బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–most critical decade..అనండి లేదా పుష్కరం అనండి..


    ఏమిటీ ఈవేళ ఏదైనా స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలోని “most critical decade..అనండి లేదా పుష్కరం అనండి..” గురించేమైనా పాఠాలు చెప్తాడా ఈయనా అని ఊరికే ఖంగారు పడకండి! నాకు అలాటి జ్ఞానబోధలు చేసే అలవాటూ లేదూ, అంత జ్ఞానమూ లేదూ, ఓపికా లేదు. నేను చెప్పేది, సాదా సీదా ఓ ఆడపిల్ల మామూలు NTP conditions అంటే, పాతికేళ్ళో, మహా అయితే ఇంకో రెండేళ్ళకో, పెళ్ళి చేసికుని, 30 ఏళ్ళకి ఒకరో ఇద్దరో పిల్లల్ని కని, వాళ్ళని పెంచిపెద్దచేసే సందర్భంలో, తను, 30-40 సంవత్సరాల వయస్సులో పడే పాట్ల గురించి. నా టపాలు చదివేవారు చాలా మంది ఈ కోవకే చెందినవారైఉంటారనే ఉద్దేశ్యంతో వ్రాస్తూన్న టపా. ఇవన్నీ నా observations మాత్రమే. తప్పొప్పులు మీరే నిర్ణయించాలి. వేషాలు కానీ, ఈయనకేం తెలుస్తుందీ అని తీసిపారేస్తే, నేనేం చేయలేను! మీ ఇష్టం !

అప్పుడప్పుడే టీన్ ఏజ్ లో అడుగెడుతున్న కూతురికి, ప్రపంచం లో ” అమ్మ” అంత పరమ శత్రువింకోరుండరు. అసలు ఈ అమ్మ అనేది, నన్ను హింసించడానికే పుట్టుకొచ్చిందీ అనుకుంటారు.పదేళ్ళొచ్చేదాకా, కొంగుపట్టుకుని తిరిగే పిల్లకి, బయలాజికల్ ఛేంజెస్ వచ్చేసరికి, అమ్మ అంటే ” అల్లం ముక్క” అయిపోతుంది. నిజమే కదా, ప్రొద్దుటలేచింది మొదలు, స్కూలుకో కాలేజీకో వెళ్ళి తిరిగొచ్చేదాకా, పాపం ఆ తల్లికి ఈ పిల్లగురించే చింతంతా! బయట ఫ్రెండ్సేసుకునే డ్రెస్సులే బావుంటాయి, వాళ్ళు చదివే పుస్తకాలే నచ్చుతాయి. పైగా ఈ రోజుల్లో ఇంటర్ నెట్టులూ, అవీనూ.బయటివాళ్ళు తినే తిండేనచ్చుతుంది.ప్రతీ విషయంలోనూ అమ్మేదో అడుగుతుందీ, అన్నిటికీ జవాబు కావాలంటుంది. స్కూలునుండి రాగానే, స్కూల్లో ఏమేం జరిగేయో చెప్పాలి,ఫ్రెండ్సందరూ ఎలా ఉన్నారో చెప్పాలి, స్కూల్లో చెప్పేపాఠాల విషయం సరేసరి. ఇదేం చిత్రమమ్మా, అసలు నాకో వ్యక్తిత్వం అనేదుందా లేదా అని ఆ పిల్లా, నీమంచికోసమేనమ్మా అని ఆ తల్లీ కొట్టుకోని రోజుండదు. ఫ్రెండ్సందరూ చూశారని అదేదో సినిమాకెళ్ళాలంటుంది. ఇవికాకుండా స్కూలూ, హోంవర్కూ ఉండనే ఉంటాయి.ఇదంతా ఒకెత్తూ, ఇంకో పిల్లాడు కూడా ఉంటే ఇంక అడగఖ్ఖర్లేదు! వాడి గోల వాడిదీ.

వర్కింగ్ లేడీస్ అదీ, ఏ ఐటీ లోనో పనిచేసేవారైతే,వాళ్ళకి 24 గంటలూ సరిపోనే సరిపోవు. బయటివాళ్ళనుకుంటారూ, ఆవిడకేమండి బాబూ, హాయిగా వర్క్ ఫ్రం హోం, మాలాగ ప్రొద్దుటే తెమిలి, వంటచేసికుని, పిల్లల్ని స్కూలు బస్సులో ఎక్కించి, ఆదరాబాదరాగా వెళ్ళాలా ఏమిటీ అనుకుంటారు. వాళ్ళపనే హాయి ఒక విధంగా, ఆఫీసుకెళ్ళి ఓ కాబిన్ లో కూర్చుని వాళ్ళ పనేదో చూసుకుంటారు. టైముకి తిండేనా ఉంటుంది. ఈ కొంపనుండి పనిచేసే ప్రాణులు (కొం.ప. ప్రా) ల సంగతి ఘోరం. ఆ లాప్టాపు 24 గంటలూ ఓపెనయ్యే ఉండాలి. ఏ అమెరికాలోనో, స్వీడన్ లోనో ఇంకోచోటో ఉండేవాడికి అప్పుడే తెల్లారుతుంది, వాడిదేం పోయిందీ, లేడికి లేచిందే పొద్దూ అనుకుని ఓ వరసా వావీ లేకుండా మెయిల్స్ పంపుతూనే ఉంటాడు.ఇక్కడ ఈ అమ్మగారేమో పాపం ఏదో ఒకటి గొంతుకలో పడాలికదా,దానితో ఏ కాఫీయో చాయో తయారుచేసికోడానికి ఏ కిచెన్ లోకో వెళ్తుంది. ఇంతట్లో వాడేమో, ఈవిడ రెస్పాన్సివ్వడం లేదని, ఈవిడగారి పైవాడికి మెయిలోలేకఇంకోటో పంపెస్తాడు. అక్కణ్ణుంచి ఆయన ఫోన్లూ. కాఫీ చాయ్ గయా పానీమే ! పైగా ఈవిడ టైముకి అటెండవకపోతే ” ఆర్ యూ దేర్?” అంటూ సణుగుడూ. హాయిగా ఆఫీసునుంచే పనిచేసికుంటే బావుండేదీ అని ఈవిడనుకుంటుంది. ఓ టైమూ పాడూ ఉండదు ఈ కొం.ప.ప్రా లకి. కానీ ఇందులో ఉండే సౌకర్యాలు దీంట్లోనూ ఉన్నాయి. ఎప్పుడో బయటి దేశాలకెళ్ళవలసివచ్చినప్పుడు వస్తుంది అసలు గొడవంతా. పాపం అప్పుడే వయస్సులోకి వస్తున్న టీనేజ్ పిల్లని వదిలీ వెళ్ళలేదూ, అలాగనిఉద్యోగ భవిష్యత్తూ పాడిచేసికోలేదు.

ఇదంతా టీనేజ్ ఆడపిల్లలుండే తల్లుల కష్టాల పరంపర. ఇంక చిన్న స్కూలుకి వెళ్ళే పిల్ల ఒకర్తీ, ఇంకా క్రెచ్ కెళ్తున్న బాబూ ఉన్న వాళ్ళ కష్టాలింకో రకం. స్కూల్లో ఏమైనా హోం వర్కిచ్చారో లేదో, స్కూలునుండి రాగానే ఛస్తే చెప్పరు. ఏ రాత్రో సడెన్ గా గుర్తొస్తుంది.ఇంక ఆ తల్లి ఉరకలూ పరుగులూ చూస్తే, “పగవాళ్ళకైనా ఇలాటి కష్టాలు రాకూడదురా బాబూ” అనుకుంటాము! ఏం తింటారో తెలియదు, ఎప్పుడు తింటారో తెలియదు. వాళ్ళు ఏదో ఒకటితిని పడకెక్కేదాకా ఈ తల్లులకి నిద్రనేదుండదు.

ఏదో నానా తిప్పలూ పడి, మొత్తానికి ఓ పదేళ్ళో,పుష్కరమో ఏ అవాంతరమూ రాకుండా,గడపగలిగితే వీళ్ళ పెళ్ళిలయేదాకా కొంచం పరవా లేదు. కానీ ప్రతీ స్త్రీ, మామూలు గృహిణైనా (మా ఇంటావిడ లాటిది), ఇద్దరు పిల్లల వర్కింగు లేడీ ( మా అమ్మాయీ, కోడలూ, ఎందుకంటే పైన చెప్పిన వెరైటీలు- టీన్ ఏజ్ కూతురూ, ఏడేళ్ళ కొడుకూ,చిన్నస్కూలుకెళ్ళ్ కూతురూ, క్రెచ్ కెళ్ళే కొడుకూ–), వాళ్ళు పడే తిప్పలు డే ఇన్ డే ఔట్ చూస్తున్నాను. అదృష్టం కొద్దీ నాది అబ్జర్వర్ పాత్రే! పార్టిసిపెంటు పాత్రైతే వామ్మోయ్ !! హ్యాట్సాఫ్ టు ఆల్ వర్కింగ్ మదర్స్ !!

6 Responses

 1. మీ కొం.ప.ప్రా పదం బాగుంది మాస్టారు,.,మాకు బాగా నప్పుతుంది.. కానీ అమ్మాయిలకి ఎప్పుడైనా చాయిస్ ఉంటుంది..వారికి మరీ బర్డెన్ గా అనిపిస్తే ఉద్యోగం మానేయ్యచ్చు..అలాగే వీలైతే మళ్ళీ చెయ్యచ్చు..కానీ పురుషపుంగవుల గతి ఏమిటి?ఒకప్పటి పరిస్థితి ఇప్పుడు లేదు..అందరూ సమానమే..ఇంటి పనులు కూడా ఇప్పటి జంటలు చక్కగా షేర్ చేస్కుంటున్నారు..(కొందరు మినహాయిస్తే ) నా స్నేహితుడు శ్రీమతి ఈ మధ్యే బెల్జియం వెళ్ళింది ..ఒక ఆరు నెలల పని. ఇద్దరు పిల్లలనీ వాడి తల్లిదండ్రుల సాయంతో చక్కగా వాడే చూస్కుంటున్నాడు..వారానికి 3 రోజులు కొం.ప.ప్రా..2 రోజులు ఆ.ప.ప్రా ..

  Like

 2. ఓ వరసా వావీ లేకుండా మెయిల్స్ పంపుతూనే ఉంటాడు. :))

  లెస్స బలికితిరి!

  Like

 3. అమ్మాయిలకి చాయిస్ ఉన్నవాళ్ళు కూడా ఎందుకు ఆఫిసుకి ఇంటికి మధ్య నలిగిపొతారో అర్దం కాదు.పిల్లలు స్చూల్ కి వెళ్ళేదాకా అన్నా బ్రేక్ తీస్కొవచ్చు..financial constraints ఉంటే సరే..ఐనా సరే,ఇంత చదివింది ఇంట్లో వంట చెయటానికా అంటారు..చేసేది తన కుటుంబానికే గ…

  మళ్ళి పిల్లలతొ time spend చెయలేకపొతున్నాము..మాకు హెంత కష్టం,హెంత కష్టం అంటారు..అదే పిల్లలు పెరిగి,,అమ్మ ని శత్రువులా చూస్తున్నారంటే,,చూడరు మరి..వాళ్ళని ఎప్పుడన్నా పట్టించుకుని ఎడిస్తేగా..!!!..I hav seen cases like this ..

  Like

 4. ఈ టపా మా ఇంటివారి కంటపడకుంటే బాగుండును. చూసావా.. ఇరవైనాలుగు గంటలు కొంపలో సుఖంగా గడిపేస్తూ “టైం లేదు, సాయం చెయ్యరు, వేగలేకపోతున్నాను” అని సణుగుతావు. అదిగో పెద్దగీత అని సూక్తిముక్తావళి మొదలెడతారు.

  ఏమాటకామాటే చెప్పాలి కొంతమంది పనిచేసే తల్లులు పిల్లలతో పడే కష్టాలు చూస్తే, నా భవిష్యత్తు నా కళ్ళ ముందు కవ్విస్తూ నవ్వుతుంది. నాకు వాళ్ళంటే మాహా గౌరవం, జాలి కూడాను. తప్పదుగా.. ఆ రోజొస్తే నేనూ పరుగులు తియ్యక తప్పదు.

  Like

 5. “All mothers are working mothers” అట 🙂 ఎక్కడో చదివాను.
  నిజమే కదా. కృష్ణప్రియ బ్లాగులో నా మొదటి వ్యాఖ్యలో అనుకుంటా, నేనూ ఇదే అన్నాను. మగ వాళ్ళకి ఉద్యోగమా వద్దా అనే చాయిస్ చాలా అరుదు కదా అని. మరి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి అని.ఇక ఉద్యోగం చెయుయకుండా ఉంటే ఊరికే ఇంట్ళో కూర్చుని తింటున్నారంటారు అటువంటి వారిని అర్థం చేసుకోలేని వారు. పైన ఉద్యోగం చేసే మహిళలని ప్రశ్నించినట్లే. ఏ చాయిస్ ఎన్నుకున్నా అందులో అందరూ మనస్ఫూర్తిగా సరైన కారణాల వళ్ళే ఎన్నుకున్న వారు ఉంటారని కాదు. అన్నిట్లోనూ exceptions ఉంటాయి. పిల్లలను పెంచడం తల్లి ఒక్కర్తి పనే కాదు. మొదటి వ్యాఖ్యలో అభిప్రాయం అదే చెప్తోంది. వివరంగా నా అభిప్రాయాలు ఇంకెప్పుడైనా, వ్యాఖ్యగానో, టపాగానో వ్రాయగలుగుతానేమో.

  Like

 6. @నైమిష్,

  “మన” లో ఉన్న సమస్యే ఇది–అమ్మాయిలు ఎప్పుడైనా మానేయడానికి చాయిస్ ఉంటుందీ– అనడం! ఎలా మానగలరు? పరిస్థితులు వాళ్ళని అంతంత త్యాగాలు చేయనీయలేవు!

  @కృష్ణప్రియా,
  ధన్యవాదాలు.

  @నిరుపమా,

  ప్రస్తుత కాలంలో ఇద్దరూ ఉద్యోగం చేయడం అవసరమౌతోంది.

  @కొత్తావకాయా,

  “ఇరవైనాలుగు గంటలు కొంపలో సుఖంగా గడిపేస్తూ”– అదేనా ప్రస్తుత వ్యాపంగం ? అదృష్టవంతురాలివి తల్లీ !!!!!

  @లలిత గారూ,

  మా పిల్లలు పడే అవస్థలు ప్రత్యక్షంగా చూసి ఈ టపా వ్రాశాను. మీ దృష్టికోణం కూడా ఓ టపా వ్రాయండి.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: