బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–ఓ కొత్త పరిచయం…


   ఈవేళ మధ్యాన్నం నాకు ఒకమెయిల్ వచ్చింది. ఎవరో డి.అమరేంద్ర గారివద్దనుండి.ఆయనతో నాకు పరిచయం లేదు, నాకు. అయన పంపిన మెయిల్ సారాంశమేమిటయ్యా అంటే, వచ్చే శనివారం( 25/06) రోజు, మన భాగ్యనగరం నుండి, కొందరు తెలుగు రచయితలూ, ముంబై నుండి కొందరు మరాఠీ రచయితలూ, వస్తున్నట్లూ, ఆ మీటింగుకి, నేను కూడా రాగలనా అని! ఆ వచ్చే తెలుగు రచయితల పేర్లు వ్రాయలేదు. ఎవరైతేనేమిటీ, మన వాళ్ళు వస్తున్నారూ, అడక్కుండా వచ్చిన ఈ మహదవకాశాన్ని, ఎలా వదులుకుంటానూ? పైగా ఈ మధ్యన మా గ్రంధాలయం ధర్మమా అని, కొన్ని మంచి పుస్తకాలు చదివే అవకాశం కూడా వచ్చింది.పైగా నాలాటి మోర్టల్స్ కి అలాటి ప్రముఖ రచయిత/త్రు లని ప్రత్యక్షంగా చూసే అవకాశం, అడక్కుండా వస్తోందంటే, అంతకంటె కావలిసినదేముంటుంది? తప్పకుండా వస్తానూ, అని ఓ మెయిల్ పెట్టేసి, ఆయనిచ్చిన సెల్ కి ఫోను చేస్తే, ఎవరూ తీయలేదు. సరే, వీలుపడలేదేమో, సాయంత్రం చూద్దామూ అనుకున్నాను. ఇంతలో ఆయన దగ్గరనుండి ఫోనూ, ఎవరూ మాట్లాడుతూంట అని అడగ్గానే, డి.అమరేంద్ర అన్నారు. మా ఇంటావిడ, పక్కనే నిలబడి, డి అంటే దాసరా అని అడగండీ అంది. సరే ఆవిడ మాటెందుకు కాదనాలీ అనుకుని అడిగేశాను.అర్రే మా ఇంటి పేరు మీకెలా తెలిసింది అని ఆయన అడగ్గానే, అదంతా, మా ఇంటావిడ చలవండి బాబూ, ఆవిడ మీ కథలూ, నవలలూ చదువుతూంటుందీ అని చెప్పగానే, ఆయనకూడా సంతోషించారు.

   25/06/2011 ‘నవ్య’ సచిత్ర వారపత్రిక లో నవ్య నీరాజనం-111 లో ఆయన తో ఇంటర్వ్యూ ఇచ్చారు.మా గురించి ఎలా తెలిసింది సారూ అని అడగ్గానే, తనకు తెలిసిన వారి ద్వారా, మేము పూణె లో నిర్వహిస్తున్న గ్రంధాలయం గురించి విన్నారుట,ఇంక కబుర్లు మొదలయ్యాయి.ఓ అరగంట సేపు మాట్లాడారు. మధ్యలో నా బ్లాగుల విషయం ఛాన్సొచ్చిందికదా అని చెప్పేసికున్నాను. మాట్లో మాటగా, ఏదో నేనుకూడా వ్రాస్తూంటానండి, కానీ వాటిలో ఏమి పెద్ద సాహిత్యానికి సంబంధించినవేమీ ఉండవూ, ఏదో కాలక్షేపం కబుర్లు తప్పా, అన్నాను.అయినా, మీలాటి సెలిబ్రెటీ తో పరిచయం అవడం చాలా సంతోషంగా ఉందీ వగైరా వగైరా అన్నాను.’మీకు తెలిసిన వారిలో సాహిత్యం మీద ఆసక్తి ఉన్నవారెవరైనా ఉంటే, తప్పకుండా తీసికుని రండీ అన్నారు. నేనైతే, ఏదో లైట్ గా ఉండేవి చదువుతాను కానీ, మా ఇంటావిడ ఈ సాహిత్యం వగైరా ఔపోసన పట్టిన మనిషే, అని అన్నానో లేదో, అమరేంద్ర గారి టోన్ మారిపోయింది!ఆవిణ్ణి మాత్రం తప్పకుండా తీసికుని రండీ, మీరు కూడా వస్తే పరవాలేదూ అన్నారు! చూశారా ఒక్క నిముషంలో నన్ను “also ran ” లోకి మార్చేశారా అన్నాను.

   అరగంట సేపు మాట్లాడిన తరువాత తేలిందేమిటయ్యా అంటే, ‘ ఫణిబాబు గారూ, మిమ్మల్నిద్దరినీ కలవడానికి 25 వ తారీఖు దాకా ఆగడం కష్టం. మీరెక్కడుంటున్నారో, చెప్తే వచ్చి కలుస్తానూ” అన్నారు. అన్నట్లుగానే, ఓ గంటలో మా ఇంటికి వచ్చేశారు. వస్తూ వస్తూ, ఓ నాలుగు పుస్తకాలు కూడా తెచ్చి ఇచ్చారు. ఆయన పరిచయాలు అన్నీ, చాలా పెద్దలెఖ్ఖల్లోవే ! శ్రీశ్రీ, కారా మాస్టారు లాటి ప్రముఖులతో అన్నమాట . వామ్మోయ్, అంత ప్రముఖ రచయిత, మా ఇంటికి వచ్చి మమ్మల్ని కలిశారంటే మరి గొప్ప విషయం కాదు మరీ? ఇప్పుడే వెళ్ళారు, ఇదిగో టపా వ్రాసేశాను. అందరికీ చెప్పుకోవద్దూ మరీ...

Advertisements

3 Responses

 1. మొత్తానికి ఒక రచయితని, మీ ఇంట్లోనే కలిసారనమాట.
  ఆనందం.

  Like

 2. very good. your good work is yielding fruits. Congratulations to you, Smt Suryalakshmi and all members of your family. They all form an integral part of yourt writings and stay put wih what you say. In your writings, we see a natural and virtual image of contemporary social life, as also on your concern on corruption.

  Like

 3. @ప్రబంధ్,

  ఔనండి. చాలా సంతోషమయింది.

  @రామం,

  థాంక్స్.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s