతెవడిక్కావాలి? అయినా సరే గుడ్డెద్దు చేలో పడ్డట్టు, ఎవడి వెనక్కాలో ఫాలో అయిపోవడమే! …….”

  ఫణి బాబుగారూ చాలా బాగా చెప్పారు. అవినీతి అంతం అవ్వాలంటే ఏదో ఒక ఉద్యమంగా ఒక పది మంది నిక్కచ్చిగా ఉంటే చాలదు (వాళ్ళూ అలా లేరని వార్తలు చెబుతున్నాయి, నిజానిజాలు ఏమిటో తెలియదు), ప్రజలందరికీ ఉండాలి నిజాయితీగా ఉండాలని. అన్నా హజారే గారు చెప్పిన చట్టం వచ్చినా కూడా ప్రజలు తమకు నష్టం కలిగినా సరే, తమకు కావలిసిన పనులు తాము అనుకున్న సమయంలో కాకపోయినా సరే ఏమయినా సరే లంచం ఇవ్వకూదదు అనే దీక్ష ఉండాలి. తాము ఎన్నుకున్న వాళ్ళు ఏ మాత్రం అటూ ఇటూ పోయినా, పనికి రాని ప్రకటనలు ఇచ్చి, అవినీతికి పాల్పడినా ఎదిరించగల ధైర్యం ఉండాలి. ఊరికే కొవ్వొత్తులు వెలిగించీ ఆయనెవరో నిరాహార దీక్ష చేస్తుంటే ఆయన చుట్టూ చేరి భజనలు చేసి ఆ టోపీలు పెట్టుకున్నంత మాత్రాన అవినీతి పోదు.ప్రజలందరిలోనూ నిజాయితీ, మొక్కవోని ధైర్యం ఉండాలి.

  Like

 5. అన్నా ఏమి సాధించినా సాధించకపోయినా, కనీసం ప్రయత్నం చేస్తున్నాడు కదండీ.
  మనకి ఓపికుంటే మద్దతు ఇవ్వాలి కాని నిరుత్సాహపరచడం ఎందుకు?

  Like

 6. @మోహన్ గారూ,

  ధన్యవాదాలు.

  @శర్మ గారూ,

  Most welcome !!!!

  @Snkr,

  హజారే చేస్తున్నది తప్పని నేనెప్పుడూ అనలేదే ! ఆయన నిజాయితీ పరుడే అవొచ్చు. కానీ, ఆయన వెనక్కల ఉన్నారు కదా అని, వాళ్ళందరినీ నమ్మమంటే కష్టం మాస్టారూ.

  అయినా ఎవరి అభిప్రాయాలు వారివీ. ఆ మాత్రం freedom of speech ఉందనే అనుకుంటున్నాను.

  @శివరామప్రసాద్ గారూ,

  ముందుగా ధన్యవాదాలు. నా టపా నచ్చినందుకు. కానీ పరిస్థితి ఏమిటంటే అన్నా సాహెబ్ కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, వారికి దేశభక్తి లేనట్టు భావిస్తున్నారు చాలా మంది.
  ఊరికే గుండెలు బాదేసికుని, టోపీలు పెట్టుకుంటేనే దేశభక్తులంటారా ? ఏమో ఓసారి ప్రయత్నిస్తాను !!

  @బోనగిరీ,

  ఇక్కడ ఎవరూ ఎవరినీ నిరుత్సాహపరచడం లేదండి. నేను పెట్టిన వ్యాసం లో శ్రీ శేఖర్ గుప్తా ప్రస్తుతం ఉన్న పరిస్థితిని విశ్లేషించారు. దాన్ని మీరు ” నిరుత్సాహం” అంటే చేసేదేమీ లేదు. అప్పనంగా తినేసిన డబ్బు ( కిరణ్ బేడీ), ఎవరో బయట పెట్టారని, తిరిగి ఇచ్చేస్తానంటే చేసిన తప్పు మాఫీ అయిపోతుందా?

  Like

  • Freedom of Speech – దానికేమీ మనదేశంలో తక్కువలేదు కాబట్టే, ముక్కోడు, తెలబాన్ యూనియన్లు అన్ని బూతులు తిట్టినా కాంట్రాక్టులు, ముడుపులు ఇచ్చి రాజీ చేసుకున్నారు. 🙂

   హజారే వెనక వున్న వాళ్ళు, బేడి, కేజ్రివాల్, భూషణ్ లను చిన్న చ్తక తప్పిదాల్లో ఇరికించబడినా (వారి మీద ఎందుకు అప్పుడే చర్య తీసుకోలేదు? ఇప్పుడు తవ్వి తీయడంతో వేలకోట్ల కుంభకోణాల్లో పాత్ర వున్న వీళ్ళు పరిశుద్ధాత్ములైపోరు కదా – అనేది నా ప్రశ్న)

   హజారే అవినీతి ఆరోపణల్లో ఇరికించబడ్డా… ఇక్కడ వాళ్ళ సదాశయం ప్రధానం, వ్యక్తులు కాదు. వాళ్ళ కృషివల్ల ఓ పటిష్టమైన చట్టం వచ్చాక, వీళ్ళందరినీ ఆ చట్టం కింద తిహార్ పంపిచ్చవచ్చు కదా అనే నా అభిప్రాయం. కాబట్టి వారికి మద్దతునివ్వడంలో తప్పు లేదు.

   Like

 7. “…….. కానీ పరిస్థితి ఏమిటంటే అన్నా సాహెబ్ కి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే, వారికి దేశభక్తి లేనట్టు భావిస్తున్నారు చాలా మంది……”

  This is called over enthusiasm and over zealous behaviour. Yes there is corruption all over and every one of us is part of it. No exception. The way to remove corruption is to start from oneself first.The most minimum thing all of us can do is following the civic sense and voting in all elections. Lets do these two things first then we shall get a right to fight the corruption from without. Being part of the corruption, how one can say that they are fighting corruption. Its not politicians alone who are resorting to corruption, they are only a refined and most efficient part face of the corruption.

  Just wearing some caps and clapping and dancing will only be a good tamasha for TV news channels, but will not solve the problem at all and the so called Anna Hazare act will be more dangerous to the country, as it is bound to be misused by zealots and our Country may become like France just after its so called chaos which was termed as revolution,

  Like

 8. @Snkr,

  ” వెనక వున్న వాళ్ళు, బేడి, కేజ్రివాల్, భూషణ్ లను చిన్న చ్తక తప్పిదాల్లో ఇరికించబడినా …” మీ దృష్టిలో అవి చాలా చిన్న చిన్న తప్పిదాలు. శశిభూషణ్ కి మాయావతి స్థలాలిస్తే అదికూదా చిన్నదే. ఏదో తిన్నదరక్క కిరణమ్మ ట్రస్టు కోశాధికారి, వీళ్ళ double standards భరించలేక, ట్రస్టు నుండి తప్పుకోవడమూ మీ దృష్టిలో తప్పే ! అలాగే కానియండి, మీ ఇష్టం మీదీ ! నాలాటివాళ్ళకి ఇలాటి ప్రముఖుల ” త్యాగాలు” అర్ధం అవవులెండి !

  @శివరామప్రసాదు గారూ,

  మీరు మరీ ఇలాగ స్పందిస్తే, మనం “దేశద్రోహులు” కింద పరిగణించబడతాము, మాస్టారూ. వదిలేయండి…

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: