బాతాఖాని-లక్ష్మిఫణి కబుర్లు–to be or not to be….


   ఎల్లుండి 15 వ తారీఖున, మా మనవరాలు చి.నవ్య పుట్టినరోజు. ఆరోజు కార్యక్రమం ఏమిటమ్మా అని, కోడలునడిగాను. ఏముందండీ మామూలుగా ఆ రోజు, మన సొసైటీ, పక్క సొసైటీ లోనూ ఉన్న తన ఫ్రెండ్స్ ని పిలుచుకుంటుందీ, స్కూలు ఫ్రెండ్స్ ని ఆదివారం(19 న) పిలుస్తుందీ. 16 నుండి స్కూళ్ళు తెరుస్తున్నారు,అందుకోసమన్నమాట ఈ ఎరేంజ్మెంటూ అని చెప్పింది.కానీ, ఈసారి, ఓ ‘మార్పు’ చేస్తున్నామూ,ఇన్విటేషన్ కార్డుల్లో No gifts please. అని వ్రాస్తున్నామూ, పిల్లల పేరెంట్స్ కి కూడా ఫోను చేసి చెప్పేస్తానూ, అయినా కూడా తీసికొచ్చినవాళ్ళకి మొహమ్మాటం లేకుండా ‘నో’ అని చెప్పేస్తానూ అంది. పోన్లెండి ఎవరో ఒకరు మొదలెడుతున్నారుకదా ఈ పధ్ధతీ అని సంతోష పడ్డాను. ఇప్పటివరకూ, Marriage invitations లో మాత్రమే, కొంతమంది No gifts please అని వ్రాయగా చూశాము.

   నవ్య మరీ చిన్న పిల్లకదా, ఫ్రెండ్స్ ఖాళీ చేతుల్తో వస్తే disappoint అవదా అన్నాను. మా కోడలు సమాధానమేమిటంటే, “లేదండి మామయ్యగారూ, నేనూ, హరీషూ తనకి వివరించామూ, నీక్కావలిసినవేవో చెప్పూ, ఏ toy అయినా సరే, ఏ డ్రెస్ అయినా సరే, just ask for it and you will get అని చెప్పామూ, దానికి తను ఒప్పుకుందీ, అందువలనే అలా వ్రాశామూ” అని చెప్పింది. కానీ నా వంతు, నా అభిప్రాయం కూడా చెప్పాలిగా,” మరి తను ఎవరింటికైనా ఫ్రెండ్స్ పుట్టినరోజులకెళ్ళినప్పుడు, గిఫ్ట్ పంపుతావా” అన్నాను.“వాళ్ళ ఫ్రెండ్స్ ఇన్విటేషన్ కార్డుల్లో గిఫ్టుల సంగతి వ్రాయకపోతే, తప్పకుండా పంపుతానూ, లేకపోతే అక్కడ, మిగిలినవాళ్ళ చేతుల్లో గిఫ్టులూ, తను ఖాళీ చేతులతో వెళ్తే తను ఫీల్ అవుతుందీ“. మరి అలాటప్పుడు level playing conditions మారడంలేదా,fair కాదేమో ఆలోచించూ” అన్నాను.దానికి తనన్నదేమిటంటే, ఇదివరకొకసారి అందరం ఆలోచించామూ, ప్రతీసారీ, స్కూల్లో ఎవరోఒకరి పుట్టినరోజులు వస్తూంటాయీ, వచ్చినప్పుడల్లా, ఆరోజు ఈ పిల్లలందరికీ ఏదో ఒక గొడవొస్తూంటుంది, నేనిది తెచ్చానూ, నువ్వేం తెచ్చావూ అని ఒకరితో ఒకరికి పోటీ. పైగా ఒక్కొక్కప్పుడు, ఏ ఫ్రెండో తెచ్చిన ప్యాకెట్టుని, అందరెదురుగా ఓపెన్ చేసి
ఓహ్ ఇదా, ఇలాటిదానికంటే పెద్దదే నా దగ్గర already ఉంది” అని ఆ ప్యాకెట్టు కాస్తా పక్కని పడేస్తుంది.ఇంక రిటర్న్ గిఫ్టుల పేరుతో, కొంతమందైతే,price tag కూడా తీయకుండా ఇస్తూంటారు.అలాటప్పుడు, ఇంటికి వచ్చిన తరువాత మనకో గిల్టీ ఫీలింగోటీ.అలా ఇచ్చినవాళ్ళ ఉద్దేశ్యమేదో తెలిసి చావదు,‘మీరిచ్చింది మహ అయితే వందో రెండొందలో ఉంటుందీ, చూశారా మేమిచ్చింది ఎంత ఖరీదో’అని చూపించుకోడానికా, లేక నిజంగానే మర్చిపోయారా(price tag తీయడం)అనేది !

   అప్పుడెప్పుడో ఈ పుట్టినరోజులగురించి ఒక టపా వ్రాశాను.మా పిల్లలకి ఎలా చేసేవారమో, ఇప్పుడు పిల్లలకి ఎలా చేస్తున్నారో అని. ఎక్కడో అక్కడ, ఎప్పుడో అప్పుడు మార్పనేది రావాలి. మంచిదే. కానీ, అది తట్టుకునేంత స్పిరిట్, మరీ చిన్న పిల్లకి ఉంటుందా లేదా అనేది ప్రశ్న. ఏదో అమ్మా నాన్నా చెప్పారూ, అయినా వింటే ఏం పోయిందిలే అనే మెచ్యూరిటీ ఉంటుందా అనేదే ప్రస్తుత విషయం.నాకో విషయం మాత్రం నచ్చలేదు, ప్రతీ సారీ తనుకూడా రిటర్న్ గిఫ్టుల రూపంలో, ఏదో ఒకటి ఇచ్చేది, కానీ ఈ సారి వచ్చినవాళ్ళందరికీ saplings ఇస్తోందిట.చాలా మంచి ఆలోచనే. కానీ,అవతలివాళ్ళిచ్చిన గిఫ్టులు వద్దంటూనే, మనం ఇలా ఇస్తే, ఆ పేరెంట్స్ ఏమనుకుంటారు? saplings అనేవి ఈ రోజుల్లో ఊరికే వస్తాయా, పదో పరకో పెట్టే కొనాలికదా.

   ఏది ఏమైనా, మార్పు అనేది ఎప్పుడూ మంచిదే. మీ అభిప్రాయాలు కూడా వ్రాయండి. ఈ టపాలు చదువుతున్న చాలా మందికి, ఈ సమస్య ఉంటుంది.

Advertisements

10 Responses

 1. మా అమ్మాయి పుట్టిన రోజున ఇలాగే అనుకున్నాము. కానీ.. ఇంక రేపు పుట్టిన రోజనగా మా అమ్మాయి ఒకటే ఏడుపు.’నాకు ఒక్క గిఫ్ట్ లేకుండా చేసారు…’ అని. మేము కొంటాము కదా.. అన్నా.. దాని బాధ అది పడుతూనేఉంది. దానితో ఇంక అలాంటి వి పెట్టుకోలేదు. మీరన్నట్టు ఆ మెచ్యూరిటీ రానంత వరకూ కష్టమే..

  Like

 2. My daughter birthday coming on 26th July2011. I was discussing the same matter with my daughter before sitting computer and same matter in our blog today discussed . She will complete 8yrs. Now my opinion is if she is very young then we can celebrate. Now after entering into 9th year still she needs to celebrate infront of her friends ?? I am not at all interested conducting a birthday party . I told her you are not still small girl. I will bring cake on u r birthday evening and i will call your friends while they are playing to come to our house and cut the cake infront of them and share the cake and enjoy with them. Today she is saying ok ok but i do not know till what extent she will stand on her words.

  Is my idea good or bad??

  Like

 3. బావుంది 🙂
  మీ మనవరాలి పార్టీ అనుభవం మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాను.
  నేను ఇటువంటి ambitions వదిలేసుకున్నాను.
  నా ఆలోచనలౌ కథ రూపంలో ఇలా వ్యక్తీకరించాను:
  http://lalithagodavari.com/bahumatiTaguReeti.html
  (Thanks to Chandamama)

  Like

 4. @కృష్ణప్రియా,

  నా ఉద్దేశ్యమూ అదే.

  @శ్రీలక్ష్మీ,

  మీ ఉద్దేశ్యమైతే చాలా బాగుంది.ఎక్కడో అక్కడ, పిల్లలకి ‘నో’ అని చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. అది ఎప్పుడూ అన్నదే ,చెప్పడానికి కష్టం అవుతూంటుంది.

  @లలిత గారూ,

  పంచుకోవాలనే అనుకుంటున్నాను. మీరిచ్చిన లింకు చూశాను.

  Like

 5. చాలా సార్లు పిల్లలు బాగానే అర్ధం చేసుకుంటారు విషయాన్ని. పెద్దలే సరిగా అర్ధం చేసుకోరనిపిస్తుంది నాకు.
  అయిదేళ్ళ క్రితం మా ఇంటికి గృహ ప్రవేశం రోజు మేము స్నేహితులందరినీ ఆహ్వానించి కానుకలు తేవొద్దని బ్రతిమిలాడాం.
  ఒకే ఒక్క స్నేహితుడు మాత్రం, “మీ సూచనని అంగీకరించలేను, అయినా మీ అభిప్రాయాన్ని గౌరవిస్తాను,” అని పూలు తెచ్చారు. ఒకరిద్దరు స్నేహితులు పూల మొక్కలు పట్టుకొచ్చారు. ఇంకొక అయిదారుగురు స్నేహితులు మా మాటని మన్నించారు. మిగతా ఇరవై మంది స్నేహితులూ కానుకలు పట్టుకొచ్చారు. నాకెంత ఒళ్ళు మండిందో చెప్పలేను. అంటే వాళ్ళు బహుశా, “ఆఆ… వాళ్ళూరికే పది మందిలో పోజు కొట్టటానికి అలా అంటారు,” అనుకుని వుంటారా? ఏమో, నాకైతే అదొక చేదు ఙ్ఞాపకం. (మనం చెప్పేది పక్క వాళ్ళు సీరియస్ గా తీసుకోకపోతే కోపం వస్తుందని ఆ రోజే తెలిసింది నాకు!)
  శారద

  Like

 6. Giving spalings as return gifts is a very good idea. but as for gifts, you can tell the kid that they should share the gifts with other kids who doesn’t have any. for example, if she gets two barby dolls, you can tell that she should give one away to some home or some thin glike that. or if she gets new dolls, ask her to give away old ones (i’m sure they would be in good shape too).

  Like

 7. i agree with Ruth..అసలు ఈ పద్ధతి నాకెమి అర్ధం అవదు..అంతగా ఐతే ఆ గిఫ్త్స్ ని bday baby చేతనె ఎదన్నా orphanageలొ ఇప్ప్పించొచు కదా బాబాయిగారు..అందరు అన్ని functions ki ,,gifts వద్దు అనెకన్నా ఇలా మేలు కద..ఒకసారి gifs వచాక,kids wont agree to let go అంటారేమొ…అసలు రావు అని convince చెయగలిగినపుడు,,ఇలా donate చేద్దాం అని కూడా convince చెయొచు కదా..

  **దానికి తనన్నదేమిటంటే, ఇదివరకొకసారి అందరం ఆలోచించామూ, ప్రతీసారీ, స్కూల్లో ఎవరోఒకరి పుట్టినరోజులు వస్తూంటాయీ, వచ్చినప్పుడల్లా, ఆరోజు ఈ పిల్లలందరికీ ఏదో ఒక గొడవొస్తూంటుంది, నేనిది తెచ్చానూ, నువ్వేం తెచ్చావూ అని ఒకరితో ఒకరికి పోటీ.**
  That is what childhood is all about కదా..ఈ రోజు గొడవ పడతారు..రేపు కలుస్తారు…దానికొసం ఇలా మార్చటం…ఎమోనండి..నాకు అనిపించింది చెప్పాను..చాలా రొజుల తర్వాత coment ట్టాను..ఎమి అనుకోకండి బాబాయి గారు

  Like

 8. I personally like to give and receive gifts 🙂 all part of the fun, unless it becomes competitive/aggressive. Some people request donation towards a charitable cause. I also liked the Chandamama story!
  HAPPY BIRTHDAY NAVYA!

  Like

 9. నవ్య కు పుట్టినరోజు శుభాకాంక్షలు

  mohan

  Like

 10. @శారద గారూ,

  జీవితం లో ఇలాటి అనుభవాలు తప్పవు మరి !

  @రూత్,

  మా నవ్యకి ఇప్పటికే, ఆ అలవాటు అంటే, తనకి డూప్లికేట్లుగా వచ్చిన బహుమతులు, తనే ఓ బాక్స్ లో పెట్టి, వాళ్ళ అమ్మతోనో, నాన్నతోనో చెప్పి ఏ ఎన్.జి.ఓ. వారికో ఇప్పించేస్తుంది. గాడ్ బ్లెస్ హెర్.

  @నిరుపమా,

  అదీ నిజమే. అనుకోడానికి ఏముందమ్మా?

  @అరుణ తల్లీ,

  I am with you !!!

  @మోహన్ గారూ,

  నవ్య తరఫున థాంక్స్.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

%d bloggers like this: