బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు


   ఈమధ్యన నా మిస్టరీ షాపింగుల సందర్భం లో జరిగిన సంగతి గురించి ఈ టపా.నేను బాపట్ల ,మా ఫ్రెండు కూతురి పెళ్ళికి వెళ్ళిన సందర్భం లో, నాకు ముంబై నుండి ఒక ఫోనొచ్చింది. పూణె లో ఫలానా చోట ఓ రెండు ఎసైన్మెంట్లున్నాయీ, చేస్తారా అని.నేను పూణె తిరిగి వెళ్ళిన తరువాత ఫోను చేయమన్నాను. చెప్పినట్లుగానే, ఫోను వచ్చింది.SOTC అని, ఒక టూర్స్ ట్రావెల్స్ కంపెనీ ఉంది.ఒక దాంట్లో డొమెస్టిక్ టూర్, రెండో దాంట్లో ఓ విదేశీ టూర్ గురించీ చేయమన్నారు. మొదటిది చేసేసి, రిపోర్ట్ పంపేశాను. రెండోది కూడా చేస్తూంటే, ముంబై నుండి, ఆ మిస్టరీ షాప్ వాళ్ళ దగ్గరనుండి ఓ ఫోనొచ్చింది. ఈ రెండో ఎసైన్మెంటులో రెండు స్టేజిలున్నాయీ,అని చెప్పి, ఓ ఇంటర్నేషనల్ టూర్ బుక్ చేసికోమనిన్నూ, దానికి కట్టవలసిన ఏడ్వాన్స్ కట్టేసి, ఆ రిసీట్ పంపితే,ఓ వారం రోజుల్లో నెను కట్టిన డబ్బులు ఇచ్చేస్తారనిన్నూ. పోన్లే చూద్దామనుకుని, సరే అని, అక్కడ SOTC వాళ్ళని అడిగితే, 20,000 /- రూపాయలన్నారు!
ఆ ముంబై వాళ్ళని నమ్ముకుని, అంత డబ్బు కట్టడానికి, నా దగ్గరెక్కడుందీ? పైగా వాడిచ్చేదాకా, నోరెళ్ళబెట్టుకుని కూర్చోవాలి.

   ఇలా కాదని, వాళ్ళకి ఓ మెయిల్ పంపాను, ఈ పధ్ధతి బాగోలేదూ, ఏ ఎస్యూరెన్సూ లేకుండా, అంత డబ్బుకి రిస్క్ తీసికోనూ, మహ అయితే, వాళ్ళు ఒక అథారిటీ లెటర్, ఓ చేత్తో నేను డబ్బు కట్టడం, రెండో చేత్తో ఈ అథారిటీ లెటర్ చూపించగానే, నా డబ్బు నాకొచ్చేటట్లూ అయితే, చూస్తానన్నాను. అలా కాదూ, మేము ముందుగానే డబ్బు నా బ్యాంకెకౌంటుకి ట్రాన్స్ఫర్ చేసేస్తామూ అన్నారు. అసలా గొడవంతా నచ్చక, చేయను పొమ్మన్నాను.ఇంక వీళ్ళు నాకు ఎసైన్మెంటులు ఇవ్వరూ అనుకున్నంతసేపు పట్టలేదు, తరువాత ఓ పీటర్ ఇంగ్లాండ్ చేశాను.మళ్ళీ ఈవేళో ఫోనూ, ఇంకో ఔట్లెట్ మిగిలిందిట, చేస్తావా అంటూ. అది చాలా దూరం నేను చేయనూ అని చెప్పేసి, వదిలించుకున్నాను.పోనీ నీకు తెలిసినవారెవరి చేతైనా చేయించూ అంటారు.

   ఇదంతా ఎందుకు వ్రాశానూ అంటే, ఎటువంటి పనైనా సరే, మనం సిన్సియర్ గా చేస్తే, మనకి ఒక ఇమేజ్ ఏర్పడుతుంది, ఇదేదో డబ్బా కొట్టుకోడానికి వ్రాస్తున్నది కాదు, ఆ మిస్టరీ షాపింగు వాళ్ళకి, నేనూ, మా ఇంటావిడా అన్నీ కలిపి ఓ నూట పాతిక దాకా చేశాము. నెలో రెండు నెలల్లోనో డబ్బులు ఎకౌంటుకి వచ్చేస్తాయి, వాళ్ళు ఓ ఎస్.ఎమ్.ఎస్. కూడా పంపుతారు, ఫలానా నెల డబ్బులు పంపామూ అని!ఎప్పుడైనా మేము, దేనికైనా ఎప్లై చేయడం మర్చిపోతే, వాళ్ళ దగ్గరనుండి ఫోనొస్తుంది.చెప్పొచ్చేదేమిటంటే, చేయాలనుకుంటే కావలిసినన్ని పనులు.కాలక్షేపానికి కాలక్షేపం.నాకైతే నచ్చేసింది బాబూ.కొత్తకొత్త వాళ్ళతో పరిచయాలూ, కావలిసినవేవో ( వాళ్ళిచ్చిన బడ్జెట్ లొనే అనుకోండి) కొనుక్కోవడం, ఏదో ముందర ఎడ్వాన్స్ చేయాలి కానీ, తరువాత ఎలాగూ వచ్చేస్తుంది.అదో సరదా !

   ఈ మధ్యన శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి కథలు చదువుతున్నాను. మరీ వాటిమీద వ్యాఖ్యలు వ్రాసేటంత పరిజ్ఞానం లేదు కానీ, నా అభిప్రాయాలు వచ్చేవారం నుండీ వ్రాద్దామనుకుంటున్నాను.వద్దూ, మమ్మల్నిలా వదిలేయండీ బాబోయ్ అంటే, మానేస్తాను!ఇప్పటికే మీ గోల భరించలేకున్నామూ, ఏదో వాళ్ళ దారిన వాళ్ళు వ్రాసుకున్నారూ, మళ్ళీ మీ అభిప్రాయాలోటా అంటే, నోరుమూసుక్కూర్చుంటాను.మీరందరూ కాదనరులే అనే భరోసాతో, ఆ పుస్తకం లో నాకు నచ్చినవి బుక్ మార్కు కూడా చేసికున్నాను.

Advertisements

4 Responses

 1. Ela cheyalandi ee mystery shopping.
  ekkadanna register chesukovala??

  Like

 2. Bash on regardless!!
  We always enjoy your musings.

  Like

 3. పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారివి కధలు నాకు పరిచయం లేవు కాని పురాణం సీత పేరు మీదుగా ఆయన వ్రాసిన ఇల్లాలి ముచ్చట్లంటే మాత్రం నాకు చచ్చేంత ఇష్టం.

  Like

 4. @శ్రావ్యా,

  దీని గురించి ఒక టపా వ్రాశాను. ఒకసారి చదవండి. ఏమైనా సందేహాలుంటే నాకు ఒక మెయిల్ పెట్టండి. దాంట్లో ‘సీనియర్ సిటిజెన్స్’ అని వ్రాశాను. ఎవరైనా చేయొచ్చు.

  https://harephala.wordpress.com/2011/01/21/baataakhaani-417/

  @మోహన్ గారూ,

  అనే అనుకుంటున్నాను !!

  @నరసింహరావు గారూ,

  శ్రీ పురాణం వ్రాసిన కథలు ఆణిముత్యాలు. ‘సీత’ పేరుతో వ్రాసినదానికే చాలా ప్రాచుర్యం వచ్చింది. కానీ మిగిలిన కథలు కూడా దాదాపు అదే శైలిలో ఉంటాయి. తప్పకుండా చదవ్వలసిన పుస్తకం.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: