బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–చాలామందికి నచ్చకపోవచ్చు…


   నిన్న సాయంత్రం మా స్నేహితుడి ఇంటికి వెళ్ళాము.అవి ఇవీ కబుర్లు మొదలెట్టగానే ఆయన అడిగారూ- అన్నా హజారే దీక్ష మీద మీ అభిప్రాయం ఏమిటీ అని.నాకేమీ అంత ఆసక్తి లేదండీ అనగానే ఆయన కొద్దిగా ఆశ్ఛర్యపోయి, అదేమిటండీ, దేశమంతా అలా అట్టుడికిపోతూంటే, మీరలాగ అంటారేమిటీ,అన్నారు.నాకు ఆ విషయం మీద ఏదైనా ఆసక్తి ఉన్నా లేకపోయినా ,జరిగేది జరక్క మానదు కదా.అయినా ఎవరి అభిప్రాయాలు వారివీ, హాయిగా ఏవో కబుర్లు చెప్పుకోకుండా, ఈ గొడవంతా ఎందుకూ అన్నాను.ఆయన కొద్దిగా డిజప్పాయింట్ అయినట్లు కనిపించారు. ఏ పేపరు చూసినా, ఏ చానెల్ చూసినా ఇదే గొడవ.

   నాకు ఓ విషయం అర్ధం కాదు. దేశంలో చట్టాలకేం తక్కువా? ప్రతీ దానికీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లో పేజీలకి పేజీలు నింపారు. అవి కానట్లు, ఎప్పుడో 40 ఏళ్ళ క్రితం ఇంకో చట్టం తెద్దామని ఓ ముసాయిదా తయారుచేశారుట, దాన్ని పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి, ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఒక్కరికీ దానిమీద శ్రధ్ధ లేదుట. దాన్ని ఎలాగైనా పార్లమెంటులో ప్రవేశపెట్టి ఎలాగోలాగ దానికి చట్టరూపం తేవాలనేదే ప్రస్తుత సమస్య. అన్నా కీ, ప్రభుత్వానికీ ఇక్కడ వచ్చింది సింపుల్ ఇగో ప్రోబ్లం. ఆయన చెప్పింది ప్రభుత్వం ఒప్పుకోడం లేదూ, వీళ్ళు చెప్పింది ఆయన ఒప్పుకోడం లేదూ. ఏదో ఒకటీ, నలభై ఏళ్ళ తరువాత, ప్రభుత్వం మొత్తానికి దిగొచ్చింది కదా, ఏదో ఒకటి ప్రవేశపెట్టనీయొచ్చుకదా , ఆ బిల్లేదో పాస్ అయిన తరువాత, కావలిసినన్ని ఎమెండ్ మెంటులు చేసుకోవచ్చుగా. మన రాజ్యాంగానికే కావలిసినన్ని ఎమెండ్ మెంట్లున్నాయి, దీనికో లెఖ్ఖా? అసలు దీనికే ఒప్పుకోనంటున్నాడీయన. ఏదో ప్రజాస్వామ్యం, పార్లమెంటూ అని ఉన్నాయికదా, వాటి పని వాటిని చేసికోనీయొచ్చుగా.అబ్బే అలా కాదు, నేను చెప్పిందే వేదం అంటే ఎలా కుదురుతుందీ?

   గత అరవైఏళ్ళనుంచీ జరగనివన్నీ ఇప్పుడు జరుగుతున్నాయా లేదా? కల్మాడీలూ, రాజాలూ, ఈవేళో రేపో మారన్నూ ఈ కరప్షన్ ఛార్జిలమీద జైలుకెళ్ళారా లేదా, కొద్దిగా సహనం ఉండాలని నా ఉద్దేశ్యం.యాక్టివ్ జ్యుడీషరీ ధర్మమా అని, నల్లధనం వ్యవహారం కూడా సుప్రీం కోర్టు చేతిలో ఉంది. ఎప్పుడో ఓ రోజున మన అతిరథమహారథులందరూ, జైల్లో కూర్చోవలిసిందే. మన సిస్టం మీద నాకు ఈమధ్యన చాలా నమ్మకం వచ్చేసింది. ప్రతీ సిస్టమ్ లోనూ కలుపుమొక్కలనేవి ఉంటాయి. అందరూ ” భారతీయుడు” లో కమల్ హాసన్ లాగుంటే, మజా ఏముంటుంది? మన న్యూస్ పేపర్లూ, టి.వీ. చానెళ్ళూ, వాటిల్లో తమ అమూల్యమైన అభిప్రాయాలు చెప్పే రాజకీయనాయకులూ ఏ గంగలో దూకుతారు?

   ఈవేళ ప్రొద్దుటినుంచి చూడండి, ఏ చానెల్ చూసినా జగన్ మీద రైడ్లగురించే. ఇక్కడ ఇంత గొడవ జరుగుతున్నా, తను మాత్రం అక్కడెక్కడో ఓదార్పు యాత్ర చేసికుంటున్నాడు, తనకేమీ పట్టనట్లు. అయినా ఏణ్ణర్ధం నుంచీ రూఫ్ టాప్స్ మీదనుంచి అరుస్తున్నారు, ఎప్పటికోఅప్పటికి తనమీదా రైడ్లు జరుగుతాయని తెలుసు కదా, తనేమైనా తెలివితక్కువవాడా, ఇలా సి.బి.ఐ, వాళ్ళు వచ్చీరాగానే, “రండి రండి మీరాకయే మా అదృష్టమూ, ఇదిగో ఇవీ నేనూ, మా కుటుంబమూ సంవత్సరాలనుండీ జమా చేసిన అక్రమ ఆస్థులూ..” అని చూపించడానికీ? ఏదో చానెళ్ళ టి.అర్.పీలు పెరగాలీ, ఎంత హడావిడీ, ఇదే కదా ఆంఆద్మీ ఎంటర్టైన్మెంటు!

   వచ్చిన గొడవల్లా ఎక్కడంటే, అప్పుడెప్పుడో రాందేవ్ అదేదో దీక్ష చేశారుట, దేశం దేశం అంతా కాషాయ బట్టలు కట్టేశారు. ఓ వారంరోజులు జరిగిందా హడావిడంతా. ఇప్పుడు ఆయన ప్రసక్తే ఎక్కడా లేదు. ప్రస్తుతపు హవా అన్నా హజారే గారు. పోనీ ఆయనన్నదే రైటూ అనుకుని, ఆయనన్నట్లుగానే ఆయన అడిగినవన్నీ ఆ ముసాయిదాలో చేర్చి, పార్లమెంటులో ప్రవేశబెట్టారూ అనుకుందాము, అక్కడ ఆ బిల్లు పాసవుతుందని ఏదైనా గ్యారెంటీ ఉందా? మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటిదాకా పాస్ అవనేలేదు. మన రాజకీయనాయకులు చాలా మంది జగజ్జంత్రీలండి బాబూ. వాళ్ళా ఈలాటి బిల్లులు పాస్ చేసేదీ? ఏదో వాళ్ళరోజులు బాగోక పట్టుబడాలికానీ, ఈ చట్టాలూ చట్టుబండలూ వాళ్ళనేం చేస్తాయి?

   రాత్రికిరాత్రి ఈ కరప్షన్ ని కూకటివేళ్ళతో లేపేయాలనుకోడం ఓ భ్రమ. ఇదేమైనా కంప్యూటరా ఏమిటీ Esc, delete అనగానే మాయమైపోవడానికీ?బహుశా నా ఈ టపా చదివిన తరువాత, నేను చాలా Sacrilegious గా కనిపించొచ్చు, ప్రస్తుత దేశ వాతావరణ దృష్ట్యా. కానీ ఉన్నదేదో చెప్పుకోవాలిగా. మరి నా ఈ అభిప్రాయాలన్నీ, నిన్న ఆయనతో చెప్తే, సిగపట్లదాకా వెళ్ళొచ్చు. ఇక్కడ రాసుకుంటే, చదివేవారు చదువుతారు లేకపోతే మానేస్తారు. పైగా ఇలాటివి అందరితోనూ చర్చించడం కష్టం. ఊరికే బ్లడ్ ప్రెషర్ పెంచుకోడం తప్ప.

10 Responses

 1. భలే చెప్పారు 🙂 బాగా ఎమోషన్ తో రాసారనుకుంటా 🙂

  Like

 2. నిజమే! ఒప్పుకుంటా…:D

  పోనీ పనసపొట్టు కూర మీద మాట్లాడుకుందామా? పనస పుట్టిందే పాలకొల్లులో అని వైవశ్వత పురాణంలో స్పష్టంగా చెప్పబడింది. మహా భారతంలో రాయబారానికి కృష్ణుడు విదురిని ఇంట్లో పనసపొట్టు కూర మొదటిసారి ఆరగించాడని తెలుస్తోంది, దీన్ని బట్టి విదురుడు మన తీరాంధ్రుడే అని అవగతమవుతోంది. పనసపొట్టు కూర వేడివేడి అన్నం లో ఓ పేద్ద కంచంలో కలుపుకుని తింటూ, అన్నమాచార్య కీర్తన్లు తందనానా.. తందనాన అని వింటూ వుంటే… ఓహోహో … కెవ్వోకెవ్వు, కేకో కేక… ఆరుచి చెప్పనలవి కాదు. ఇక మరాఠావాళ్ళు దీన్నే మాఠోళీ, ఒరియా వాళ్ళు ఓర్‌ఝోల్‌బోయ్,తమిల్ వాళ్ళు ఫనకుళిత్తువేండ్రుం అన్నా అది మన పనసపొట్టు కూరనే అనుకోవాలి. అసలు ఈ పనస్….
  😛 :))

  Like

 3. పెద్ద పెద్దవారి సంగతులు నాకు తెలియవు కానీ, ఇళ్ళలో, ఫేస్ బుక్కుల్లో చర్చల వల్ల ఒరిగేదేం లేదు. ఇంకా సమాజానికి మన వంతు అనుకుంటే ప్లాస్టిక్ మానేసి గుడ్డ సంచీ పట్టుకు బజారుకెళ్ళచ్చు. రీ సైకిల్ చెయ్యచ్చు. మన పని మనం లంచం ఆశించకుండా చెయ్యచ్చు. ఇవ్వాల్సొచ్చిన చోట ఎదిరించడమే అందరికీ సాధ్యం కాకపోవచ్చు. మన పరిధిలో మనం అన్నీ సక్రమం గా చేస్తే చాలని నా అభిప్రాయం. సర్కారు లెవెల్లో జరిగేది జరగక మానదు. ఆఖరికి ఓటు వేసే రోజు కూడా చెడ్డవాడిని వదిలి, కొంచెం తక్కువ చెడ్డవాడినే ఎంచుకోవడం మినహా చేస్తున్నదేంటి మనం. జిజియా బాయి లా కొడుకుని ఒక్కరైనా “వెళ్ళు, రాజకీయనాయకుడివి కా.. ” అని తిలకం దిద్ది పంపించగలుగుతున్నామా? :X

  ఏ మనిషికి ఉన్న బలమైన అభిప్రాయమూ ఎదుటి వాడు చెప్పడం వల్ల మారదు. మారితే అది అభిప్రాయమే కాదు. ముందుకు నడిపించేది స్వతహాగ ఉన్న విచక్షణ, తిన్న ఢక్కామొక్కీల వల్ల పెరిగిన తెలివీను.

  మీ టపాకి నా పూర్తి మద్దతుని ఇస్తున్నాను. ఇంత స్పష్టంగా ఇంకొకరు చెప్పలేరు.ఈ చానల్స్ హడావిడి, జనాల గోల చూస్తే మహ విసుగ్గా ఉంది. ఎన్ని పని గంటలు వృధా? ఓ హైవే వేసెయ్యొచ్చు.

  నా ప్రాణ స్నేహితురాలు సమాజం కోసం తన వంతు అని “రెఫ్రిజిరేటర్ లేకుండా, ప్లాస్టిక్ వాడకుండా, పిల్లలకి పేపర్ విలువ చెప్పి పలక వాడిస్తూ, చెత్త సక్రమంగా రీసైకిల్ చేస్తూ, వీలయినంత దూరం నడిచి వెళ్ళి పని చేసుకుంటూ” గడుపుతోంది. నాకు తనే చాలా గొప్ప.

  Like

 4. నిజమే.. చానళ్ళ హోరు… మద్దతు ఇస్తున్న వాళ్లల్లో అందరూ.. లంచం ఇవ్వకుండా, తీసుకోకుండా ఉంటున్నారా? ఓటు వేస్తున్నారా? ఒక్కోసారి నాకు అనుమానం వస్తోంది… లోక్ పాల్ బిల్లు లో దేనికోసం అన్నా పోరాడుతున్నారో ఖచ్చితం గా తెలుసా?
  మొన్న బస్సు కోసం నుంచుని అక్కడ ప్లే కార్డ్ పట్టుకున్న అమ్మాయిల్ని అడిగాను.. 🙂 ఖచ్చితం గా వాళ్లకీ తెలియదు. నలుగురితో నారాయణ..

  @snkr, LOL

  Like

 5. బావుంది. ఆసక్తి లేదు లేదూ అంటూనే చక్కటి విశ్లేషణ చేశారు ఫణి గారు 🙂

  nice post. I agree with your views.

  Like

 6. disclaimer: పై నా వ్యాఖ్యలు ఎవరినీ ఉద్దేశించినవి కావు, ముఖ్యంగా పొట్టు(పనస) తినేవాళ్ళని గురించి కానే కావు. అన్నమాచార్య/త్యాగరాజు పాటలతో నంజుకుతింటే బాగుంటుందని ఎవరో ఇక్కడెక్కడో చదివింది, పొట్టు/తౌడు అంటే ఫైబర్, అంటే ఓట్స్ లాంటివే ఐనా, బలవర్ధకమైన చవగ్గా దొరికే ఫుడ్స్ అని లక్కరాజు గారు అనుకుంటా చెప్పింది కలసిపోయి అలా అనేశాను. ఇందులో పాత్రలు, పనసపొట్టు కేవలం కల్పితాలు. ఏదో ఫణి గారితో సరదాగా… అంతే గాని, ఆయన హైలైట్ చేసినవాటితో నేను సైద్ధాంతికంగా ఏకీభవిస్తున్నా. అపార్థం చేసుకోవద్దని మనవి. 😦

  Like

 7. Super like !

  Like

 8. @రాజేష్,
  ఎమోషన్ అని కాదూ, ఏమిటో ఈ హడావిడి చూసి విసుగెత్తి వ్రాసింది !

  @Snkr,
  మొదటి లైనుకి ధన్యవాదాలు! ఇంక పనసపొట్టు చరిత్ర కి థాంక్స్ !!

  @కొత్తావకాయా,
  కరప్షన్ మన దేశానికున్న ఒక సమస్య. మీరన్నట్లు, మిగిలినవాటి మీద శ్రద్ధ్ధ తీసికుంటే ఇంకా బాగుండేది.

  @కృష్ణప్రియా,

  ఈవేళ వ్రాసిన టపా కూడా చదవండి.

  @వీకెండ్ పొలిటీషియన్,

  థాంక్స్.

  @రూథ్,

  థాంక్స్.

  Like

 9. మీరు కూడా అవినీతి గురి౦చి ఏక౦గా రె౦డు టపాలు బ్లాగారు .
  బాగా వ్రాసారు 🙂

  Like

 10. మౌళీ,

  ధన్యవాదాలు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: