బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– Good old gripewater…..


   కనీసం గత మూడు నాలుగు తరాలనుండి ప్రతీ ఇంటిలోనూ, చిన్న పిల్లలు ఎప్పుడు ఏడ్చినా, ఇదిగో ఇలా చేసేవారు! మరి ఆ గ్రైపువాటరు ఎక్కడ మాయం అయిపోయిందో ఆ భగవంతుడికే ఎరుక! ఎవడో ఏ లాబీ వాళ్ళో రంగం లోకి దిగుంటారు. ఈరోజుల్లో గ్రైపు వాటర్ తీసికుంటే, ఫలానా రోగం వస్తుందీ, లేకపోతే ఇంకోటేదో వస్తుందీ అని భయపెట్టేసుంటారు. డాక్టర్ల్కి ఫ్రీబీలు ఇవ్వడం కూడా మానేసుంటారు. దానితో వాళ్ళుకూడా రికమెండు చేయడం మానేసుంటారు. 1980 దశకం దాకా మన దేశం లో గ్రైపు వాటర్ ఓ చుక్కేనా వేసికోకుండా పెరిగిన పిల్లో పిల్లాడో ఉన్నాడంటే నమ్మడం కష్టం !

   అదేదో త్రాగితే నష్టం వచ్చేస్తుందీ, addiction అయిపోతుందీ, వగైరా వగైరా చెప్పి భయపెట్టేశారు. త్రాగినవాళ్ళందరూ గుండ్రాయిల్లా ఉన్నారు. ఒక విషయం నిజమే, దానిలో alcohol content కొంచం ఎక్కువే! అయితే ఏమిటిట? ఇప్పుడు తల్లి పాలు త్రాగడం మానేసినప్పటినుండీ చిన్న పిల్లలు తినే, త్రాగే వస్తువులకంటే, addictive అనుకోను!

   ప్రొద్దుటే లేవడం తోటే అవేవోహనీ లూప్పులుట, అవి కాకపోతే చాకోలుట. ఆకలేసిందంటే, నూడుల్స్ ఉండనే ఉన్నాయి! ఇవన్నీ కాకుండా ఫూడుల్సోటిట ! వీటికంటే అన్యాయమంటారా ఆ గ్రైపు వాటరూ? పైగా, ఓ వయస్సొచ్చేసరికి, గ్రైపు వాటర్ పిల్లల చేతికందకుండా పెట్టేవారు. పెద్దాళ్ళు అటొచ్చీ, ఇటొచ్చీ ఎవరూ చూడకుండా ఓ చుక్కేసికునేవారనుకోండి. అందులో ఉన్న కిక్కు, ఓ గ్లాసుడు బీరు తాగినా ఉండేది కాదు, పైగా ఆ రోజుల్లో ప్రొహిబిషనోటీ !!

    ఏ శనాదివారాలో వచ్చాయంటే, పిజ్జాలూ, బర్గర్లూ ఉండనే ఉన్నాయి. ఇంక పెద్దాళ్ళకైతే పానీ పూరీలూ వగైరాలు. అవన్నీ తీసికోకూడదనడం లేదు, కానీ దేనికైనా ఓ హద్దూ పద్దూ ఉంటే బాగుంటుంది. హాయిగా ఓ పండు ఏదో తీసికుని రసం తీసికుంటే పోయే దానికి, రియల్ జ్యూసులూ వగైరా. అవన్నీ పీకలదాకా త్రాగడమూ, మర్నాటినుంచి దగ్గు ప్రారంభం అయి డాక్టర్ల దగ్గరకి పరిగెత్తడమూనూ.

    అసలు ఈ వేలం వెర్రేమిటో తెలియడం లేదు. పైగా ఈ రోజుల్లో ఏ మాల్ కి వెళ్ళినా, రకరకాల తిళ్ళు. పైగా చిన్న పిల్లల ఏ చానెల్, ఓ పోగో అనండి, ఓ డిస్నీ అనండి, ఓ కార్టూన్ నెట్ వర్కనండి దేంట్లో చూసినా వీటి సంబంధిత యాడ్లే! మొన్నెక్కడో కొట్టుకి వెళ్తే, ఒకావిడ అడుగుతోంది– బోర్న్ వీటా విత్ అదేదో మెమొరీ బ్లాస్టో సింగినాదమో కావాలని. ఆవిణ్ణడిగాను, మీ పిల్లాడికోసమా అని. ఏం చేయనూ అది లేకపోతే హోం వర్క్ చేయనంటున్నాడూ అన్నారు. Kids are holding parents for a ransom !! ఏమీ చేయలేని పరిస్థితి! Absolutely helpless!

   ఏదో ఒకళ్ళో ఇద్దరో తల్లితండ్రులు, ఈ పధ్ధతి మార్చాలని చూసినా, పిల్లలకి మళ్ళీ స్కూళ్ళల్లో అదేదో పీర్ ప్రెషరుట ! అక్కడికేదో ఇదివరకటి రోజుల్లో, చిరుతిళ్ళూ, ఫలహారాలూ లేకుండా పెరిగేరా పిల్లలూ? ఆరోజుల్లోనూ ఉండేవి మినప రొట్టె, మినప సున్ని, శనివారాలొచ్చాయంటే వాసిని పోళ్ళూ, సరదాగా నోట్లో వేసికోడానికి చేగోడీలూ, కారప్పూసా ఓహ్ ఎన్నెన్నుండేవో? ఇప్పుడు అలాటివన్నీ చేసికోడానికి టైమూ లేదూ, ఓపికా లేదూ. రైటే. ఏ దుకాణం లో చూసినా దొరుకుతాయిగా. మావాడికి ఇలాటి తిళ్ళు ఎక్కవండీ, వాడిదంతా పిజా కల్చరండీ అంటూ పోజులెట్టడం ! ఇంకేం చేస్తాం? తూర్పుకి తిరిగి దండం పెట్టడమే !!

10 Responses

  1. హహహ చక్కగా ఉందండీ మీ టపా! ఇక్కడ నాకొక విషయం పంచుకోవాలనిపిస్తోంది మా క్లాసులో ఒకమ్మాయుండేది అది కొంచెం అల్లరిది. ఏమయినా జరిగినప్పుడు ఏమయింది అంటే మేము పాప ఏడ్చింది అనే వాళ్ళం అది వచ్చి heywards పట్టండి అనేది! ఏ మాటకామాటే చెప్పాలి వుడ్వర్డ్స్ బాగుంటుందండీ!

    Like

  2. అయ్యబాబోయ్ బాబాయిగారు,,Gripewater లొ alchohol ఉంటుందా?? నాకిప్పటిదాకా తెలీనేలెదు సుమీ..అందుకేనా మా 9 mon బుజ్జిది తెగ తాగుతుంది..ofcourse రెండు చెంచాలేలెండి..Gripewater వాడకపోవటం ఏంటండి బాబు..నేను అమెరికా లొ,మా area అంతా గాలించి మరి woodwards పట్టాను..ఇస్తున్నాను…india లొ వాడటం లేదన్నమాట జనాలు..hmmm..

    “”ఎన్నెన్నుండేవో? ఇప్పుడు అలాటివన్నీ చేసికోడానికి టైమూ లేదూ, ఓపికా లేదూ. రైటే. ఏ దుకాణం లో చూసినా దొరుకుతాయిగా””

    దొరుకుతాయి కాని బాబాయిగారు,,మరి ఆ నూనె,,మళ్ళి మళ్ళీ కాగబెట్టి,,అసలు ఎం నూనె వాడతారో…ఇలా నాకు పలు అనుమానాలు వస్తుంటాయి…ofcourse,,పిజ్జా లు మంచివి అని నేననను..:)

    Like

  3. వుడ్వర్డ్స్ జోకులు మా కాలేజీ రోజుల్లో కూడా ఉండేవి….

    ఇక్కడ ఏది దొరికినా అపురూపంగా చూసుకునే జనాలు…
    అక్కడేమో అన్ని వస్తువులూ అందుబాటులో ఉన్నా కాలితో తన్నే రోజులు…

    ఇదే కలి ప్రభావం అనుకుంటా….

    అవునూ బులుసువారు కనబడటం లేదేమిటి చెప్మా…

    ఎక్కడ వైద్యం చేయించుకుంటున్నారో…………
    పాపం ఇంకా అంతుబట్టి ఉండదు డాక్టర్లకు…

    Like

  4. అవునండీ ఇప్పుడు గ్రైప్ వాటర్ వద్దని చెప్పి డాక్టర్లు వాళ్ళకు తెలిసిన.. బాగా లాభాలొచ్చే జనరిక్ మందులిస్తున్నారు. పుట్టిన పిల్లాల్లో చాలా శాతం వరకూ జీర్ణ వ్యవస్త కుదుటపడటానికి కాస్త సమయం పడుతుంది. తాగిన పాలు అరగక ‘కోలిక్’ అని కడుపులో కాస్త ఇబ్బంది కలుగుతుంది.. అంటే పెద్దాల్లలో గ్యాస్ లా అన్నమాట. దాంతో వాళ్ళు అర్ధరాత్రి లేచి.. ఏడ్చే ఏడుపుకి మనకు నరకం కనపడుతుంది.. అది వేరే విషయం… అనుకోండి. :), గ్రైప్ వాటర్ పట్టడం వల్ల జీర్ణ వ్యవస్త కాస్త బాగుపడి ఇలాంటి ఇబ్బందులు పడే అవకాశాలు తక్కువ.. అందుకే డాక్టర్ చెప్పకపోయినా ఇచ్చేవారు అప్పట్లో. ఇప్పటి డాక్టర్ల వలన అది మానేసి.. సమస్య వచ్చాకా డాక్టరిచ్చిన ఇంగ్లీషు మందులు వాడుతున్నాం. అదీ ఇదీ ఒకటే ఫార్ములా. మన పల్లెటూర్లలో అయితే అనాస అని అనాస అరుకు అమ్మేవాడిదగ్గరకు పరుగులు తీస్తారు.. వాడేదో అరుకు పారేస్తాడు.. అదీ అలాంటి ఫార్ములానే అయ్యుంటుంది… ఇన్ని విషయాలు నాకు ఎలా తెలిసాయని అడక్కండి.. మా వారసుడు వున్నాడుగా.. నేర్చుకోవాల్సొచ్చింది.. నేను ఒక ఎం.బి.బి.ఎస్ (డి.సి.హెచ్) కన్నా పర్వాలేదు ఇప్పుడు.. త్వరలోనే ఎం.డి చెయ్యబోతున్నా 🙂

    Like

  5. Phani Garu

    I would like to share on grip water. When my daughter is in months baby, my in laws used to shout at me for not using grip water to my baby. They feel that i am not taking care of my daughter properly and not giving grip water to her. Children’s doctor did not prescribed grip water to my daughter at any time. I could not control pressure from my in laws for not using grip water and went to my children’s doctor and told the same. He told me grip water will have alcohol and kids will sleep long hours. It is not good for their health. If we use it later stage they will become fat. It is true grip water babies will become fat in the later stages when compared with not used kids.

    Like

  6. @రాజేష్,
    థాంక్స్…

    @రసజ్ఞ,
    రుచి చూశారన్న మాట !!

    @నిరుపమా,

    Woodward’s Gripe Water has spawned many imitators, but none have proven to be as popular in Europe. It is true, the original formula for Woodward’s contained 3.6% alcohol. In 1992, following public pressure, the alcohol was removed, ఇదంతా నా ప్రజ్ఞ కాదు. ఏదో సందర్భం వచ్చింది కదా అని నెట్ లో వెదికి పెట్టేశాను! ” మరి ఆ నూనె,,మళ్ళి మళ్ళీ కాగబెట్టి,,అసలు ఎం నూనె వాడతారో…” ప్రతీ దాన్నీ అనుమానిస్తే ఎలా? పిల్లలు ఇరవైనాలుగ్గంటలూ నమిలే కుర్ కురే ల కంటే హానికరం అనుకోను!

    @Maddy,

    బులుసు వారెక్కడకి వెళ్తారూ? మళ్ళీ ఏ ఇలియానా కనిపించిందో….

    @శ్రీనివాసా,

    ఫరవాలేదు వృధ్ధి లోకి వస్తావు! శీఘ్రమే ఎం.డి. ప్రాప్తాయా !!!

    @శ్రీలక్ష్మీ,

    సరదాగా ఈ లింకు చదవండి..http://en.wikipedia.org/wiki/Gripe_water. ఇంకో విషయం- గ్రైపు వాటర్ తీసికున్నవాళ్ళందరూ లావుగా ఉంటారనుకోవడం తప్పు. ఆ ఒబేసిటీ కి కారణాలు ఇంకా చాలా ఉన్నాయి. అక్కడకి నేనేదో రిసెర్చ్ చేశానని కాదు, ఏదో నెట్ జ్ఞానమే !!

    Like

  7. హ హ బాగా చెప్పారు…

    Like

  8. ఆర్యా,
    ఈ gripewater పెద్దలు కూడా త్రాగొచ్చా? అంటే మత్తు కోసం కాదు, ఎప్పుడన్నా పొట్టలో గడబిడ చేసునప్పుడు వేసుకోవడానికి 🙂

    Like

  9. @Maddy,

    థాంక్స్….

    @పానీ పూరి,

    లక్షణంగా త్రాగొచ్చు !!

    Like

Leave a comment