బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఏం చేస్తారు, భరించాలి.. తప్పదు మరి….


   ఏమిటో గత నాలుగు రోజులనుండి, టపా వ్రాయడానికి మూడ్డే రావడం లేదు. ఏదైనా ఎక్కువ అయితే అలాగే ఉంటుందేమో? ఇంకా రెండున్నరేళ్ళు పూర్తవలేదు, మరీ 675 టపాలు కొంచం ఎక్కువైపోలేదూ? ఏదో అభిమానం కొద్దీ చదువుతున్నారు కదా అని, మిమ్మల్నందరినీ ప్రతీ రోజూ బోరుకొట్టేయడం భావ్యం కాదని, నోరుమూసుక్కూర్చున్నాను. కానీ ఈ వ్యసనం లోంచి బయటపడ్డం అంత సులభం కాదని తెలిసింది. ఇదిగో మళ్ళీ ప్రారంభం! ఏదైనా సరే “అతి” అయితే, చిరాకేసికొస్తుంది.ఒక్కొక్కప్పుడు, అది నెగెటివ్ గా కూడా రూపాంతరం చెందొచ్చు, కదూ?

   ఉదాహరణకి మన టి.వి.చానెల్స్ లో వచ్చే యాడ్ల సంగతి తీసికోండి. చానెళ్ళవాళ్ళకి వచ్చే ఆదాయం అంతా, ఈ యాడ్లవల్లే అంటారు మీరు. నిజమే కాదనం. కానీ మరీ ఇంతలా బోరు కొట్టేయాలా? పైగా ఒకే యాడ్డు, వాళ్ళు వేసే పధ్ధతి చూస్తే, మళ్ళీ జీవితం లో ఏ యాడ్డు వేశారో ఆ సరుకు ఛస్తే కొనకూడదని నిశ్చయించేసికుంటాము.One is put off after watchng the same ad so many times. ఆవిషయం ఆ కంపెనీల మార్కెటింగు వాళ్ళకి తెలియడం లేదా? లేక తెలిసినా, కంపెనీ యాజమాన్యం వారు ఏదో యాడ్ బడ్జెట్ ఎలాట్ చేశారూ, దాన్ని ఖర్చుపెట్టడమే మన ధ్యేయమూ అనుకుంటున్నారా? ఏది ఎమైనా, మనకి చిత్రహింస మాత్రం తప్పడం లేదు.

   ఏ కార్యక్రమం తీసికోండి, ఓ సీరియల్లవచ్చు, ఓ సినిమా కావొచ్చు, చివరకి ప్రతీ రోజూ ఉదయం వచ్చే ప్రవచనాల్ని కూడా వీళ్ళు వదలడం లేదు. న్యూస్సుల్లో కూడా ఇవే. అందుకే, కార్యక్రమం మధ్యలో, ఈ యాడ్లగోల భరించలెక, హాయిగా మ్యూట్ చేసేసికుంటే ఉన్నంత సుఖం ఇంకోటి లేదు. అరగంట సేపు వచ్చే తెలుగు సీరియల్ ని నెట్ లో చూడండి, అంతా చేసి అయిదు నిముషాలుంటుంది. ఆ అయిదునిమిషాలకోసమూ మనం అరగంట టైము వేస్టు చేయాలి! అలాగే హిందీ సీరియల్సు వ్యవహారమూనూ. సినిమా విషయం అడక్కండి.

   ఆ మధ్యన Tata Crucible Quiz కి వెళ్ళినప్పుడు, ఓ గంట సేపు ఎలిమినేషన్ల రౌండు ముందర కూర్చోవలసి వచ్చింది. ఆ గంటలోనూ, Tata Nano గురించి యాడ్ వేసిందే, వేసి హోరెత్తించేశారు! పైగా పేద్ద సౌండోటీ. అంతసేపు ఆ చిత్రహింస భరించేటప్పటికి, మళ్ళీ Tata Nano మొహం చూడకూడదనిపించింది. అంత వెగటూ, అసహ్యం కలిగింది. మరి ఇలాటి Ad campaign లని ఏమంటారో తెలియదు. మన చానెళ్ళలో యాడ్లేసే వస్తువులని మార్క్ చేసికుని, జీవితంలో ఆ వస్తువు కొనకూడదూ అని నిశ్చయించేసికున్నాను. ఓ పాతిక దాకా తేలాయి. ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ధర్మమా అని, చాలా భాగం సుఖపడ్డట్ట్లే! పైగా ఒక్కో యాడ్డూ, టోకున ప్రతీ చానెల్వాళ్ళకీ ఇస్తారనుకుంటా. ఒకచోట వదిలిందనుకుంటే, ఇంకో చానెల్ లో ప్రత్యక్షం. ఏ చానెల్ కా భాషోటీ పైగా.

   ఇవి కాకుండా, మన చానెళ్ళలో వచ్చే సంగీత పోటీలు– ఏదో మొహమ్మాటానికి, ఎస్.పి.బాలు , ‘పాడుతా తీయగా’ మొదలెట్టినప్పుడు, ఎలిజిబిలిటీ క్రైటీరియా లో, ” ఇప్పటివరకూ ఏ పోటీలోనూ పాల్గొనని పిల్లలే ఈ పోటీకి అర్హులూ” అన్నారు. అమ్మయ్య కొద్దిగా వెరైటీ గా ఉంటుందీ, అనుకున్నంత సేపు పట్టలేదు, గత మూడేళ్ళనుండీ, ఏ కార్యక్రమం( సంగీత) చూసినా, అదే పిల్లలు, అదే వ్యాఖ్యలు, చివరాఖరికి అదే ఆడియెన్సూనూ! పిల్లల సంగీత కార్యక్రమాలు బావుండడం లేదనడం లేదు, ఆంధ్రదేశం లో ఇంక పిల్లలే లేరా? ఉన్నా రానీయరా? పాటలూ మహ అయితే ఓ యాభై ఉంటాయి. వాటినే వినాలి. ఇంక జడ్జీల సంగతి, ఎక్కడ చూసినా వీళ్ళ మొహాలే.

   ఇదివరకటి రోజుల్లో సినిమాల్లో especially black & white era యుధ్ధాల సీన్లూ, గాలివాన వరద భీభత్సం సీన్లూ, ఏరో ప్లేన్ నుంచి బాంబులు వేసే సీన్లూ, బయటి సినిమాల్లోంచో, డాక్యుమెంటరీల్లోంచో stock scenes ఉండేవి, వాటినే copy, paste చేసేసేవారు. వీణ్ణెక్కడో చూసినట్లుందే అనిపించేది! ఈ రోజుల్లో తాజకీయనాయకులు చేసే, ఊరేగింపులూ, ధర్నాలూ చూస్తూనే ఉంటారు, ఏ ఊరేగింపు చూసినా అవే మొహాలు! ఇదో వ్యాపారం అనుకుంటా. ఏ పార్టీ వాడు డబ్బులిస్తే వాడి జెండా పట్టుకుని, అరవడం పోలీసుల చేతిలో నాలుగు లాఠీదెబ్బలు తినడం!

   ఇంత జరుగుతున్నా, మనం టి.వి. సీరియళ్ళు చూడ్డం మానలేమూ, రాజకీయనాయకుల ఊరేగింపులూ ధర్నాలూ ఆగవూ, యాడ్లవాళ్ళు మనల్నిbombard చేయడమూ మానరూ, నేను బ్లాగులు రాయడమూ మాననూ! వాళ్ళనెలా భరిస్తున్నారో నన్నూ అలాగే భరించండి !!!

12 Responses

 1. భమిడిపాటివారికి,
  మూడు రోజుల్నుంచి కళ్ళు కాయలు కాసేలా చేసేను. ఇప్పుడె పండేయి. మీరే చెపేరుగా తప్పదని.అంతే.

  Like

 2. భరించేవాడే బ్లాగరు.. .

  Like

 3. మీ బ్గాగులను చదవటం మాకూ ఓ వ్యసనంలా తయారయింది. దీంట్లోంచి ఎలా బైటపడాలో కాస్త చెబుతారా?

  Like

 4. ఏదో ఒకటి ఫణిబాబు గారు..మీరు రాస్తూ పొండి. మేము చదివి పెడతాము. మీరు బ్లాగ్ రాయకపొతే మాకు ఏదోలా ఉంటుంది మరి. మీ బ్లాగ్ కోసం ఎదురుచూడ్డం ‘అతి ‘ అయితే ఇక బ్లాగు ఎవరు చూడరు కదా..అందుకే మమ్మల్ని ఎక్కువగా wait చేయించకండి.

  Like

 5. Because of this ad pollution, I’ve stopped watching tv!!

  Like

 6. నా స్పందన కూడా పై బ్లాగర్లు ఇచ్చిన స్పందనే లాగా ఉంటుంది….

  రోజూ మీ బ్లాగు ఒపెన్ చేయడం …. కొత్తది రాయలేదని చూడటం… పొనీ అటూ వేపు తొంగిచూద్దం అని ఆ బ్లాగు చూద్దును కదా…. నో అప్డేత్ …. ఆ బ్లాగు ఏంటా అని అలోచించకండి… హ్త్త్ప్://బ్సుర్యలక్ష్మి.బ్లొగ్స్పొత్.చొం/ … ఇప్పుడే చూస్తున్నా…. అక్కడ కూడా ఏదో కొత్తది కనబడుతుంది…. త్వరగా చదివేయాలి…

  ఇద్దరూ కూడబలుక్కుని మమ్మల్ని ఆటపట్టించటంలేదు కదా…
  ఒకేసారి రాయడం…. ఒక 3 రోజులు ఎవ్వరూ రాయకపోవడం…..

  ఇక విషయానికి వస్తే…. మీరు రాస్తూ పోండి…. మేము చదువుకుంటూ పోతాం….
  అంతే….

  Like

 7. ఆ బ్లాగు తప్పుగా ప్రచురితమైంది… క్షమించాలి…

  http://bsuryalakshmi.blogspot.com/

  Like

 8. >>>నేను బ్లాగులు రాయడమూ మాననూ! వాళ్ళనెలా భరిస్తున్నారో నన్నూ అలాగే భరించండి !!!
  తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావండి పద్ధతిలో డబాయిస్తే తప్పుతుందా?

  Like

 9. @శర్మగారూ,

  ఏదో రాస్తూంటాను. మరీ సీరియస్సుగా తీసికోకండి.

  @రాజేష్,
  నిజమే కదూ !!

  @నరసింహరావుగారూ,

  నిజమే. దానికి విరుగుడేదో మీరే కనిపెట్టి పుణ్యం కట్టుకోండి !!

  @స్వాతి,

  ఎప్పుడో ఎవరో “ఇంక చాలు బాబోయ్, మీ సొద ఆపేయండి ..” అనేదాకా వ్రాద్దామని ఉద్దేశ్యమైతే ఉంది !!

  @గణేష్,

  అదృష్టవంతుడివి !

  @Maddy,

  అందరూ అలా అనుకోవాలిగా !! చూడు బులుసువారు ఎలాటి అభాండాలు వేస్తున్నారో? అయినా మా ఇద్దరికీ ఇది అలవాటే !!

  @సుబ్రహ్మణ్యం గారూ,

  అదేం అదృష్టమో తెలియదు. నేనెలా వ్రాసినా అందులో ఏదో లా పాయింటు లాగుతారు! ఏం చేస్తానులెండి, మీరు అనకా మానరు, నేను పడకా మానను! పూర్వజన్మ సంబంధం!!

  Like

 10. హ హ అలా అంటే మీరెక్కువ రాస్తారని బులుసువారి ఉద్దేష్యం అయి ఉండవచ్చు…

  వారి ఆంతర్యాన్ని గ్రహించాలి మరి….

  Like

 11. నేను కాకపోతే ఇంకెవరు అంటారు సార్ మిమ్మలని. యెస్ వెల్ సెడ్. పూర్వ జన్మ సంబంధమే అయి ఉంటుంది. లేకపోతే ఈ పాటికి నన్ను తన్ని తరిమేసేవారు. 🙂

  Maddy గార్కి,

  సరిగ్గా కనిపెట్టారు సార్.

  Like

 12. @Maddy,

  మా ఇద్దరికీ ఇది మామూలే !!

  @సుబ్రహ్మణ్యం గారూ,

  మొత్తానికి కనిపెట్టేశారు!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: