బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–సరదా సరదాగా వర్షంలో ఓ ఔటింగ్……


   క్రిందటివారం రామాయణం .. గొడవ సుఖాంతమైన తరువాత, మళ్ళీ సత్సంబంధాలు పునరుధ్ధరించుకోవాలిగా మరి. పొనీ మాకు దగ్గరలో ఉన్న ఓ హొటల్ కి వెళ్దామా అంటే, వద్దులెండీ అంటుంది. పోనీ అదేదో అమితాబ్ సినిమా ” బుఢ్ఢా హోగా తేరా బాప్..” సినిమాకి వెళ్దామా అంటే, ” ఛత్ ఇంట్లో ఉన్నవాడొకడు చాలకనా, ఊళ్ళో వాళ్ళని చూడడం..” అంటూ నా ఉత్సాహం మీద నీళ్ళు కుమ్మరించేసింది! ఇంకేమి చేయాలీ అని ఆలోచిస్తూంటే, నిన్న మా ముంబై ఏజన్సీ ఆవిడ ఫోను చేసి, పూణె లో ఓ Restaurant ఇవాల్యుఏషన్ ఉందీ చేస్తావా అని అడిగారు. పైగా ఇద్దరు లంచ్ కానీ డిన్నర్ కానీ తీసికోవాలీ, ఓ వెయ్యి రూపాయలదాకా బిల్లు రిఎంబర్స్ చేస్తామూ అన్నారు! వాహ్వ్ ! ఇంతకంటే, మంచి అవకాశం ఎక్కడినుంచొస్తుందండి బాబూ నాకు? సరే ఇదీ బాగానే ఉందీ అనుకుని రైఠో అని చెప్పేశాను. ఓ గంటలో మెయిల్ వచ్చేసింది!

   ఇదివరకు ఇలాటివి వచ్చినప్పుడు, మా కోడలుని తీసికెళ్ళేవాడిని, కారణం పెద్ద పెద్ద Restaurant లలో, ఒక్కడినీ వెళ్ళిన మొహం కాదు కాబట్టీ. ఈ మధ్యన, పిల్లలతో అక్కడకీ,ఇక్కడకీ వెళ్ళడం వల్ల, కొద్దిగా కాన్ఫిడెన్స్ రావడం ప్రారంభం అయింది! అయినా అంత ప్రాణం మీదకొస్తే, మా ఇంటావిడ ఎలాగూ ఉంది, తనమీదకు తోసేస్తే సరీ! పైగా ప్రస్తుతం firefighting కార్యక్రమం ( “రామాయణానికి” ప్రాయశ్చిత్తం!) లో ఉన్నాను కాబట్టి, మా కోడలుకి ఫోను చేయకుండా, ఇంటావిడనే తీసికెళ్ళాలని నిశ్చయించేసికున్నాను! అదీ ఈ కథ పూర్వాపరం.

   ముహూర్తం చూసుకుని ఓ ఆటోలో బయలుదేరాము. హోరున వర్షం! ఎక్కడో కల్యాణీ నగర్ లో ఉంది ఆ Restaurant ( (Cream Centre,,Hotel CYPRESS). ఎప్పుడైనా వెళ్ళానా ఏమైనా? వాణ్ణీ వీణ్ణీ అడుక్కుంటూ, మొత్తానికి చేరాము.మేమొక్కళ్ళమే అనుకుంటాను ఆ టైములో,వెళ్ళీ వెళ్ళగానే ఒకడొచ్చేసి, రుమ్మాళ్ళూ వగైరా ఒళ్ళో వేసేసి వెళ్ళాడు. వాడేమైనా అడుగుతాడో, లేక నేనే చొరవ తీసికుని ‘క్యా హై ఖానేకా…” అని మన ఉడిపీ హోటళ్ళల్లో అడిగినట్లడగాలో తెలియదు. ఇన్నాళ్ళూ పిల్లలతో వెళ్ళడం వలన వీధిన పడకుండా, ఏదో లాక్కొచ్చేశాను! బయలుదేరేముందు, పేద్ద గొప్పగా, మా ఇంటావిడ నెట్ లో ఆ హొటల్ గురించి అన్నీ చదివింది, పోనీ ఆ సంగతేదో చెప్తే, నాకీ గొడవ తప్పేదిగా, అబ్బే ఆవిడకి ఆవిడా, ఆ సర్వర్ కి సర్వరూ నా ప్రాణం తీసేశారు!

   అదేదో మెనూ యొ ఏదో అంటారుట, ఓ రెండు పుస్తకాలు తెచ్చి నా మొహాన్న పడేశాడు. అసలు గొడవంతా ఇక్కడొచ్చేసింది. నాకొచ్చిన మెయిల్ లో, నా అదృష్టం కొద్దీ చెప్పారు, నేనేం ఆర్డరు చేయాలో- ఓ స్టార్టరూ, ఓ సూప్పూ, రెండు బెవరేజ్ లూ, రెండు మెయిన్ కోర్సులూ, ఓ డెజర్టూ ట.- స్టార్టరుకీ, ఎపిటైజరు కీ తేడా తెలియదు. ఏది ఆర్డరు చేస్తే ఏం గొడవో? నా ఈ అవస్థంతా, మాఇంటావిడకి నవ్వులాటగా ఉంది, ఇక్కడేమో నా తాడి తెగుతోంది. స్టార్టర్ అని ఉందికదా అని, అవేవో పనీర్ పకోడాలు, త్రాగడానికి,లస్సీ చెప్పేశాను.ఎప్పుడో ఓసారి మా ఇంటావిడ జ్ఞానబోధ చేసిందిలెండి, ఆ గ్లాసులోది ఒకేసారి గొంతుకలో పోసుకోకూడదుట, ఆరారగా, మనం తింటున్నంతసేపూ తాగాలిట! ఏమిటో గొడవ!

   ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపూ, ఏవేవో ఖబుర్లు చెప్పుకోవాలిట! ఇంతలో, ఆ పకోడాలేవో తినడం పూర్తవగానే, ఆ వెయిటర్ మళ్ళీ ప్రత్యక్షం- మెయిన్ కోర్స్ ఏమిటీ అని.ఆ పకోడాలు తినేటప్పటికే, భుక్తాయాసం వచ్చేసింది. పోనీ ఆ మిగిలినవేవో ( మెయిల్లో వ్రాసింది) ప్యాక్కు చేయించి తీసుకుపోదామా అనుకుంటే, బావుండదేమో అనో అనుమానం. ఆ మెనూ నిండా, ఏమిటేమిటో ఇచ్చాడు. ఏం తింటే ఏమౌతుందో అనో భయం. అటూ ఇటూ కాకుండా, ఓ ఆలూ పరాఠా, మా ఇంటావిడకి ఓ జీరా రైస్సూ చెప్పాను. ఓ ప్లేటులో అరడజను ముక్కలు చేసిన పరోఠా, ఇంకో దాంట్లో, ఓ సోలడుబీపన్నం, తెచ్చాడు. మామూలుగా హాయిగా నలుగురు తినొచ్చు! ఏమిటో మరీ వదల్లేమూ, అలాగని తినా లేమూ, ఎందుకొచ్చిన తిళ్ళూ? హాయిగా పప్పూ,కూరా,ఆవకాయా,పులుసూ వేసికుని ఇంట్లో తినకా? చివరాఖరికి డెజర్టోటి మిగిలిపోయింది. దాని సంగతి కూడా తేల్చేస్తే, బిల్లు కట్టేసి కొంపకు చేరొచ్చు. తెలుసున్న పేరు కదా అని “మలై కుల్ఫీ’ చెప్పాను.నాకు పళ్ళు లేవు కాబట్టి బాగానే ఉంది. మా ఇంటావిడకి మాత్రం… అడక్కండి...ఎప్పుడో మళ్ళీ రూట్ కెనాలింగ్ అని ఓ టెండరు పెడుతుంది !!

   మా ఇంటావిణ్ణే తీసికెళ్ళానూ అని “నిరూపించుకో” డానికి ఆ పైన పెట్టిన ఫొటోగ్రాఫిక్ ఫ్రూఫ్ !!

Advertisements

6 Responses

 1. ఈ వయసులో అవసరమా మాష్టారూ? ఇంటికెళ్ళాక డైజన్ లాంటి మాత్రలేవో మింగే వుంటారు? పైగా బీపన్నం? అంటే? ఫోటోలో కప్పులో వున్న ముక్కలు వెజ్జా? నాన్ వెజ్జా?

  Like

 2. “దాసుడి తప్పులు దండం తో సరి” అని సరిపెట్టెయ్యడానికి రామాయణం గోలలో మీ తప్పేంలేదని అంటున్నారాయె. ఇక సంధి కి ఏదో ఒక తాయిలం తప్పదుగా! కనీసం బిల్లు మీ జేబులోంచి కట్టక్కర్లేకపోయినందుకు సంతోషించాలేమో! బావుంది. రూట్ కెనాల్ కబుర్లు ఆవిడ రాసేస్తారు లెండి ఎలాగూ! 🙂

  Like

 3. “అయినా అంత ప్రాణం మీదకొస్తే, మా ఇంటావిడ ఎలాగూ ఉంది, తనమీదకు తోసేస్తే సరీ! ”
  అమ్మమ్మా! హెంత కుట్ర…హెంత కుట్ర. మీరేదో అమాయకులనుకున్నాను గురువుగారూ.

  Like

 4. @శంకర్ వోలేటి గారూ,

  మాస్టారూ, మరీ నా శీలాన్ని శంకించి, నాన్ వెజ్జా అంటున్నారు! నేను వ్రాసిన సోలడుబీపన్నం అంటే సోలడు+ బియ్యం+ అన్నం. ఆ కప్పులో ఉన్నవి శుధ్ధ శాఖాహారం ! ఆ హొటల్ లో కేకుల్లో కూడా ఎగ్ వేయడుట! నా రిపోర్టు లో వ్రాయవలసి వచ్చింది.

  @కొత్తావకాయ,
  తప్పదు కదమ్మా మరి !!

  @యుసన్23,

  నిఝంగా అమాయకుడనే !

  Like

 5. అయ్యయ్యో బాబాయ్ గారూ.. ఎంత పనిచేసారూ..
  ఆ హోటల్ మా ఆఫీసుకు కూతవేటు దూరంలోవుంది. వెజ్జు కాబట్టి మేమెప్పుడూ దాంట్లోకి వెళ్ళలేదులేండి అదివేరే విషయం. 🙂
  మీరు నాకు ఫోన్ చేసుంటే మీ ఇద్దరినీ అక్కడ డ్రాప్ చేసేవాడిని కదా.. దారి ఖర్చులు కూడా కలిసొచ్చేవి… 🙂
  అయినా మేం ఇది ఒప్పుకోం. రామాయణం లో లంకా దహణాన్ని ఇలా మినరల్ వాటర్ తో ఆర్పలేరు. పిన్నిగారికి నేను ఫోనుచేసి చెబుతావుండండి. 🙂

  Like

 6. శ్రీనివాసా,

  మాతోపాటు, ప.గొ.జి. సెంటిమెంటు అడ్డం పెట్టుకుని, మాతో వస్తానంటే కష్టం కదా! నీ ఫోను గురించే వెయిట్ చేస్తోంది తను !!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: