బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు— చిల్లర…..


    నేను వ్రాస్తున్న విషయం, ప్రస్తుత యువతరానికి most irrelevant topic లా కనిపించొచ్చు. కానీ నూటికి డెభై మందికి మాత్రం ఈ “చిల్లర” అనేది most precious విషయం. ఎక్కడ పడితే అక్కడ క్రెడిట్ కార్డులు స్వాప్ చేసేవారికి ఈ కష్టాలెలా తెలుస్తాయి? చాలామందికి గుర్తుండే ఉంటుంది– ఇదివరకటి రోజుల్లో, మీ తండ్రుల వద్ద ఉండే “మనీ పర్సుల” లో, చిల్లర కోసం ఓ అర విడిగా ఉండేది. మరి ఇప్పుడో, walletటో ఏదో అంటారుట, దానినిండా క్రెడిట్ కార్డులూ, డెబిట్ కార్డులూ, అవేవో కూపన్లూ, గర్ల్ ఫ్రెండు ఫొటోలూ, పెళ్ళైనవారి దాంట్లో పెళ్ళాం, పిల్లల ఫుటోలూ కనిపిస్తాయి. చిల్లర అనే మాటే విన్నవారు కాదు. అంతా కాల మహిమ!

   అప్పుడెప్పుడో ప్రభుత్వం వారు, పావలా కాసుల్ని demonitize చేసేస్తున్నామని ఓ ఆరునెలల నోటీసిచ్చేసి, కావలిసినవాళ్ళు తమ దగ్గరున్న పావలాల్ని, ఏ బ్యాంకు వారి దగ్గరకైనా తీసికెళ్ళి మార్చుకోవచ్చని చేతులు దులిపేసికున్నారు. మార్చుకోడం అంత ఈజీయా బాబులూ, ఏ బ్యాంకుకెళ్ళండి, ” ఇక్కడ ఇవ్వలేమండీ, హెడ్డాఫీసుకెళ్తే దొరుకుతాయీ..” అనేవారే. ఈ మాత్రం లక్ష్మీ కటాక్షానికి, మళ్ళీ అంత దూరం వెళ్ళడం ఎందుకూ, ఉన్న పావలా కాసుల్ని, తమ క్రియేటివిటీ ఉపయోగించి,ఫెవికాలో, తుమ్మ జిగురో అంటించి, ఏ శిల్ప కళా ఖంఢాలో తయారు చేసికుంటే పోదా అని ఊరుకున్నవారూ ఉన్నారు. ఏది ఏమైనా, ఆ పూర్ పావలా కాసులు చరిత్రలో ఓ భాగం అయిపోయాయి!

   పోనీ చిల్లర అవసరం లేకుండా ఉంటుందా అంటే అదీ లేదు- సాక్షి పేపరు వాణ్ణి చూడండి రెండున్నర ట. ఏ మూడో, రెండో చేస్తే వాళ్ళ సొమ్మేం పోయింది చెప్పండి? పైగా ఆ పేపరాయన కోటానుకోట్లు సంపాదించాడని జనం అందరూ చెప్తున్నారాయె. కొట్టువాడు అయిదురూపాయలిస్తే, రెండు రూపాయలు చేతిలో పెడతాడు. మిగిలిన అర్ధరూపాయేదిరా అంటే, చిద్విలాసంగా ఓ నవ్వు నవ్వేసి చిల్లర లేదు సార్ అంటాడు. పోనీ ఆ మర్నాడు వెళ్ళినప్పుడు, ఓ అర్ధరూపాయ తగ్గించి ఇద్దామా అనుకుంటే, కొట్లో ఆ ముందురోజున్నవాడి అబ్బో, అన్నో, చెల్లెలో ఇంకోళ్ళెవరో ఉంటారు. మనం ఏం చెప్పినా వినరు, వాడితోనే తేల్చుకోండీ అంటారు. మళ్ళీ అదే యాక్షన్ రీప్లే! నెలా పూర్తయేసరికి, వాడికుటుంబం మనకి రోజుకీ అర్ధరూపాయి ( ఆదివారం సాక్షి మూడున్నరతో కలిపి) చొప్పునా, పదిహేను రూపాయలు బాకీ ఉంటారు. మనలాటి బక్రాలు ఇంకా చాలా మందే ఉంటారు. మళ్ళీ వెధవ బీదరుపులోటీ! ఆదివారం సాక్షీ, ఈనాడూ కలిపి తీసికుంటేనే కిట్టుబాటవుతుంది! లేకపోతే విడి విడిగా, కలిపి రూపాయి వట్టం!

    ఇంక కొన్ని వస్తువులు ప్రత్యేకంగా “బాటా” కంపెనీవి 199,399,699,1999….. వెధవ్వేషాలు కాపోతే, ముష్టెత్తేదేదో పబ్లిక్కుగానే చేయొచ్చుగా! నేను పుట్టినప్పటినుంచీ చూస్తున్నాను, ఈ “బాటా” వాడు మాత్రం వాడి strategy మార్చలేదు. కొట్టువాడు చచ్చినా ఆ రూపాయివ్వడు. అనుభవించడమే! కొన్ని కొట్లలో చూస్తూంటాము, అయిదు రూపాయలకి తక్కువైతే, అన్ని టాఫీలో, చాకొలెట్లో చేతిలో పెడతాడు. ఈ మధ్యన ఓ మాల్ లో నాకు ఇలాగే అయితే, సరే వీడి సంగతిలా ఉందా అనుకుని, బయటకి వెళ్ళి, ఓ అరగంటలో తిరిగొచ్చి, ఓ సరుకు తీసికుని, వాడి చేతిలో ఓ పది నోటూ, అంతకుముందు వాడిచ్చిన నాలుగు టాఫీలూ చేతిలో పెట్టాను. కుదరదన్నాడు, ఏం, నువ్విస్తే తీసికోలేదా, నేనిస్తే తీసికోడానికేం రోగం అన్నాను. కాదూ కూడదూ అంటే మేనేజర్ ని పిలవమన్నాను. ఆ పెద్దమనిషొచ్చి ఏమిటీ గొడవా అన్నాడు. నాకేమీ గొడవలేదూ, మీవాణ్ణే అడుగూ అంటే వాడు కథంతా చెప్పుకొచ్చాడు. ఇంతలో ఈ గొడవతో బిల్లింగు అగిపోయింది. చాలా మంది నన్ను సపోర్టు చేసినవాళ్ళే. కానీ అందులో ఉన్న హాఫ్ చెడ్డీల వాళ్ళూ, క్యాప్రీ లవాళ్ళూ మాత్రం, చిరాకు పడ్డం మొదలెట్టారు విషయం తెలిసి.” क्या इत्नीसी छॉठी चीजकेलियॅ इत्ना जगढा …” అంటూ. పైగా వారిలో ఒకతను, అంకుల్, I will pay that amount, settle the issue…, నా దగ్గర డబ్బులు లేకనా ఈ హడావిడంతా. ఇలా ఉంటుంది ఈ రోజుల్లో!

   ఎప్పుడో, ఉన్న ఆ అర్ధ రూపాయలకి కూడా ఆయుర్దాయం తీరిపోతుంది. బస్సుల్లో వెళ్ళినప్పుడు కండక్టరు ఛస్తే చిల్లరివ్వడు, పైగా డిపోకి వెళ్ళి తీసికోమంటాడు. ప్రతీ రోజూ ఎక్కడ చూసినా ఇదే గొడవ. ఇదివరకటి తోచిందిస్తే పుచ్చుకునేవారు అడుక్కునేవాళ్ళు. ఇప్పుడో, వాళ్ళ రేటూ మారిపోయింది. మినిమం రూపాయ! ఇంక హొటళ్ళల్లో కౌంటరు దగ్గరకి వెళ్ళి బిల్లులు పే చేయడం నామోషీ! ఆ స్టువార్డో, బేరరో, సర్వరో ఓ ఫోల్డరు లో ఓ బిల్లూ, పక్కనే పళ్ళుకుట్టుకునే పుల్లలూ, పటీ బెల్లం ముక్కలూ, సోంపో సింగినాదమో వేసి పక్కనే పెడతాడు. ఏ అయిదు వందల నోటో పెట్టడం, వాడు తిరిగి డబ్బిచ్చేటప్పుడు, పదిరూపాయల నోట్లు ఏమాత్రం లేకుండా చూస్తాడు. కనీసం ఓ యాభైయ్యో, వందో టిప్పు దొరక్కపోతుందా అని!

   మామూలు కూరల మార్కెట్టుకి వెళ్ళి చూడండి, చిల్లర విలువేమిటో తెలిసొస్తుంది !!!!

Advertisements

9 Responses

 1. కాలం, టైమ్, సమయ్ అలావుంది సార్ మరి

  Like

 2. అలాగే పొస్టు కార్దుల గురించి ఒక టపా వ్రాయండి.

  Like

 3. బాగున్నాయి మీ”చిల్లర” కబుర్లు 🙂

  Like

 4. నిజంగా ఇది ఒక రకం దోపిడీనే అండీ అనకూడదు కానీ అందరూ తలో దారిలో దోచుకుంటూ పోతున్నారు….

  Like

 5. పానీపూరీ123 గారూ.. ఐ ఆబ్జెక్ట్ . నేను వ్రాద్దామనుకున్న వ్యాఖ్య మీరు పెట్టేశారు.

  Like

 6. బాబాయ్ గారూ,
  బాగుంది అయితే.. అదేదో సినిమాలో నానాపఠేకర్ లా బిల్లింగ్ కౌంటర్లో వాడికి చాక్లెట్ ఇచ్చారన్నమాట. ఇదే ఒకసారి మా ఆఫీసు దగ్గరున్న డి-మార్ట్లో చాక్లెట్ ఇస్తే.. (వాడిచ్చినదే) మాట్లాడకుండా తీసుకున్నాడు. 🙂

  Like

 7. @శర్మగారూ,

  నిజమే కదండీ…

  @జ్ఞానీ,

  ఇదివరకు ఓసారి టపా వ్రాశాను https://harephala.wordpress.com/2011/07/02/baataakhaani-529/. ఈసారి పోస్టు కార్డులమీద వ్రాయడానికి ప్రయత్నిస్తాను.

  @పాని పూరి,

  చివరకు ” చిల్లర’ కబుర్లలాగ తేల్చేశావన్నమాట !!!!

  @Maddy,
  అక్కడే వస్తోంది గొడవంతా !!

  @సుబ్రహ్మణ్యం గారూ,

  అనుకున్నాలెండి !!

  @శ్రీనివాసా,

  కానీ అందరూ అలా ఒప్పుకోవడం లేదు కదా !

  Like

 8. కొత్తగా నిన్న డి-మార్ట్ లో 49 రూపాయల వస్తువు కొని 50 నోటిస్తే చాక్లెట్ ఇస్తున్నాడు.. నా దగ్గర చిల్లరుంది ఎంత కావాలి అన్నాను.. అప్పుడు రూపాయి కాసు చేతిలో పెట్టాడు.. నవ్వుతూనే క్లాసుపీకేసా…. చిల్లర లేకపోతే చాక్లెట్ట్ ఇవ్వు.. ఉండి కూడా చాక్లెట్లు అమ్ముకుంటావెందుకూ..అని… హి హీ అని నవ్వాడు..
  పాపం మేం ఏమన్నా ఎవరూ మాట్లాడరులేండి… మా ఆఫీసు పక్కబిల్డింగులోనే డి-మార్ట్ ఉండటంవల్ల… రోజు సగం మంది మా కంపెనీ కష్టమర్లే.. అంతా తెలిసిన స్టాఫే.. కాకపోతే బిజినెస్ టాక్టిక్స్ మాత్రం మామీద ప్రయోగించడం మానరు. 🙂

  Like

 9. శ్రీనివాసా,

  ఉన్న బేరాలు పోగొట్టుకోడం ఎందుకని, వాడు ఒప్పుకుంటున్నాడు. మా ఇంటి కింద రిలయెన్సు వాడిక్కూడా, నేను రెగ్యులర్ గిరాయికీనే. వాళ్ళు నాతో వేషాలేయరు!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: