బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Pennywise Poundfoolish….


   చాలామందిని చూస్తూంటాము, డబ్బులు ఖర్చు పెట్టడం లో చాలా లిబరల్/లావిష్ గా ఉంటూంటారు. కానీ ఎక్కడో ఎప్పుడో ఓ భూతం పట్టేస్తుంది వాళ్ళని, ప్రతీ పైసకీ చూసుకుంటారు. అలాగని వాళ్ళు పిసినిగొట్టా అంటే అదీ కాదు. ఆ పరిస్థితిలో అక్కడ డబ్బు పెట్టకూడదూ అంతే! పోనీ అలాగని వాళ్ళేమీ డబ్బులు ఖర్చుపెట్టరా అంటే అదీ కాదూ. ఒక్కొక్కప్పుడు అనిపిస్తుంది, అరే ఈయనకేమైనా పిచ్చి పట్టిందా, ఓ రూపాయికి వచ్చే సరుక్కి అంతంత డబ్బులేసి కొంటున్నాడూ అని!

    ఈ సందర్భం లో నా అనుభవాన్ని చెప్తాను. మా నాన్నగారు జనరల్ గా ధారాళంగా ఖర్చుపెట్టేవారు. ఎప్పుడైనా సినిమాకి వెళ్ళాలీ అనుకుని అడిగితే చాలు, కావల్సింది బీరువాలోంచి తీసికోరా అనేవారు. ఆరోజుల్లో మేము మిడిల్ క్లాసులోకే వచ్చేవారమనుకోండి, అయినా ఆయన పెట్టే ఖర్చులు చూస్తే, వామ్మోయ్, మనం అంత ధనవంతులమా అనిపించేది. ఇంట్లో ఎప్పుడూ అతిథులే, స్కూలుకి సంబంధించినవారో, లేక మా ఇంట్లో ఉండి చదువుకుంటున్నవారో, ఎప్పుడూ సందడిగా ఉండేది. ఆతావేతా చెప్పొచ్చేదేమిటంటే, అంతా జమిందారీ లెవెల్లో ఉండేది!

   అంత లిబరల్ గా ఖర్చుపెట్టే పెద్దమనిషీ, నా పెళ్ళి టైములో, ఎవడో రిక్షావాడితో ఓ రూపాయ తేడా వచ్చేటప్పటికి కాకినాడ బస్ స్టాండులో వాడితో గొడవెట్టేసికున్నారు, వీళ్ళ దెబ్బలాట చూసి, మిగిలిన రిక్షావాళ్ళందరూ మమ్మల్ని కొడతారేమో అన్నంత భయం వేసింది. ఇదేమిటిరాబాబూ, అవక అవక ఏదో నాకూ పెళ్ళి కుదిరిందనుకుంటే, ఈయనేమిటీ ఈ రిక్షావాళ్ళతో గొడవెట్టుకుని ముహూర్తం దాటబెట్టేట్లున్నారూ అనికూడా భయం వేసింది! పోనీ నేను ఇన్వాల్వ్ అయి సర్ది చెబ్తామా అంటే అదీ కుదరదు, ఇజ్జత్ కా సవాలాయే. అటు ఆ రిక్షావాడూ తగ్గడూ, ఇక్కడ ఈయనో మొండి మనిషీ, ఇదెక్కడ గొడవరా దేముడోయ్ అనుకున్నాను. మా ఇంటావిడతో నాకు రాసిపెట్టుండడంతో, మొత్తానికి ఆగొడవంతా సద్దుమణిగి, అన్నారం చేరామూ, కథ సుఖాంతం !

   ఏదో అప్పటికి ఉద్యోగం చేస్తున్నా కాబట్టి, ఆ రిక్షావాడికి ఏదో సద్దిచెప్పేసి సెటిల్ చేద్దామనుకున్నా, కానీ అంతకు ముందర జరిగిన అనుభవం, పూనా మొట్టమొదటిసారి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు. అప్పటికి ఏగాణీ సంపాదనకూడా లేదు. చాయ్ తాగాలన్నా ” నాన్నా డబ్బులూ..” అనడమే! ఆరోజు ప్రొద్దుటే నా ఇంటర్వ్యూ జరిగింది, ఏదో వయస్సుతక్కువై ఓ రెండు నెలల తరువాత జాయిన్ అవమన్నారు అంతా సజావుగానే జరిగింది. అలా పిలిచి ఉద్యోగం ఇచ్చినాయన్ని వెళ్ళేముందర కలిసి, థాంక్స్ చెప్పుకోడం పెద్దమనిషి లక్షణం. అంతదాకా బాగానే ఉంది. మేము దిగిన, మా కజిన్ చదువుకునే AFMC Hostel నుంచి, మా ఫాక్టరీ ఉండే Kirkee ప్రాంతానికి వచ్చి, అక్కడనుండి, మేము కలియవలసిన ఆయన బంగళాకి డైరెక్టు బస్సుంది. అది ఆ ఎస్టేట్ మీదుగా పూనా స్టేషన్ కి వెళ్తుంది. మేము అక్కడకి వచ్చేటప్పుడు, బస్సువాడు పావలాయో ఎంతో తీసికున్నాడు, ఆరోజుల్లో అలాగే ఉండేవి, ఆశ్ఛర్యపడిపోకండి బంగారం తులం అరవై రూపాయలున్న రోజులు అవి, మాకు ఆ రూట్ లో వెళ్ళేందుకు, ఖర్మకాలి ఆ కండక్టరు ఇంకో అయిదు పైసలెక్కువా అన్నపాపానికి,
ఠాఠ్ అని బస్సు దింపేశారు
. నీకెందుకివ్వాలీ అయిదు పైసలెక్కువా అని వాడితో దెబ్బలాట. పాపం వాడేం చేస్తాడూ, బస్సు మామూలుగా వెళ్ళే రూట్ లో కాకుండా, చుట్టూ తిరిగి వెళ్ళడం వల్ల ఆ అయిదు పైసలూ extra. వాడడిగిన ఆ అయిదుపైసలూ ఇచ్చి వెళ్తే హాయిగా మేము కలియవలసినాయన బంగళా దగ్గర దిగేవాళ్ళం. అంతదృష్టం కూడానా, ఆరోజున మానాన్నగారి మూడ్ ధర్మమా అని, బస్సుదిగేసి, ఆయన బంగళా పట్టుకోడానికి మూడు గంటలు నడిచాం! పోనీ మా కజిన్నేనా సద్దిచెప్తాడా అంటే, వాడూ ఆరోజుల్లో ఇంకా స్టూడెంటే!

   పైగా అలా ఏమైనా చేసేడంటే, మా నాన్నగారు, మా పెద్దనాన్నగారితో ‘మీవాడు చేసే ఖర్చుకి ఐపూ అదుపూ లేదూ…” అని చెప్పినా చెప్పొచ్చు. ఎందుకొచ్చిన గొడవలే అని వాడూ ఊరుకున్నాడు!

   అక్కడికేదో ఆయన్నే ఆడిపోసుకోకూడదు, నేనూ ఆ “జాతి పక్షినే” కదా. ఎంతచెప్పినా వంశపారంపర్యం! ఏం అబ్బినా లేకపోయినా ఇలాటివి మాత్రం ఠక్కున వచ్చేస్తాయి! అప్పుడెప్పుడో రాజమండ్రీలో ఉన్నప్పుడు, ఓ చోట న్యూస్ పేపరు తీసికున్నాను, వాడు చిల్లరిస్తూ, ఓ అర్ధరూపాయ తక్కువిచ్చి చిల్లర్లేదన్నాడు. అంతే వాడితో చడామడా దెబ్బలాటేసేసికుని, ఓ రెండు మైళ్ళు నడిచి మరీ ఇంకోచోట పేపరు కొనుక్కున్నా! అసలిలా ఎందుకు ప్రవర్తిస్తామో తెలియదు. అలాగని డబ్బుల దగ్గర కక్కూర్తా అంటే అదీ లేదూ, లక్షల్లక్షలు ఖర్చుపెట్టి, ఉపయోగించేవీ, ఉపయోగించనివీ కొంటూనే ఉంటాం.అయినా సరే, ఎప్పుడో ఎక్కడో ఇలాటి దరిద్రప్పన్లు చేస్తూంటాం. Thats life !!!

Advertisements

6 Responses

 1. అది డబ్బు గురించి కాదులెండి! మోసపోకూడదన్న రోషమూ, ఆత్మాభిమానమూ. fairness in transaction కోసం పట్టింపు.

  Like

 2. @Srinivas

  చాలా బాగా చెప్పారు
  ప్రతి ఒక్కళ్ళూ ఏదో ఒక టైం లో ఇలా చేస్తుంటారు
  ఉదాహరణకి
  బయట ఇలాంటి గొడవలప్పుడు సర్ది చెప్పే ఆడవారు కూడా
  కూరగాయలు వంటివి కొనే దగ్గర సామాన్యం గా గొడవపడుతుంటారు

  any how Thats life !!!

  Like

 3. నేను కూడా ఇలాంటివి చాలా చేశాను. ముఖ్యంగా ఆటో వాళ్ళతో, రైల్వే పోర్టెర్స్ తో. ఒక మాటయితే హౌరా స్టేషన్ లో రెండు సూటు కేసులు ఒక బాగ్, ఒక బుట్ట , నీళ్ళ గిన్నె (మిల్టన్ దే లెండి.) అన్నీ రెండు మాట్లు తిరిగి మోసాను ప్లాట్ఫాం చివరి నుంచి వెయిటింగ్ రూమ్ దాకా. అన్నట్టు ఒక పెళ్ళాం ఇద్దరు పిల్లలు కూడానండోయ్.

  Like

 4. This type of behaviour is quite common in people,but high lighting it in this in the lighter vein is good medicine for correction.

  Like

 5. :)) బావుంది, నిజమే.. అంతే! అదంతే! దేనికదే. అదే నిజాయతీ చూపిన ఆటో/కూలి వాడికో ఎంతో కొంత ఎక్కువ ఇవ్వకుంటే కూడా, మన కక్కుర్తి మనల్ని కొన్నేళ్ళు వెంటాడుతూ వుంటుంది, అదేంటో!

  ఓ సారిలానే చదువుకునే రోజుల్లో … ఓ మద్య వయస్సావిడ పల్లెనుంచి వచ్చానని, తిరిగి వెళ్ళడానికి డబ్బు తక్కువ పడ్డాయని అంటే, లేదని చెప్పి కొంత దూరం వెళ్ళాక, తిరిగి మరీ వచ్చి నా పాకెట్ మనీలో 5రూ వితరణ చేశాక కాని మనసు కుదుట పడలేదు – అదే మనిషి అదే స్పాటులో ఓ వారం రోజుల తరువాత మళ్ళీ నన్నే పట్టుకుని అదే కథ చెప్పి … :(((

  Like

 6. @శ్రీనివాస్,

  అదీ నిజమే.

  @రవితేజా,
  ఎప్పుడూ మోనోటోనస్ గా ఉంటే బావుండదుగా. అందుకే జీవితంలో ఇలాటివి కూడా ఉంటాయి ! అదో కాలక్షేపం !

  @సుబ్రహ్మణ్యం గారూ,

  చూశారా! నా టపా చదవగానే మీ పాత జ్ఞాపకం గుర్తుకొచ్చేసింది !!

  @శర్మగారూ,

  మీరన్నట్లు చాలామందిలో ఉంటుంది, కానీ ఒప్పుకోడానికి సిగ్గూ మొహమ్మాటమూనూ !!

  @Snkr,
  ఇలా సెంటిమెంట్లమీద కొట్టేవాళ్ళూ ఎదురుపడుతూంటారు.Life goes on……

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: