బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–We eat లంచం,We breathe లంచం,We live లంచం….


    పుట్టినప్పటినుంచీ ఏదో ఒక లంచానికి అలవాటుపడ్డవాడే ప్రతీ వాడూనూ. మళ్ళీ ,ఏదో కొత్తగా కనిపెట్టినట్లు ఈ గొడవేమిటీ అసలు? ఆ ఆదం ఆపిల్ పండు లంచం ఇవ్వడంతో ప్రారంభమయింది ఈ సృష్టి. జీవితాంతం ఆ లంచంతోనే బ్రతకాలి. ఎక్కడ లేదూ లంచం? పెళ్ళానికి లంచం ఇవ్వకపోతే, అసలు దగ్గరకేరానీయదు,ఇంక సృష్టెక్కడ?ఓసారి కోప్పడి చూడండి, ఏదో కారణం చెప్పి, ఈవేళ ఏమిటో మూడ్ బాలేదండీ, అంటుంది. ఆ మూడ్ బాగుచేయడానికి ప్రతీ భర్తా ఏదో ఒక టైపు లంచం ఇచ్చికున్నవాడే!

    చిన్నపిల్లాడు ఊరికే ఏడుస్తూంటే, ఓసారి ఎత్తుకుంటే కానీ ఏడుపు మానడు. అలాగే బువ్వ తినరా అంటే, ఇంకోటేదో కావాలని పేచీ, ముందర బుధ్ధిగా తినేస్తే తరువాత తాయిలం పెడతానని, అమ్మ ఆ పిల్లాడికి లంచం ఇచ్చుకోవాలి!అంతదాకా ఎందుకూ, పిల్లలు బాగా చదివి పై చదువులకి వెళ్తే, ఓ వాచీయో, ఓ బైక్కో కొనిపెడతాననే తల్లితండ్రులు ఎంతమందిని చూడలేదు? కాలక్రమేణా అవి సెల్లుల్లోకీ, ఐపాడ్లలోకీ వచ్చాయి. ప్రిన్సిపుల్ ఒకటే లంచం.పిల్లో పిల్లాడో ఎవరో అమ్మాయినో అబ్బాయినో ప్రేమిస్తున్నానూ అనగానే, కాదంటే ఏం కొంప ముంచుతాడో అని భయపడి, వాళ్ళడిగినట్లు చేయడం కూడా ఈ కోవలోదే.

   గవర్నమెంటు ఆఫీసుల్లో చూస్తూంటాము, ఎవడో కక్కూర్తి పడి దక్షిణ అడిగినవాళ్ళే బయట పడతారు కానీ, ఆ ఆఫీసు హెడ్డు ఇచ్చే లంచాలు బయట పడవు. ఉదాహరణకి అక్కడ ఓ ఫలానా యూనియన్ పవర్ఫుల్ గా ఉందనుకోండి, వాళ్ళేం చేసినా ఊరుకోమని ప్రతీ డిపార్ట్మెంటు కీ subtle గా instructions వెళ్తాయి, dont be harsh, be diplomatic అని! దీన్నేమంటారు? ఎవడితో గొడవెట్టుకుంటే ఏం గోలో అని, నోరుమూసుకుని, వాళ్ళేం వెధవ్వేషాలేసినా భరించాలి. బహుశా ఇందువల్లే కాబోలు, బ్యాంకులో ఆఫీసర్లకంటే, క్లాస్ ఫోర్ వాళ్ళు పవర్ఫుల్ గా కనిపిస్తారు.ఇదీ ఓ రకమైన లంచమేగా? నా నలభై ఏళ్ళ సర్వీసులోనూ ఇలాటివి ఎన్నో చూశాను.ప్రతీదానికీ డెప్యుటేషనే ( గవర్నమెంట్ ఖర్చు మీద).

    అంతదాకా ఎందుకూ, మన దేముళ్ళేమైనా తక్కువ తిన్నారా? ఫలానా పరీక్ష పాసౌతే గుండు కొట్టించుకుంటానూ, ఫలానా రోగం బాగైతే నిలువు దోపిడీ ఇస్తానూ, ఫలానా లాటరీ తగిల్తే ఫలానా పెర్సెంటు హుండీలో వేస్తానూ, మరివన్నీ ఏమిటీ? చివరాఖరికి ఆ భగవంతుడు కూడా, తృణమో పణమో సమర్పించుకోపోతే, పని చేయడం లేదు. దీన్ని మొక్కుబడి అంటారూ, లంచం కాదూ అనొచ్చు. కానీ ఇదికూడా లంచం డెఫినిషన్ పరిధిలోకే వస్తుంది.( Gift or money given, to persuade him to make a favourable decision).

    ఇంక మన పాత్రికేయులూ, మీడియా వాళ్ళూ తక్కువ తిన్నారేమిటీ? ప్రభుత్వం వారు వీళ్ళని గుడ్ బుక్స్ లో పెట్టుకోడానికీ, మంచి ఇమేజ్ బిల్డప్ చేసికోడానికీ, జర్నలిస్టులకి కొంపలు కట్టుకోడానికి స్థలాలూ, ఎప్పుడైనా విదేశాలకెళ్ళినప్పుడు వాళ్ళ టీం లో రావడానికీ అన్ని ఖర్చులూ భరిస్తారు. ఓ ప్రెస్ మీట్ పెడితే, అక్కడకి వచ్చే విలేఖరులకి జరిగే మర్యాదలకి అంతే ఉండదు. ఏదైనా తక్కువయిందా, మర్నాడు పేపర్లలో ఏకేస్తారని భయం!
వీళ్ళిచ్చే ఆమ్యామ్యాలకి , for maintaining goodwill అనో పేరోటీ! వెధవ్వేషాలేం కాదూ. ఇన్నాళ్ళనుంచీ మీడియాల్లో రాస్తున్నవాళ్ళందరూ గుండెల మీద చెయ్యేసికుని చెప్పగలరా, తాము ఎప్పుడూ ఇలాటి ప్రలోభాల్లో పడలేదని? అవన్నీ గుడ్ విల్లులూ, మిగిలినవన్నీ లంచాలా? అంతదాకా ఎందుకూ, పండగలకీ పబ్బాలకీ, ప్రతీ ఆఫిసులోనూ చూస్తూంటాము, జనవరి ఒకటికి డైరీలూ, క్యాలెండర్లూ, దీపావళికో, దసరా కో స్వీట్ బాక్సులూనూ.ఇవేమిటిట మరి, బువ్వాలాటల్లో తాయిలాలా?

   లంచం ఇచ్చినా తప్పే, పుచ్చుకున్నా తప్పే, ఇంకోళ్ళు పుచ్చుకుంటూంటే చూస్తూ ఊరుకున్నా తప్పే అంటారు కదా, మరి ఈ పెద్దమనుష్యులు, అదేనండీ సో కాల్డ్ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళందరూ జీవితంలో అసలు తప్పే చేయలేదంటారా? పైగా అలా అంటే, ఏమో చేసే ఉంటాం, అయినా సుధారవడం కూడా తప్పేనామ్మా అని ఓ కౌంటరోటీ? Have a heart. Dont be a hypocrite.

   అలాగని బతికున్నంతకాలమూ, లంచాలిస్తూనే బతకాలని కాదు. ఈ పరిస్థితి మారాలి, తప్పకుండా మారే తీరాలి, కానీ one has to accept facts. ఏ గవర్నమెంటాఫీసులోనైనా, ఓ పని చేయించుకోవాలనుకోండి, అక్కడి పెద్దాయనేదో తెలిసినవాడూ, మనకేమిటీ అనుకుంటే సరిపోదు, ఒకసారైతే సరిపోతుంది, ఆ తెలిసినాయన కాస్తా రిటైరయ్యో, ట్రాన్స్ఫరయ్యో వెళ్ళిపోతే, అక్కడుండే ప్యూన్నో, గుమాస్తాయే గతి. అప్పుడు తెలుస్తుంది, అసలు సంగతి!

   ఈవేళ ఓ పేపర్లో చదివాను- అన్నా హజారే గారి పెర్సనల్ ఫిజీషియన్ అంటారూ, అన్నా తొమ్మిది రోజులపాటు, నిక్షేపంగా నిరాహార దీక్ష చేసికోవచ్చుట. ఆయన ఆరోగ్యానికొచ్చిన ధోకా ఏమీ లేదుట!
I am not trying to dilute the seriousness of the mood of the Nation. Janalokpal is not the solution.

7 Responses

 1. it may not be solution but it can be one step towards solution. when we think of corruption we think mostly about corruption by a 4th class employee but not about raja’s and koda’s. with what ever intentions anna has started the moment, i think the bill can be very powerful against such people. so atleast there is no harm in implementing such a bill rather than the govt saying that exempt all the corrupt sector from the bill. i am sure the polititians who are supporting anna today will not vote for his bill tomorrow in the parliment.

  Like

 2. మొత్తానికి ఉత్తరాదిలో ఉంటున్న వాసన పోలేదు. సుధారవడం ఏెంటండీ. నేటివ్ లకు అర్ధం అవ్వదు. దానికి తెలుగు – తప్పుదిద్దుకోవడం – తప్పు తెలుసుకోవడం – అనుకుంటాను. బాగుంది.

  Like

 3. Babayya,
  Whole heartedly agree with all you said except for the part about ”Devudu – lanchalu’ the humans have projected their ‘lancha- Gondi. ‘ to Him. Now, this past visit we went to this temple in Chilkur near HYD – Balaji temple. There is no Hundi , the priest does not take Dakshina and so on. Quite remarkable.

  Like

 4. @మురళీ,
  I beg to differ with you. There are already enough rules in the Criminal Procedure Code. Honest implementation and execution would be more than enough. I still feel, this show of “solidarity” is avoidable.

  @వేణు గోపాల్,

  మీరన్నదీ నిజమే. కానీ ఎంతైనా హిందీ మన రాష్ట్రభాష కదా!

  @అరుణా,

  ఇప్పటివరకూ ఎన్నో దేవాలయాలు చూసుంటావు. చిలుకూరు తప్ప ఇంకోచోట అలా ఉందని చెప్పగలవా? It is a rare exception.

  Like

 5. ఫణి బాబు గారూ.

  మీరు చెప్పిన ప్రతి పాయింట్ తోనూ నేను ఏకీభవిస్తున్నాను. అతి చిన్న విషయాల్లో కూడా క్రమశిక్షణ పాటించలేని జాతి మనది. సివిక్ సెన్స్ అనేది ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు. క్రమశిక్షణ లేని ఏ జాతి కూడా అవినీతి మీద పోరాడలేదు. పైనెక్కడో ఉన్న అవినీతి గురించి అరుపులే కాని, ప్రజలందరూ తమ తమ రోజువారీ పనుల్లో చేసే అవినీతి అంతా ఇంతా కాదు. ఏదో ఉద్యమం పేరుతొ నాలుగురోజులు గంతులు వెయ్యంగానే అవినీతి పోతుందా??!! రేప్పొద్దున ఆ బిల్లేదో వచ్చినా అది అమలు జరగటానికి కూడా లంచాలు అడుగుతారు! ఈ మధ్యనే బెంగుళూరులో పిల్లలు హడావిడి చేస్తుంటే చూసి నేను నా ఆలోచనలు నా బ్లాగులో వ్రాసాను ఒకసారి చూడగలరు.
  http://saahitya-abhimaani.blogspot.com/2011/08/blog-post.html

  Like

 6. @అరుణా,

  ఓకే.

  @శివరామప్రసాద్ గారూ,
  మీరు పంపిన లింకు చూశాను. మనవాళ్ళు చాలా ఉత్సాహవంతులు !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: