బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–Easy chair critics…


   ప్రపంచంలో అతి సుళువైన పని ఇంకోళ్ళని తిట్టడం, ఇంకొకరు చేసిన పనిని విమర్శించడం. దీనికి ఏమీ ప్రతిభాపాటవాలూ, జ్ఞానం లాటి పెద్ద పెద్ద క్వాలిఫికేషన్లు ఏమీ అవసరం లేదు.కావలిసినవల్లా ఓ నోరూ, వాళ్ళు పేలే అవాకులూ చవాకులూ వినే ఓపికున్న ఓ నాలుగో అయిదో చెవులూనూ! అదేమిటీ చెవులు ప్రతీ మనిషికీ రెండేసుంటాయి కదా, మరీ నాలుగో అయిదో అని ఆడ్ నెంబరన్నారేమిటీ అనకండి, ఆ వినేవాళ్ళల్లో, ఓ చెవితో విని రెండో చెవితో వదిలేసేవాళ్ళుంటారు. అందుకన్నమాట నాలుగో అయిదో అన్నది. సరేనా? ఏమిటో వ్రాసిన ప్రతీ దాంట్లోనూ హోల్స్ వెదికేవాళ్ళే ! ఇదిగో ఇలాటివాళ్ళనే Easy chair critics అంటారు.

   వీళ్ళకి ప్రపంచం లో జరిగే ప్రతీ విషయం లోనూ అంటే వాళ్ళుండే వీధినుంచి, అమెరికా ప్రెసిడెంట్ ఒబామా దాకా. మధ్యలో క్రికెట్టొస్తుంది, ఓ సినిమా వస్తుంది, అన్నా హజారే, బాబా రాందేవ్ వస్తారు.ఇంక సోనియా, మన్మోహన్సింగ్, చిదంబరం ల గురించి చెప్పేదేమిటి? వాళ్ళకి తెలియనిదేమీ ఉండదు. ‘మొన్న ఆ టెస్ట్ లో ధోనీ అలా ఆడకుండా ఉండవలిసింది, రెండు పరుగులకే ఔట్ అయ్యాడు. చెప్పేకదండీ, వీళ్ళు ఐ.పి.ఎల్ లో ఆడమంటే హాయిగా ఆడతారు. కంట్రి కి ఆడ్డం మొదలెట్టేసరికే ఎక్కడ లేని సూకరాలూనూ…’ అసలు వాళ్ళననాల్సిన పనేం ఉంది లెండి, అంతా వెధవ మీడియా హైప్పండీ, ఓ నాలుగు యాడ్లు చేసేటప్పటికి కళ్ళు నెత్తిమీదకొచ్చేశాయి..” దీనితో మన క్రిటిక్కు గారు సాధించేమయ్యా అంటే, ఒకే దెబ్బతో ధోనీని, మీడియానీ దులిపేశాడన్నమాట! Buy one get one.. టైపు !!

   ఇంక రాజకీయాల్లో ప్రతీవాడినీ కడిగేయడం చూస్తే/వింటే అపర చాణక్య మన ముందు నుంచున్నట్లే! అసలు ఇంత మేధావి మనదేశంలోనే ఉన్నట్లు ఆ దరిద్రులకి ఎప్పుడు తెలుస్తుందొ? అప్పుడప్పుడు టీ.వీ ల్లో చూస్తూంటాము, చర్చల సందర్భంగా, టి.వి వాళ్ళు ఎవడో “మేధావి” ని ఫోన్లో అడగడం, ఆ శ్రీవారేమో తమ అమూల్యాభిప్రాయాన్నీ, జరగబోయే పరిణామాలగురించీ ఓ ఫోర్కాస్టూ చెప్పడం. ఆయన దారిన ఆయన ఫోన్లో అరుస్తూనే ఉంటాడు, ఇక్కడ స్టూడియో లో ఉన్నవాళ్ళు వాళ్ళదారిన వాళ్ళు ఏవేవో మాట్లాడుతూంటారు. అంతా “రైతు బజారు” లా తయారవుతుంది. మరీ ఫిష్ మార్కెట్ అంటే, చేపలు తినే పాఠకుల మనోభావాలు దెబ్బతింటాయేమో అని రైతుబజారన్నాను. రిజల్ట్ ఏమిటయ్యా అంటే
unadulterated entertainment మనకి.

   ఇంక సినిమాలగురించి మాట్లాడడం, బాయే హాథ్ కా ఖేల్. ప్రతీ సినిమా చూడఖ్ఖర్లేదు. ఏ హెయిర్ కటింగ్ శలూన్ కో వెళ్ళడం, (అక్కడ చాలా మంది వెయిట్ చేస్తున్న టైములో)
అక్కడుండే పేపర్ చదివేసి అందులో ఉన్న రివ్యూ చదివేయడం బస్! ఇంకో ఇద్దరు గిరాయికీలుండగానే, చల్లగా ఆ శలూన్ నుంచి బయటకు జారుకోడం. వారానికో శలూన్ చూసుకోవాలి, ప్రతీ సారీ ఒకే శలూన్ కి వెళ్తే, ఎప్పుడో కూర్చోపెట్టి అంట కత్తెరేసేస్తాడు! మరీ ఊళ్ళో ఉన్న శలూన్లకెళ్ళడానికి మొహమ్మాట పడితే, ఏ “రద్దీ” ( పాత న్యూస్పేపర్లుండేవి) దుకాణానికో వెళ్తే, కావలిసినన్ని రివ్యూలు దొరుకుతాయి! అదీ కాదూ ఇదీ కాదంటారా, చిల్లర కొట్లలో పొట్లాలు కట్టే కాగితాలు. ఆతా వేతా ఎక్కడా ఖర్చనేది పెట్టకుండా ఉండడం!

   ప్రపంచం లో జరిగే ప్రతీ సంఘటన గురించీ, తెలిసికోడానికి ఇంట్లోనే టి.వీ. ఉండఖ్ఖర్లేదు. బిజీ గా ఉండే రోడ్లమీద ఉండే ఎలెక్ట్రానిక్ షాపుల్లో బయటనుంచుని విండో షాపింగ్ చాలు!ప్రతీవాడిగురించీ అలవోకగా మాట్లాడేయొచ్చు. వినేవాళ్ళకి అంత పరిజ్ఞానం లేదని పసికట్టాడా, ఇంక ఈ పెద్దమనిషిని పట్టడం ఎవరి తరమూ కాదు.He goes on a rampage !!
ఈ జన్మలోనే ఏదో పాపం చేసుంటామూ, అందుకే ఈయన చేతిలో పడ్డామూ అనుకుని, ఓ దండం పెట్టుకోడమే!

    ఇప్పటిదాకా పైన చెప్పినవి జాతీయ, అంతర్జాతీయ విషయాలు. ఇంక గ్రౌండ్ లెవెల్ లోకి వస్తే, తనకి తెలిసిన ప్రతీ వాడిగురించీ వాగేయడం. ” వాడికేం తెలుసండి బాబూ, ఏదో తనకే అన్నీ తెలుసన్నట్లు పోజెట్టేస్తాడు. మొన్న మా ఆఫీసరు ఏదో ఫైలు గురించడిగితే తెల్ల మొహం పెట్టాడు. ఇంతలో అక్కడకి నేనెళ్ళబట్టి సరిపోయిందికానీ, లేకపోతేనా ,ఓ మెమో దొరికేది, తెలిసేది..” ఇలాటి పక్షులు చాలా ఆఫీసుల్లో తటస్థ పడుతూంటారు.

   ఇంక మామూలు సాదా సీదా రాజకీయనాయకులు మాట్లాడేవి, మరీ పట్టించుకోనఖ్ఖర్లేదు. ఏ ఎండకా గొడుగు పట్టేవాళ్ళే.అవతలి పార్టీ గురించి తెగేసి మాట్లాడడం, ఓ అబ్సెషన్ వాళ్ళకి.రోజుకో పార్టీ మార్చేస్తూంటారు. ఏమిటయ్యా అని అడిగితే “There are no permanent enemies in politics” అని జ్ఞానబోధోటీ!

   ఇన్నీ రాసి మిమ్మల్నేక్యాటగిరీ లో చేర్చమంటారూ అని అడిగితే ఏం చెప్పనూ? ఏదో రాసుకుంటున్నాను, మరీ physical torture చేయడం లేదుగా? ఇష్టం ఉంటే చదువుతారు,లేకపోతే మానేస్తారు! వ్యాఖ్యలు పెట్టడం తగ్గించేశారు అప్పుడే. ఎప్పుడో ఎవరో, ఇంక చాలండి బాబూ అనేదాకా రాస్తూనే ఉంటాను !!!

Advertisements

12 Responses

 1. వ్యాఖ్యలు పెట్టడం తగ్గించేశారు అప్పుడే. ఎప్పుడో ఎవరో, ఇంక చాలండి బాబూ అనేదాకా రాస్తూనే ఉంటాను !!!

  i am reading all your posts. please continue. comments pettadaniki baddakam anthe…

  Like

 2. 🙂 బాగా చెప్పారు.
  నర్తనశాల సినిమాలో కంకుభట్టు విరాటరాజుకొలొవులో ఉండగా “అన్నిటికన్నా సులువైన పని ఏది” అంటే, “ఇతరులకి సలహాలివ్వడం” అని చెబుతాడు.

  Like

 3. వెనకటికో అయన, ప్రతీ వేదికమీదా తన వుపన్యాసాన్ని “యెందరో మహానుభావులు! అందరికీ వందనములు!” అని ప్రారంభించేవాడట.
  కొంతకాలానికి తన ప్రారంభ పలుకులు తనకే విసుగొచ్చి, ఓ సారి “అందరూ మహానుభావులే! యెందరికని వందనములు?” అని నీరసిస్తే, ఆ స్వారస్యానికి చప్పట్లు కురిశాయట.
  అలాగ, మీ టపాలు అన్నీ వేటికవే! “యెన్నిటికని కామెంట్లు పెట్టుదుము?”! ఇంకో 1,26,054 మందిని అలరంచడానికి కంకణం కట్టుకోండి మరి! (అదీ అతి తక్కువ సమయంలో)!

  Like

 4. నాది కూడా రామూ గారి కామెంటే ఫణిబాబు గారు. నేను కూడా మీ పోస్ట్లు అన్నీ చదువుతున్నాను..పాత పోస్ట్ లు కూడా చదవడానికి ప్రయత్నిస్తున్నాను. మీరు రాస్తూనే వుండాలని…

  Like

 5. ఆపండి అని ఎవరన్నా అంటే కూడా నా బ్లాగు నా ఇష్టం . రాస్తాను. రాయను. ఇష్టముంటే చదవండి లేకుంటే లేదు .నేను రాసింది నేనే చదువుకుంటాను. అని చెప్పంఢి. సరేనా..

  Like

 6. నాది కూడా ఒక ఉచిత సలహా. మీరిలాగే వ్రాస్తూ ఉండండి. అదే మా కానందం.

  మీరు కామెంట్ల మోహం లో పడుతున్నారని నేను అనుకోను.

  బాగుంది. చాలా బాగా చెప్పారు, వహ్వా మాష్టారు, అని ఎన్ని మాట్లు చెప్పుతాము.:):)

  Like

 7. @రామూ,
  అసలు విషయమేమిటో తెలిసికోవాలని అలా వ్రాశాను! మరీ సీరియస్సుగా తీసుకోకండి మరి!

  @కొత్తపాళీ గారూ,
  ధన్యవాదాలు.
  @కృష్ణ శ్రీ గారూ,

  నన్ను కూడా అలా చేయమంటారా? ఒక్కొక్కప్పుడు అనిపిస్తూంటుందండి, ప్రతీ రోజూ ఓ టపా పెట్టి బోరుకొట్టేస్తున్నానేమో అని!

  @ప్రబంధ్,

  ధన్యవాదాలు.

  @జ్యోతి,
  సీనియర్ సిటిజెన్ హోదాలో ఉన్నాను కాబట్టి,మరీ మొహం మీదే అలా అనకపోవచ్చు!

  @సుబ్రహ్మణ్యం గారూ,

  మరీ “మోహం” అనకూడదు కానీ, ఎంతైనా మానవమాత్రులం కదా. అసలు నా ఉద్దేశ్యమేమంటే, ఆ మధ్యన నేను కొన్ని సీరియస్సు టపాలు – ఒక పుస్తకం గురించీ, ఒక సాహిత్య మిత్రుని గురించీ వ్రాశాను, చదివి స్పందించిన వారు లేరు. ఇంకో విషయమేమంటే, నా చుట్టాలందరినీ పలకరించొద్దూ అప్పుడప్పుడూ?

  Like

 8. http://www.namastheandhra.com/newsdetails.asp?newsid=16459

  మీ ఈ టపా చూడగానే ఇదిగో ఈయన గుర్తొచ్చాడు, చాలా బాగా చెప్పారు, ఐదో పేజీలో చివరి ప్రశ్నకి సమాధానం చూడండి.

  Like

 9. తారా,

  మీరు ఇచ్చిన లింకులో సి.పి.ఐ నారాయణ గారి ఇంటర్వ్యూ చదివాను. ప్రభుత్వం చేసే ప్రతీ పనినీ విమర్శించడమే వీళ్ళ పని! వినేవాళ్ళున్నారు కదా అని, ఓ మైక్కు తీసికుని సోది చెప్పడమే!!

  Like

 10. అయ్యో గురువుగారు,

  మీరు సరిగ్గ గమనించారా? అబ్దుల్ కలాం ఒక మూర్ఖుడు అట, ఆయనకి సైన్సు ఈయన చెబుతాడు అట, ఆయన వినాలి అట ,

  అబ్దుల్ కలాం పాఠాలు ఈయన దగ్గిర చెప్పించుకోవాలి, లేకపొతే కలాం మూర్ఖుడు.
  అమెరికాలో పని గంటలు 15 గం|| అట ఈయన ధర్న చేస్తాడు అంట…

  ఏమి చెప్తాం అండి?

  Like

 11. తారా,

  చదివాను. కమ్యూనిస్టులు వాళ్ళంత తెలివైనవాళ్ళు ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరని అనుకుంటారు.Fools’ paradise లో ఉన్నారు.

  Like

 12. 🙂

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: