బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు-సెంటిమెంటల్ బక్రాలు…..


   మిగిలిన వారి గురించి అంత తెలియదు కానీ, ప్రపంచంలో మనంత సెంటిమెంటల్ బక్రాలు ఇంకెక్కడా ఉండరేమో అనిపిస్తూంటుంది. మనం పెరిగిన వాతావరణమంటారా, మనకి చిన్నప్పటినుండీ మన తల్లితండ్రులు చేసిన బ్రెయిన్ వాష్ అంటారా? నేనేమీ నాస్థికుడను కాను.దేముడంటే భయం భక్తీ కావలిసినంత ఉన్నాయి.వీలున్నప్పుడల్లా గుళ్ళకీ,గోపురాలకీ వెళ్తూంటాను. కానీ ఒక్కొక్కప్పుడు అనిపిస్తూంటుంది – దేముడి పేర మనల్ని ఎంతమంది,exploit చేసేస్తున్నారో, అన్నీ తెలిసికూడా మనం succumb అయిపోతున్నామో అని.

   దేశంలో ప్రముఖ దేవాలయాల్లో చాలా చోట్ల (ఎక్కడో ఒక్కటీ రెండూ తప్పించి), ఉత్తరభారతంలో పాండాలంటారనుకుంటాను వాళ్ళు చేసే హడావిడి అంతా ఇంతా కాదు. ఉద్యోగంలో ఉండేటప్పుడు ఒకసారి కలకత్తా వెళ్ళాను. ఇంతదూరం వచ్చాను కదా అని కాలీఘాట్ కి వెళ్తే, వామ్మోయ్ అక్కడ, మనతో, మన మొహం చూడగానే తెలుస్తుందనుకుంటాను కొత్తమొహాలు ఇవీ అని,ఆటాడేసికుంటారు.మనం అడిగినా అడక్కపోయినా, వాళ్ళే చొరవ తీసికుని, మనల్ని దర్శనం పేరుతో లాక్కుని పోతారు. అంతా పూర్తయిన తరువాత, వాళ్ళడిగిన డబ్బు ఇవ్వకపోతే, దెబ్బలాటా, మన కుటుంబం అంతా సర్వనాశనం అయిపోవాలని శాపనార్ధాలూ. ఎందుకొచ్చిన గొడవరా బాబూ అనుకుని వాళ్ళు డిమాండ్ చేసినంతా చేతిలో పెట్టి చక్కా వస్తాము. ఏదో ఆ ఊళ్ళో ఉండేవారితో వెళ్ళాలి కానీ, ఒక్కళ్ళం వెళ్ళే ధైర్యం చేశామా, అంతే సంగతులు!

   కలకత్తా లో ఒకసారి ఇలాటి అనుభవం జరిగిందని, కాన్పూర్ వెళ్ళినప్పుడు, దగ్గరలో గంగా నది ఉందికదా,అని, పగలు వెళ్తే వీళ్ళ బాధ పడలేమూ అనుకుని, చీకటి పడ్డ తరువాత ఓ సైకిలు రిక్షా చేసికుని, గంగ ఒడ్డుకి వెళ్ళినా అదే అనుభవం. అప్పటికీ రిక్షా వాడు చెప్తూనే ఉన్నాడు, జాగ్రత్తా, ఏ పాండానీ దగ్గరకు రానీయకూ, వాళ్ళు నిన్ను పీల్చి పిప్పి చెసేస్తారూ అని.అందుకోసమని, అటూ ఇటూ చూసుకుని,ఆ చీకట్లోనే, నీళ్ళ దగ్గరకు వెళ్ళి, ఓ దండం పెట్టుకుని, కాళ్ళూ చేతులూ కడుక్కుని, నెత్తిమీద నీళ్ళు చల్లుకున్నానో లేదో, ఎక్కడినుంచో వచ్చేశాడోడు. దక్షిణ ఇవ్వాలంటాడు, అదేమిటీ నువ్వేమైనా సంకల్పం చెప్పావా, నేనెందుకివ్వాలీ అంటే వినడే, నోటికొచ్చినట్లు తిట్టడం, ఇది మా గంగామయ్యా,
ఇక్కడ ఎవరు నీళ్ళు జల్లుకున్నా మాకు దక్షిణ ఇవ్వాల్సిందే అంటూ దెబ్బలాట. పైగా అక్కడున్నవాళ్ళంతా పోగైపోతారు.దీనితో ఏమౌతుందీ అంటే, మనకి దేముడంటే భక్తి ఉంటే, ఏదో మన దారిన మనం ఇంట్లోనే పూజలు చేసికుంటే హాయి అనిపిస్తుంది.

   ఈ వ్యవహారం ఏదో ఉత్తర భారతానికే కాదు, మన అన్నవరంలోనూ ఇదే భాగోతం.వాళ్ళు నిర్వహించే దుకాణాల్లోనే పళ్ళూ పువ్వులూ కొనాలిట. అక్కడ కొబ్బరికాయ ఎలాగూ కొట్టనీయరు. ఆ దుకాణాలవాళ్ళు ఎంత రేటు చెప్తే అంతా ఇవ్వాలి. మనమేమైనా ప్రతీ రోజూ యాత్రలకి వెళ్తున్నామా, ఏదో జన్మానికో శివరాత్రన్నట్లు, ఎప్పుడో ఒకసారి వెళ్తామూ, ఈ మాత్రందానికే ఇంత గోలా అనొచ్చు కొంతమంది.నాకు తోచింది నేను చెప్పాను.ఆమధ్యనెప్పుడో పేపర్లలో చదివాను, ఇదివరకటి ట్రస్ట్ బోర్డ్ మీద ఏదో ఎంక్వైరీ అవీ పెట్టి, దుకాణాలకి టెండర్లు పిలిచి,ఎంతంత దోచుకున్నారో అవీ బయట పెట్టారుట.

   పోనీ ఇంట్లో ఏదైనా అమంగళం జరిగిందా, ఈ బ్రతికున్నవాళ్ళు బలైపోతారు! ఆ మాటా, ఈమాటా చెప్పి మనచేత, ఎంత కక్కించగలరో అంతా కక్కిస్తారు.ఈ వ్యవహారాలు జరిపించే ఆయన్ని, మళ్ళీ ఏడాది చూశామంటే ఏ ఇన్నోవాలోనో కనిపిస్తాడు. పైగా చాఫర్ డ్రివెన్ ! మనం ఇదివరకెలా ఉన్నామో అలాగే ఉంటాము.తల్లితండ్రుల మీద ఆమాత్రం అభిమానం లేదా, ఈమాత్రం దానికే అలా ఏడవాలా అనకండి. అభిమానం,ప్రేమా వేరు. ఆ పేరుతో, మనం బక్రాలైపోతున్నామే,దానిగురించి ఈ టపా. అక్కడికేదో నేను ఏదో రిఫార్మ్ చేద్దామనికాదు.ప్రస్తుతం ప్రతీదీ, ఎంత commercialise అయిపోయిందో అందరి దృష్టికీ తెద్దామని.ఎవరికీ ఈ సంగతులు తెలియవా అంటే, అదీ కాదూ. ఎవరికివారికే భయం, సెంటిమెంటోటి.ఏదో పోనిద్దూ, మన డబ్బేమైనా ఏమిటీ, పాపం ఆ పెద్దాయన సంపాదించిందేగా, ఆయన డబ్బు ఆయన గురించి ఖర్చుపెడితే తప్పేమిటీ, ఊరికే ఎదేదో వ్రాస్తూంటాడు కానీ, ఆయన మాత్రం, తన తల్లితండ్రులకి చేయలేదా,మనకి మాత్రం చెప్పొచ్చాడూ పేద్ద, అని కూడా అనుకోవచ్చు.

   అంతదాకా ఎందుకూ, ప్రొద్దుటే స్నానం చేసి, గుర్తున్న ప్రతీ దేముడికీ దండం పెట్టుకుంటాము. ఎవరిని మర్చిపోతే ఏం గొడవో అని!
సర్వేజనా సుఖినోభవంతూ !!

Advertisements

3 Responses

 1. హాహాహాహహ!
  అంటే ఎవరైనా నన్ను కొడతారేమో కానీ కొంత మందికి భక్తి కూడా వ్యసనమైపోతోంది.
  వీరి భక్తి మరి కొంత మందికి జీవనోపాధి.

  Like

 2. లెంపలేసుకుని మరీ డబ్బు దోపిడీ చేయించుకోవడం గుళ్ళ లోనే కనిపిస్తుంది. “వాడు నిన్ను దోచేస్తున్నాడ్రోయ్” అని మనసు చెబుతున్నా దాన్ని ఓ రెండు మొట్టికాయలేసి కళ్ళు పోతాయి తప్పు అలా అనకూడదు అని మరీ సమర్పించుకుంటాం. ఏంటో ఈ రోజుల్లో చదువు తర్వాత అంతటి బెస్ట్ బిజినెస్ భక్తేనేమో.

  Like

 3. @సుబ్రహ్మణ్యం గారూ,

  మీరు చెప్పింది ఉన్న మాటే కదా!

  @యుసన్ 23,

  నిజం చెప్పారు.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: