బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు– ఓ అద్భుతమైన కానుక…


   వారం రోజులక్రితం, మన బ్లాగరు శంకర్ ఫోను చేసి, ‘గురువుగారూ, మీ పోస్టల్ ఎడ్రస్ ఒకసారి చెప్పినా సరే, లేక ఓ మెయిల్ పంపినా సరే’ .’ఎందుకయ్యా బాబూ’ అంటే సమాధానం చెప్పడే.’మీకో ఇన్విటేషన్ పంపాలీ,అందుకోసం’
అని చెప్పేసి ఫోను పెట్టేశాడు. ఇంటికి వచ్చి నా పోస్టల్ ఎడ్రస్ పంపాను. నిన్న సాయంత్రం, మా కోడలు ఫోను చేసి చెప్పింది,’ మామయ్య గారూ, మీ పేరన ఓ కొరియర్ వచ్చిందీ’ అని. ఈవేళ ప్రొద్దుటే, మా ఇంటికి వెళ్ళాను. అప్పుడు కరెంటు లేకపోవడం తో అన్ని మెట్లూ ఎక్కి వెళ్ళాను, నాకొచ్చిన కొరియర్ ఏమిటో తెలిసికోవద్దూ.ఆపసోపాలు పడి, అన్ని మెట్లూ ఎక్కి, ఆయాస పడుతూ, తలుపు తీసి ఆ ప్యాకెట్టు, కత్తెరతో జాగ్రత్తగా కట్ చేసి చూద్దునుగా, అప్పటిదాకా పడ్డ శ్రమా( మెట్లెక్కడానికి!), ఆయాసం హూష్ కాకీ అయిపోయింది ! కారణం– పైన బొమ్మ పెట్టానే, అదీ నాకొచ్చిన అద్భుతమైన కానుక !! తిరుమల ఎప్పుడు వెళ్ళినా మెట్లమీదుగానే వెళ్తూంటాను, ఎక్కడానికి పడ్డ శ్రమంతా,ఆ స్వామి దర్శనం అవగానే,మాయం అయిపోయేది.అలాగన్న మాట ఈవేళ ఆ పుస్తకం చూడగానే నాలో కలిగిన భావం !

   ఒక్కసారి అది చూసి,ఆనందం పట్టలేకపోయాను. ఆ పుస్తకం చూసే కాదు, నామీద అంత అభిమానముంచి, శ్రమ పడి, ఆ బొమ్మలంత అందంగా ప్యాక్కు చేసి పంపిన శంకర్ శ్రధ్ధకి ! అసలు మేమెవరం, తనెవరు, ఏమిటో ఈ అభిమానానికి కారణాలు నాకైతే తెలియడం లేదు. ఈ మధ్య హైదరాబాద్ లో జరిగిన శ్రీ బాపు గారి కళాఖండాల ప్రదర్శనకు, నేను కొన్ని కారణాల వలన వెళ్ళలేకపోయాను. ఆ విషయం తెలిసికుని, నేను శ్రీ బాపూ గారికి ఎంత వీరాభిమానినో
నా టపాలద్వారా చదివి, ‘అయ్యో పాపం,ఫణిబాబు గారు రాలేకపోయారే అని బాధ పడిపోయి,’ ఆ లోటుని ఈ విధంగా భర్తీ చేశాడు.

   అక్కడితొ ఎక్కడ పూర్తయిందీ, సాయంత్రానికల్లా, మెయిల్ లో ఒక లింకు పంపాడు- ఆ ఎగ్జిబిషన్ లో ప్రదర్శించిన శ్రీ బాపూ గారి బొమ్మల ఫొటోలు తను తీసినవి! జీవితం ధన్యం అయిపోయింది.
God bless you Shankar. billions, and trillions of a BIG BIG THANK YOU .

Advertisements

8 Responses

 1. భలే ! so sweet 🙂

  Like

 2. అంతర్జాల మహేన్ద్రజాలము నుంచి వచ్చిన అత్యద్భుతమైన కానుక.
  శుభాకాంక్షలు
  MOHAN

  Like

 3. wonderful gift..u r very lucky …

  Like

 4. ఫణిబాబు గారూ! మీ సంతోషం నాకూ సంబరాన్ని కలిగిస్తోంది.
  ఈ బాపు బొమ్మల కొలువు పుస్తకం కాగితం క్వాలిటీ పరంగా బాగుంది. బొమ్మలూ, వ్యాసాలూ కూడా ఓకే. (కొన్ని రిపిటిషన్స్ ఉన్నప్పటికీ ).

  దీనికంటే ముందు 30 సంవత్సరాల క్రితం క్రోక్విల్ వాళ్ళు బాపు బొమ్మలూ, ఆయనపై వ్యాసాలతో ఓ అభినందన సంచిక వేశారు. అంతకుముందు ఆరేళ్ళక్రితం మరో పుస్తకం వచ్చింది. ఆ రెండు పుస్తకాలూ మీ దగ్గర లేవా?

  Like

 5. please share the link mailed by Shankar

  Like

 6. శంకర్ గారి మంచి మనసు కు, ఇంతమంది అభిమానులను స్వంతం చేసుకున్న మీకు, అభినందనలు, శుభాభినందనలు.

  మీ ఆనందం చూసి నేనూ ముదావహుడ నైతిని.

  Like

 7. నిన్న రాత్రంతా జర్నీ లో ఉండటం వలన మీ టపా ఇప్పుడే చూశాను. ధన్యోస్మి. మీ బ్లాగులో ఈ విధంగా చోటు చేసుకునే అవకాశం కల్పించిన బాపు గారికి ధన్యవాదాలు. 🙂

  Like

 8. @కొత్తావకాయ,

  ధన్యవాదాలు.

  @మోహన్ గారూ,

  ధన్యవాదాలు.

  @గీతా,

  థాంక్స్.

  @వేణూ,

  మీరు చెప్పినవి నాదగ్గరలేవు. సంపాదించి ఇస్తానంటే వద్దనను !!

  @ఎనానిమస్,

  ఫొటోలు తీసింది శ్రీ శంకర్. ఆ క్రెడిట్ ఏదో తనే తీసికోవాలి. నేను పెట్టడం బాగుండదు.

  @సుబ్రహ్మణ్యం గారూ,

  @ధన్యవాదాలు.

  శంకర్,

  ఇది మరీ బాగుంది. అంత అద్భుతమైన బహుమతీ ఇచ్చి,పైగా నేనేదో ఘనకార్యం చేసినట్లు చెప్పడం, మీ హ్యుమిలిటీ !

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: