బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Jinxed money…..


   ఒక్కొక్కప్పుడు, ఒక్కక్క సంఘటన ఎందుకు సంభవిస్తుందో చెప్పలేము. ఓ కారణం ఉండదు.It just happens! ఎప్పటికో, దానికి సంబంధించిన ‘గ్రహణం’ వదిలిపోయి,అంతా బాగానే ఉంటుందని ఎదురుచూడ్డం తప్పించి ఏమీ చేయలేము. అలా అని వదిలేయకుండా, పరిస్థితిని బాగుచేయడానికి, మన వంతు ప్రయత్నమేదొ చేయాలి కదా! మరీ గాల్లో దీపం పెట్టేసి, దేముడా నీదే భారం అని వదిలేయలేమూ. కానీ, ఏదో కొంత చదువుకున్నవారి పరిస్థితే ఇలా ఉంటే, ఏ చదువూ లేని వారి గోడు ఎవడు పట్టించుకుంటాడు? అలాగని నేను ఏదో పెద్ద చదువులు చదివేశానని కాదు, Unintentional mistakes కీ, callousness కీ తేడా ఆ మాత్రం తెలుస్తుంది లెండి, ఎంత చెప్పినా నేనూ 42 ఏళ్ళపాటు, ఆ సర్కారీ నౌకరీయేగా వెలిగించిందీ? నెలనెలా తీసికునే జీతానికి, కొద్దిగా న్యాయంచేయాలనే బుధ్ధే ఉంటే, అందరూ బాగానే ఉంటారు. అదిలేకే కదా, ఈ సోదంతానూ !

   ఎప్పుడో రిటైరయినప్పుడు వచ్చిన డబ్బుల్లో, ఖర్చు పెట్టగా మిగిలినవి, for a rainy day ఉపయోగిస్తాయని, దాచుకుంటాము. మరీ రాత్రికి రాత్రే, గుడారం ఎత్తేయరుకదా అని, ప్రభుత్వ బ్యాంకుల్లోనూ, పోస్టాఫీసుల్లోనూ పెడతాము.అక్కడికేదో ఇవన్నీefficient అని కాదు, just for security. దానికే, ఆ పోస్టాఫీసు వాళ్ళూ, షెడ్యూల్ద్ బ్యాంకులవాళ్ళూ, ప్రపంచం లో వాళ్ళంతటివారు అసలు లేరే లేరని అనుకుంటూంటారు. ఏ బ్యాంకుకి వెళ్ళండి, ఏ పోస్టాఫీసుకి వెళ్ళండి, ఎక్కడ చూసినా ఒకటే body language. To hell with customers. ఏ సంగతి విచారించండి, ఏదో అడుక్కుతినేవాడిని చూసినట్లు చూస్తారు. మనం ఊరుకుంటే, ఇంకా పేట్రేగిపోతారు.

   విషయం ఏమిటంటే, 2006 లో ఇక్కడ (పూణె) లో పోస్టాఫీసులో, కొంత డబ్బు Term Deposit చేశాను అదేమో 2009 లో మెచ్యూర్ అయేటట్లు. అప్పటికి మేము రాజమండ్రీ లో టెంపరరీ కాపరం పెట్టడంతో, ఆ డబ్బేదో, అక్కడే తీసికోవచ్చని తెలిసి,పాస్ బుక్కూ, అవీ రెండు నెలల ముందే ఇచ్చాను, టైముకి డబ్బులొస్తాయని. తీరా చూస్తే జరిగిందేమిటీ, టైముకి రాలేదు సరి కదా, రాజమండ్రీ లో పోస్టాఫీసు వాళ్ళు చెప్పిన ప్రకారం, ఆ ట్రాన్స్ఫర్ గొడవంతా, మన బాధ్యతే అన్నట్లు మాట్లాడారు. చివరికి, నెట్ లో వెదికి, పూణె లో ఉండే
PMG లెవెల్ దాకా వెళ్తేనే కానీ నా డబ్బు దొరకలేదు. మళ్ళీ పోస్టాఫీసులో వేసే ధైర్యం లేక, ఏదో మా వియ్యపరాలుగారు పనిచేస్తున్న బ్యాంకు కదా అనీ, మిగిలినవాళ్ళకంటే కొద్దిగా ఎక్కువ ఇంటరెస్ట్ ఇస్తున్నారనీ, అదృష్టం బాగోక, SBH లో డిపాజిట్ చేశాను. ఈ పుణె-రాజమండ్రి ట్రాన్స్ఫర్ హడావిడిలో, అదేదో ఇన్ఫ్లేషనో ఏదో తగ్గిందిట, ఇంటరెస్ట్ రేట్లు కాస్తా తగ్గేపోయాయి.పుణ్యకాలం కాస్తా అయిపోయింది. మళ్ళీ ఇంకో బ్యాంకుకి వెళ్ళే ఓపిక లేక, ఆ SBH లోనే వేసేశాను.

   2009 చివరలో రాజమండ్రి కాపరం ఎత్తేసి, పూణే వచ్చేశాము.క్రిందటేడాది, ఆ TDR మెచ్యూర్ అయే వేళకి ముందుగా, పూణె లో ఉన్న SBH కి వెళ్ళి, కథంతా చెప్పి, ఓ ఎప్లికేషనిచ్చి, ఆ TDR కాపీ ఒకటిచ్చి, ఆ డబ్బేదో ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయించమన్నాను.ఓ వారం పోయిన తరువాత రమ్మన్నారు, సరే అని వెళ్తే, ఆ రిసీట్ వెనక్కాల కొత్త తేదీ ఎండార్స్ చేసి, తిరిగిచ్చారు. పోన్లే మన డబ్బు క్షేమంగా ఉందికదా అని నేనూ, పెద్దగా పట్టించుకోలేదు. ఏవో కాగితాలు చూస్తూంటే, ఇదికూడా కనిపించింది. మెచ్యూర్ క్రిందటి నెలే అయింది. అయినా ప్రస్తుతం వడ్డీ రేట్లేవో పెరిగాయన్నారు కదా, ఈ డబ్బూ అంత అవసరం లేదూ, ఆ బ్యాంకులోనే, maximum interest పిరియడ్ కి రెన్యూ చేద్దామూ అని నిన్న ఇక్కడి బ్రాంచికెళ్ళాను. ఆటోమేటిక్ గా ఓ రేటుకి రెన్యూ అయిందీ అన్నారు. అలా కాదూ, ఎక్కువ వచ్చే పీరియడ్ కి చెయ్యండీ అన్నాను. ఆ రిసీట్ వెనక్కాలే, రాసి సంతకం పెట్టించుకున్నారు. కొంచం సేపు ఆగితే, దానిమీద ఎండార్స్ చేసిస్తామన్నారు. ఎక్కడెక్కడో వెదికి, కెలికి అరగంట పోయిన తరువాత తేల్చిందేమిటయ్యా అంటే, రాజమండ్రీ బ్రాంచ్ వాళ్ళు, అసలు ఆ డబ్బే ఇంకా ట్రాన్స్ఫర్ చేయలేదుట! మళ్ళీ ఓ ఎప్లికేషనివ్వండీ, ఓ వారం రోజుల్లో ట్రాన్స్ఫర్ చేయించేస్తామూ అన్నారు. ఏణ్ణర్ధం నుండీ జరగని ట్రాన్స్ఫర్, వారంలో చేయించేస్తామంటే, నమ్మడానికి నేనేమైనా చెవిలో పువ్వెట్టుకున్నట్లు కనిపిస్తున్నానా ఏమిటీ అనుకుని, మీ బ్రాంచ్ మేనేజర్ తో మాట్లాడాలీ, అన్నాను. మరీ ఈమాత్రం దానికి, ఆయనదాకా ఎందుకూ అన్నారు. No way అని చెప్పి, ఆయన కాబిన్ లోకి వెళ్ళి ఆయనతో మొత్తం విషయమంతా చెప్పాను. ఆయనంటారూ, రాజమండ్రీ బ్రాంచ్ వాళ్ళ,negligence కి మేమేం చేయమూ అన్నారు. అప్పుడు, నేను దేశంలో ఉన్న SBH బ్రాంచీలన్నిటికీ, MD/ Chairman ఒక్కరే కదా, మీకు మాత్రం బాధ్యత లేదా, అని ఝణాయించేసరికి, ఆయన విషయం అర్ధం చేసికుని,ఓ వారం లో పని పూర్తిచేస్తామన్నారు. చూద్దాం నా అదృష్టం ఎలా ఉందో?
అదేం ఖర్మమో, ఆడబ్బు ఏ ముహూర్తంలో వేశానో, పని పూర్తయేదాకా jinxed money లాగే కనిపిస్తోంది……

12 Responses

  1. BSNLని మర్చిపోయారు, కొద్దిగా పెద్ద సిటీల్లో పర్లేదేమో కానీ (విశాఖలో చాలా చక్కటి అనుభవం, స్టాఫ్ చాలా బాగా మాట్లాడేవారు), పల్లెల్లో,టవున్లలో మహా పొగరుగా ఉంటారు, 198 కి కాల్ చేసి మాకు బిల్ ఇంకా రాలేదు ఎప్పుడు వస్తుంది, బిల్ సైకిల్ ఎప్పుడు అని అడిగితే, అతను, బిల్ వచ్చినప్పుడు వస్తుంది, కడితే కనెక్షన్ ఉంటుంది లేకపోతే లేదని జోకాడు, గట్టిగా అడిగితే బిల్లింగ్ తన సెక్షన్ కాదని వేరే నెంబరు ఎక్కడికి పడితే అక్కడికి కాల్ చేస్తావా అట, చిన్న రిపేర్ కి కుడా పెద్ద ప్రహసనం, ప్రతిసారి ఎదో ఒకటి ఇవ్వమని గొడవ.

    ఇక బ్యాంకులు ఐతే చెప్పక్కర్లేదెమో, SBI వాడు నా వైజాగ్ ఎకవుంట్ మీ బ్రాంచికి ట్రాన్స్ఫర్ పెట్టరా అంటే, వెళ్ళీ వైజాగులో ఇవ్వమంటాడు తప్ప నా అప్లికేషన్ తీసుకోను కుడా లేదు, అంతగా ఐతే రిజిస్టర్ పోస్ట్ చెయ్యి అని ఓ ఉచిత సలహా పారేశాడు.

    పోస్టల్ సంగతి అనవసరం లేండి.

    Like

  2. బాబాయ్ గారు..
    ఒక గవర్నమెంటు ఉద్యోగి అయివుండి మీరిలా రాయటం ఏం బాగాలేదు. నేను ఇది ఖండఖండాలుగా కేశఖండనం చేస్తున్నాను. 🙂
    అవుతాయి సార్.. ట్రాన్స్ఫర్ అంటే మాటలా… అక్కడినుండి అంటే.. మన రాజమండ్రినుండి ఇక్కడకు ఒక్కరోజులో మీరు రాగలరా? ఎన్ని రైళ్ళెక్కాలి.. ఎన్ని బస్సులెక్కాలి.. ఎంతమందిని అడగాలి.. చెప్పండి. మధ్యలో ఎన్ని హాలిడేసు.. ఉద్యోగులకు ఎన్ని జాలీడేసు.., ఇవన్నీ దాటుకుని మీ అప్లికేషను కదలాలంటే చాలా కష్టం కదండీ మరి. ఇంకో సంవత్సరం ఓపికపట్టండి అయిపోద్ది మీ డబ్బు ట్రాన్స్ఫర్. 🙂

    అవును మనలోమన మాట.. ఆ డబ్బు మీరు ఉద్యోగం చేస్తున్నటైములో బల్లకింద చేతులు పెట్టి… అలాంటిదేమీ కాదు కదా!!! 🙂

    Like

  3. 🙂

    Like

  4. @తారా,
    బి.ఎస్.ఎన్.ఎల్ వారితో రాజమండ్రీ లోనూ, పూణె లోనూ కూడా చాలా అనుభవాలున్నాయి.

    @శ్రీనివాసా,

    బల్లకింద చేతులు పెట్టడం వస్తే, అద్దింట్లో ఎందుకు నాయనా, ఇంకో ఫ్లాట్ తీసికోనూ ?

    @రెహ్మాన్,
    థాంక్స్.

    Like

  5. SBH అంత చెండాలం సర్వీసు ఎక్కడా చూళ్ళేదు. నాకు చాలా చేదు అనుభవాలున్నాయి మాకు దగ్గరలోని SBH బ్రాంచు తో ! ఏదో ఒకరోజు ఆర్.డీ.ఎక్స్ బ్లాక్ లో కొనుక్కొచ్చి పేల్చేయాలన్నంత కోపం కలుగుతుంది వీళ్ళ రెస్పాన్స్ చూస్తుంటే ! ముఖ్యంగా బాంకు స్టేట్మెంట్ కి పేజీ కి 50 రూపాయల చొప్పున వసూలు చేస్తారు. కస్టమర్ల ఖర్మ కాపోతే SBH ఖాతాదారులవుతారా ? Worst Service ever.

    Like

  6. RDX ఎక్కడ దొరుకుతుంది మేడం? నాకు పేల్చాల్సిన లిస్ట్ కాస్త పెద్దగా వుంది. 🙂

    ఫణి బాబు గారు ఏ నాగార్జున ఫైనాన్స్, కృషి బ్యాంక్, గోల్డ్ క్వెస్ట్ లలోనో పెట్టివుంటే ఈ తిప్పట వుండేది కాదు కదా! ఏకంగా బోర్డ్ తిప్పేసి అంతర్థానమయిపోయేవారు. 🙂

    ICICI bank కూడా అంతేనండోయ్, ప్రతిదానికి ‘ఫాం భరో’ అంటుంటారు.

    Like

  7. నాక్కుడా RDX కావాలి, ఈ దీపావళికి ఏదైనా ఘనంగా చెయ్యాలని ఫిక్ష్ అయ్యా, ప్రత్యేక మా వీధి రాష్ట్రంలో భాగంగా పక్క వీధి బిల్డింగులని పేలుస్తా.

    Like

  8. నాక్కుడా RDX కావాలి, ఈ దీపావళికి ఏదైనా ఘనంగా చెయ్యాలని ఫిక్ష్ అయ్యా, ప్రత్యేక మా వీధి రాష్ట్రం ఉద్యమంలో భాగంగా పక్క వీధి బిల్డింగులని పేలుస్తా.

    Like

  9. సుజాత,
    బాంక్ స్టేట్మెంట్ కి ఇప్పుడు ప్రతి బాంకూ డబ్బు వసూలు చేస్తోంది. అదృష్టం ఏమిటంటే పాస్ బుక్ లో ఎంట్రీలు నిండి మరో పాస్ బుక్ తీసుకున్నపుడు మాత్రం ఫ్రీగానే ఇస్తున్నారు. అదేమిటంటే రూలు, మేమేం చేయాలంటారు! ప్రతి బాంక్ పరిస్థితీ ఇలాగే ఉంది.

    ఇటీవల ఆంధ్రా బాంక్ వాళ్ళ ఇండియా ఫస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకుంటే అందులో నా అడ్రస్ తప్పుగా పడింది.ప్రాసెస్ మొత్తం చేసింది ఆంధ్రా బాంక్ వాళ్ళు. అది సరి చేయించి ఇమ్మంటే మాకు సంబంధం లేదు కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి అడ్రస్ ప్రూఫులవీ పంపిస్తే వాళ్ళే కరెక్ట్ చేస్తారంటున్నారు.మళ్ళీ ప్రీమియమ్ రిమైండర్ కాల్ మాత్రం ఆంధ్రా బాంక్ వాళ్ళే చేస్తారు. వీళ్ళకే కట్టాలి.

    మొన్న కస్టమర్ మీట్లో ఈ విషయం మాట్లాడి బాగా దెబ్బలాడాను. వాళ్ళే చేయిస్తామన్నారు. చూడాలి, ఏం చేస్తారో?పాతికేళ్ళుగా కస్టమర్ గా ఉన్నా ఇదే ట్రీట్ మెంట్!

    Like

  10. @సుజాతా,
    “ఆర్.డీ.ఎక్స్ బ్లాక్ లో కొనుక్కొచ్చి పేల్చేయాలన్నంత కోపం కలుగుతుంది “–కొన్ని రోజులాగండి. నా డబ్బులేవో వచ్చిన తరువాత చేద్దురుగాని !

    @Snkr, తారా,సుజాతా
    వామ్మోయ్ !!ఒకేసారి అందరూ ఇలా రియాక్టైపోతున్నారో ?

    Like

  11. బాబుగారూ!

    బ్యాంకు వాళ్లకి వుండే సమస్యలు వాళ్లకి వున్నాయి. ముఖ్యంగా, కవుంటర్లలో వుండే వాళ్లకి “జాబ్ నాలెడ్జ్” వుండటం లేదు! నేరుగా కాలేజీల్లోంచి, కాస్త కంప్యూటర్ పరిఙ్ఞానంతో, ఆ బ్యాంకు సాఫ్ట్ వేర్ అవగాహన లేకుండా వచ్చేస్తున్నారు. పైగా, బ్యాంకంటే, వుదయం 10 నుంచీ, సాయంత్రం 5 వరకూ, ఫ్యాన్లూ, యేసీలూ క్రింద, కాఫీలు, టీలూ త్రాగుతూ, (ఓ నలభై యేళ్ల క్రితం లా వూహించుకొని) గడిపెయ్యడమే కదా అని వస్తున్నారు! కానీ, వాస్తవ పరిస్థితులు వేరు! యేదైనా సమస్య వస్తే, రాత్రి పదకొండూ, పన్నెండూ అయినా, ఇంటికి వెళ్లే పరస్థితి లేదు. పైగా, “మేనేజరు” కి పై ఆదేశాలు యే క్షణమైనా వచ్చేస్తూంటాయి! ఆయన బ్యాంకు ముయ్యనియ్యడు–ఆ పని అయ్యేదాకా. దాంతో, విసిగిపోయి, బ్యాంకుని వదిలేసి పోతున్నారు చిన్న వుద్యోగులు.

    అందుకే సర్వీసులు అలా తగలడుతున్నాయి.

    దువ్వూరివారూ, పి(చ్)చిదంబరం, ప్రణవ్ లు యేం చేస్తారో చూద్దాం!

    Like

  12. కృష్ణశ్రీ గారూ,

    నేనూ కేంద్రప్రభుత్వ శాఖలో పనిచేశానండి మాస్టారూ. Customer relation అనేదొకటుండాలా లేదా ! ఊరికే జీతాలుచ్చేసికుంటే సరిపోతుందా ?

    Like