బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Compromiజులు….1


    ఏదో ఎవరి పేరో “సోమయా జులు” లాగ ఈ “Compromi జులు” ఏమిటీ అనుకుంటున్నారా? ప్రపంచం లో అందరి సంగతీ ఎందుకు లెండి, రమారమి సామాన్య మానవుడు ( స్త్రీ పురుష బేధం లేకుండగా) ,ఒక్కోప్పుడు ఎక్కువగా స్త్రీలే, జీవితాంతం బ్రతికేది ఈ “Compromi జుల” తోనే !! ప్రతీ విషయం లోనూ Compromi జులే! ఏదో కొద్దిగా తెలివి మీరి, వాటిల్లోంచి బయట పడదామనుకునే సరికి పుణ్య కాలం కాస్తా అయ్యేపోతుంది. అదృష్టం బాగుంటే, వచ్చే జన్మలోనైనా, మొహమ్మాటం లేకుండా ఉంటే బాగుండునూ అని అనుకోవడం తప్ప చేసేదేమీ లేదు!

మామూలుగా, ఇంట్లో పెద్ద కొడుగ్గానో, పెద్ద కూతురుగానో పుట్టిన ప్రతీవారికీ, ఈ Compromi జులు ఓ in built quality! పాపం పుట్టినప్పటినుంచీ, తల్లితండ్రుల్ని చూసి చూసి,పోన్లెద్దూ, అమ్మా నాన్నా నాకోసం ఇంత కష్ట పడుతున్నారూ, ఏదో సద్దుకుపోతే పోలేదూ, అనే భావం వచ్చేస్తుంది. అది పెరిగి పెరిగి పెద్దయేసరికి, దాంట్లోంచి, అసలు బయట పడలేనంతగా, మహా వృక్షమైపోతుంది. ఇంక ఆ మిగిలిన వాళ్ళు ( తరువాత పుట్టిన జనాభా!) ఉన్నారే వాళ్ళు మాత్రం డాం భిస్ గాళ్ళు!వాళ్లకి to hell with Compromi జులు! వాళ్ళకి కావలిసినవేవో చేయించుకుంటారు!

ఓ పెళ్ళనండి, చదవ్వలసిన చదువులనండి, అన్నీ కావలిసినట్టుగానే. పాపం పెద్ద పిల్ల, అమ్మా నాన్నా తెచ్చిన సంబంధం, చేసికుంటుంది. నాన్న చెప్పిందే వేదం అనుకుంటుంది పూర్ ఫెలో ! చిన్నప్పుడు ఇంట్లో చెల్లెలో, తమ్ముడో పుట్టినప్పుడు ప్రారంభం అయిన ఈ Compromi జులు, ఈ పెళ్ళితో ఓ మలుపు తిరిగి, మళ్ళీ ఇంకో ప్రస్థానం మొదలెడతాయి!
అక్కడ కూడా పెద్దకోడలే అయిందా, గోవిందో గోవింద… ఆ భార్యా భర్తలిద్దరి నోముఫలమూ ఇంకో Compromi జు… కుర్ కురే వాళ్ళ యాడ్ లో లాగ
क्या फामिली है
…. అనుకోవడమే ! ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళతో ఫుట్ బాలాడేసికుంటారు.

రెండో పిల్ల కో, పిల్లాడికో పెళ్ళవుతుంది. ఇవ్వవలసిన లాంఛనాలూ ఇస్తారు, పుచ్చుకుంటారు కూడానూ. అంతా మహరాజభోగమే! ఎక్కడిదాకా వెళ్తుందంటే, పెళ్ళై ఓ పిల్లో పిల్లాడో పుట్టిన తరువాత కూడా, పుట్టింటికి వచ్చినప్పుడు, ముక్కు పిండి వసూలు చేసికుంటుంది! మా చుట్టాలలో ఒకళ్ళ గురించి చెప్పుకునేవారు- పెళ్ళై పదేళ్ళు గడిచినా, పుట్టింటికి వచ్చినప్పుడు, ” మావారికి ఒక్కరూ పడుక్కోవడం ఇష్టం ఉండదూ, విడిగా ఓ రూమ్మియండమ్మా…’అని అడిగేంతవరకూ! వెధవ్వేషాలు కాపోతే ఏమిటీ? జరుగుబాటు!
ఇక్కడ ఇంట్లో పెద్దక్క ఉందిగా, Compromi జిణి.. “పొన్లే అమ్మా చెల్లికీ, మరిది గారికీ మా గదిచ్చేయండి, మేము వంటింట్లో సద్దుకుంటామూ అంటుంది! పాపం ఆ బడుగు జీవి

తనకి ఉన్న కొన్నైనా ” ప్రాధమిక హక్కులు” ఉపయోగించుకోవాలనే ఆలోచన కూడా ఉండదు! అలాగని, National Human Rights Commission కి వెళ్ళి, బాలకృష్ణన్ గారికి Su moto కంప్లైంటు ఇవ్వమని కాదూ. అప్పుడప్పుడైనా తనకి పుట్టింట్లో ఉండే, ఇలాటివి ఉపయోగించుకోలేదే అని బాధ! అదృష్టం కొద్దీ, ఈ రెండో పిల్ల భర్త, వాళ్ళింట్లో పెద్దాడైతే, కొద్దిగా పరిస్థితి పరవా లేదు. ” బుధ్ధుందా లేదా, నాకు విడిగా రూమ్ము కావాలని నేనెప్పుడు చెప్పానూ అసలు నీతోటీ..” అని కొద్దిగా నసుగుతాడు. అయినా సరే, ఆ భార్య( ఇంటికి రెండో పిల్ల!) ” అబ్బ మీరూరుకోండి, మీకేం తెలియదు, మనకి కావలిసినట్టుగా చేయించుకోవాలి. అడక్కపోతే అమ్మైనా పెట్టదు..” అని ఓ జ్ఞానబోధ చేస్తుంది.మళ్ళీ, అక్కడ కూడా ఆ పూర్ భర్త Compromi జు mode లోకి వెళ్ళిపోతాడు,( ఎంతైనా వాళ్ళింట్లో అలవాటు పడ్డవాడు!)ఎందుకొచ్చిన గొడవా దీనితోటి, తిరిగి వెళ్ళిన తరువాత రోజూ సతాయిస్తుంది” అనుకుని!

ప్రతీ ఇంట్లో ఉండే ప్రతీ రెండో పిల్లలందరూ ఇలాగే ఉంటారని కాదు నా ఉద్దేశ్యం. కోప్పడకండి… అక్కడక్కడ….
ఇంకా చాలా ఉన్నాయి… ఇంకో టపాలో… బై దవే మా ఇంట్లో నేను మూడో వాణ్ణి, మా ఇంటావిడ మాత్రం ఇంటికి పెద్దపిల్లే ! ఆవిడ Compromi జు లు చూసి చూసే ఈ టపా!

నేను చదివిన ఓ జోక్కు…

There is only one perfect wife in the world and every neighbor has it!

Advertisements

12 Responses

 1. “పెద్ద కొడుగ్గానో, పెద్ద కూతురుగానో పుట్టిన ప్రతీవారికీ, ఈ Compromi జులు ఓ in built quality! ”
  నూటికి నూరు శాతం నిజం గురువుగారూ.

  బై దవే మా ఇంట్లో నేను మూడో వాణ్ణి, మా ఇంటావిడ మాత్రం ఇంటికి పెద్దపిల్లే ! ఆవిడ Compromi జు లు చూసి చూసే ఈ టపా!
  అంటే ఆవిడ Compromi జిణి అయితే మీరు డాం భిస్ అన్నమాట :)))

  Like

 2. nijame kada. (edi nijam ani adagakandi malli)

  Like

 3. మా ఇంట్లో నేను పెద్ద అమ్మాయి. మా వారు వాళ్లింట్లో పెద్ద అబ్బాయి. మీరన్నది ఒక రకం గా నిజమే అయినా… కొన్నింటిలో అడ్వాం తేజ్ లు కూడా ఉంటాయి అని నాకనిపిస్తుంది. మొట్ట మొదట.. తల్లి దండ్రుల ప్రేమ ని ఎక్కువ కాలం అనుభవించగలగటం.. మా పిల్లలకి కూడా రెండు పక్కలా తాతల అమ్మమ్మల, నాయనమ్మల ప్రేమ దక్కటం.. వాటి ముందు.. చిన్నపాటి కాంప్రమైజులు ఒక లెక్క కాదని.. నా వ్యక్తిగత అనుభవం…

  Like

 4. పెద్దవాడిగా పుట్టితే ఎంత అదృష్టమో. కాంప్రమైజ్ అంటారేమిటి. చిన్న వాడిగా పుట్టితే ఎన్ని కష్టాలు. వాళ్ళకి పొట్టైన బట్టలుచిన్న వాళ్ళు వేసుకోవాలి. వాళ్ళ పుస్తకాలు వాడాలి. చిన్నోడికి ఏమి తెలియదు అనే టాగ్ తగిలించుకోవాలి. ప్రతిదీ వాళ్ళని అడిగి యెస్ అనిపించుకోవాలి. చివరికి, పెళ్లి చేసు కుంటే అన్నలకి, అక్కలకి అందరికీ సాష్టాంగ ప్రణామాలు చేయాలి. పెత్తనం వారిది కష్టపడి పని చేసేది చిన్నవాళ్లు. అంతెందుకు మాష్టారూ పిల్లల పెళ్లి కార్డు లు కూడా అగ్రజుడి పేరుతోనే, నా సోదరుడు చి. ఫలానా కుమార్తె/కుమారుడి అంటూ. చిన్న వాడికే కాంప్రమైజు లు అని తెలియ చేసు కుంటున్నాను అధ్యక్షా.

  (నా పెళ్ళికి మా పెద్దమ్మ గారి పిల్లలు, పెదనాన్నగారి పిల్లలు అందరూ వచ్చారు. సాష్టాంగం చేసి చేసి, మీరు, మీ ఇంట్లో ఇంత చిన్నవారని తెలిస్తే ….. అని కూడా అంది మా ఆవిడ).

  పిల్లలు అందరూ వచ్చారు.

  Like

 5. నా పై కామెంటు లో ఆ చివరి లైను ఎక్కడి నుంచి వచ్చింది? కొట్టేయండి.

  Like

 6. నాకు దీనికి భిన్నమైన అభిప్రాయాలున్నయండీ. చిన్నవాళ్ళే ఎక్కువ కాంప్రమైజ్ అవుతారేమో నైపిస్తుంది. మా ఇంట్లో నేనే పెద్దదాన్ని. పాపం మా చెల్లే ఎక్కువ కాంప్రమైజ్ అవుతుంటుంది. నాకు తెలిసిన ఇంకో 4-5 కుటుంబాలలో కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు మీరు రాసినది చదువుతుంటే చాలా భిన్నంగా, కొత్తగా ఉంది.

  Like

 7. @ బులుసు సుబ్రహ్మణ్యం గారు,

  లెస్స పలికితిరి.
  *********************నా పెళ్ళికి మా పెద్దమ్మ గారి పిల్లలు, పెదనాన్నగారి పిల్లలు అందరూ వచ్చారు. సాష్టాంగం చేసి చేసి, మీరు, మీ ఇంట్లో ఇంత చిన్నవారని తెలిస్తే ….. అని కూడా అంది మా ఆవిడ).
  ****************** LOL

  Like

 8. @ కృష్ణప్రియ గార్కి, థాంక్యూ. బహుశా ఇదే మొదటి మాటు అనుకుంటాను, మీ అట్టహాసం చూడ్డం.. రెండు దరహాసాలు

  Like

 9. @ఆ.సౌమ్య
  @బులుసు సుబ్రహ్మణ్యం
  మీరు చెప్పింది చాలా కరెక్ట్

  చిన్నవాళ్ళ కస్టాలు ఎన్నో పాత చొక్కాలు , పుస్తకాలు , బొమ్మలు అన్నిటికి సర్దుకొని పోవాలి

  Like

 10. @శంకర్,
  మరీ పూర్తిగా అలాగ కాదులే !
  @krsna,

  అడక్కుండానే అర్ధం అవుతోందిలే !!

  @కృష్ణప్రియా,
  ఓవరాల్ గా పెద్దపిల్ల/పిల్లాడు చాలా విషయాల్లో కాంప్రమైజు అవుతారని నా ఉద్దేశ్యం.

  @సుబ్రహ్మణ్యం గారూ,
  ఏమిటో ఒక్కసారి సాష్టాంగ ప్రమాణం చేసేటప్పటికే, కొంపలంటుకుపోయినట్లు చెప్పేసికోడం!

  @సౌమ్యా,

  చిన్నవాళ్ళని సమర్ధించడంలోనే తెలుస్తోందిగా, ఎంతవరకూ కాంప్రమైజు అవుతారో !!!

  @రవి తేజా,

  అడగడం తరవాయి, ఓ పేద్ద లిస్టిచ్చేయడమే !!

  Like

 11. అవును గురువుగారూ ఇంతకీ “డాం భిస్” అంటే ఏంటండీ?

  Like

 12. శంకర్,

  డాం భిస్ అంటే–సంథింగ్ లైక్ ” బిందాస్ “. మళ్ళీ బిందాస్ అంటే ఏమిటీ అని అడగొద్దు!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: