బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–వెర్రి తలలంటే ఇవే మరి……


   ఇదివరకటి రోజుల్లో ఎవరింటిలోనైనా,కొత్తగా పెళ్ళైన అమ్మాయి కడుపు పండిందంటే,పేద్ద హడావిడి ఉండేది. సినిమాల్లో చూసేవాళ్ళం కదా, సడెన్ గా ఆ పిల్ల భళ్ళున కక్కేసికోడం, ఓ డాక్టరుగారు రావడం,నాడి చూసి, ఓ సారి అందరి వంకా చూసేసి, పెద్దావిడతో మీరు త్వరలో అమ్మమ్మో/నానమ్మో అవుతున్నారనడం, ఆ పిల్లేమో సిగ్గుతో మెలికలు తిరిగిపోవడం, ఇంతలో ఆ ఇంటి పెద్ద రాగానే,” మీరు త్వరలో తాతౌతున్నారు..’అనడం, ఆయనేమో మీసం ఓసారి దువ్వడం, చివరాఖరికి రాత్రి ఆ పుణ్యకార్యం చేసిన బడుధ్ధాయికి తెలియడం వగైరా వగైరా…

   కాలక్రమంలో జాయింటు ఫామిలీలు అటకెక్కేసిన తరువాత, కొడుకూ కోడలూ ఇంకో ఊళ్ళో ఉద్యోగ నిమిత్తం ఉంటున్నప్పుడు, ఎప్పుడో ఆ పిల్ల నలతగా ఉందన్నప్పుడు, ఆఫిసు మానేసి,ఇద్దరూ ఓ డాక్తరు దగ్గరకు వెళ్ళడం, పోనీ ఇదివరకటి రోజుల్లోలాగ, నాడి పట్టుకుని చెప్పేస్తారా అంటే, అబ్బే,మళ్ళీ వీళ్ళని రప్పించుకోవద్దూ, ఏవో టాబ్లెట్లూ, అవి ఇచ్చి, ఓ వారం తరువాత రమ్మంటాడు. ఆ సంగతేదో అప్పుడే చెప్పేస్తే, వాళ్ళూ సంతోషిస్తారు కదా.ఇదివరకటి లాగా ఏమిటీ ఇప్పుడూ, ఎన్ని టెస్టులు చేయాలి, ఎన్ని స్కాన్నులు తీయాలి, ఎంతమందికి డాక్టర్లు పోషింపబడాలి, ఈ టెస్టులూ అవీ పూర్తయేసరికి, ఓ పెద్ద ఫోల్డరూ, వాటినిండా ఎక్స్ రేలూ, రిపోర్టులూ, ఇవన్నీ తీసికుని, ఆ డాక్టరు దగ్గరకో డాక్టరమ్మ దగ్గరకో వెళ్తే,చివరికి ఆ కబురు కాస్తా చల్లగా చెప్తాడు. చెప్పవలసిన జాగ్రత్తలూ,మందులూ, పుచ్చుకుని, పదిహేను రోజులకోసారి తప్పకుండా రమ్మని ఇన్విటేషనూ తీసికుని, అక్కడనుంచి ఏ హొటల్ కో వెళ్ళి,డిన్నర్ తీసికుని కొంప చేరుతారు! ఆహా నా జన్మ ధన్యం అయిందని ఆ పిల్లా, ఓహో నేనూ కార్య శూరుణ్ణే అనుకుని పిల్లాడూ డ్యూఎట్లు పాడుకునేవారు. ఓ నెలకో, రెండు నెలలకో ఊళ్ళొ ఉన్న పిల్ల తల్లితండ్రులకీ, పిల్లాడి తల్లితండ్రులకీ తెలిసేది.

   ఈ రోజుల్లో అయితే ఆ గొడవఖ్ఖర్లేకుండా, అదేదో యాడ్ వస్తోంది, డాక్టరూ లేదూ,సింగినాదం లేదూ, అదేదో టెస్టుట,ఆ పిల్లకి అనుమానం వస్తే చాలు, ఇంట్లోనే స్వయంగా టెస్టు చేసేసుకోవచ్చట. చూపిస్తారుగా ఆ యాడ్లో- మెట్లమీదనుంచి పరిగెట్టుకుంటూ వెళ్లి,చకచకా అంటూ, ఓ మూడు నిమిషాల్లో కిందకు వచ్చెసి, ముసిముసిగా నవ్వి, తలూపడం!ఎవరికి వారే తెలుసుకోవడం,యాడ్ వరకూ బానేఉంది, కానీ ఊళ్ళొ ఉన్న కొత్తగా పెళ్ళి చేసికున్న నవదంపతులందరూ ఇలా ప్రెగ్నెన్సీ టెస్టింగ్ కిట్టులు ఇళ్ళల్లో పెట్టేసికుంటే ఎలాగండి బాబూ? అంతంతేసి డబ్బులు ఖర్చు పెట్టిన డాక్టర్ల సంగతేమిటీ? ఎవరి పని వారిని చేయనీయాలి. నీ పని నువ్వు చేశావుగా,ఇంక వదిలేయ్ మరీ!

   ప్రస్తుతం హైట్ ఆఫ్ నాన్సెన్స్ ఏమిటంటే, అమితాబ్ బచ్చన్ గారు, తను “తాత” అవుతున్నానని, అదేదో “ట్విట్టర్” లోనో ఇంకో దేంట్లోనో వ్రాసుకున్నారుట.ఇంక ఆయనకున్న అభిమానులందరికీ పండగే పండగ! తామే తాతయ్యాననో, తామే తండ్రయాననో సంతోష పడిపొతున్నారు. ఇంక ప్రతీ నెలా,ఛెకింగ్ కి వెళ్ళినప్పుడు, ఆ మెడికల్ రిపోర్టులు కూడా ఆ ట్విట్టర్ లో వస్తాయో ఏమిటో! ఆ పురుడేదో త్వరగా వచ్చేస్తే ఓ గొడవొదిలిపోతుంది. ఇదే వేలం వెర్రి అంటే! దేనికైనా దాని శాంక్టిటీ ఉండనిస్తేనే అందం! వాళ్ళు సెలిబ్రెటీలూ,వాళ్ళింట్లో ఓ పిల్లో కుక్కో “పెద్దమనిషి” అయినా అదీ న్యూసే అనకండి. అసలు అలా రాసేవాళ్ళకి బుధ్ధుండాలి. ఈ సోషల్ నెట్వర్కుల ధర్మమా అని, చదువడానికి ఆసక్తున్నవాళ్ళకి, కావలిసినంత చెత్తుంటోంది!

   ఈ ఐటీ లో పనిచేస్తున్నవాళ్ళోసారి ఆన్సైట్ కి వెళ్ళొచ్చారే,ఇంక వాళ్ళ హావభావాలు,మాట పధ్ధతీ మారిపోతాయి. ప్రతీ వాడినీ ” హాయ్ గైస్ !” తో మొదలవుతుంది.మొన్నమొన్నటిదాకా లక్షణంగానే మాట్లాడేవాడు. అదేం రోగమో, వెళ్ళొచ్చినప్పటినుండీ మాటతీరే మారిపోయిందండీ.ఇదివరకు నోరారా ” అమ్మా” అనేవాడు కాస్తా “హాయ్ మాం” లోకి వచ్చేశాడు. ఇంట్లో కొత్తగా కనిపించిన వాడిని, ” హూ ఈజ్ దిస్ గై?”. గై ఏమిటి గై, తిన్న తిండరక్క. ఇంకా ఇలా వెర్రితలలు ఉన్నాయి. మరో టపాలో…..

Advertisements

5 Responses

 1. http://answers.yahoo.com/question/index?qid=1006032803818

  n pregnancy, the growing tissues of the new conception (early foetus) secrete a special hormone into your body called ‘human Chorionic Gonadotrophin’ (hCG). This enters your blood as early as one week following fertilisation. This can be traced from your blood or urine by special tests. Home tests are done with urine.

  Like

 2. నిజమే నండీ ఈ సోషల్ నెట్వర్క్లు , బ్లాగుల పుణ్యామాని
  బోలెడంత చెత్త
  ఆశక్తి ఉన్నవాళ్ళకీ
  చదివే వాళ్ళకీ
  రాసే వాళ్లకి
  అనీవేస్ లెటజ్ లీవ్ ఇట్ టు దెయిర్ ఫేట్ !!
  వాట్ యు సే ఫణి గారూ !!!

  Like

 3. My son .. born of me.. shall be the reason for birth … of another being .. nature and science willed it so … అలా అనుకోవడం సహజమే -ఎవరికైనా
  కానీ మీరన్నట్లు కొన్ని హద్దులు ఉండాలి

  Like

 4. @Aaa,
  Thanks for the information.

  @ahmisaran,

  నిజమే అనుకోండి. మరీ ఎక్కువ అయినప్పుడే చిరాకొస్తుంది.

  @మోహన్ గారూ,

  నేను ఇదివరకటి రోజులకీ, ఇప్పటికీ ఉన్న తేడాలు వ్రాశాను.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: