బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–moral support


    ఒక వయస్సు వచ్చిన తరువాత, ఇంకోళ్ళకి ఏదో moral support తప్ప ఇంకోటి ఇవ్వలేము. ఓపికుందా నాలుగు మంచి ముక్కలు చెప్పడం, ఇష్టం ఉందా వింటారు, లేదా తలూపేసి ఊరుకుంటారు. మరీ తన్ని తగలెయరులెండి. వయస్సులో ఉన్నప్పుడైతే, అవతలివాళ్ళకి ఏదైనా కష్టం వస్తే, మన తాహతుని బట్టి, ఆర్ధిక సహాయం చేయగలమేమో.
నాకు అలాటి అవకాశం ఎప్పుడూ రాలేదు భగవంతుడి దయ వలన. ఏమో, అలాటి అవసరం వస్తే, చేసుండేవాడినో లేదో, ఏదో చేసేద్దామని ఉన్నా, దానికి తగ్గ ఆర్ధిక సామర్ధ్యం కూడా ఉండాలిగా. అదేం ఖర్మమో, నా ఆర్ధిక పరిస్థితి ఎప్పుడు చూసినా, ఇంకోళ్ళకి సహాయం చేయగల స్థితి లో ఎప్పుడూ లేనేలేదు. దానితో ఈ నా noble intentioన్లు, hypothetical గానే ఉండిపోయాయి. ఆ భగవంతుడిక్కూడా తెలుసు, వీడికంత ‘సీన్’ ( తెలుగు సినిమాలు చూసి చూసి, మన భాష కూడా భ్రష్టు పడిపోతోంది!) లేదూ అనుకుని, నన్ను వీధిన పెట్టకుండా దయ తలచాడు!I Thank God for that.

   స్వతహాగా మరీ దుర్మార్గుణ్ణీ, దుష్టాత్ముణ్ణీ కాకపోబట్టి, ఇంకా ఆ residual intentions ఉండిపోయాయి. అప్పుడప్పుడు బయటకి వస్తూంటాయి. ఎవరైనా, వారి సమస్య కానీ, వచ్చిన కష్టం కానీ నాతో పంచుకున్నప్పుడు, తోచిన సలహా ఇస్తూంటాను. అదృష్టం కొద్దీ ఇప్పటిదాకా వింటున్నారు. అక్కడకి మనమేదో గ్రేట్ అనికాదు, ఆ పర్టిక్యులర్ పరిస్థితి లో, ఆ అవతలి వ్యక్తి, తను అప్పటిదాకా అందరి సలహాలూ విని విని విసిగెత్తిపోయి, ఏదో మనం చెప్పినది కొద్దిగా రీజనబుల్ గానూ, రిఫ్రెషింగ్ గానూ ఉండుండొచ్చు, అనుకోవాలి, అంతేకానీ, ఒకరెవరికో నచ్చిందికదా అని, కనిపించిన ప్రతీ వాడినీ – ” నీకేమైనా సమస్యుందా, ఫరవాలేదూ నాతో చెప్పు, నాకు తోచిన సలహా ఏదో ఇస్తాను”- అనలేముకదా. వాడు తెలివైనవాడూ, మన రోగం కుదిర్చేవాడూ అయితే – ” ఔనూ నాకో రెండు లక్షల రూపాయలు కావాలీ..” అన్నాడనుకోండి, వాడి సమస్య తీర్చగలమా, అబ్బే లేదు. మహ అయితే ఏ బ్యాంకులో అప్పు దొరుకుతుందో చెప్పగలం. మళ్ళీ అప్పుడు మనల్ని ష్యూరిటీ సంతకం పెట్టమంటే, అదో గొడవా. అందుకే ఇలాటి సలహాలు voluntary గా ఇచ్చుకుంటూ పోవడం అంత ఆరోగ్యలక్షణం కాదు అని నా అభిప్రాయం. ఎవరి హద్దుల్లో వాళ్ళుంటే, అందరికీ శుభప్రదం.

   ఆ మధ్యన మా ఫ్రెండొకరు కనిపించారు, ఫ్రెండ్లకేమీ లోటు లేదు. వీధిలో బయటనుంచుంటే కావలిసినంతమంది. ఓ పలకరింపు నవ్వు నవ్వేస్తే సరిపోతుంది. అవతలివాడికీ పనేం లేకపోతే మనతో కబుర్లు మొదలెడతాడు. ఉద్యోగంలో నాతో పనిచేసిన చాలా మంది నా స్నేహితులే. చెప్పానుగా, ఈనాడిలా సంతోషంగా గడిపేయకలుగుతున్నానంటే, ఆ భగవంతుడి దయా, స్నేహితుల గుడ్ విషెస్సూనూ. ఓ రోజున అలాటి ఫ్రెండొకరు కనిపించాడు. మామూలుగా కనిపించినప్పుడల్లా, ఏదో ఒక విషయం మీద కనీసం ఓ గంటైనా కబుర్లు చెప్తూండేవాడు, ఇదేమిటీ ఇలా ఓసారి పలకరించేసి వెళ్ళిపోతున్నాడూ అనుకున్నాను. బహుశ, ఏదో సమస్యొచ్చిందేమోలే అని పట్టించుకోలేదు. ఆ మర్నాడు, నేనెక్కడికో వెళ్తూంటే, నాకు ఓ నాలుగడుగులు ముందర, ఏదో ఆలోచించుకుంటూ వెళ్తున్నాడు. ఓ కేకేశాను, అబ్బే విన్నట్లు లేదు, కొద్దిగా ముందరకెళ్ళి, ఆపి హల్లో క్యా హుఆ, తబియత్ ఠీక్ నహీక్యా అని నాకు తెలిసిన టూఠీ పూఠీ హిందీలో పలకరించాను. ఏమిటీ, ఎన్నిసార్లు పిలిచినా ఆగలేదూ, వినబడలేదా, లేక వినిపించీ, ఎందుకులెద్దూ అని ఆగలేదా అని నిలేశాను. ఆమాత్రం చనువుందిలెండి. అప్పుడు చెప్పాడు, తననీ, భార్యనీ దొల్చేస్తున్న సమస్య. ఏముంటుందీ, ఆర్ధికసంబంధితమైనది కాదూ, ఆరోగ్య సమస్య కాదూ, ఏదో లా ఎండ్ ఆర్డరు సమస్య కాదూ, మరీ ఈ వయస్సులో ఇంకోడిమీదకెళ్ళి దెబ్బలాడే మనిషికాదూ, అలాగని ఇంకోటీ ఇంకోటీ కూడా కాదు. చెప్పానుగా, చాలా చోట్ల వచ్చే సమస్య అదీ ఇంట్లో ఓ ముగ్గురు పిల్లలుంటే, వారిలో పెద్దాడో, చిన్నాడో, చిన్నదో ఫలానా వాళ్ళని పెళ్ళిచేసుకుండామనుకుంటున్నానూ, ఆ అమ్మాయి/అబ్బాయి మా ఆఫీసులోనే పనిచేస్తున్నాడూ/స్తుందీ వగైరా వగైరా.

   అన్నీ బావుంటే, ఏదో అమ్మతో చెప్తే సరిపోతుంది, ఆవిడే ఏదో సమయం చూసి, ఆయనతో చెప్పి, కోడల్ని తెచ్చేసికుంటుంది. కథ సుఖాంతం! ప్రపంచం అంతా అంత ఆనందంగా ఉండడం, ఆ భగవంతుడికీ నచ్చదు, ఓ ఆటాడదామనుకుంటాడు. ఈ పిల్లో/పిల్లాడో రొమాన్స్ లో పడ్డవాళ్లు, చాలామంది,inter caste, inter state అయుంటారు. అక్కడేగా వచ్చిన సమస్యంతా! ముందర ఒప్పుకోనివాళ్ళు ఈ అమ్మా నాన్నలే. ఠాఠ్, మన భాషా, మన జాతీ వదిలెసి, ఇంకో చోటకెళ్ళడం ఎందుకూ తో మొదలయి, నువ్వీ పెళ్ళి చేసికుంటే, ఇల్లు వదిలి వెళ్ళిపోవాలీ, etc ..etc.. ప్రారంభం. మరీ ఇదివరకటి సినిమాల్లో లాగ – “అసలు నువ్వు మాకు పుట్టేలెదనుకుంటాం” లాటి భారీ డయలాగ్గుల్లేవులెండి ఈ రోజుల్లో. మళ్ళీ DNA Test లూ గొడవానూ. అప్పటికీ వినకపోతే, చూద్దాం అనేసి , discussion ని adjourn చేసేస్తారు, మన లోక్ సభ లో లాగ. ఎప్పుడో ఆ కొడుకు ఇంట్లో లేనప్పుడు, ఈ భార్యాభర్తలిద్దరూ జుట్టుపీక్కుంటారు! అంతకంటే చేయగలిగేదీ ఏమీ లేదు. ఆ కొడుకూరుకుంటాడా, ప్రతీ రోజూ అడుగుతూంటాడు, ఎక్కడిదాకా వచ్చిందీ మీ decision making అని. చివరికోరోజు ఓ deadline పెట్టేస్తాడు. రెండురోజుల్లో చెప్పండి, లేదా..……. అని.

   అదిగో తెల్లారితే ఆ deadline పూర్తయే ముందురోజన్నమాట, నేను అతన్ని కలిసింది! చెప్పుకొచ్చాడు గొడవంతా. ఓస్ ఇంతేనా అని కొట్టిపారేశాను. వారి అబ్బాయి అడిగినట్లు చేయడంలో ఉన్న ఎడ్వాంటేజెస్ ఏమిటొ, చేయకపోవడంవలన వచ్చే consequences ఏమిటో అన్నీ చెప్పాను.అతనడిగిన ప్రతీ సందేహానికీ జవాబిచ్చాను. నేచెప్పిందంతా విని, “నీదేం పోయిందీ, చెప్తావు, అలా చేసినవాళ్ళ కష్టాలు తెలిస్తే కదా” అని కొట్టిపారేయబోతే, అప్పుడు చెప్పాను, బాబూ నీకు నాకంటే apt person దొరకడూ, మా అమ్మాయికీ, అబ్బాయికీ కూడా వాళ్ళు చెప్పింది అర్ధం చేసికుని, వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని, మేమిద్దరమూ ఆలోచించుకుని వాళ్ళడిగినవాళ్ళతోనే పెళ్ళి చేశామూ, భగవంతుని దయవలన హాయిగా ఉన్నారూ, అందుకే అలా చెప్పానూ అని. అర్రే బాస్ నాకు తెలియనే తెలియదు ఇన్నాళ్ళూ అని, ఇంటికి వెళ్ళి, వాళ్ళావిణ్ని కూడా తనే కన్విన్స్ చేసేసి, ఓ పదిరోజుల్లో ఓ ఇన్విటేషన్ కార్డుకూడా చేతిలో పెట్టాడు.

   అక్కడికేదో నేను చెప్పడం వల్లే వాళ్ళ పెళ్ళయిందనడం లేదు, ఏదో కాకీ, తాటిపండూ ( కాకతాళియం అనో ఏదొ అంటారనుకుంటా) లాగ, just in time లో నా moral support ఇవ్వగలిగాను.

6 Responses

 1. విషయాన్ని వివరించి చెప్పి దాని ఉగ్రతని తగ్గించి మనుషులని అలోచింపచేసే కబుర్లు చెప్పగలవాళ్ళు కావాలి కదా. నేటి రోజుల్లో చెబుతున్న కౌన్సిలింగూ వగైరా అంతే కదా. వాడి దగ్గరకెళితే బాగా గుంజి చెబుతాడు. ఇలా ఊరికే చెప్పేవాళ్ళు మంచినీళ్ళుకూడా అడగరు. వినలేకపోతే వారి దురదృష్టం. ఏంచేస్తాము.

  Like

 2. బాబాయ్ గారూ..
  నా వయసు మొన్నే ముప్పయొకటి నిండి ముప్పయొచ్చాయి… .పొట్టిగా లావుగా నల్లగా వుంటాను. నాకు ఒక సంవత్సరంన్నర బాబు వున్నాడు. వాడు నాలాగా కాకుండా తెల్లగా బాగానే వుంటాడు. ఈ మధ్యే ఎవరో మరాఠీ అమ్మాయిని ఇష్టపడి నాకూ ఓ డెడ్ లైను పెట్టాడు. ఏం చేయమంటారు?, దయచేసి నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. మీ సలహా కోసం ఎదురుచూస్తూ..

  మీ
  శ్రీనివాసరాజు ఇందుకూరి. 🙂

  Like

  • S R I garu,
   ” ముప్పయొకటి నిండి ముప్పయొచ్చాయి…”
   మా బాబయ్య మీద జూకులు వేస్తే మీ మీద కూడా వెయ్యాలని అనిపించింది !
   “The curious case of Benjiman Button” సినిమా లో లాగ, ఇంకో 10 ఏళ్ళు ఆగితే మీరు కూడా మీ అబ్బాయి కి అమ్మాయి deadline ఇవ్వచ్చు !

   Like

 3. @శర్మగారూ,

  థాంక్స్.

  @శ్రీనివాసా,

  ఇప్పుడు వేళాకోళంగానే ఉంటుంది నాయనా! ముందుంది ముసళ్ళ పండగ ! అందుకే చెప్పాను, త్వరలో ఓ కూతుర్నికూడా కనేస్తే, ఎకౌంటు బాలెన్సవుతుంది! అందుకే మా అమ్మాయి నీమీద జోక్కేసింది !!

  @అరుణ తల్లీ,

  మహబాగా చెప్పావు !

  @మౌళి,

  ధన్యవాదాలు.

  Like

 4. బాబాయ్ గారూ,
  ముందు ఏం పండగున్నా నేను ముందే ప్రిపేరయిపోయాను కాబట్టి పర్వాలేదులేండి. 🙂

  అరుణ గారు,
  ఆ సినిమా నేను చూడలేదు కానీ మీరు చెప్పింది అర్ధమయ్యింది. బాబాయ్ గారు కాబట్టే జోకులేసాను.. వేరే.. ఎవరన్నా అయితే కొడతారు గానీ.. పడతారా చెప్పండి 🙂

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: