బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   క్రిందటి వారంలో వ్రాసిన టపాలమీద, చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలొచ్చాయి. వాటిమీద నా స్పందన వ్రాయడం ఆలశ్యం అయినందుకు కోప్పడకండి. పీత కష్టాలు పీతవీ ఏం చేస్తాం? మా అబ్బాయి ఇదివరకు ఏదో ఓ కంపెనీలో పనిచేయడం వలన, పూణె లో జరిగే క్విజ్జు పోటీల్లో, వాళ్ళ కంపెనీ తరఫున పాల్గొనేవాడు. Tata Crucible, Landmark, Brand Equity వగైరాల్లాటివి. ఇవేకాకుండా, పూణె లో ఎక్కడ క్విజ్జు జరిగినా మావాడు, దానిలో పాల్గొనాల్సిందే. చాలావాటిల్లో నెగ్గాడనుకోండి.Landmark క్విజ్జులో క్రిందటేడాది నేషనల్ లెవెల్ లో సెకండొచ్చారు. ఎంబిఏ చదువుతున్నప్పుడు, బి.బి.సి వారు నిర్వహించిన University Challenge Round లోకూడా, సెమిఫైనల్స్ దాకా వచ్చాడు. ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే, తనకీ ఈ క్విజ్జులకీ అవినాభావసంబంధం! ఉద్యోగం వదిలేసి, ఈ కొత్తగా వ్యాపారం మొదలెట్టేడుగా, లైబ్రరీ ఒకటీ. మరి క్విజ్జుల్లో పాల్గోడం ఎలాగా అని ఆలోచించి, డాడీ, మీరు నా partner గా వచ్చేయండీ అన్నాడు. ఓరినాయనో ఇదేం గొడవరా బాబూ అనుకున్నాను. నా క్విజ్జు వ్యవహారం, తనతో తోకలా వెళ్ళడం, ప్రైజులొస్తే మోయడం వరకే పరిమితం . అప్పుడెప్పుడో నాలుగేళ్ళ క్రితం ఓ సినిమా క్విజ్జులో తనతో పాటు పాల్గొని, సెకండొచ్చామనుకోండి. అంతమాత్రమే నా సో కాల్డ్ అనుభవం !

   ఏదో మొహమ్మాటానికి, పోన్లేరా నేనెందుకూ అన్నాననుకోండి, మరీ ఎక్కువసార్లంటే, సరేలే అంటాడేమో అనో భయం!మొత్తానికి మేమిద్దరమూ ఓ టీం అని, ఎంట్రీ పంపించాము, ఇంక చూడండి నా తిప్పలు- ఈ వారం రోజులూ ఈ రెండు క్విజ్జులకోసం నేను చదివిన పుస్తకాలూ, నెట్ లో సైట్లూ, చదువుకునే రోజుల్లో చదివుంటేనా, వామ్మోయ్ ఎంత పైకొచ్చేవాడినో? అయినా ఇదంతా చదవాలని చదివింది కాదు, ఛాన్సొచ్చిందికదా అని మా ఇంటావిడ, చాయ్ లిచ్చి మరీ చదివించింది! వదల్దే!

   క్రిందటి శనివారం Tata Crucible కి వెళ్ళాము. తీరా చూస్తే, అక్కడున్నవాళ్ళందరూ మా అబ్బాయి వయస్సువాళ్ళే ! వాళ్ళందరూ నేనేదొ ఆడియెన్సులో కూర్చోడానికి వచ్చాననుకున్నారు. ఉన్న వంద టీములకీ మొదట, ఓ prelims చెస్తారు. స్టేజ్ మీదకి వెళ్ళేది ఆరు టీములేగా! ఇచ్చిన పాతిక ప్రశ్నలకీ, 14 దాకా రైటయ్యాయి. కానీ cut off 17 అవడంతో, మేము ఆడియెన్సులోనే ఉండవలసొచ్చింది.

   నిన్నేమో Brand Equity కి అదేదో West in అని ఓ హొటల్లో జరిగింది. నిన్నా అంతే, 24/30 వచ్చాయి. cut off ఏమో 27. ఏం చేస్తాం, యోగం లేదు. ఒకటిమాత్రం తెలిసింది, అవసరం అయితే నేనూ వెళ్ళొచ్చూ అని. Next time better luck!! ఎంత చదివితే ఏం లాభం? పైగా ఎంతని చదవడం? అడిగేవాడికి చెప్పేవాడు ఎప్పుడూ లోకువే! But I had lot of fun and thoroughly enjoyed. ఈ క్విజ్జులకి చదవడం ధర్మమా అని నా జ్ఞానం కొద్దిగా, ఎంతా పిసరంత,update అయింది!

   ఈవాళేమో, నా మిస్టరీ షాపింగు సందర్భంలో Esprit అనేదానికి వెళ్ళాను. క్రిందటి సారి మనవరాలికి అదేదో కొన్నాను 1500 పెట్టి. ఈసారి పోనీ ఇంటావిడకి తీసికుందాం అనుకుని చూస్తే, అదేం ఖర్మమో, అన్నీ high end fashion dresses, పోనీ కదా అని తీసికుంటే, కాళ్ళిరక్కొడుతుంది! ఏదొ ఒకటి తీసికోవాలిగా, ఓ షాల్ ( కాటన్) ది తీసికున్నాను. ఇంటికి తెచ్చి చూపిస్తే, దీనికి వెయ్యి రూపాయలు తగలేశారా అని చివాట్లూ! ఓ పీకో చేసిన గుడ్డముక్క అది దానికేమో వెయ్యి రూపాయలా, కోప్పడిందంటే కోప్పడదూ మరి? చేతులో ఉన్న డబ్బులు ఎలా తగలెయ్యాలా అనుకునేవాళ్ళకి ఈ షాప్పులు! నాలాటివాడెళ్తే ఆరిపోతాడు! వాడెవడో reimburse చేస్తున్నాడు కదా అని వెళ్ళడం! Again, I am enjoying all this.

    ఇంత ఆనందం లోనూ, ఒకటే బాధ! నా favourite , ఆటగాడు Mansur Alikhan Pataudi మరణం. అసలలాటి కాప్టెన్ ఉన్నాడా? ఏనాడైతే, అతన్ని, దరిద్రపు కారణాలు చూపించి, కాప్టెన్ గా తీసేశారో, అప్పటినుంచీ నాకు క్రికెట్ మీద ఆసక్తి పోయింది. ఈ రోజుల్లో ఒళ్ళంతా కవచాలు పెట్టుకుని ఆడ్డం చూస్తే నవ్వొస్తుంది, ఆరోజుల్లో కాళ్ళకి పాడ్లూ, చేతులకి గ్లోవ్సూ తప్ప ఇంకేమీ లేకుండా, అదీ ఒకే కన్నుతో ఆడ్డం, అతనండి champion player అంటే! వాళ్ళెవరో అన్నట్లుగా, he taught us to win !

4 Responses

 1. బాబుగారూ!

  చక్కటి టపా అందించారు! చాలా సంతోషం. మనందరం, జీవితాంతం, యెంతో కొంత “విజ్ఞానార్థులమే”! క్విజ్ ల్లో వచ్చే ప్రశ్నలకి, క్విజ్ మాస్టర్ బుర్రలోకో, వాడి క్వెశ్చన్ బ్యాంకులోకో జొరబడితేగానీ, నెగ్గలేం! మీరే చెప్పుకున్నట్టు నెక్ స్ట్ టైమ్ బెటర్ లక్!

  పటౌడీ నవాబ్ (జూ) గురించి మీతో నేనూ యేకీభవిస్తాను…..హి టాట్ అజ్ టు విన్! నేనుకూడా, బేడీ కెప్టెన్ అవ్వగానే, క్రికెట్ మీద ఇంటరెస్ట్ కోల్పోయాను.

  వ్రాస్తూనే వుండండి….మేం చదువుతూనే వుంటాం!

  Like

 2. బాగుంది. మంచి కాలక్షేపం చేసారు. నేను రాసిన కామెంట్లతో బులుసువారు నొచ్చుకున్నట్లుంది. నేను వారిని నొప్పించడానికి రాయలేదని చెబుతూ వారికి క్షమాపణ చెపుతున్నాను.
  నేనూ బ్లాగు రాస్తునానోచ్. ఇదిగోలింకు. నాకోసం మీ బ్లాగుని వాడుకుంటున్నందుకు ఫణిబాబు గారికి ముందే క్షమాపణలు.
  http://kastephale.wordpress.com/

  Like

 3. శర్మ గారు..
  నిన్ననే నేను ఫణిబాబు గారికి వ్రాసాను ఈ విషయం గురించి . నా కామెంట్ మీకు కష్టం కలిగించిందేమో ననిపించి మీకు క్షమాపణ చెప్పుకుందుకు, వారిచ్చిన మైల్ అడ్రెస్ తో రెండు మాట్లు ట్రై చేశాను మీకు మైల్ పంపడానికి. వారు ఇచ్చిన అడ్రెస్ కరెక్ట్ కాదు అనుకుంటాను.

  మీ సహృదయానికి కృతజ్ఙతలు, ధన్యవాదాలు.

  .

  Like

 4. @కృష్ణశ్రీ గారూ,

  థాంక్స్.

  @శర్మగారూ, సుబ్రహ్మణ్యం గారూ,

  మొత్తానికి ఒకరినొకరు అర్ధం చేసికున్నందుకు సంతోషం. కథ సుఖాంతం !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: