బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–బస్సులో ఓరోజు…


   మొన్నోరోజున నా మిస్టరీషాపింగుకి వెళదామని బస్సెక్కుదామని ప్రయత్నిస్తూంటే, దారికడ్డంగా, ఓ కుర్రాడు, వీప్మీద ఓ సిమెంటుబస్తా అదేనండీ back pack ఏదో అంటారుట, వేళ్ళాడేసికుని నుంచున్నాడు. బయటకీ రాడూ, ముందరకీ వెళ్ళడూ, చేస్తున్న ఘనకార్యం ఏమిటంటే, ఎంట్రెన్స్ దగ్గర సీట్లో కూర్చున్న ఓ అమ్మాయితో కబుర్లు! అదేం ఖర్మమో. బస్సుల్లో ఈ సిమెంటుబస్తాల్లాటివేసికుని, ఇంకోళ్ళ ప్రాణం ఎందుకుతీస్తారో? ఓ స్పర్శాజ్ఞానం ఉండదూ, రోడ్డుకడ్డంగా ఉంటూంటాయీ ఎద్దులూ, దున్నపోతులూ అవే గుర్తొస్తాయి! వెనక్కాల కాకుండా, పోనీ ఓ పక్కగానైనా వేళ్ళాడేసుకోవచ్చుగా, అమ్మో తనకి కష్టం అయిపోదూ,ఊళ్ళోవాళ్ళకేమైనా ఫరవాలేదు.మనం సుఖంగా ఉంటే చాలు!ఎవడో, అ బ్యాగ్గుకాస్తా కోసేసో, జిప్పుతెరిచేసో ఉన్నవన్నీ ఖాళీ చేసేస్తే వదులుతుంది రోగం!

   నాదారిన నేను,ఎలాగో చోటుచేసికుని, నా శక్తంతా ( ఉన్నదెంతా!) ఉపయోగించి, వాణ్ణీ, వాడి బస్తానీ తోసుకుంటూ, మొత్తానికి ఏదో కొద్దిగా సేఫ్ గా ఉండే చోటకి చేరుకున్నాను. లేకపోతే ఆ ఫుట్ బోర్డ్ మీదే నుంచోవాల్సొస్తే, ఏ బ్రేకెసినప్పుడో కిందపడతాను.ఇక్కడ బస్సుల్లో, ఏ పదిశాతమో తప్పించి, Senior Citizens కి రిజర్వ్ చేసిన సీట్లలో, ఏ కుర్రగాళ్ళో,లెక మధ్యవయస్కులైన ఆడవారో కూర్చుంటారు. పక్కనే, ఓ Senior Citizens నుంచున్నా సరే, వాళ్ళని కాదన్నట్లు ఎటో చూస్తూ! అమ్మాయిలలాకాదు, నాలాటివారినెవరైనా చూడ్డం చాలు, అంకుల్, ప్లీజ్ బి సీటెడ్ అని ఆఫర్ చేస్తారు.నేనూ ఓసారి గాడ్ బ్లెస్ యూ అని ,ఆ సీటులో కూలబడతాను.

   ఆరోజు, మామూలుగానే, నుంచున్నాను, కారణం రిజర్వ్ చేసిన సీట్లలో ఓ ఇద్దరు ఆడవాళ్ళూ, వెనక్కాలి సీటులో వారి సంబంధితవ్యక్తే కాబోలు ఒకాయనా కూర్చున్నారు.ఇంతలో, నేను నుంచున్న చోటుకి పక్కనుండే సీట్లోంచి, ఆ ముందరివాళ్ళ సంబంధితవ్యక్తి కండక్టరునుంచి చిల్లరో ఏదో తీసికోవాలనుకుంటా, లేచాడు. ఇంతలో ఆ ముందరావిడ, ఆ ఖాళీ అయిన సీటులో, ఓ జేబురుమ్మాలూ, ఓ క్యారీబ్యాగ్గూ వేసేసి, ఊరుకోవచ్చా, పైగా నన్నుద్దేశించి, ఆప్ మత్ బైఠో, ఉన్కా సీట్ హై, అభీ ఆయేగా.అంది. నాకైతే నషాళానికెక్కెసింది,పెద్దాళ్ళకి రిజర్వ్ చేసిన సీట్లో కూర్చోడమే తప్పు, పైగా ఖాళీ అయినసీటు గురించి జ్ఞానబోధ చేయడం ఓటీ!నేను మాత్రం తక్కువతిన్నానా, ‘ఆప్ లోగ్ సే జాదా అక్కల్ హై హంకో, ముఝే మాలూం హై ఏ సీట్ కా ఆద్మీ వాపస్ ఆయేగా. అని. తగలవల్సిన చోటే తగిలింది అక్కల్ అనేసరికి!మళ్ళీ ఈ అక్కల్ అంటే ఏమిటీ అనడక్కండి,మ్యానర్స్ లాటిదన్నమాట!

   ఇంతలో పక్కనే ఓ సీట్ ఖాళీ అయితే, అక్కడ ఒకావిడ పక్కన సెటిల్ అయ్యాను.మీరు గమనించండి, ఎప్పుడైనా అలా మధ్యవ్యస్కులైన స్త్రీల పక్కన కూర్చోవలసివచ్చినప్పుడు, ఒక్కోప్పుడు చిత్రాతిచిత్రాలు జరుగుతూంటాయి! మరీ ఏ చెయ్యో కాలో తగిలితే ఏం గొడవో అని భయ పడుతూ కూర్చోవలసివస్తుంది, ఆ కూర్చున్నావిడ మామూలు మనిషైతే ఫరవాలేదు. కానీ కొందరు ఎబ్నార్మల్ వాళ్ళుంటూంటారు, మనం కూర్చోగానే, ఠక్కున లేచిపోతూంటారు, అదేమిటో మన “శీలం” శంకిస్తున్నారా అనిపిస్తూంటుంది! బస్సుల్లో అంత రష్షులోనూ, పక్కవాడూ ముందరవాడూ, తొక్కేస్తూ, నొక్కేస్తూంటే వీళ్ళకి పట్టింపుండదు, పక్కన ఓ మగాడు కూర్చునేటప్పటికి వచ్చేస్తూంటుంది వీళ్ళకి మాడెస్టీ! అలాటప్పుడు బస్సుల్లో వాళ్ళకి రిజర్వ్ చేసిన సీట్లోనే కూర్చోవచ్చుగా, అక్కడెవడైనా మొగాడు కూర్చుంటే, చమడాలెక్కతీసి, లేవదీసేయాలి. అలాటి సంఘటనలూ చూస్తూంటాను. పనేమీ లేదుగా, బస్సుల్లోనే వెళ్తూంటాను, ఇదిగో ఇలాటివి చూడ్డానికి! అలాగని dont doubt my integrity !!

   అక్కడితో అవలేదు ఆరోజు వింత సంఘటనలు– బస్సు ఎగ్జిట్ దగ్గర ఒకతను నుంచున్నాడు. ఇంతలో కండక్టర్ గంట కొట్టీ కొట్టడంతోనే, ఆ తాడో ఇంకేదో, నలిగి నలిగుంటుంది, అది కాస్తా టుపుక్కున తెగి, ఆ గంట ఇతని నుదిటిమిద పడింది! అదృష్టం కొద్దీ పేద్ద దెబ్బేమీ తగల్లెదు! ఇంత హడావిడీ పూర్తయి దిగుతూంటే చూశాను- ఓ పెద్దమనిషి ఓ సిమెంటు బస్తా అదేనండీ, back pack ని అందరిలాగా వీప్మీద కాకుండా, ముందరకి, అప్పుడప్పుడు ఈ రోజుల్లో “అమ్మలు” తమ బేబీలని పెట్టుకుంటూంటారూ అలాగన్నమాట, పెట్టుకుని దిగడం. ఓసారి అతన్ని పలకరించి, అలాటి ఇంగితజ్ఞానం ఉన్నందుకు అభినందించాలనిపించింది!హలో బాస్ మీరు అలా ఎందుకు పెట్టుకున్నారూ అనడగ్గానే, నేనాశించిన సమాధానమే వచ్చింది.– వెనక్కాల పెట్టుకుంటే అందరికీ న్యూసెన్సూ, పైగా మన సరుకులు ఉన్నాయో ఊడేయో చూసుకుంటూండొచ్చూ- అని!

   అప్పుడు తెలిసింది, ప్రపంచంలో అందరూ తమ సుఖమే చూసుకునేవారు కాదూ, పక్కవాళ్ళ కన్వీనియెన్సూ, కంఫర్టూ కూడా గమనిస్తూంటారూ అని. వెదకాలేకానీ,అలాటివాళ్ళూ ఉంటారు! సర్వేజనాసుఖినోభవంతూ !!!

Advertisements

11 Responses

 1. >>>> అలాగని dont doubt my integrity !!
  భుజాలు తడుముకోవడం కాదు కదా 🙂

  Like

 2. నెట్టడవి లో తిరుగుతుండగా మీ బ్లాగు కనపడింది. ఆదృష్టం అనుకున్నాను. మూడు రోజులుగా చదువుతున్నాను. సీనియరు సిటిజను అని మనం అనుకుని ఉపయోగం లేదు. యెక్కడికెళ్ళినా గౌరవం మాట అటుంచి యీ ముసలాడితో యెలాగా అన్నట్లుగా చూచేవారెక్కువయిపోయారు. మీ అనుభవం కొన్ని కొన్ని మా అనుభవాలకంటే మేలు. పెన్షనుకోసం వెళితే మీరింకా బాగున్నారా అనే ప్రశ్నలు కూడా యెదురవుతున్నాయి. బతకక తప్పదుకదా.

  Like

 3. >వాళ్ళని కాదన్నట్లు ఎటో చూస్తూ! అమ్మాయిలలాకాదు
  అలా అని, మీరు మన మగజాతిని అవమానిస్తున్నారు?

  Like

 4. మీ టపాలు చదవడమే “ఓ ఎడ్యుకేషన్”!

  Like

 5. నేను ఒక రోజు బస్ లొ ఇలాగే ఒక చాలా పెద్దావిడ పక్కనే కూర్చున్నాను గురువు గారూ! ఆవిడే ఏక్చువల్ గా సీట్ ఆఫర్ చేశారు. అది తెలియని చుట్టు పక్క వాళ్లు నానా హడావుడీ చేసి సీట్ లో నుంచి లేపేశారు. ఆవిడ చెబుతూనే ఉంది నేనే సీట్ ఆఫర్ చేశాను అని.

  అప్పుడప్పుడు ఈ అతిగాళ్లు ఓ హడావుడీ చేసేస్తుంటారు.

  Like

 6. @సుబ్రహ్మణ్యంగారూ,

  మీకు నేను తప్ప ఇంకోరు దొరకరు, రాగ్ చేయడానికి!ఉన్నవి ఉన్నట్లుగా వ్రాస్తే ఇలా అభాండాలు వేస్తారు…

  @శర్మగారూ,
  ముందుగా మనం మనల్ని ముసలాళ్ళూ అనుకోవడం మానాలి !!

  @పానిపూరీ,

  మరి ఏం చేయనూ, ఇప్పటివరకూ అలాటి అనుభవాలే ఎదురయ్యాయి !

  @కృష్ణశ్రీ గారూ,

  థాంక్స్.

  @చందూ,

  అసలువాళ్ళకంటే, చుట్టూఉన్నవాళ్ళకి హడావిడి ఎక్కువ !!

  Like

 7. హాయిగా నవ్వేవాళ్ళ బ్లాగుల్లోనే నేను కామెంట్ వ్రాస్తాను. నవ్వనంటారా మానేస్తాను. నాకు తెలుసు మీరు అనరు.

  Like

 8. సుబ్రహ్మణ్యం గారూ,

  మరీ అలా గన్ పాయింటు పెట్టి, ” నాకు తెలుసు మీరు అనరు…” అని అంటూంటే తప్పదుకదా మాస్టారూ !!!!!!!

  Like

 9. @ ఫణి బాబు గారు,

  చాలా చక్కగా రాశారు!

  @ బులుసు వారు,

  🙂

  Like

 10. నిజం వయసు తనువుకేకాని మసుకుకాదు కదా. కాని మనలని ఎదుటి వాడు ముసలాడు అంటున్నాడు కదా.

  Like

 11. @కృష్ణప్రియా,

  థాంక్స్.

  @శర్మగారూ,
  ముందర మనల్ని మనం ముసలాడు అనుకోడం మానుకోవాలి !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: